Jump to content

వదరుబోతు/పెండ్లిపిలుపు

వికీసోర్స్ నుండి

పెండ్లి పిలుపు

14

ఇయ్యది వివాహ ముహూర్తములు కాలమగుటచే నెల్లవారు నేదోయొక విధముగ నీ శుభకార్య ప్రసంగములలోఁ దగులుటఁ జేసి యితరములగు పనులకుఁ జాల లోటు వాటిల్లినది. వయసు మీఱనున్న తమ పుత్రికా జనమునకు వర గ్రహముల వెదకి ముడివేయుటకై చౌకులలోను యాత్రాస్థలముల యందును, పొగబండి సంధి ప్రదేశముల చెంతను గాచికొని కన్యాజనకులును, వరశుల్కముల బేరములను మధ్యవర్తుల మూలమునఁ బరిష్కరించు కొనుచు నిష్కర్షా పత్రికల వ్రాయించుకొను పనులలో వర జనకులును, శ్రమపడి తిరిగి పొత్తులు కుదిర్చి పౌరోహిత్యముల నార్జించు కొనుటకై పురోహితులును, ఈ బాధ లేమియు లేని కతంబునఁ బిలువని పేరంటములకైన ముందు పడిపోయి కడుపాత్రము దీర్చుకొను కార్యములలో నితరులును, అందఱును మిక్కిలి పాటుపడుచున్నవారు, సంపాదకునకుఁ గూడ నీలో నొక చిన్నికూతురు గల్గుటచే నతఁడుకు నొక చిన్ని వరుని యన్వేషించు ప్రయత్నములో నున్నాఁడు. నా మిత్రులనేకులు కన్యాదాతలుగానో, వరులుగనో, మీఱరాని బంధువులుగనో , వివాహ కార్యములలో దిగిరి. ముద్రాయంత్రముల కన్ననో, మీదు మీదు వచ్చుచున్న వివాహలేఖల సచ్చొత్తుటకే తీఱిక యెదవదు. కావుననే నా పనులకుఁ గూడ నీవల కొంత యిబ్బంది కల్గిన దని విన్నవించి చదు వరుల క్షమాపణము నర్థింపవలసెను.

ఇట్టి పనులలో నాకు మాత్ర మేమియు సంబంధము లేదనుమాట నిజమేకాని, అను దిన మును నామిత్రుల నుండియు నాచదువరులు నుండి- యు, అపరిచితుల నుండియు తపాలావాఁడు మో- యలేని మోతగ నాకుఁ దెచ్చి యిచ్చుచున్న శుభ లేఖల “బస్తా”ల విప్పి చూచుకొనుటకైన నాకుఁ గాలము చాలకున్నది. “బ్యాండు” వాద్యప రోకటిపాట కర్ణ కఠోరమగు చుండ ననుక్షణమును గుంపులు కట్టి వచ్చి లగ్న పత్రికల నందిచ్చువారల గడబిడలో నా కేమియుం దోచుట లేదు.

ఇప్పుడు నామిత్రులలో నెల్ల మిగిలియున్న నాఁడు రామానందుఁ డొక్కఁడే! విసుకు చెంది కడకేదేని యొక వివాహమున కరుగవలెనని య- తఁడును నిర్ధరించెను. అంతలో నాతని చుట్టము లలో నొకరు తమయింట నాలో జరుగనున్న యొక మంగళమునకు మేమిరువురమును దప్పక యరుగ వలెనని యాహ్వానించిరి. వాద్యాడంబరము లేక, ముద్రితములగు రంగుల పత్రికలఁ దేక యూరక చేతులాడించుకొనివచ్చి పిలిచి పోయిన యతని యాహ్వానము నాకు మాత్ర మేమో హృదయంగ మముగ నున్నను, నామిత్రున కింతయేని రుచింప దయ్యె. ఈ పిలుపును గౌరవింపవలెనని నాయభీష్ట ముండెనుగాని నామిత్రుఁడది తన కగౌరవముగ నెంచి సమ్మతించినాఁడు కాఁడు.

వచ్చిన పత్రికల నెల్ల త్రిప్పి చూచి తుదకు నామిత్రుఁ డొకదాని నెత్తెను. బంగరు నీరు పోత - యక్షరములు చిత్రములగు నలంకారములును గల్గి యా లేఖ చాల సొంపుగ నుండెను. అందలి వర్ణ నలును హృదయాకర్షకములు. నే వలదంటిని గాని, చాలచర్చించి సాపాటు రాముఁడు ---నా మిత్రున కది గౌరవనామము - కడకు చెన్నపురికే

వెడలెను.

ఆశుభలేఖ యిది.


ఈలగ్న పత్రికలయాడఁబరముచూడ నా కేమో

తలనొప్పి. రానురాను లోకమునకు డాంభికత్వము పై దృష్టి హెచ్చుచున్నదనుట కీ తలతోక లేని పత్రికలే సాక్షి! మూఁడు నాల్గు రూప్యముల వ్యయముతో నూర్ల కొలఁది శుభలేఖల నచ్చొ త్తించి బంధువులయినను గాకున్నను, వచ్చు వా- రైనను రాకున్నను గూడ విచారింపక యెదుటఁ బడిన వారికెల్ల ప్రకటన పత్రికలవలె వివాహ లేఖలిచ్చుట యేపరశురామునికి ప్రీతియో దైవ మెఱుఁగు. పదిపదునైదు పణములతోఁ బెండ్లి ముగింపఁదలచువారును, స్వగృహమున వివాహము జరిపిన యెడ బంధువులతోడి కాటమని యేకొండ పైననో, ఏపల్లెగుడిలోనో, ఏరావి చెట్టుక్రిందనో చప్పుడు లేక తలఁబ్రాలు పోసికొని రాఁదలఁచు భాగ్యవంతులును సయితము పత్రికల నచ్చొత్తించి పంపకున్నఁ దమకు గౌరవము లేనట్లు భావించు కాలమువచ్చినది. ఆహ్వానపత్రికలందిన వారిలో నాలవవంతు వివాహమునకు వచ్చినచో భరింపఁ గల మనుకొను నుదారపురుషులు నూటఁబదియవ వంతైన నీకాలమునఁ గలరని నమ్ముట అనుభవ మునకుఁ జాలవిరోధము. ఎవరు తమ యాహ్వాస మను గారవింపరో, ఎవరిరాక తమకిష్టముగ నుండదో ఎవరురాఁగలరని స్వప్నమునందైన దాము నమ్మరో అట్టివారికెల్ల నిష్ప్రయోజనముగ నీప్రకటనలఁ బంపుట కంటె మిన్నకుండుటయే గౌరవమని నాతలంపు. నిరర్ధకముగ నీ కఱవు దినములలోఁ గాగితమును పాడు సేయ కుండుటే గాక యిందుకై వ్యయమగు ధనమును వేఱు మంచిపనుల కుపయోగించు కొనఁగల్గుటచే వారికిని వారిదేశమునకును గొంత క్షేమమే!

పోనిండు. అయిదారు దినములలోఁ జెన్నపురినుండి నామిత్రుఁడొక జాబు వ్రాసెను. దానిని వచ్చు సారి ప్రకటించెదను.