Jump to content

రామునివారమైనాము

వికీసోర్స్ నుండి


  యదుకుల కాంభోజి రాగం    ఆది తాళం


ప: రామునివారమైనాము

యితరాదుల గణన సేయము మేము || రాముని ||


అ.ప: ఆ మహామహుడు సహాయుడై

విభవముగా మమ్ము చేపట్ట || రాముని ||


చ 1: యమకింకరుల జంకించెదము పూని

యమునినైన ధిక్కరించెదము

అమరేంద్ర విభవము అది ఎంతమాత్రము

కమలజు నైన లక్ష్యము సేయకున్నాము || రాముని ||


చ 2: గ్రహగతులకు వెరువబోము మాకు

గలదు దైవానుగ్రహబలము

ఇహపరములకు మాకిక నెవరడ్డము

మహిరామ బ్రహ్మ మంత్రము పూనియున్నాము || రాముని ||


చ 3: రాముడు త్రిభువన దేవ దేవుడు

రామతీర్థాల దైవలరాయడు

రామదాసుల నెల్ల శుభదాయియై చాల

బ్రోచి ప్రభుడై విభవముగా రక్షించును || రాముని ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.