Jump to content

రామా దయజూడవే

వికీసోర్స్ నుండి


   ధన్యాసి రాగం    ఆది తాళం

ప: రామా దయ జూడవే భద్రాచల

ధామా ననుబ్రోవవే సీతా || రామా ||


అ.ప: రామా దయ జూచి రక్షించి మమ్మేలు

రామా రణరంగ భీమా జగదభి || రామా ||


చ 1: రాజీవ దళలోచనఅ భక్త ప

రాధీన భవ మోచన

రాజ రాజ కుల రాజ రాజార్చిత

రాజిత వైభవ రాజాలలామ || రామా ||


చ 2: తాటక సంహరణ మేటి

కోటి రాక్షస హరణా

నీటుతో శ్రీ రామకోటి వ్రాసితి నీకు

సాటిలేరని సారె సారెకు వేడితి || రామా ||


చ 3: దిక్కు నీవని నమ్మితి నీపదములు

మక్కువగొని మ్రొక్కితి

చిక్కులు బెట్టకు శ్రీ రామదాసుని

చక్కగ బ్రోవవె చక్కని జానకి || రామా ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.