లోకోక్తి ముక్తావళి/సామెతలు-భా

వికీసోర్స్ నుండి

2544 బంకారు పళ్లెరమునకైన గోడచేర్పు ఉండవలెను

2545 బిందేడువచ్చి కోడలు కొత్తా లేదు

2546 బిడ్డచక్కిలమువలె యెండిపోయినాడంటే చక్కిలాలు యిమ్మని యేడ్చినాడట

2547 బూడిదగుంటలో కుక్కసామెత

2548 బహునాయకం బాలనాయకం స్త్రీనాయకం

2549 బాపనవాని బండవావి

2550 బ్రహ్మవ్రాసిన వ్రాలుకు యేడవనా రాగల సంకటికి యేడవనా

2551 భక్తి లేనిపూజ పత్రిచేటు

2552 భయ మెంతో అంతకోట కట్టవలెను

2553 భరణి కార్తెలో వేసిన నువ్వుచేను కాయకు చిప్పెడు పండును

2554 భరతుడి పట్టం రాముడి రాజ్యం

2555 భల్లూకపు పట్టు

2556 భరణి ఎండకు బండలు పగులును

2557 భక్రురాలు లేనిది బావాజీ ఉండదు

భా

2558 భాగ్యంవుంటే బంగారం తింటారా

2559 భారము లేని బావచస్తే దూలముపడ్డా దు:ఖములేదు

2560 భారీముద్ర భారీముద్రే కరుకుకరుకే 2561 భార్యచేతి పంచభక్ష్య పరమాన్నములు కన్న తల్లి చేతి తవిటిరొట్టె నయం

భి

2562 భిక్షగాని గుడిసె మాయాక్కచూసి మురిసె

2563 భిక్షాదికారైనా కావలె భిక్షాధికారైనా కావలె

భూ

2564 భూమికిరాజు నాయ్యం తప్పితే గ్రామస్తులేమి చేస్తారు

2565 భూమికి వానమేలా అంటే మేలే అన్నట్లు

భో

2566 భోజనం చేసిన వారికి అన్నంపెట్ట వేడుక బోడితలవానికె తలంటువేడుక

2567 భోజనానికి మాబొప్పడు, నేను లెక్కజెప్ప నేనొక్కడనే యన్నాడట

2568 భోజనానికి ముందు స్తానానికి వెనుక

2569 భోజునివంటి రాజు గలిగితే కాళిదాసువంటి కవి అప్పుడే వుంటాడు

2570 మంగలివాడి గుంటపెల్లగిస్తే బొచ్చుబైటపడుతుంది

2571 మంగలినిజూచి యెద్దుకుంటుతుంది

2572 మంగలి పాత చాకలి కొత్త