రామ నీ దయరాద రవివంశాంబుధి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: భైరవి. చాపు తాళం.

ప: రామా నీ దయరాదా రవివంశాంబుధి సోమా ||

అ: ఆ ముని సుదతిని మును నీవే బ్రోవలేదా ఆ ముని సవమును పాలించలేదా ||

చ: రాకేందు నిభ వదన! సాకేత వర సదన! శ్రీకాంచన వసన! శ్రీకర మృదుగదన
       ఏకానేకమై వెలయు ఓంకార స్వరూపా లోకావనాతి చతుర శ్రీకాంత వాసుదేవ ||