రచయిత:గణపతిరాజు అచ్యుతరామరాజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
గణపతిరాజు అచ్యుతరామరాజు
(1924–2004)
చూడండి: జీవితచరిత్ర.

అచ్యుత రామరాజు 1924 మార్చి 5 మహాశివ రాత్రి పర్వదినాన మాతామహుల ఇంట తూర్పు గోదావరి జిల్లా కొలిమేరు గ్రామంలో ఛాయా భాస్కరయ్యమ్మ,సాంబ మ్మూర్తి దంపతులకి జన్మించారు. ప్రాధమిక విద్య విశాఖపట్నంలో సి.బి.ఎం. హైస్కూలులో ఇంటర్మీడియట్ మిసెస్ ఏ.వి.ఎన్. కళాశాలలో బి.ఎ. కాకినాడ పి.ఆర్కాలజీలో బి.ఎల్. చెన్నై లా కాలేజీలో పూర్తిచేసి విశాఖపట్నంలో లా ప్రాక్టీసు మొదలు పెట్టారు. ప్రఖ్యాత క్రిమినల్ లాయరుగా పేరుపొందడమే కాక చిన్న వయస్సులో 1966 లో విశాఖపట్టణ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా అయినా ఆ సాహిత్య,సాంస్కృతిక,నాటక,కళారంగాలలో,విద్యా,కార్మిక,రాజకీయ రంగాలలో అసమాన ప్రతిభ ప్రదర్శించి అనేక సంస్థలకు వ్యవస్థాపకులై అధ్యక్షులై రాణించారు. ‘కవిభూషణ’, ‘కళాసరస్వతి’, ‘కవిరాజు’, ‘రాజకవి’,‘సాహితీ’,‘సాంస్కృతిక’,‘సామ్రాట్’‘నాటకరత్న’,’నాటకపితామహ’, ‘నవయుగ ఆంద్ర భోజ’ ,’అభినవ కృష్ణదేవరాయ’ వంటి గౌరవాలు ఎన్నో అనేక సంస్థలుఇచ్చి సత్కరించారు. 197౦ లో విశాకపట్నం లో పౌరాసన్మానం ,సువర్ణ ఘంటా కంకణం ప్రధానంగా జరిగాయి. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ 199౩ లో కళాప్రపూర్ణ గౌరవం ప్రధానం చేసింది.19౩8 లో హైస్కూల్లో చదివేటప్పుడు కధలు రాయడం ప్రారంభించారు.

ఆ రోజుల్లోనే మంచి వక్తగా పేరు సంపాదిచారు. ‘చింతామణి’, లో శ్రీకృష్ణుడుగా ,షేక్సిపియర్ ఆంగ్ల నాటకాలలో విభిన్న పాత్రలు ధరించారు. ఆనాటి నుంచి నటులుగా, నాటక రాచయితగా ,ప్రయోక్తగా,నాటక సంస్థల నిర్వహణదక్షులుగా ప్రఖ్యాతి చెందారు. పిన్న వయస్సులోనే రవీంద్రనాద్ ఠాగూర్ నాటకాన్ని ‘మాలిని’, పేరుతో అనువదించారు. వీరి హాస్యరస ప్రధానమైన నాటకాలు ‘బ్రహ్మముడి’,’వినాయకుడి పెళ్లి’ అనేక సార్లు ప్రదర్శింపబడి ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ‘ఖడ్గ తిక్కన’ ,’తీర్పు’,’అన్వేషణ’,’చిన్న పిల్లలు’,‘ఇంకాన ------------ఇటుపైసాగావు’వంటి ప్రయోగాత్మక నాటక రచయితగా ప్రసిద్ధికెక్కారు. విశాఖ నాటక కళామండలిలో శిక్షణ పొందిన నటులు ,దర్శకులు, సంగీత కళాకారులు తరువాత సినీ ,టి.వి. రంగాల్లో ప్రఖ్యాతులయ్యారు. నేటి గొల్లపూడి మారుతీ రావు,కాశీ విశ్వనాద్ , ఆనాటి చంద్ర కళ,సంగీత దర్శకులు , ఇత్యాదులో వారిలో కొందరు.

నాటక రంగంలో ఎంత కీర్తి గడించారో అంత కీర్తి సాహిత్య రంగంలో సాధించగలిగారు. చిన్ననాటనే కధలు రాసిన వీరు 1949 లో విశాఖ రచయితల సంఘ తొలి సభ్యులలో ఒకరై కార్యవర్గ సభ్యత్వం నుంచి అధ్యక్ష స్థానం వరకు ఎదిగి దాని నుండి తప్పుకున్నారు. ‘ఆంధ్ర దర్శిని’ 195౩ లో వీరిని నటులుగా గుర్తించి పరిచయం చేసింది. 1957 లో ఆంద్ర ప్రదేశ్ సంగీత మూల నాటక అకాడమీకి సభ్యులుగా ఎన్నికయ్యారు. 1971 లో విశాఖ సాహితీ మూల పురుషులలో ఒకరై మూడు దశాబ్దాలుగా పైబడి అధ్యక్ష పీఠం అధిరోహించారు.

సాహితీ సభలు నిర్విరామంగా నిర్వహించి ‘విశాఖ సాహితీ , తరపున సుమారు 1౦౦ పుస్తకాలు ప్రచురింపచేసి ఎందరో వర్ధమాన కధలు, కవులు, రచయితలకు ఉత్సాహ ప్రోత్సాహాలందించారు. వీరి ‘కసి’కధకు 197౩ లో ప్రధమ బహుమతి లభించింది. ‘అమరం’,‘ఆనందహేల’,’రమ్యారామం’,స్వీయ కవితా సంకలనా’ల ద్వారా ఫ్రౌఢ కవిగా చక్కని గుర్తింపు పొందారు. సాహిత్యపు విలువలు ప్రోదిచేసుకోన్నవిగా గుర్తింపుపొందిన వీరు రచించిన పుస్తక పీఠికాలు ఎందరిచేతనో ప్రశంసింప బడ్డాయి. వీరు తమ కావ్యాలను, రచనలను ఎంతోమందికి అంకితం ఇచ్చారు. విద్యా రంగంలో వీరి కృషి తక్కువేమీ కాదు. వీరు 1964 నుంచి 1972 వరకు ఆంధ్రా విశ్వ కళాపరిషత్ లోనూ 1969 – 1972 వరకూ శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయాలకు సెనేటర్ గా ఎన్నికై విద్యా రంగంలో ప్రశస్తి పొందారు. వీరి రాజకీయ జీవితం కూడా చిన్న వయసులో ప్రార౦భమైనదే వీరు 1937 లో తేన్నీటి విశ్వనాధం గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

ఉత్తర సర్కారు జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పోటీచేసి 1962 లో ఓడినా 1968 లో జనసంఘ్ అభ్యర్ధిగా పోటీచేసి అఖండ విజయం సాధించి ఆరేళ్ళ పాటు శాసన మండలి సభ్యులుగా ప్రతిపక్షానికి రాణింపు తేవడమే కాక పాలక పక్ష మన్ననలు కూడా పొందారు. వీరు విశాఖపట్నంలో జరిగే ప్రతి సాహిత్య,సంస్కృతిక,విద్యా రంగాలలో ఇచ్చిన ఉపన్యాసాలు సభికులను ఎంతగానో అలరించేవి. వీరు 2౦౦4 లో పరమపదించారు.