Jump to content

రక్షించు దీనుని రామ రామ నీ

వికీసోర్స్ నుండి


 పున్నగవరాళి రాగం   త్రిపుట తాళం

ప: రక్షించు దీనుని రామ రామ నీ

రమణితోడు నన్ను రక్షింపకున్న మీ

తండ్రి దశరధరాజు తోడు || రక్షించు ||


చ 1: అరుదు మీరగ విభీషణుని బ్రోచితి వల్లనాడు అట్లు

కరుణింపకున్నను మీతల్లి కౌసల్య తోడు || రక్షించు ||


చ 2: గిరిగొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితి వల్లనాడు అట్లు

సిరులియ్యకున్నను మీకులగురు వసిష్టు తోడు || రక్షించు ||


చ 3: అలివేణి యహల్య శాపము బాపితి వల్లనాడు అట్లు

కలుషములు బాపకున్న లక్ష్మణుని తోడు || రక్షించు ||


చ 4: పాపాత్ముడైన కబంధు బ్రోచితి వల్లనాడు అట్లె

నెపము లెన్నక కృపచూడకున్న మీయింటి తోడు || రక్షించు ||


చ 5: వదలక నీమీదనే నాసలు బెట్టవలసె నేడు

భద్రాద్రి రామదాసుని ఏలకున్న నీపాదము తోడు || రక్షించు ||

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.