రామా నామనవిని చేకొనుమా
Appearance
అసావేరి రాగం చాపు తాళం
ప: రామ నామనవిని చేకొనుమా దైవ ల -
లామ పరాకుచేయకుమా || రామ ||
అ.ప: స్వామి భద్రాచల ధామ పావన దివ్య
నామ గిరిజ నుత భీమ పరాక్రమ || రామ ||
చ 1: దరిలేని జనులను గాచే
బిరుదుపూనితివి ఖ్యాతిగాను
బరువగు నాబాధలను తీర్ప నీ
మరుగు జేరితి నన్నరమరచేయకు || రామ ||
చ 2: కపట మానసుడని మదిని యెన్న
కిపుడు రక్షింపు సమ్మతిని
అపరాధములకు నే నాలయమైతిని
కృపజూడుము నన్ను నెపము లెన్నకు || రామ ||
చ 3: పతిత పావన మూ ర్తివైన నీవే
గతియని యుండితి మదిలోన
సతతము రామదాస పతివై భద్రాద్రిని
అతులిత వై భవతతులచే నెలకొన్న || రామ ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.