రామహో రఘురామహో
స్వరూపం
సౌరాష్ట్ర రాగం త్రిపుట తాళం
ప: రామహో రఘురామహో హే సీతా
రామ హో రఘు రామ హో || రామహో ||
చ 1: రామ హో భద్రశైల ధామ హో భక్తపాల
నేమహో సీతాలోల స్వామి హో సత్యశీల హో || రామహో ||
చ 2: అగణిత గుణధామ అజభవ నుత నామ
నగధర మేఘశ్యామ నత జనాశ్రిత కామ || రామహో ||
చ 3: శరధి బంధన శౌర్య శతృసంహార ధైర్య
గురు జన కార్య ధుర్య కోమలాంగ సౌందర్య || రామహో ||
చ 4: శరదిందు నిభానన శతమన్మధ సమాన
నిరుపమానంద ఘన నిజదాసావన రామ || రామహో ||
This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.