రారా యని పిలిచితే - రావదేమిరామ
స్వరూపం
రాగం: ఖరహరప్రియ - చతురశ్ర త్రిపుట తాళం
ప: రారా యని పిలిచితే - రావదేమిరామ
లోకాభిరామ - కోదండరామ - పట్టాభిరామ॥
అ: ఈరేడు లోకములలో - నీవలె శరణాగతరక్షకుడు
వేరెవరున్నారు - కరుణా జలనిధే తామసంబు సేయక॥
చ:
ఇలలో ఈకలిలో - జేసిన దెల్ల మరచితివేమో
అలనాడు నీవె రామదాసుని బ్రోవలేద॥
ఏలావతారమెత్తితివో - యేమేమి జేసితివో
ఈలాగని నిన్ను వర్ణింపలేను - వాసుదేవ బ్రోవు॥