రాముని వారము మాకేమి విచారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


       ఆనందభైరవి రాగం     ఆది తాళం

ప: రాముని వారము మాకేమి విచారము


అ ప: స్వామి నీదే భారము దాశరధీ నీవాధారము || రాముని ||


చ1: తెలిసి తెలియ నేరము మాదేవునిదే యుపకారము

తలచిన శరీరము మది పులకాంకురపూరము || రాముని ||


చ2: ఘోరాంధకారము సంసారము నిస్సారము

శ్రీరాముల యవతారము మది చింతించుట వ్యాపారము || రాముని ||


చ3: ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారము

ఎంతో శృంగారము మా సీతేశుని యవతారము || రాముని ||


చ4: ఇతరుల సేవకోరము రఘుపతినే నమ్మినారము

అతి రాజసుల జేరము మా రాముని దాసులైనాము || రాముని ||

This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.