Jump to content

రామ రామ భద్రాచల

వికీసోర్స్ నుండి


        నీలాంబరి రాగం        ఆది తాళం

ప: రామా రామా భద్రాచల రామా రార రామ రామ || రామ ||


చ1: రామా రారా నీమోమిపుడే - ప్రేమతీర చూతుగాని

తామసము వలదు రామ - స్వామి తాళజాలనికను || రామ ||


చ2: ఎన్నడు నే నిన్ను నమ్మి - యున్న వాడనని యెంచి

కనులెత్తి చూచి నన్ను - మన్ననతో బ్రోవ రాదా || రామ ||


చ3: మాటి మాటికి నీతోటి - సాటి వేల్పులు లేరని

చాటుచున్న నన్ను నీవె - పాట్లుపెట్ట నీటగునటరా || రామ ||


చ4: భద్రగిరి రామదాస పాలకుడవై నీవేల

ఛిద్రములెల్ల తొలగించి భద్రముగ నన్నేల వేల || రామ ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.