Jump to content

రాగమాలిక

వికీసోర్స్ నుండి
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/3 పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/4 అంకితం

శివశ్రీ

తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి

అన్న గారికి భక్తితో

ఈ రాగమాలికను. అర్పిస్తున్నాను.

-- బాపిరాజు. ఇందులో - 1. నరపతి 2. వాన 3. నాగరాజు 4. గుడిపిల్ల 5. ద్వేషం 6. గాలివాన 7. దీపావళి 8. సోమసుత 9. కన్ని

ఓ నరపతీ! నువ్వు ముప్పైయిద్దరు రాజకుమారులు మోసే వివిధరత్న సువర్ణ పల్యంకిపై ఊరేగుతూ ఉంటావు. గౌరీశంకరశృంగ మహామహిమప్రదేశాలలో తిరుగాడే దేవమృగ చామరాలతో నవయౌవన చంద్రికాస్నాతలైన మహారాజకుమారికలు పదహారుగురు మంజులకంకణకింకిణీ స్వనాలు వెలయ నీకు సదా వీస్తూ ఉంటారు. నీ వైభవం యక్ష పతి కుబేరుడిక్కూడ లేనేలేదు. నరపతీ! నీ క్రీగంటిఎరువులు చూడగానే L హిమా - లయాది పర్వతములు కదిలిపోతాయి. సదా సంతోషంతో ఉప్పొంగే ఒంటివాడైనా సముద్రుడు ఇంకిపోతాడు. అనేకోర్మి కోజ్వలితమైన నీఅంగుళీ వ్యంజనములకు ఒక్క సారిగా ఇరువది యొక్క అక్షౌహిణీలు గజ తురగ పదాతులు, సర్వనౌకా బలాలు హుమ్మని ముందు కురికిపోతవి. మానవావృత నిబిడ జనపదములు ఎడారులై తే, మరుభూములు పట్టణా లౌతవి. నీ బలసంపత్తి దేవచమూపతియగు కుమారునకే లేదు. 2 ఆ నరపతి ఒకనాడు ముప్పైరెండు రాజ్యా కు పాలక లగు తన సామంతులకుమారులు మోసే అందలమునుంచి దిగాడు. మంచి అందమైన వస్త్రాలు ధరించి, అంతఃపురంలో అంతటా ఏమాత్రం దారికైనా ఎడం లేకుండా, అడ్డంగా పండు కొనిఉన్నారు, తానుజయించినలాతి రాజ్యాలనుంచి ఖైదీలుగా 6 ణ బాపిరాజు బాపి రాజుక థ లు పట్టుకోని వచ్చిన మంత్రులు, సేనానాయకులు, రాజకుమారు లున్నూ —వాళ్ళమీదనుంచి రాళ్ళు పొదిగి నబంగారపు చెప్పు. లతో నడుస్తూ తనమందిరం చేరాడా రాజు. ఆమందిర వైభవం మచిలీపట్టణపు పల్యంకపురీ ప్రతినీరాదులు, గంధాతిముక్తక శ్రీపర్ణి కాది దారువులశిల్పములుగల గోపాన పటలాదులు, దంత స్తంభాలు, రత్నస్థగిత సువర్ణ సింహాసనాలు, సింహ శార్దూల మృగాదన కృష్ణసారాది మృగచర్మాలు, సువర్ణ ధూపదీప స్తంభాలు, కాశ్మీరపు పట్టు పని చేసిన దుకూలాంబ రాల చాందినీలు, అందుండి వ్రేలాడు నీలగారుత్మతలోహితక, వజ్రముల దీపపుబుళ్లు, భీమ, వాయుపు తాభిమన్యు, రామ, రావణ, సుందోప మందాదిపేరులు చిత్రలేఖనములు, స్ఫటిక రత్న నీలాది వివిధవర్ణ శిలలు, చంద్రశిలలు చెక్కిన శిల్పాలు. - ఆ నరపతి వచ్చి పట్టు తలగడలు, పరుపులు వేసిన ఒక పీఠముపై అధివసించగా, పూర్ణచంద్రబింబాస్యలగు బాలికలు వచ్చి, కొందరు సువాసన వేళ్ళ విసనకఱ్ఱలతో వీస్తున్నారు. కొందరు వీణాగీతాలతో కంఠాలు మేళవించి, కాకలీధ్వనులతో పాటలు పాడుతూ ఉన్నారు కొందరు పాద సేవ ఉన్నారు. కొందరు వర్ణకంతో వూరంగా అతని దేహ Ед మునకు లేపూత పూయుచున్నారు. చేస్తూ అయి ఆ నరపతి మ-సత్వుడు, ఆజానుబాహుడూ ఉన్నాడు. అతని విశాలమైనపక్షం హిమాలయపర్వత సాను వులా ఉంది అతనిభుజాలు, చేతులు ఏనుగు కుంభాలు, తొం డాలు. ఆ నరపతి గౌరీశంకరశృంగంలా మహోన్నతరూపుడు. మల్ల యుద్ధ గదాయుద్ధాలలో శక్తి, తోమరం అవీ అత్యంత న ర ప తి 7 నిపుణంగా వేయటంలో యిరువదినాలుగు రీతుల కతి సాములు, ఘాతము, గతి, వక్రము, ప్రతిఘాత, ఆవగతి, లక్ష్యము మొదలైనవాటిల్లో అత్యంతంగా ప్రావీణ్యం ఉంది. ధనుర్వేదంలో అర్జునుణ్ణి మించిపోతాడు. గజ తురగ శాస్త్రము లతనికి అశ్వనీకుమారుల కుమల్లే అతివిచిత్రంగా వచ్చు. ఆ నరపతి చాలా అందమైనవాడు. అతన్ని చూస్తే అప్సరసలు మొదలైన దివ్యనారీమణులక్కూడా హృదయం కొట్టుకొనేది. దేవతల్లోనే లేడు అతనితో సమానమైన సుందరమూర్తి. అతను అన్ని కళల్లో, అన్ని శాస్త్రాలల్లో మహాసిద్ధి సంపాదించాడు. సేవలు నడపడం, కొద్దిసేవలతో గొప్ప సైన్యములను కూడా చీకాకు పరచి నాశనం చేయడం, మనవ్యూహాలు పన్నడం, వీటిల్లో ద్రోణాచార్యుడు కూడా అతనికి ఈడు కాడు. భయంకరంగా ఆ నరపతి యుద్ధముజరిగినప్పుడుకూడా అతని సైన్యాలల్లొ భటులు ఎప్పుడూ కొద్దే నశించడం. రథ గజ తురగ పదాతిదళాల ప్రతివీరుడు, సము దాల్లొ యుద్ధనౌకలనావికులు అందరూ అతడంటే మహాప్రేమతో ఉంటారు. ఆతడు వారికి నచ్చిన నాయకుడు. గొప్పగా ధన మిచ్చు ప్రభువు, వారి హృదయం రంజించే వీరుడు. దేశాలన్నీ జయించా డా నర ప తి. కానుకలూ, కప్పాలు కొన్నాడు. రాజసూయయాగములు చేశాడా చిన్నతనంలోనే ఆక్ష ము కాక పోయినా. ఎ మూడు

"https://te.wikisource.org/w/index.php?title=రాగమాలిక&oldid=468155" నుండి వెలికితీశారు