వందే రఘురామా శుభనామ శుభనామ

వికీసోర్స్ నుండి


   మోహన రాగం     త్రిపుట తాళం


ప: వందే రఘురామ శుభనామ శుభనామ

తులసీ దళధామాభిరామ శ్రీరామ || వందే ||


చ 1: కనక మణిమయహార సుకుమార సుకుమార

పంక్తి రధ మహిత కుమారా సువిహార

అరిసూర భూధర ధరకల్మషదూర

పాలిత వానర దారుణ కారణ మురహరణ రఘు

వీర నీరదాభ విమలశరీర నిర్వికార || వందే ||


చ 2: వందిత అనిమిష సత్యభావ సీతానన

భక్తపోష బుధతోష దళితదోష సజ్జన పోష

మానుషవేష సంగరభీషణదాస సుపోషణ నిజతోష

రత్నభూష రమ్యవేష సురాంభోజ పుంజప్రత్యు

ష సుమానస భ్ఋంగ మునిరాజవేష శ్రీరామ || వందే ||


చ 3: కుంతల జిత నీల భక్తపాల భక్తపాల

అసురద్వేష పటలపాల వరశీల కనకచేల

కాంతిజాల మానుషశరీర దానవ బాలక

తావక సేవక సురసాల భూపాల పాలక

కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల || వందే ||


చ 4: ధరణిజ సత్కళత్ర సుచరిత్రసురిత్ర

మునిస్తోత్ర మృదయాబ్జమిత్ర సత్పవిత్ర

త్రిశర జైత్ర నీరజనేత్ర వారిజగాత్ర

విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర

అజపవిత్ర అతురమిత్ర విభీషణపరస్తోత్ర పాత్ర || వందే ||


చ 5: భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి

రాభ మదేభ హర్యక్ష మృదు పక్షపం కేరుహాక్ష

నిజరూపాక్ష శతృవిపక్ష వసురేషణ

వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస

భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహోరామ || వందే ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.