రంగనాథ రామాయణము/బాలకాండము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీరస్తు

శ్రీ రంగనాథ రామాయణము

ద్విపదకావ్యము - బాలకాండము


—: దేవతాస్తుత్యాదికము :—

శ్లో. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్,
ఏకైకమక్షరం బ్రిక్తం మహాపాతకనాశనమే.
రామూయ రామభద్రాయ రామచస్ట్రాయ వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః.


శ్రీకామినీనాథు జితదైత్యనాథు - లోకరక్షణకృత్యు లోకైకనిత్య
నిత్యసదానందు నిర్వాణకృత్యుఁ - గృత్యవిదూరు నకృత్రిమాధారు
నాధారకమలమధ్యామోదభేద - సాధనక్రమ సమాచరణషట్చరణు
సింధురవరదు నాశ్రితలోకబంధు - బంధమోచను బలిబంధనోదగ్రు
నారూఢపంచదశాక్షర ప్రసవ - పారిజాతాకారుఁ బ్రిణవానుకారు
నగాన్యుగోపి కొభ్యంతరవ్యగు - నగసదాకారు నాకారరహితు
యోగిమావసలసదోంకార దీపు - యోగసందర్శితాభ్యుదయ ప్రచారు
శ్రుతిశిరోభాగవిశుద్దదైతన్యు - నతిలోకు సర్వలోకాశయశ్లోకు
నఖిలాండమౌక్తికాయతనిత్యసూత్రు - నఖిలతత్త్వాతీతు నాద్యంతరహితు
నమలాత్తు నక్షరు నామ్నాయకమల - కమలాపు నక్షీణకల్యాణసదను 10
శంకావినిర్తు క్తసద్భక్తవర్య - కైంకర్యవత్సలుఁ గారుణ్యసింధు
డై వచ్చి బోధ్యమై తోఁచి - బోధమై వీక్షించు పూర్ణస్వరూప
నాదితత్త్వము తత్త్వమస్యాదివాక్య - భేదాతిదూరు, నభేదప్రతాపఁ
గడుకొని నియతులై కర్త బంధములు - గడచి. యేకతమునఁ గదలక నిలిచి
యరుదుగా నింద్రియవ్యాప్తలమఱచి - విరచితాసనబద్ధ విన్యాసిలీలఁబరిచితాసనమునఁ బదిలమై నిలిచి - సరవితో మదిలోన సరసత నిల్పి
వెలయ డెబ్బది రెండు వేలనాడులను - గలయ వివేకించి, కసటు వోఁ దుడిచి
యోక రెండు క్రోవల నొకటిగా మెలఁగి - యకలంకమతితోడ నతిసూక్ష్మముగను
నవయవంబులయందు నానందమైన, పవను నిరోధించి, పశ్చిమవీథిఁ
జొనిపి, కోణత్రయశుద్ధి గానించి - మనసుతోడనె కూడ మఱపించి తెచ్చి 20
కుండలినిజశక్తిఁ గూర్చి, సంప్రీతి - నొండొండఁ గమలంబు లొగి నాఱు గడచి
యటఁ జంద్ర మండలం బల్లనఁ జేర్చి - యటఁ బరమచ్యోమమై తన్నుమఱచు
పరమయోగీందులభావముకీలు - పరికింపఁ దానె న బహుస్వరూప
మొగి రెంటఁ బెరయక మూఁట నేర్పడక - తగిలి నాల్గవ త్రోవ తత్త్వమైయుండి
యైదింటి కాదియై, యాటిటిఁ గడచి - యాదికి నాదియై యమరినదేవుఁ
దనుతర నిర్త్పలాంతర్నాడియూప - మనురూప మగుమనం బాబద్ధపశువు
నిష్టాభిరతి వేది, నిఖిలేంద్రియములు - కాష్ట్రము, ల్బోఛ మఖండ పావకుఁడు
యోగామృతము ఘృత, మ.జ్ఞ్వలానంద - యోగంబు ఫలముగా, నొగి జెచున్న
యభిమతాంతర్య నిత్యామోదకర్త - విభవంబు కడపట విలసిల్లా పరముఁ
బర మేకు నవ్యయుఁ బచమకల్యాణుఁ - బరూతు నపరోక్షఁ బ క్షీణకర్ము 30
మాదేవుఁ గమలాక్ష మస్జేలు దేవు - నాదినారాయణు నఖిలలోకేశు
భావించి కీర్తించి, పార్లించి మొక్కి - సేవించి, యభిమతసిద్దిఁ గావింప
హారకర్పూర నీహారగోకీన - తారకాకృతి శారదాదేవిఁ గొలిచి,
చారురాచూయణ చంద్రాద్ధి యగుచు - వారక విలసిల్లవాల్మీకి దలఁచి,
భారతమంజరీ పారిజాతంబు - సారమానసుఁ బరాశరసూనుఁ దలఁచి,
యతనితనూభవు నాశుకబ్రహ్లా - నతిభక్తియుక్తిమై నభినుతిచేసి,
కథఁ జెప్పిన నెల్ల సజ్జనులు - సేకాని కీర్తులు చేయుచు నుందు;
రేకథఁ జెప్పిన నిహపరోన్నతులు - పాకటంబుగఁ జేర్చి ఫలియించుఁ బీతి ;
నేకథఁ జెప్పిన నీప్సితార్థములు - గైకొని పుణ్యముల్ గడఁగి కొన్పించు,
ననువిచారములు నాయంతరంగమునఁ - గొనకొని కృతిసేయఁ గోరుచున్నంత ; 40

—: గ్రంథరచనకుఁ గారణము :—

శ్రీరమణీయులై సృష్టి సత్తములు - గోరి వర్ణన సేయఁ గోనవంశమున
ఫలిత సదాచార భానుఁ డై తోఁచి - కలికాలదోషాంధకారంబు ద్రోలి,
గురుధర్షపథముల కొలఁదులు దెలిసి - పరనృపనక్ష త్రపంక్తుల సణఁచి,
నిత్యపుణ్యోదయనియతిఁ బెంపొందు - నత్యున్నత ప్రతాపాభిరామునకుఁ
గరదీప్తి నిజఖడ్గ గంగా ప్రవాహ - పరధరణీపాల ఫాలాక్షరములఁగలపూర్వగర్వపంకము లొప్పఁగడుగు - నలవు మై నసమూనుఁడగు సత్యనిధికి
శరణార్థి రాజన్యషట్పదాధార - కరపద్ము నకుఁ గోనకాటభూపతికి,
నయనయోదయదయాయతనిత్యమతికిఁ - బ్రియతనూజ నుఁడై పృథివిఁ బెంపొందు
రుద్రప్రతాపుండు రుద్ర నిర్మలుఁడు - రుద్రాత్ము డగు కోనద్ర నరేంద్రు
పౌ తుఁ డభంగుఁ డ ప్ర తిమ విక్రముఁడు - గో త్రధీరుఁడు కులగోత్రవర్దనుఁడు 50
దివిజేంద్ర విభవుండు ధీరవర్తనుఁడు - భువనవిఖ్యాతుండు బుద్ధభూపాలు
తను జ నుఁ డక్షీణదాక్షిణ్యధనుఁడు - ధనధాన్యధనదుండు ధ రధర జుఁడు
అతిపుణ్యసౌజన్యుఁ డరిభీమజన్యుఁ - డతిశౌర్యశరజనుఁ డాజ_న శుభుఁడు
కామినీకాముఁ డ ఖండవిక్రముఁడు - రామ త్రయోదారరణవిశారదుఁడు
చందనమందార చంద్రికాహార - కందళత్కుందేందు ఘనకీర్తిధనుఁడు
పరఁగు కోనాన్వయపారిజాతమునఁ - బరిపక్వఫలరీతిఁ బరగినవాఁడు
పొలుచు కోనాన్వయ పూర్వాబ్రియందు - వెలుఁగు భానుఁడు వోలె విలసిల్లవాఁడు
దొరిసికోనాన్వయ దుగ్గాంబురాశి - బరిపూర్ణచంద్రుఁడై భాసిల్లవాఁడు
నిక్కి యంతంతకు నిలం బగుచు - దిక్కు-లఁ దన పేరి దీపించువాఁడు
దానధర్హక్రియాతాత్పర్యకెళి - డానయై వినుతులఁ దనరారువాఁడు 60
మగఁటిమి నసమానమహిమ దీపింపఁ - బగతుఱ నవలీల భంజించువాఁడు
బలితోగరాజన్యబలవజపాణి - లలినొప్పవాసపు లలిఁ బోలువాఁడు
ప్రత్యక్షనృపవనపావకోజ్వలుఁడు - సత్యంబుచేతను సరిదగువాఁడు
బలవదుగా రాతి బలసముద్రములఁ - గలఁచుచో మంథా ది గతిఁ బేర్చువాఁడు
విమలో గ రాజన్యవిపులాంధకార - కమలా పబింబఖడప భావిభవ
ృపప్రాణానిలాహారభుజగ - వరభుజాస్థాపితావనిగలవాఁడు
కురు కేరళావంతికుంతల ద్రవిళ - మరుమత్స్యకకరూశమగధపుళింద
ససుపాండ్యకోసలబర్బరముల - నరనాథసభల వర్ణన కెక్కు దాఁడు
ఆతతసామభేదాదులనొప్ప - నీతిక్రమంబుల నెరసినవాడు 70
రమణమై నాది మరాజన్యరీతి - నమిత వైభవముల నమరినవాఁడు
వినయనయోపాయ విజయసుస్థిరుఁడు - ఘనకీర్తి విర్థలక్షాపాలవరుఁడు
రాజసర్వజ్ఞండు రాజసింహుండు - రాజశిలోమణి రాజపూజితుఁడు
సకలజగద్ధితచాతుర్యధుర్య - డొకనాఁడు కొలువున నున్నతుం డగుచు,
బహు పురాణజ్ఞలు బహుశాస్త్రవిదులు - బహుకావ్యనాటక ప్రైఢమానసులు,
హితులు మంత్రులు పురోహితులు నాశ్రితులు - సుతులు రాజులు బహుప్రతులును గొల్వ,
దీపించి భూలోకదేవేంద్రుపగిది - నేపారియున్నచో నింపు సొంపాందరసికులు భారత రామాయణాది . రసగోష్టిం జెల్లింప రసిక శేఖరుఁడు,
రామకథా సుధారసర క్రుఁ డగుచు - నామహాసభలోన నందఱఁ జూచి,
రమణ మొఁ దెను గున రామాయణంబు - కమ మొప్పఁజెప్పెడి ఘనకావ్యశక్తి 80
గలకవు లెవ్వారు గల రుర్వి?"ననుచుఁ - దలపోయ విర్థలధరణిపాలనకు
నున్నతమూ_ర్తికి నురుయశోనిధికి, మిన్నవించిరి వేడ్క విబుధులు గడఁగి
“నీతనూజనుండు నిపుణమూ నసుఁడు - ధూతకల్మషుఁడు బంధురనీతియుతుఁడు
సర్వజ్ఞఁ డనఘుండు చతురవర్తనుఁడు - సర్వపురాణవిచార తత్పరుఁడు
కమనీయ బహుకళాగమవిచక్షణుఁడు - సుమనీషి పోషణోత్సుకసుఖోన్నతుఁడు
కనిసార్వభౌముండు కవికల్పతరువు - కవిలోకధోజండు కవిపురందరుఁడు
ప్రత్యర్షిరాజన్యబలవ జపాణి - పత్యర్షి నృపదావపావకోజ్జ్వలుఁడు
భీకర నిజఖడ్లబింబిత స్వర్ల, లోకానుర కృతి లోకదుర్హముఁడు
వరసాధుజలజాతవనజాతహితుఁడు - పురుషచింతామణి బుద్రభూవిభుఁడు
నీ కతిభ క్రుండు నిఖిలశబ్దార్థ, పాకజ్ఞ డత్యంత పాండిత్యధనుఁడు 90
మఱియు రామాయణముర ధర జుఁ - డెఱుఁగు నాత ని బిల్వు మీకథఁ జెప్ప,"
వనిన మజ్జనకుఁ డుదా_త్తవర్తనుఁడు - నను నర్థిఁ బిలిపించి, నను గారవించి,
భూమిఁ గవీంద్రులు బుధులును మెచ్చ - రామాయణంబు పురాణమార్గంబు
తప్పక నా పేరఁ దగ నంద్ర భాష - జెప్పి ప్రఖ్యాతంబు సేయింపు ముర్వి"
నని యానతిచ్చిన నష్టృదూక్తులకు - ననయంబు హర్షించి, యట్ల రౌ వింపఁ
బనిపూని, యరిగండ భైరవు పేర - ఘను పేర మీసరగండాంకు పేర
లలిత సద్గుణగణాలంకారు పేర - నలఘు నిశ్చలదయాయతబుద్ధి పేర
నాతతకృతి పేర నతిపుణ్యుపేర - మాతండ్రివిఠలబైనాథ పేర
రాజులు బుధులును రసికులు సుకవి - రాజులు గోష్టిని రాగిల్లి పొగడ
బదము లర్ధంబులు ధావముల్గతులు - పదశయ్య లర్థసౌధాగ్యము ల్యతులు 100
రసములకల్పన ల్పాససంగతులు - నసమానరీతులు నన్నియుఁ గలుగ
నాదికవీశ్వరుఁ డైన వాల్మీకి - యాదరంబునఁ బుణ్యు లందఱు మెచ్చఁ
జెప్పిన తెఱఁగున శ్రీరామచరిత - మొప్పఁ జెప్పెదఁ; గథాభ్యుదయ మెట్లనినః——
కథా ప్రారంభము

ఘనతపస్స్వాధ్యాయకమనీయశీలా - మునినాథు నారదు మునిలోకవంద్యు
ననఘతపోనిధి యైన వాల్మీకిఁ - గనుఁగొని యొకనాఁడు కర మర్థి నడిగె,
“ఎవ్వఁడు శ్రీమంతుఁ? డెవ్వఁడు శాంతుఁ? - డెవ్వఁడుఘనపుణ్యఁ? డెవ్వడున్నతుఁడు? .
ఎవ్వఁడు నీతిజ్ఞఁ? డెవ్వఁడు ప్రాజ్ఞఁ? - డెవ్వఁడు దుర్దముం? డెవ్వఁ డుత్త ముఁడు ?
ఎవ్వఁడు జితకాముఁ? డెవ్వఁడజేయుఁ? - డెవ్వడు నిరసూయుఁ? డెవ్వఁడాఢ్యుండు ?
ఎవ్వఁడు సువ్రతుం? డెవ్వఁడుదారుఁ? - డెవ్వండుసుచరిత్రు? డెవ్వఁడు సముఁడు ?
ఎవ్వనికిన్కకు నింద్రాదిసురలు - దవ్వుదవ్వులనుండి తలఁకుచుండుదురు ? 110

అట్టివాఁడిలఁబుట్టి యరిగెనో ? యిష్టు - పుట్టెనో? యిఁకమీదఁబుట్టనున్నాఁడొ? "
యనినఁ ద్రి లోకజ్ఞఁ డైననారదుఁడు - దనబుద్ధినెంతయుఁ దలపోసిచూచి
“యామహి శ్రీవిష్ణుఁ డిపుడు జన్మించె, రాముఁడై దశరథరాజున; కతఁడు
నియతాత్తుఁ, డతిశౌర్యనిధి, కృపాజలధి - జయశాలిస్వజనరక్షణవిచక్షణుఁడు
కంబుకంధరుఁడు చక్కని మేనివాఁడు - బింబారుణోష్ఠుండు పీనవక్షుండు
పెడదకన్నుల వాఁడు విపులాంసతలుఁడు - నిడుదచేతులవాఁడు నియతవ_స్త్రనుఁదు
వేదవేదాంగకోవిదుఁడు కోదండ, వేదవిదుండు వివేకభూషణుఁడు
కమలాపు తేజంబు కడలిగాంభీర్య - మమరాద్రిదైర్యంబు, నవని సైరణయు,
ధనదునిత్యాగంబుఁ దనయందు మిగులఁ - ననునొందునిత్య కల్యాణవిగ్రహుఁడు,
కౌసల్యకానంద కరుఁడు శ్రీకరుఁడు - భాసురత్చైలోక్యపావనమూర్తి 120.

రాముఁడైయిలఁబుట్టి రాజశేఖరుఁడు - రాము నిమ్లని వేఁడ రాజు పంపఁగను,
మౌని వెంటను బోయి, ముఖమునుగాచి - దానవి నటు కూల్సి దైత్యుని ద్రుంచి,
రాతి నాతిని జేసి, రాముఁడు వేగ - సీతఁ జేకొనుటకు శివువిల్లు విeటిచి,
ఖ్యాతిగా సీతను గడుఁ బెండ్లియాడి - సీతతోడనుగూడి, చెలఁగియయోధ్య
కేతెంచుచోటను గెరలుచు విప్ర - డే తెంచి, నిలిచిన నేపునఁ గదిసి,
వాపోవ నాతని బలువిల్ల దిగిచి . కోపంబుతో మునుఁ గొమరొప్పఁదీసి,
యేపన నందఱ నెద వేడ్కమీఱ - నాపట్టుననెవచ్చి యప్పరిఁజేరి,
“యాసక్తియా"వరాజ్యాభిషిక్తునిగఁ - జేసెద"నని తండ్రి చెలఁగి యయోధ్యఁ
బట్టంబు గట్ట భూపతి సమకట్ట - మట్టుమీఱినయట్టి మంథర యపుడు
నెట్టనఁ గైకతో నెటినాటఁ జెప్పఁ - గట్టడికైకసంగరమునఁ దొల్లి 130

రెండు వరంబు లర్థించినదౌట - జండించి, కాననస్థలికి రాఘవునిఁ
బనిచిన, జనకుని ప్రతినకై పూని - జనకజాలక్ష్మణసహితుఁడై వెడలి,
దేవనంబునను నెంతేవనంబునను - బావనమునిచర్యఁ బరఁగుసంయములఁగరుణమైఁ గాపాడి ఖరదూషణాది . శిరములు శరములఁ జెండు చెండాడి,
ఋశ్యమూకంబున నినజుఁ జేపట్టి, వశ్యత నౌకకోల వాలిఁ దూలించి,
సీత కె చలపటి సేతువుగటి - పాతకదశకంఠుపదితల లొట్టి,
సీతతోఁ గూడి, యా శ్రీతలోక పారి.జాతంబు వనచర జాతంబు గొలువ.
నిందాదివినుతుఁడె యేతెంచి, రాము.చందుండు నిజపూజ్యసా మా జ్యలక్షీఁ
బాలించుచున్నాఁడు; ప్రజలకు వేడ్క - గీలించుచును గృతకృత్యుఁడై" యనుచు 140

నారాము చరిత మాద్యంతంబు చెప్పి - నారదముని పోయె నలిన జుపురికిఁ;
మునిపతివాల్మీకిముద మొప్ప నంత - దనశిష్యుఁ డగు భరద్వాజుండు డాను
బ్రకటింప సజ్జనభావంబు పోలె - నకలుషజీవనం బైకరం బలరు
తమసానదికిఁ బోయి, తన్నదీవారిఁ - దమయనుష్టానము ల్డగఁ జేయుచుండి,
యాయేటిదరిఁగ్రౌంచయమశంబు ప్రేమ - గాయజకేమైఁగవయుచో, నొకటి
నొక బోయచంపిన, నున్నయా క్రౌంచి ప్రకటశోకంబునఁ బలవింపఁ జూచి ,
దగవును ధర్తంబు తలపోసి మౌని - పగదాయ నద్బోయపై నల్క బొడమి.
యోరి నిషాదుండ ! యోరిపాపాత్త . యోరి ! సీకెమి యొునరించే ? రోరి
కామించి క్రొంచముర్ గవయుచో నొకటి . నేమిటికై చంపి తిబ్బంగిఁ గదిపి ?
యాపాతకమున ననేకదుఃఖములు - ప్రాపించి తిరుగుము బహువత్సరములు " 150

అనిబోయ శపియించి, యంత వాల్మీకి - దనశిష్యుఁ డగు భరద్వాజునిఁజూచి.
పలికెను శ్లోకంబుపద్ధతిగాను - “బలికినపల్కును బలుమాఱుచూడ
ఛందో నిబద్దమై సమవర్ణపంక్తిఁ - బొంది నాలుగుపదంబుల హృద్య మగుచు
నిది చాలవిస్తయ మీశాపవాక్య - పదములు దమయంతఁ బద్యమై నిలిచె."
ననిన భరద్వాజుఁ డాదిగా శిష్యు - లనురక్తిఁ బఠియించి రాపద్యమంత ;
సనఘుఁ డా వాల్చీకి యాశ్రమంబునకుఁ - జనియున్నచో బహ చను దెంచుటయును
నెదురేగి పదముల కెరఁగి తోడైచ్చి . కుదురుగాఁ గుశ పీఠిఁ గూర్చుండజేసి,
కరమర్ధి బూజించి, కరములు మొగిచి - పరఁగ శాపాక్షర పద్యంబుఁ జదువ
విని, బ్రిప్త నగి, “పద్యవిషయమై వాణి - యనఘ! నీముఖమున నవతరించినది ;
శ్రీరామచరిత మ శేషంబు నాకుఁ . గోరి నారదుఁడు సంకోచించి చెప్పె. 160

నదివిస్తరించి నీ వథిలంబుచెప్ప - నది; సర్వమును దోఁచు"నని చెప్పి పోయె.
సీరీతిఁ గృప వరం బిచ్చి మన్నించి - సారసగర్భుండు సనినపిమ్మటను.
మఱి నిర్తల ధ్యానమతిఁ బూని హౌని - తఱిగొని సకలంబఁ దలపోసిచూచి.
రఘుచరిత ము, దశరథుచరితంబు - రఘురాముజనంబు, రామువర్తనము.
తాటకవధయు, నుద్దండరాక్షసుల - యాటోపహరణంబు, యజ్ఞా రక్షణము,
చనరుగంగామహత్త్వంబు, గౌతముని - వనితను శాపంబువలనఁ బాపుటయు, .

ధనువుఁద్రుంచుటయు, సీతా వివాహంబు - చనుచోటజమదగ్నిజాతునా గ్రహము,
రామాభిషేక సంరంభంబు, దుష్ట - కామిని కైకేయి కష్టభాషణము,
నభిషేక విఘ్నంబు, నడవికి రామ - విభుఁడు వోవుటయు, భూవిభునిశోకంబు,
దశరథుమరణంబు, దశరథరాముఁ - గుశలసంభాషియై గుహుఁడు గాంచుటయు, 170

నురుపుణ్యు లట. గంగ ను త్తరించుటయు - వరతపోనిధి, భరద్వాజు గాంచుటయు,
నరిగి, యాచిత్రకూటాద్రినెక్కుటయు - భరతుండు రఘురాముపజ్ఞఁ జేరుటయు,
నన్నచేఁ బాదుక లగ్జిమై బడసి - మన్నన లింపార మగుడి వచ్చుటయు,
దండకాగమనంబు, తగిలి విరాధుఁ . జండవిక్రము నందు సంహరించుటయుఁ,
బరమపుణ్యునిశరభంగుఁ గాంచుటయుఁ - బరువడి మునులతోఁ బ్రతినలాడుటయు,
చని యయ్యగస్త్యునాశ్రమము చొచ్చుటయు - మునిచేత దివ్యాస్త్రములు వడయుటయు,
మునిచెప్పఁగా వారు మడమున వేగ - చని పర్ణశాలలో సరగనుండుటయు,
మోహించి రాక్షసి మొనసి వచ్చుటయు - నూహించి దానితో నొగిఁ బల్కుటయును, .
రామానుజుండు శూర్పణఖ - ముక్కును, శెవులును మ్రో డు సేయుటయు
నదివోయి. ఖరదూషణాది రక్కసుల - కదిచెప్ప వారంత నలిగి వచ్చుటయు, 180

నురువడి రఘురాముఁ డొక్కఁడే కడఁగి - ఖరదూషణాదుల ఖండించుటయును,
నట రావణునిబుద్ధి నలుక్తవుట్టుటయుఁ - గుటిలమారీచుండు క్రొవ్విచచ్చుటయు,
నసురాధిపతి సీత నపహరించుటయు - విసువక రాముఁడు విలపించుటయునుఁ,
నని జటాయువుచావు నవల గబన్ధుఁ - గనుటయు, మఱి పంపకడకుఁ బోపుటయుఁ.
గరమర్థి ఋశ్యమూకమున సుగ్రీవుఁ - డరుదెంచి కనుటయు, నతనిసఖ్యంబు
వాలిసుగ్రీవులవై రంబు తెఱఁగు - , చాలంగ రాముండు సప్తతాళముల
నేలఁ గూలఁగనేసి నెమి మెప్పించి - వాలి నొక్క-మ్లున వధియించుటయును,
దారావిలాపంబు దశరథసూసుఁ - డారవిసూను రాజ్యమున నిల్పుటయు,
మానవపతియంత, మాల్యవంతమున - వానకాలం బెల్ల వసియుంచుటయు,
గాకుత్స్థకోపంబు కపిసమాగమము - నేక తంబున ముద్రి కిచ్చిపుచ్చుటయు, 190

నలయక కప్పలు సీతాన్వేషణంబు - సలుపుటయును, బిలసందర్శనంబు
నాక్షణంబున మహేంద్రాద్రి నెక్కు-టయుఁ - బక్షీంద్రుఁడైన సంపాతిదర్శనము,
వనధిలంఘనమున. పనధిమధ్యమునఁ - జనుచోట మైనాకసందర్శనంబు,
మదమెత్తి సింహిక మారుతసూనుఁ - గదిసి చచ్చుటయు, లంకా ప్రవేశంబు,
లంకను నొప్పించి లలనచే నచట - లంకత్రోవయు గని 'లంకఁ జొచ్చుటయు,
నంతఃపురంబున కరిగి చూచుటయు, - నంత నశోకవనావలోకనముఁ,
దెఱగొప్పనందు వైదేహి ఁగాంచుటయు, - నెఱుకకు నానపోలిచ్చి దేర్చుటయు,
బెనచి యావన మెల్లఁ బెణికివైచుటయు, - హనుమంతుఁ డత్తఱి నక్షుజంపుటయు,


బవనజుఁ డటఁ బట్టువడి పోవుటయును, గవిసి లంకాపురి గలయఁగాల్చటయు,
మానినీమణిశిరోమణి నిచ్చుటయును - మానితాత్తం డబ్ది మరలదాఁటుటయు, 200

మధువనహరణంబు, మణి ప్రీతినిచ్చి - యధిపతి మారుతి నాశ్వసించుటయు,
వినకులాధిపుఁడు దండెత్తిపోవుటయు, - వనధితీవంబుస వచ్చి నిల్చుటయు,
వనరాశి త్రోవ యివ్వక క్రొవ్వుటయును - గొనకొని రాముండు గోపించుటయును.
నంతవిభీషణుఁ డధిపుఁ గాంచుటయుఁ - జింతించుటయు మఱి సేతుబంధనము,
జడధిదాఁటుటయును, జనిలంకమీఁద - విడిసి పేర్చుటయు, దోర్వీర్యంబు మెఱసి
కర ముగ్రులగుకుంభకర్ణాదివీర - వరులఁ ద్రుంచుటయు రావణునిఁ జంపుటయు,
నావిభీషణుని లంకాధినాయకునిఁ - గావించి పట్టంబు కరుణఁ గట్టుటయు,
ననుపమశుద్ధి బ్రహ్లాదుల మెచ్చ - జనకజ రఘురామచంద్రుఁ ఓ'Oదుటయు,
నెలమి ఁబుష్పక మెక్కి యెల్లరు వేడ్కఁ - జెలఁగి యంభోనిధి సేతువు మీఁదఁ
దెలిసి శ్రీకంఠుఁ బ్రతిష్ట సేయుటయు, - వెలయ నయోధ్యకు వేగవచ్చుటయు, 210

భరతుగాంచుటయును, దిట్టాభిషేక - మరుదుగా రఘురాముఁ డవధరించుటయు,
గపి సైన్యపతుల నర్క-జవిభీషణుల - విపులసంపద లిచ్చి వీడుకొల్పుటయుఁ,
బరికించి ప్రజలకాపదలౌందకుండ - గరుణ ట్రోచుట, యనుకథలెల్లఁ దెలిసి
వెలయ నిర్వదినాల్గవేలల్లోకములు - గలిగి, యేనూఱుసర్గల విస్తరిల్లి
కొండంబు లాఱింటఁ గర మొప్ప మిగిలి - యుండ, రామాయణ మొప్పఁగావించి
యొనరఁ దక్కినకథ లుత్తరకాండ - మునఁ జెప్పి, వాల్టీకి మునినాథుఁ డంత
ఈ కథ పఠియుంప నెవ్వరు నేర్తు - రీకథ జగముల నెబ్భంగి వెలయు,
ననుచుండ కుశలవు లనఘమానసులు - మనసిజాకారులు మంజుభాషణులు,
జనను తుల్ సంగీతసాహిత్యపరులు - ముని వేషధారు లిమ్లులవచ్చి మొక్కి,
యనఘ ! రామాయణంబర్థితో జదువ-జనుదెంచితిమి మమ్లఁజదివింపవలయు,"220

ననిన సంతోషించి యమ్లనీశ్వరుఁడు - "తనమనోరథమెల్లఁదలకూడె" ననుచు
గేయమై పాఠ్యమై కేవలపుణ్య, దాయకం బగు రఘూత్తముచరిత్రంబు
ననుపమతంత్రీలయాన్వితఫణితి - మునిపతి చదివింప ముద మొప్పఁ జదివి,
గమణశృంగారాదిరసములేర్పడఁగ సమవృత్తి భేదముల్ సంధి సమూస
సమధికశబ్దార్థసంగతు లెఱిగి - క్రమ మొప్ప బాడుచుఁ గవగూడి వారు
మునిజనసభల నిమ్లులఁబూజనములు - గొని, వినోదింపఁ గాకుస్త వల్లభుఁడు
వెలయఁ దమ్ములు దాను వేడ్కలింపొందఁ - గొలువిచ్చి వారలఁ గోరి రావించి
గొరిరూపంబులు వారినిల్కడలు వారినిర్మలతరవాగ్విశేషములు,
నకు నింపొనఠింపఁ దత్కథాక్రమము - వినుచుండె రాముఁడవ్విధమెట్టిదనిన:---కుశలవులు శ్రీమద్ద్రామాయణ కథను గానము చేయుట

ద్వాదశ యోజనాత్యాయం బగుచు - నైదు యోజనముల నది వెడ ల్పగుచు 230

నిపుణత మయునిచే నిర్దితంబగుచు - నెపుడుశా త్రవకోటి కెమరుచు క్కగుచు
కొలఁదిమీఱినభానుకులజులకెల్ల - కులరాజధానియై కొనియాడఁ బరఁగి
సరయువు పొంత కోసల దేశమునను - ధరణికిఁ దొడ వయోధ్యాపురంబొప్ప ;
మణిగోపురంబుల మణితోరణముల - మణికట్టిమంబుల మణి గవాక్షములఁ
గేళికాగృహములఁ గృతకళైలముల - బాలానిలంబులఁ బటహనాదముల
మహితవారణముల మానితాశ్వముల - బహురథ ప్రతతుల భటకదంబముల
విమల సౌధంబుల విపణి మార్గములఁ - గమనీ యవనములఁ గమలాకరములఁ
జెఱువుల బావులఁ జెఱకుదోటలను - దఱు చైన శాలి కేదారవారములఁ
బరిఘలఁ గోటలఁ బసిఁడిచూడువులఁ - గర మొప్ప లోక విఖ్యాతమై పరఁగు.
నాపురి దశరథుం డను మహారాజు . చాపవిద్యావరజాల కార్ముకుఁడు 240

చతురుపాయజ్ఞండు షాడ్గుణ్యశాలి సతతశక్తిత్రయసంధానకర్త
ధర్మోత్తరుఁడు కృతాధ్వరుఁడు శ్రీకరుఁడు ధర శాస్త్రపురాణతాత్పర్యపరుఁడు
అజునినందనుఁడు బాల్యాదిగా నియతిఁ - బ్రజలపాలించిన పరమపావనుఁడు
జంభారికై పోయి శంబరాసురుని, దంభం బణంచి సుత్రామునిచేత
మందారపుష్పదామములు గైకొన్న - యిందుమతీపత్తుఁ డి నకులాధిపుఁడు
తేజంబు కాంతియుఁ దెగువయు నేర్పు - రాజసంబును నుదారతయు ధైర్యంబు
మొదలైనసద్గుణంబులప్రోదియగుచు - నుదయార్కు గతిఁదనయుగ్ర తేజంబు
దీపితంబై యేడు దీవులఁ దిర్వ - భూపాలతిలకమై పౌలు పొంద నేలు.
నన్న రనాథుకులాంగనామణులు - మున్నూటయేబండ్రు ముఖ్యలై యందు
నచలతసౌశీల్యమైన కౌసల్య - కుచకుంభనిర్జితకోక యాకైక 250

యనఘచరిత్రయానా సుమిత్రయును - వినుతికెక్కిరి త్రయీవిద్యలోయనఁగ.
నిలమీఁదనతనికి హితపురోహితులు - పొలుచువసిష్టాది పుణ్యసంయములు
అనఘాత్తకుఁడు దృష్టి యనువాఁడువిజయుఁ - డను వాడు సిద్ధార్ధుఁ డన వాఁడు మలయు
నర్థసాధకుఁడు జయంతుఁడు నీతి - తీర్ధుఁడశోకుండు ధీమంతుఁడైన
మంత్రపాలకుఁడు సుమంత్రుండు ననఁగ - మంత్రులుగల రెనమండ్రునాతనికి.
నామంత్రు లందఱు నన్యోన్యహితులు_ స్వామికార్యవిచారచతురమానసులు
పరమ ర్హభేదనోపాయడౌరేయు - లరసి ప్రజారక్ష యాచరింపుదురు.
అట్టివా రెనమండ్రు నఖిలకార్యములఁ - బట్టున దిద్దఁదీర్పను జాలికొలువ
నష్టాక్షరముల బాహాష్టకంబులను - స్రష్టయై వెలయు నారాయణుకరణిదశరథుండల రె, నాతనిదేశమునను . గృపఁడు కొండీఁడు రోగియు దరిద్రుండు 260

జారుండు మఱి యనాచారుండు పుణ్య . దూరుండు క్రూరుండు తుచ్చుండు జడుఁడు.
మందుండు మఱిలేరు మందునకైన ; - నందఱు మణికుండలాద్యలంకృతులు
నందఱు ధ్వర్థపరాయణచిత్తు . లందఱు విహితకులాచార రతులు
అందఱు సకలశాస్త్రాబ్దిపారగులు - నందఱు శ్రీవిష్ణునతిభక్తిపరులు.
ఈచందమున రాజ్య మేపు దీపింప - భూచక్ర మొల్ల నేర్పున నేలియేలి
ప్రకటరాజ్యాంగసంపద దేలి తేలి, యొకనాఁడు దశరథుం డుల్లంబులోనఁ

మంత్రులతో దశరథుడు పుత్రకామేష్టి సేయుట కాలోచించుట

దనకు సంతతిలేమిఁ దలపోసి వగచి . తనకు నాయువు వేగ తగఁబోయె ననుచు
మనమునఁగుందుచు ను కియునాతండు - తనమంత్రివరుల నందఱను రప్పించి
ఘనముగఁ గొలువిచ్చిఘనత (గూర్చుండి - తనమంత్రివరుల నందఱఁ జూచి పలికెఁ
బెక్కు దానంబులు పెక్కు-ధర్ధములు , పెక్కు-యాగంబులు పెక్కువఁజేసి 270

పెక్కేండ్లు మంటి: శోభితకీర్తిగంటి; - మక్కువ మీవంటిమంత్రులు గలుగఁ
గొదవలేదేమిటఁ; గొడుకులులేని, కొదువ యొక్కటిగాని, కులముద్ధరించు
కొడుకులు లేకున్నఁ గోరిపుణ్యములు - వడయ రుత్తమలోకపదవు లెవ్వరును,
గానఁ బుత్రులఁగానఁగా నాకువలయుఁ - గాన నేనింక లోకము లెల్ల మెచ్చఁ
దలకొని యశ్వమేధము సేసి, పిదప - నెలమితోఁ బు
ఈ యాగములచేత హితము రంజిల్లఁ బాయకపుత్రులఁ బడసె
ననిచెప్ప వారలు. నతిసంభ్రమమున - మనమున సంతోషమగ్నులైయున్న
నామంత్రివర్యుల నందఱఁ జూచి - తా మది నూహించి తగవొప్పఁ బలికె
“ననుపమంబుగ. నేను నశ్వమేధంబు - వినయంబునఁజేసి విబుధులు మెచ్చఁ
బుత్రులకొఱకునై పుత్రకామేష్టి --నేత్రోత్సవంబుగ నేఁజేయువాఁడ." 280

నని తగషనులకు నందఱఁబనుప - ననఘులు మటి వసిష్టాదులు వచ్చి
విలిచిన ప్రెక్కుచు నెలమిఁ దోడైచ్చి - పలికెను, వారితోఁ బార్ధివోత్తముఁడు.
“ఆనఘవసిష్టసంయములార యిపుడు - ఘనమైనహయ మేధకంబు నాచేత
జేయించి పత్రైకసిద్ధినొందుటకుఁ - జేయింపుఁడీ దాని జెచ్చెఱ"నన్న
నలవడ సీచేయు హయమేధమఖము - నెలకొని యేమింక నిర్వహించెదము.
మది నెన్నశక్యమే. మఖరాజమహిమ? - యిదిగాక పత్రకామేష్టియుఁ జేయఁ
దనయులఁ గాంచెదు ధన్యమానసుల" - ననపుడు హర్షించి యవనినాయకుడు
ఆందఱఁ బనిచి శుద్ధాంతంబుసాచ్చి- సుందరీమణుల కాళుభవార్తఁ జెప్పి,
యనురక్తి నేకాంతమైయున్న వేళ - ననఘుండు సూతుఁడిట్లనియె భూపతికి:

ఋశ్యశృంగ వృత్తాంతము

"ధరణీశ ! మీకు సంతానసంప్రాప్తి - వెరవై నకథ మున్ను విన్నాడ నేను ; 290

భూమీశ విను మంగ భూమీశుకొడుకు - రోమపాదుడు గుణారూఢుండు దొల్లి
యేమిపాపముననో యెఱుఁగఁజొప్పడక - యామహిలో వర్ష మటు కుర్వదయ్యె.
దా నేలి పాలించు ధరణిపై నెందు . వానలు లేకున్న వగలను జెంది,
వరమునీంద్రులచేత వర్షహామములు - పరవడి సేయించి, పడయరాకున్న
భూరిశోకంబునఁ బొగలుచునున్న - యారాజుఁ గనుఁగొని యమ్లను ల నిరి,
"యో మహీపాలక యోరాజచంద్ర - యీమహిపై వానలిటఁ బర్వుటకును
నొకయుపాయమ్లు మే మొగిఁ జెప్పవార; . మకలంకమతితోడ ననుపొందఁజేయు :
పరహితోన్నతుఁడు విభాండకసుతుఁడు - చిరపుణ్యనిధి ఋశ్యశృంగుఁ డన్వాఁడు
నగదైర్య పట్టిననాఁటనుండియును - నగరరాష్ట్రంబు లెన్నఁడు నెఱుంగమిని
నతఁ డెందు నాఁడువా రను పేరునెఱుఁగ;-డతఁడు తాపసవృ_త్తి నడపులనుండు; 300

వసుదేశ యతఁడిందు వచ్చినఁ జాలు; - వెసఁబాయు నీయనావృష్టిదోషంబు."
నావుడు మునినాథు నగరి కేరీతి - రావింతు నని విచారముచేసి తెలిసి
అతఁడు వచ్చుటకును నాత్తఁజింతించి - మతిమంతు లగునట్టి మంత్రులఁ
మునులను రప్పించి ముద మొప్ప నడుగ - మునులును మంత్రులు ముదముతోఁ జెప్ప
మనమున సంతోషమహిమ శోభిల్ల, మునులమూటలు విని మోదంబుమీఱ
నుండెను భూకాంతుఁ; డొగి మౌనులనిరి, దండిగ నోరాజ1 తలపోసి యిపుడు
వారకాంతలనెల్ల వసుదేశ ! పంపు; . వారకాంతలచేత వనముల కిపుడు
దండిగా భక్ష్యముల్ దగవారికిచ్చి - మెండుగ వనముల మేటివస్తువులు
పెట్టి పంపుము నీవు పెంపుతో ననుచు - గట్టిగా గాంతలు కడుప్రొడసతులు
తిన్నగనటుపోయి తెఱఁగొప్పఁగాంచి, మన్ననచే మౌనిమహిమ వీక్షించి, 310

తియ్యనిభక్ష్యముల్ తెఱఁగొప్ప నిచ్చి - నెయ్యంబుచే మది నెఱిఁ గరఁగించి,
యాటలఁబాటలఁ దేటమాటలను - బాటలగంధులు పదిలులై నిలిచి
మనపెల్లఁగరఁగించి, మఱి వెంట నంటి - మనసిజాకారలు మఱి మాయవన్ని
యచ్చుగ నిటురాగ, నతడు వెస్టగిలి - వచ్చును; నిందుకు వసుధేశ వినుము."
అనిచెప్పి మునివర్యు లటచనిరంత - ఘనముగా నారాజు కరుణ నారాత్రి
మనమలరగ నుండి, మఱునాఁడు లేచి - మునులను దలఁచుచు ముద మొప్ప నంత
ననురక్తిఁ గడుఁబ్రోడ లగు వారసతుల - వినుతయా"వనరూప విభ్రమవతుల
మనసిజు, మోహనమంత్ర దేవతలఁ - బనిచె నొప్పెడువారిఁ బాటించి యతఁడు.
అతివ లమ్మువియున్న యడవికిఁ బోయి - యతని యాశ్రమభూమి కల్ల నఁజేరి,చతురనర్తనకళా సంగీత గతుల . నతనికిఁ దమయొప్ప లర్థిఁ జూపుటయు 320

నా పుణ్యనిధి వారి నాఁడువా రగుట - రూపింపనేరక రుచులఁ జేపడక
యలసయానముల నీయడవిలో నొప్ప . మెలఁగెడు నివి వింతమృగములోఁ గాక
యనుచుండ నొక్కనాఁ డతివలు ప్రీతి - దనుఁ జేరవచ్చినఁ దప్పక చూచి.
చన్నుల పే రక్షి, చన్నులమీఁద . నున్నహారములకు నుపదేశ మడిగి,
“మాకుఁగొమైుక్కటి దుస్తకమ్లనను - మీకుఁగొమ్ములు రెండు మెరసె !రొమ్మునను:
నేవృక్షములఁ గల్లె నివి యపూర్వములు?-మీవల్కలము లతిమృదులంబు లరయ ;
మాజటా బంధంబు మాడ్కివిగాపు - మీ జటా బంధము లైఱుఁగులఁబొదలె ;
మేనిబూడిదె పూత మేల్తావిగొట్టు . వీనులవిందు లీ వేదనాదములు ;
కని విని యెఱుఁగ మిక్కాననభూమి - మునులకు నీ వేషములు గలవొక్కొ?
ఎక్కడి మును?"లన్న నింతు లాఘనుఁడు. చిక్కుట భావించి చెలఁగి నవ్వుచును 330

"నానుపూర్విగ ప్రతిహారియా సామ - గానంబు పాడి, చక్కఁగఁ బదక్రమము
శుద్ధమార్గంబునఁ జూపంగ నేర్తు,- మిద్దర మాచర్య లెఱుఁగ మీతర మె?"
యని నేర్పుమాటలనమునిస్వామి - గనుఁ ద్రామి, మఱియు నక్కన్యకామణులు
“ఎవ్వరితనయుఁడ? పెవ్వఁడ? వేల - యివ్వనంబున నుండు? పెఱిఁగింపు " మనుడు
“అమలకీర్తల బుణ్యుఁడగు విభాండకుని - కొమరుండ; ఋశ్యశృంగుండు నా పేరు;
విపులత పోనిష్ట వెలయ నీ యడవి - దపము సేయుటకు నై తగిలి వర్తింతు,
భాగీరథీస్నానపరత మాతండ్రి - యోగిపుంగవులతో నొగి నేగినాఁడు;
ఓండు దేశంబుల నెఱుఁగక యిచట - దండి మైఁ దపములు తగదొప్పఁజేసి,
దలకయున్నాఁడు ఘనత మాతండ్రి - సదమలచిత్తుఁడై సద్బ_క్తినిపుడు.
నుఁడు మీ రిచటికి విచ్చేయుకతన . ననఘుండనైతిఁ, గృతార్థండ నైతి : 340

తండ్రి కృపచేత మఱియు నిచ్చటను - నా తతంబుగఁ దప మనువొంద నెపుడు
సి యిచ్చటనుందుఁ జతురతతోడ - వాసిగా వనములవరుస మిమ్లులను
వినయప్పడు నాకు గడుఁజోద్యమయ్యె - ననునొందఁ బోదమా యాశ్రమమునకు?"
ని మునులను వారియాశ్రమంబునకు - గొనిపోయి ఋశ్యశృంగుండు పూజించె,
లనాగ లక్షుని యిచ్చినపూజ . యలరచుఁ గైకొని, యతనివీక్షించి,
మునివర ! మావనంబునఁ దెచ్చినార - మనుపమ ఫలరాజ మనుచు లడ్వములు
తిరసంబుల మనోహరము లైనట్టి - యతిరసంబులు వడ లలరుమండిగలు,
రమౌరసములు చవులుగ్గడించి - పేరువెట్టఁగరాని పెక్కు-భక్ష్యములు
ఫ్చిన నమలుచు నెడనెడఁ జవుల - మెచ్చుచుఁ దనిసి యా మెలఁతలఁ జూచి 350

మ్రింగుచుఁ గొసరి యడ్లుచును - జొక్కుచు నందంద సౌరిదిఁ జేచాచి
యన్నిట్టిఫలముల మునివరులార - యెన్నఁ డేనెఱుఁగను నేవనంబులను:మీతపంబె తపంబు ? మీతపోవన మొ - యీత పోవనముల కెక్కుడు ధరణి ?"
ననిపల్క- నయ్యింతు లల్లన నగుచు - నను వార ఁ దనులత ల(ట సోఁకఁగదిసి
తావియూర్పులచేతఁ దాలిమిదూలి - పోవ నొయ్యన ముఖాంబురుహంబులొత్తి
పలుకులఁచళుకుల ( దాట తేటలను - బిలుపుల సౌలపుల బేలించి, యతని
హృదయంబు గరఁగంగ నిరుచన్నుగవలు - గదియించి, బిగియార గౌగిళ్ల మరపి,
“యనఘ ! పోయెద; మిడె యాశ్రమంబునకు" . నని విభాండకు దెస నడరినఫీతి
నరిగి చేరువనుండి రావనంబునకు 1 - నరవిందలోచన లరిగిన పిదప
వారింక నెన్నఁడు వత్తులో యనుచు - నా ఋశ్యశృంగుండు నట నిద్రలేక
యారాత్రి వేగించి, యమ్లలునాఁడు - ఆరమణులఁ గన్నయచటి కేతేర. 360.

-:ఋశ్యశృంగుండు వారాంగనల దగిలి రోవు పాదుని యింటికివచ్చుట :-

నందియ లైఱయంగ నసదు(గౌ(దీఁగె - లండంద వడఁక రాయంచలనడల
మగువ ఐ వచ్చి యామహితాత్తుఁ గాంచి - నగు మొగంబులతోడ నలుఁదట్లఁజేరి
"మునివర ! మా వనంబునకు రావలయు ;' . ననిపల్క- రాకకు ననుమతించుటయు,
కని చాల వెల (దులు ఘనము నిఁజూచి - మనసులు గర (గంగ మఱివురిటి పలికి,
తమ యుపాయంబులఁ దమవిలాసములఁ - దమకంబు పుట్టించి, తరలాడు లంత
విస్తార పథ మని వెఱచి పోవమికి - హస్తపల్లవముల నాందోళికగను
నొనరెడుదీమంబు లొకవింతమృగము ( - గొనివచ్చు తెఱఁగునఁ గొనివచ్చి రతని :
నతఁడు వచ్చుటయు నయ్యంగరాజ్యమున - నతులవర్షములు సస్యము లొప్పె నంత.
సకలసౌభాగ్యము ల్సలలితంబుగను - నకలంకమతితోడ నానృపుఁ డుండి
యామానిఁ గనుగొని యతిభక్తియుక్తి - నేమంబుతోఁ బూజ నెమ్మిఁ గావించి, 370

యనఘుండు దనరూఁతు నారాజు శాంత - యనుదానినిచ్చిన నారాజు నింట
నతఁడుండ, దశరథుం డడ్లునిఁ దెచ్చి - హితమతిఁ బుత్రకామేష్టినాఁ బరఁగు
క్రతు వస్తునీంద్రుచేఁ గావించెనేని - సుతులనల్వుర బహుశ్రుతుల నున్నతుల
నాతతోన్నతిఁ గాంచు" నని చెప్పెఁ దెలియ - నా తోడఁ దొల్లి సనత్కుమారుండు
అటుగాన నీవింక నా ఋశ్యశృంగు ( - బటుభ_క్తియు_క్తిమైఁ ద్రార్ధించి తెమ్లు.
అనిచెప్పి యాసూతుఁ డరిగినపిదప - మనమున సంతోషమమతలు సెలఁగ,
ననువరి దశరథుం డారోమపాద - జననాథువీటికిఁ జని ఋశ్యశృంగు
మువిపతిఁ గని మైక్కి మదముతోననియె-"వినవయ్య మునిచంద్ర విమలమానసుఁడ
యను వందఁ బుత్రుల నడుగుట కేను - మనమునఁదలపోసి మమత నికడకుఁ 380

గొనకొవి వచ్చితిఁ ; గొనుము నీ"వనుచు - ఘనమున గృపవుట్ట మఱి నుతిసేసి,
క్రతువున కాచార్యుఁగా వరియించి . యతులితచతురంతయా నాఢ్యుఁజేసివచ్చుచో దూతలవలను వీక్షించి - పుచ్చి ముందర వారిఁ “బురమును నగరు
వాసవపురితోడ వైభవం బొప్ప - గై సేయవలయును గడువేగ మీరు".
అనిపల్క వారును నరిగి పౌరులకు - వినిపింపఁ జేసిరి : వివిధ శిల్పముల
దుందుభిశంఖాదితుముల నాదముల - నందంద మ్రో యించి; రంత భూపతియుఁ
బురమునకే తేరఁ బురజను ల్సేయు . పరమమంగళతతు ల్పరఁగఁగైకొనుచు,
నతను విరోధ్యసాధ్యకునయోధ్యకును - జతురుఁడై తోడైచ్చె శాంతతో గూడ ;
నీరీతి నా ఋశ్యశృంగుని దెచ్చి - భూరమణుండంతిపురమున నునిచి
వితతార్ష్యపాద్యాదివిధులఁ బూజించి - యతికృతార్లుఁడ నైతి నని సంతసించె ; 390

 నా సమయంబున నారాజసతులు - కౌసల్య మొదలుగాఁ గలవారు వేడ్క
నలువొంద తేనియానతిఁ బూని చాల . నలరి సంతసమున నా శాంతకపుడు
మహితభూషణవస్త్రమాల్యాదు లిచ్చి - బహువిధంబుల వారిఁ వ్రార్థించి; రంతఁ.
గొంతకాలమునకుఁ గువలయజనులు - సంతోష మెసఁగ వసంత మేతేర.
నడ రెడు వేడుక నా ఋశ్యశృంగు-కడకు భూపతి వచ్చి కడుభ_క్తి మొక్కి,
“సన్నుతస్లితి నన్ను సంయమి పవర ! - చెన్నొంద జన్నంబు సేయింపవలయు"
నని విన్నవించిన నౌఁగాక యనుచు - నినకు లోత్తముఁ జూచి యిట్లని పలికె.
"వేగంబె తెప్పింపు విహితంబులైన - యాగసంభారంబు లన్నియు నధిప "
నవుడు ఁ దగువారి నయ్యై తెఱంగు - లొనరింపుఁ డనుచు నియోగింపఁబనిచి,
యఖిలసంభారంబు లన్ని దెప్పించి - మఖముచూచుటకు సుమంతునిఁ బంపి 400

కేకయ నాథుఁ గీర్తిసనాథు నా కౌశిరాజు నవ్యాహత తేజు
జనకాంగరాజాది జననాథవరుల - ననఘ చరిత్రుల నర్థి రప్పించి,
మనుజనాయకుఁడు సుమంతుతోననియె - “ననఘుల వేదవేదాంగపారగుల
గృహ మేథు లగువారి గృతతంత్రభావ్య - మహితార్థనిశ్చయమతులభూసురుల
బరగు సుయజ్ఞ జాచాలిఁ గశ్యపుని - సురుచిరాత్తుని వసిష్ఠుని వామదేవు
రయమునఁ దోడ్కొనిరము నీ"వనినఁ - బ్రియమున నాతండు పెంపార నరిగి
యురుభ_క్తి నందఱ నొగిఁ దోడితేరఁ - బరువడి ( దా నర్థ పాద్యాదులిచ్చి,
నిర్మలవ్రతనిత్యనిష్ణార్థమైన - ధర్దార్థయుతముగాఁ దగుమాటఁ ಬಲಿತ.
"మునులార ! కొడుకులు మును నాకు లేమి - మనమునఁదలపోసి మమత రెట్టించి
మిత్రసూక్తుల నశ్వమేధయాగంబు - పత్రులకొఱకునై పత్రకామేష్టి 410

"సేయంగ నీ ఋశ్యశృంగుఁ దోడైచ్చి - మీయను గ్రహము గామించి యున్నాఁడ."
ననవుడు నావసిష్టాది సంయములు - జననాథుమాటకు సంతోషమంది
"యినకు లోత్తమః లోకహితమాచరింపఁ - దనయులఁగోరునీతలఁ పొప్ప నింక
వశ్వంబువిడువు మీ యశ్వమేధమున - విశ్వరక్షకులైన విక్రమోజ్వలులునలువురు కొడుకులు నరనాథ నీకుఁ - గలిగెద"రని. పల్కఁ గడు. సంతసిల్లి
సవనయోగ్యంబైన జవనాశ్వమరసి - భువనపావనమూ_ర్తి పూజించి నొసఁట
బ్రకటిత బిరుదాంక పట్టికగట్టి - యొకయేఁడు దనయిచ్చ నుర్విఁ జరింప
సమకట్టి విడిచె నశ్వంబు రక్షింప - విమతోగ్రులగు సైన్య విధులతో గూడ.
నంత వసిష్టాదు లనుమతిసేయ - వింత ఁగా శిల్పకోవిదుల రావించి,
సరయువును త్తరస్థలి యాగశాల - విరచింపఁగాఁ బంచె వేదోక్తసరణి. 420

మఱియు నానా దేశమనుజవల్లభుల - వఱలు విప్రనృపాల వైశ్యశూద్రులను
రప్పించె; నంత వర్ష ముపూర్ణమైన - నెప్పటిమధుమాస మే తేర నృపుఁడు
చిరతపోనిధిఋశ్యశృంగు సప్తుతియు - గురునియానతియుఁ గైకొని మంచి వేళ
స్పృహను శాంతాఋశ్యశృంగులతోడ - నిహిత సంధారవర్జిత హోమకుండ
సహితమై యేకవింశతిరమ్య యూష - మహితమై శ్రాతధర్ఘక్రియాచార
విహితమై మాయా ప్రవీణదైతేయ - రహితమై సకలాఘరహితమై యొప్పు

-: దశరథుఁడు యాగదీక వహించుట :–

యాగచాటముచొచ్చి, హయమువచ్చుటయు . యాగదీక్ష వహించి యతిశుద్ధిఁబొంది
మునుల వసిష్టాదిమునిజనోత్తముల - ఘనుల ఋత్విక్కులగా వరియింప
సవనత్రయం బభీష్టమున నొనర్చి - ప్రవిమలయూపాగ్రబద్ధంబులైన
జలచరంబు లరణ్యచరములు విహగ - ములు నురగంబులు మొదలుగా నొప్ప 430

పశువుల ముస్నూటిఁ బ్రిథితాశ్వమొకటి - విశ సించి క్రతుకర్త వేడులు ప్రీతి
నేమంత్ర ులతోడ నేపలలములు - గామించి వేలుపఁగా జెప్ప ప్రతులు,
నామంత్రములతోడ నాపలలములు - కౌమించి వేళ్చిరి కడఁగి ఋత్విజులా.
అనలుండు సప్తజిహ్వలఁ బ్రిజ్వరిల్లె; - న నిమిష్సల్ దనిసి రాహ విరాదికముల;
సొయాగదినముల నాఁకొన్నవాఁడు . నాయాసపడినవాఁ డరసిన లేఁడు.
సారమృష్టాన్నవప్రసటీరకనక - హీరభూషాదిసంతృప్పలేకాని
యే క్రియలందును నెడపడకుండ - సీక్రియ హయ మేధ మీడేరుటయును,
వెనుక జ్యోతిష్ణోమవిశ్వజిదాది - ఘనయాగతతులు సాంగము మీఱఁ జేసి,
యధ్వరదక్షిణకై పూర్వదేశ, - మధ్వర్యునకును బ్రిప్తకు దక్షీణంబు, 440

పొనరంగఁ బశ్చిమభూమి హోతకును, - దనర నుత్తరము సుద్గాతకు నిచ్చె.
నిల నయోధ్యయుఁ దక్క నెల్ల దేశముల - నలరి యిచ్చిన ముదమంది ఋత్విజులు
“ఎప్ప డేలుదుము నీ విచ్చిన దేశ ? - మెప్పడనుష్టాన మేము సల్పుదుము ?
ఏమేడః దేశంబు లేలుట లేడః - భూమికి వెలయిమ్లు భూమీశ 1 మాకు "
ననవుడుఁ బదికోటులగు సువర్ణములు - కనకంబు నలుమడికలధౌతచయముఁగోరంగ నొక లక్షగోవులనిచ్చె నా ఋశ్యశృంగాదు లైన ఋత్విజులు
నవిపంచుకొని ముదమందిరి ప్రీతి: - బ్రివిమలాధ్వరకర్త పరిచారకులకు
నరనాయకుఁడు సువర్ణములు కోటియును - వరభూషణంబులు వలయువారలకుఁ
గామితార్ధంబులు కామించువారి - కేమి వాస్త్రచ్చిన నింపారనిచ్చి,
పరఁగుభూసురులకు భక్తితో మైక్కి - వరుస వారిచ్చు దీవనలు గైకొనుచు 450

బ్రకటదివ్యాంబరాభరణాదు లొసగి - యకలంక చిత్తుఁడై యవభృథం బాడి
శ్రీమహితుఁడు ఋశ్యశృంగుచేఁ బుక్ర Lol కామేష్టి జేయింపఁగా నేగు దెంచి,
క్రమ మొప్ప యాగభాగములు గైకొన్న - యమరు లారావణు నాత్త్మలో దలఁచి,

-: దేవతలు బ్రహ్మకడ కరిగి రావణు బాధలఁ దెల్పుట :-

బ్రహ్మఁ గనుంగొని పణమిలి నిలిచి - *బ హ! నీవరశ కిఁ బం కికంధరుఁడు
ప్రవిమలాచార్యుల బ్రహ్లార్షివరుల - దివిజుల మునుల బాధింపుచున్నాఁడు.
దారుణవరశక్తి దలఁప మాచేత - వారిజాసన ! వాఁడు వారింపఁబడఁడు.
సురగణంబులతోడ సుత్రాము(బట్టి - పరిభవింపుచు నేఁచు బాహుదర్పమున
గంధర్వయజెదిగణముల మునుల . బంధించు సాధులఁ దిట్టి బాధించు.
వాఁడన్న కులగిరు ల్వడవడ వడఁకు - వేడిమి చూపఁగ వెఱచు భాస్కరుఁడు.
వీఁకతో నతఁడున్నవీట నెన్నఁడును - దేకువచెడి గాలి దిరుగంగవెఱచు, 460

నన్ని శాచరుఁ గన్న నాటోప మొసఁగ - మున్నీరు కడలి" త్రి హై యంగ వెఱచు,
నేపునఁ గన్నప్ప డెల్లమ మేఁచు - పాపాత్తుఁ డగునట్టిపంక్తికంధరుని
నంతంబు నొందించు నాయుపాయంబు - చింతింపవలయు నీచి తంబులోన"
ననవుడు నా తెఱం గంతరంగమునఁ - గని బ్రహ్లాయును దేవగణెము నీక్షించి
“యమరులచేఁ జావఁ డసురులచేత - సమయఁడు గంధర్వసమితిచేఁ జెడఁడు
రజనీచరులచేత గ్రాగ డెన్నఁడును - భుజగసంఘములచేఁ బొలియఁ డెన్నఁడును
యక్షులచే నీల్గఁ డాలంబులోనఁ - బక్షియూథంబుచేఁ బడఁడు, వానికిని
వరమిచ్చునప్పడు వాక్రువ్వఁడయ్యె - నరులఁ గావున వాఁడు నరులచేఁజచ్చు
విశదంబుగా నింక వినుఁడు హిరణ్య - కశిపుఁడు లోకముల్ గారించునాఁడు
నరసింహరూపంబు నారాయణుండు - ధరియించి వాని విదారించినాఁడు : 470

వీఁడై విశ్రవసునకుఁబుట్టి . వాఁడు గావున నేఁడు నారాయణుండు
వీని నిర్జించు నవ్విష్ణుని నభయ . దానంబు మనమింకఁ దగ వేఁడవలయు"
నని దేవతలతోడ నాన్షిప్తపలుక - ననునొంద నందఱు నప్పడే కదలి
యమృతాబ్దికడ కేగి యచ్యుతుఁగాంచి - విమలచిత్తులు నయి విబుధులు వేడఁ
గరములుముకుళించి కడుభక్తి మ్రొక్కి- యరుదుగసురలప్ప డౌవిపుఁ గాంచి-: దేవతలు విష్ణువును నుతించుట:-

సన్నుతించిరి మది సంతోషమెసఁగఁ - "గనకాక్షశిక్ష ! లోకత్రయాధ్యక్ష !
వనజాలయావక్ష 1 వసుమతీరక్ష 1 - వనజాక్ష ! మాకు నెవ్వరు లేరు దిక్కు
నీ వొక్కఁడవుదక్క నిక్కమీమాట - గోవింద ! పరిపూర్ణగుణ ! చిదానంద
దేవః జగన్దయ ! దేవాదిదేవ 1 - దేవ 1 నిస్తారక ! దివ్యావతార
శుభమూ_ర్తి శరణంబుఁ జొచ్చినమాకు - నభయమిచ్చితిగాదెయమృతాబ్ది దొల్లి, 480

తలపోయ దానవదళన ! నీ బాహు . బలవిక్రమంబులఁబరఁగులోకములు :
భ_క్తవత్సల : నిన్నుఁబరికింపఁదరమె ? - భ_క్తియోగము దక్క బయలు మూటలను
మధుసూదనుఁడ ! నిన్ను మదితో న నమ్లు | | నధికపుణ్యుల Sočo నాపదల్గలవె ?
జగదుద్భవస్థితిసంహారగతులు - దగ వినోదంబులై తనరు ; నీ మాయ
నాధారభూతమై యఖిలలోకములు - మాధవ ! దాల్చు నీమహనీయతనువు ;
అహిరాజతల్ప ! నీయలరు వైభవము - మహిమ (జూడఁగ నవాజ్ఞనసగోచరము 3.
శరణాగతత్రాణ ! శరణు లోకేశ 1 . శరణార్థ లగుమమ్లు జనుఁ గావ నీకుఁ ;
గావున డ్రైలోక్యకంటకుండైన - రావణుఁ బొలియించి రక్షింపు మమ్ము l
మా కొక కార్యంబు మసలక చేసి - లోక కీర్తులఁబొందు లోకైక వినుత !
నిర్జలచిత్తుండు నిశ్చలవ్రతుఁడు - ధ్వర్షశిలుండు నుత్తమగుణాన్వితుఁడు, 490

నగుచున్నదశరథుఁ డశ్వమేధంబు-తగఁ జేసి మదిశుచిత్వముననున్నాఁడు,
కాకుత్స్థవంతునికాంతలఁదిలప - నేకాంతలను వారి కెనసేయరాదు,
నరమూర్తలొప్పంగ నాలుగంశముల - సరసిజోదర ! నీవు జనియింపవలయు ;
వరశ_క్తి సురల కవధ్యుఁడై లోక . పరితాపకరుఁ డైన పం_క్తికంధరుని
మునుల గంధర్వకింపురుషుల సురలఁ - బనివడఁ జంపిన పాపాత్తు జంపి
సవనము ల్సేయింపు సంయమివరుల - భువనము లక్షీంపు పుండరీకాక్ష "
యని విన్నపము సేయు నమరులఁ జూచి - వనదగర్జితగతి వనజాక్షుఁ డనియె.
“సురలార ! మీ రింక సుఖమున నుండుఁ - డరిగి చు_ర్త్యమున నేనవతారమంది,
యూదట బంధుమిత్రా మాత్యపాత్ర - సోదరయుతు దశాస్యుని గీటడంచి,
నిండార నేలెచ నియతితోఁ బదునొ - కొండు పేలేఁడు లీకుంభినీతలము 500

నజునివరంబున నవనీతలమున - రజనీచరేంద్రుండు రాజిల్లఁగలిగె"
ననుచు వరం బిచ్చి యజుని వీడ్కొలిపి - యనిమిషులను బంపి యసురారి చనియె,

_:దశరథునకు యజ్ఞపురుషుఁడు దివ్యపాయస మొసఁగుట :-

అప్పడు విమలహోమాగ్నిలోనుండి - యొప్పెడు పుణ్యాత్తు డొకదివ్యమూర్తి
హరిసీలనీలాంగుఁ డరుణాంబరుండు - తరుణార్క-తేజుఁ డుదగ్రవిక్రముఁడుపరఁగఁ బాయసముతోఁ బసిఁడిపాత్రంబు - కరమున ధరియించి గ్రక్కున వెడలి
తనుఁజూచి యద్భుతాదరమున లేచి - వినయాఢ్యుఁడై యున్న విభుని
వీక్షించి “భూనాథ : విను యజ్ఞపురుషుండ సుతుల - నే నీకు నీఁగోరి యేతెంచినాఁడ ;
నాదట నీపాయసాన్నంబు పచ్చి - నీ దేవులకుఁ బెట్టు నిష్టతో" ననిన
ననురాగమును బొంది యవనీశుఁ డతని - ననయంబు పూజించి యాపాయసంబు
తా నందుకొనియె సుధాకలశంబు - చే నందుకొన్నశచీపతిపూడ్కి ; 510

నంతఁ బ్రాజాపత్యుఁ డటుమాయమైన - నంతఃపురంబున కరిగి భూవిభుఁడు
రమణు లెదుర్కొని ప్రమదాబ్దిదేల - నమరని తమైన యాపాయసంబు
సగము కౌసల్యకు సగములోఁ బుచ్చి - సగము సుమిత్ర కాసగములో సగము
కైకకు నిచ్చి యుత్కంఠ నాసగము - ప్రాకటంబుగ సుమిత్రకు నిచ్చె మఱియు
నప్పాయసాన్నంబు లర్థి భుజించి - యప్పడు గర్భిణు లైరి వా రెలమి,
తగిలి వారలఁజూచి దశరథేశ్వరుఁడు మిగులనానందించి మెఱ సెఁ జూపఱకు ;
మొగి ఋశ్యశృంగాదిమునుల భూషతులఁ - దగునర్చనము లిచ్చి తగ వీడుకొలిపి
పరమానురాగుడై పడఁతులు దాను - ధరణీశుఁ డయ్యయోధ్యకు నేగుడెంచె
దమయాగభాగము లగిలి కైకొన్న - యమరులు దమలోక మరిగెడుచోట

-:బ్రహ్మ దేవతలను వానరులఁగాఁ బుట్టుఁడనుట:-

నా కంజగర్భుఁ డింద్రాదులఁ జూచి - లోకరక్షణకళారోలుఁడై భౌ8 520

ధారణిపై నవతారంబు సేయ . మీరును దోడ్పాటు మేకొనవలయు.
నటు గాన లోకహితార్థవర్తనుల so బటు పరాక్రమ రూపబలపయోనిధుల
బలగర్వముల మిమ్లుఁ బ్రతిపోల్ప జాలు - బలియుర వానరపతులఁ బెక్క-ండ్రఁ
గిన్నర గంధర్వ ఖేచరయక్ష -- పన్నగా మరసిద్ధభామలయందు
బుట్టింపుఁ డే మున్ను పుట్టించినాఁడ - నెట్టన బలపయోనిధి జాంబవంతు
నది యెట్టి దనిన నే నావలించుటయు - నుదయించెఁ జిరతరాయుష్మంతుఁడతఁడు "
అని బ్రిప్త తమతోడ నానతిచ్చుటయు - విని సంతసిల్లి యావేల్పులందఱును
అనిమిషపతి వాలి ననలండు నీలు - నినుఁడు సుగ్రీవు సురేజ్యండు తారు
సింధువల్లభుఁడు సుషేణు గుహ్యకుఁడు - గంధమాదను విశ్వకర్మయు
నలుని దివిజవైద్యయుగంబు ద్వివిదమైందులను - దివిరి పర్జన్యాధిదేవత శరభుఁ 530

గరువలి హనుమంతుఁ గడఁగి పుట్టింప - ధరణిఁ బుట్టించిరి తక్కిన సురలు
తమతమ సత్త్వము ల్డగఁ బుచ్చి పేర్చి - యమిత శౌర్యుల వానరాధీశవరుల
నావానరులు జగదా_ప్తవర్తనులు - దావాగ్నితుల్యు లు దగ్ర విక్రములు
పర్వతాకారులై భాసిల్లవారు o పర్వత యోధులై పరఁగెడువారు

భీమసాహసికులై పెంపారువారు - కామరూపంబులఁ గర మొప్పవారు
దeటిమి యజ్ఞులనైన దా(Tుడు వారు . పెఱికి కొండలనైన భేదించువారు
నఖదంష్ట్ర హేతుల నలిఁ గ్రాలు వారు - నఖిలలోకోత్తరు 한L యొప్పవారు
ధారణినైన విదారించువారు . న్పై రూఢికెక్కియు నరుదుగ వారు
కొందఱు సుగ్రీవుఁ గొందఱు వాలిఁ . గొందఱు హనుమంతుఁ గొందఱు నీలు
గొందిఅు నలమైందకుముదులఁ గొలిచి - యెందు నభేద్యలై యేప్పదీపించి 540

మలయదర్డరగంధమాదన వింధ్య - ములు మొదలగు శైలములఁ గాననముల
బహుజలనదనదీప్రాంతదేశముల - విహరించుచుండిరి వేడ్కతో నంత
మహనీయపాయసమహిమచేఁజేసి - యహిమాంశుకులపత్నులందు గర్భంబు
లలవడ నాధాన మైనది మొదలు 毫團 కలిమిఁగైకొనెఁ బేదకౌను లెంతయును
నమృతాన్నరుచిలోన నడఁగక వెలికి - గమనించె నన దేహ కళ వెల్లవాతె
రావణు సామ్రాజ్యరమముక్కు-నల్పు . గావించుటకు సూచకము లివియనఁగ
ననపత్యతా దోష మంతయు వెడల - మొన సెనా ఁ దగెఁ జనుముక్కులనల్పు
చెక్కులు పలచెక్కె(జిట్టుము ల్బలి సె - నిక్కె-నాభులు వళు ల్నెరులకుఁ బాసెఁ
దల చూపెఁ గోర్కు లంతటఁగ్రమంబునను - నెలలు తొమ్మిదియును నిండినపిదప
వర్ణితమధుమాసవరశుక్ల పక్ష Tool పూర్ణయా" నవమిని బుధవాసరమున 550

—: శ్రీరామాదుల జననము :—

మహిఁ బునర్వసుతారమధ్యాహ్నవేళ - గ్రహపంచకము నుద గ్రస్థితిఁ దనరఁ
దొలఁగక గురుఁడు చంద్రుఁడుఁ గూడియుండ - లలితకర్కాటక లగ్నంబునందు
సర్వలోకాధారు జగదేకవీరు - శర్వాది దేవతా సంస్తూయమాను
దివ్యలక్షణకళా దేదీప్యమాను - నవ్యయు నసమాను నార్తా_హరణు
భవ్యుఁ జిదానందుఁ బరచుకల్యాణు దివ్యుల రక్షించు దీనా_హరణు
గుణగణాలంకారు గురుకీర్తిహారు . ఫణిరాజశయను శ్రీపతి హృషీకేశు
నా కమలోదరునర్థాంశమునను ΤΕΙ గాకుత్స్థకులు రాముఁ గని యొుఁ గౌసల్య.
యదితి యింద్రుని గన్నయనువునఁ దూర్పు - సుదతిచంద్రునిగన్న చొప్పన, నంత
భూలోకవిదితమై పుష్యనక్షత్ర - లాలితం బగు మీనలగ్నంబునందు
గమలా_ప్తసమతేజుఁ గమలా_ప్తవంశ 譬 గమలాపు భరతుని గ నియో ( గైకేయి 560

ప్రణుతింపఁ దగునట్టి ఫణి తారకమున - గణితకర్కటక లగ్నంబునఁ గవల
దరళలోచన సుమిత్రాదేవి మిత్ర - చరితుల లక్ష్మణు శత్రుఘ్నుఁ గనియె.
దివి ప్రైసె నప్పడు దేవదుందుభులు - దివి నాడి రప్పడు దేవకామినులు
సౌరిది( బువ్వలవాన సోనలై కురిసె ( - బరితోష మందిరి బ్రహ్లాదిసురలు

కలయ నయోధ్యలో గలవార లెల్ల - వెలసి రుత్సవముల వీరు వా రనక
ఆప్పడు దశరథుఁ డనఘు వసిష్టు - రప్పించి జాతకర్తములు సేయించి
పుత్రోత్సవంబును పొరియించె దివిజ - నేత్రోత్సవంబుగా నిఖిల పౌరులకుఁ
బురుడు దీరినయంతఁ బుణ్యాహ వేళ - వరుస నాసుతులకు వంశోన్నతులకు
నామకరణములు నలువుర కిప్ప . డేమఱ కీవు సేయింపు వసిష్ట
యనవుడు నౌఁగాక యని. తనమదిని - గనుఁగొని పలికెను గౌసల్యసుతుని 570

రమక్రీడయని ధాతు రాజిల్లాచుండ - రమయతి యననొప్ప రామనామంబు
కైకేయితనయుండు ఘనబలాన్వితుఁడు - సుకుచూరతనుడు సుల్లోకుండు గాన
భరత నామంబున బరఁగు సుమిత్ర - కిరవైనసుతులకు నింపు సౌధి పెసఁగ
లక్షణ గుణులు సంలక్షీంచి చూడ - లక్ష్మణశత్రుఘ్ను లను నామ మొదవు(
గానవీరలు మహాఘనపుణ్యమతులు - ఈ నలువురకును నివి నామము లన
లక్ష్మీసమన్వితులకు రామభరత - లక్ష్మణశత్రుఘ్న లలితాఖ్య లెసఁగ
‚ምጽእ నామకరణంబు లొప్పఁ గావించి - తగ నర్థకోటులు దానంబులిచ్చె

—: శీ రా మా దు ల బా ల్య ము :—

వారలు తల్లలు వరుస దాదులును - బోరామి(దమునుఁ బోషింపఁబెరిగి
కల్లరి నగవులఁ గన్నులు దెఱిచి - యల్లనల్లనఁ దప్ప టడుగులు వెట్టి
మల్ల డిగొను దొంకుమాటలునేర్చి - యెల్లవారికిఁ జాల నింపు లొనర్చి 580

కొద్దిగా ముత్తెంపుఁ గొనబువజ్రాల !LI} మద్దికాయలడాలు మలయుఁ జెక్కిళ్లఁ
బ్రాకటంబుగ ఫాలబాలేందుకళల - శ్రీకరాకృతి రావిరేక లల్లాడఁ
బొగడి" oదు మగరాల పులిగోళ్ల మేలి - జిగి డెందములయందుఁ జిందులుక్క
నెడనెడఁ బలుపచ్చలేయడ్డిగలుగఁ - గడునొప్ప మొలనూళ్ల గంటలు మెఱయ
మువ్వలందెలు పదంబుల డొదల్సేయ - నవ్వులాటల బాల్యనటన లేర్పడఁగ
విద్దెలనెఱపుచు విభుని ముందఱను - ముద్దులుగులుకుచు మోహనాకృతుల
నంత నా నలువురు నభివృద్ధిఁ బొంది Lo సంతతపుణ్యులై సమచిత్తు లగుచుఁ
దములోనఁ గవకూడి దశరథా త్తజలు - రమణీయమూ ర్తులు రామలక్ష్మణులు
భరతశత్రుఘ్నులు పొయక పుణ్య . నిరతులై చౌలోపనీతులై యంత
మాయావినోదముల్టరిగియాడుచును . నాయెడ రఘురాముఁడా ప్తులు దాను 590

నిండారు ప్రేమతో నెట్టెలుగట్టి - చెండును దండంబు చెలావొప్పఁబట్టి
తరమిడి యాడెడుతటిని గైకేయి - వరవు డామంధర వది నేగ్స్చంచి
చిట్టంటుచేఁతలఁ జెండు దట్టుటయు Cl కట్టల రాముఁ డాకాష్టంబుచేత
Ա -ט నడచిన నొక్క కా లప్పడే విఱిగెఁ - దడయక యందందఁ దమకించి రాము

నడ రెడు వేడ్కతో నాడంగఁజూచి - తడయకరాముపైఁ దగఁ గ్రూర ముంచి
విరిగిన కాలితో వెసఁ గైక నగరి - కరిగి తద్వృత్తాంత మంతయుఁ దెలుపఁ
దరమిడి కైకేయి దశరథాధిపున - కెఱిఁగింప నంతయు నెఱిఁగి భూవిభుఁడు
అల వసిష్ఠుని నయోధ్యకును రావించి - వలగొని మ్రొక్కి- * 5xo వరము నిచంద్ర
వీరికి వేదాదివిద్యలన్నియును - నేరుపు" డనుచు నానృపుఁ డప్పగింప
ననఘుఁ డమ్లనినాథుఁ డట్ల కావించె - జననాథుతనయు లాసంయమి కరుణఁ 600

గరిహయారోహణక్రమము లెఱింగి - వరరథారోహణవై ఖరు ల్డెలిసి
యఖిల వేదంబులు నఖిలశాస్త్రములు - నఖిల శస్త్రాస్త్రవిద్యలు నేర్చిరంత
వారిలో రాముఁ డవార్యశార్యమున - సారవివేకాదిసద్గుణావళుల
దేజరిల్లాచు విష్ణుదేవుండు గాన - రాజిల్లె నాదశరథుఁడును నంతఁ

—:విశ్వామిత్రుడు దశరథుని కడకు వచ్చుట:—

గొడుకుల పెండ్లించ్ల కొమరొప్పఁజేయ - నడరిచింతింప విశ్వామిత్ర డంత
వచ్చి నిల్చుటయు దౌచారికు లిసి - వచ్చి యాదశరథవరు నర్థిఁజూచి
"యవధారు దేవ విశ్వామిత్ర మౌని - తివిరి వాకిట నేగు దెంచి యున్నాఁడు"
అనవుడు దశరథుం డాప్తులతోడ - మునివసిష్టుఁడు దాను ముదముతోనపుడు
పరమేష్టి కెదురేగుపాకశాసనుని - కరణి నెదుర్కొని ఘనశక్తి నెఱఁగి
యమ్లని గొనిపోయి యర్ఘ్యపాద్యముల - నెమ్రిబూజించిననృపజూచియతఁడు 610

"కుశలమే ప్రజలకు గుశల మేనీకుఁ ! - గుశలమే నీ ముద్దుకొడుకు గుజ్జలకు ?
విశదవ తాచార వినుత వసిష్ట - కుశలమే ? మునులార ! కుశలమే ?" యనిన
"నేమిటఁగొఱఁతలే దేము ధన్యులము - నామందిరము పావనమ్లు చెన్నొంద
భావితమూర్తి ! యోపరమ మునీంద్ర 1 . నీవు విచ్చేసితి నేఁడు మాకడకుఁ
గాన లోకములఁ బ్రఖ్యాతుఁడనైతి - మానవాధిపులలో మాన్యుండనైతి,
వచ్చిన కార్యంబు వలనొప్పఁజెప్పఁ - డిచ్చమైఁ జేసెద నేకార్యమైన"
ననిన విశ్వామిత్రుఁ డా రాజుఁ జూచి - “జననాథ ! దశరాత్ర జన్నంబుఁ దొడరి

ー:కౌశికుడు యజ్ఞరక్షణార్థమై దశరథునితో రామునిఁ బంపుమనుట:-

కోరి యేఁ జేయుచోఁ గ్రూర రాక్షసులు - దారుణాకారు లిద్దఱు వచ్చివచ్చి
మా యాగశాలలో మాంసరక్తములు - పాయక గురియుచు బ్రబలవిఘ్నములు
సేయుచు నున్నారు ; క్షితిపాల ! మాకు - నాయాగమధ్యంబునం దల్గరాదు ; 620

అటుగాన నీ పుత్ర నభిరామరాముఁ . బిటుసత్త్వఁ గ్రతువొప్ప బాలించుకొఱకు
గొనిపోవ వచ్చితిఁ గ్రూరులు దనుజు - లనిఁ జావ రొరులచే నతనిచేఁగాని
యిత నిమహత్వ మే నెఱుగుదు బ్రహ్మ సుతుఁడైన యీ వసిష్ఠుండును నెఱుఁగు ;

అనఘ! రాముఁడు బాలుఁ డను బుద్ధి మూను. మనఘ నీపుత్రకుండనులో థ ముడుగు;
క్రతుకర్త క్రతుమూర్తి క్రతుభాగభోక్త - యకఁడు లోకారాధ్యుఁ డతనిబత్తెంపు
మతులశస్త్రాస్త్రంబు లతని కేనిత్తు ; - నతనిచేఁ గ్రతురక్ష యగు మూకు' ననుడుఁ
బెలుకురి మూర్ఛిల్లి పెద్దప్రొద్దునకుఁ - దెలిసి వెల్వెల (బాటి దీనుఁడై మిగులఁ
గలఁగికంపించి గద్దదకంఠుఁడగుచుఁ - කෆි’පි విశ్వామిత్రు ద్రార్థించి నృపుఁడు
“రాముఁడు బాలుండు రాముండు నిసువు - రాముఁ డెఱుంగఁడు రణకళా కేళిఁ
బదియును నై దేండ్ల ప్రాయంబువాఁడు . కదలెడిచిప్పకూఁకటి గలవాఁడు 630

పరికించి తనయందుఁ బగవారియందు . నురుబలాబలగతు లూహింపలేఁడు
ఇటువంటి పసిబిడ్డ నేలవేడితిరి - కటకట ! ఘనదయాకలితుండ వయ్యు
బహుదివ్యశస్త్రాస్త్రపతులు రాక్షసులు - మహిత మాయోపాయమతులు రాక్షసులు
నిపుణసంగరకళానిధులు రాక్షసులు - విపుల బాహాటోపవిభులు రాక్షసులు
వారితోఁ బోర నెవ్వఁడు రాముఁడనఁగ - వారేడయితఁడేడ వరమునిచుద్ర
యరువదివేలేఁడు లవని బాలించి . తఱిదప్పి ముదిసి యీతనిఁగంటి నేను
ఇతనిఁబుతైంచుట కేఁ జాలనయ్య - క్రతురక్షకై విచారములేల మీకు ?
నేను సేనల గూడి యీప్రొద్దెకదలి . పూనివచ్చెద నిదె పౌండు మీ వెనుక
మునినాథ ! మీయాగమున విఘ్నక_ర్త - లగు రాక్షసుల శక్తు లవి యెంత గలవు
వా రెవ్వరెవ్వరు ? వారి పేరేమి ? - యీరాఘవుఁడు వారి నెబ్భంగి గెలుచు ?" 640

ననిన విశ్వామిత్ర డనియె భూపతికి - మనుపుల స్త్యబ్రహ్రమనుచుండు ఖలుడు
ఆవిశ్రవసుకొడు కథిలకంటకుఁడు - రావణుఁ డుగ్రసంరంభుడై పనుప
బలసి మారీచసుబాహులన్వారు - నలిరేఁగి యాగవిఘ్నములు సేయుదురు ;
రాముఁడొక్కఁడు దక్క రణభూమి వారి - నేమిచందంబున నెదురలే రొరులు ;"
అనిపల్క నమ్లక యధిపతి మఱియు - మునినాథుతోఁ బల్కె మోమోటలేక
“బ్రహ్లానాలవవాఁడు పరమసాహసుఁడు - బ్రహ్రచే వరములు వడసినవాఁడు,
ఆట్టిరావణుచేత నటు పంపు వడసి . నట్టివారలగెల్వ నత (డేమిచాలు ?
వారిలా వెఱుఁగక వచ్చెద ననుచు - మీఱి పల్కితి నింక మెల్లన జనుఁడు'
ననపుడు రోషతామ్రాక్షుఁడై చూచి - కనలుచుఁ గటము లుత్కటములై యదర
నొడలెల్లఁ గంపింప నురుగతిఁ బలికె - నడరి విశ్వామిత్రుఁ డారాజుఁ జూచి 650

"కాకుత్స్థ కులజులగతి విచారింప, కీకష్టదుర్భాష లేల భాషింప ?
నేను వచ్చినపని యెఱిఁగింపు మంటి - పూని చేసెద నంటి ; బొంకెద విపుడు
క్రతురక్షకై రాముఁ గడఁగి వేఁడుటయు - ధృతిమాలి యీనని తెగిపల్కె. దీపు ;.
సూనృతేతర నిన్నుఁ జూడఁగారాదు - గానఁబోయెద"నంచుఁ గడఁగిపల్కుటయు
జలవిధులింకె ; భూచక్రంబుగ్రుంగె - గలఁగె, లోకములు $ దిగ్గజములు. ప్రెగ్గి o,

దివిజులు వెఱచిరి ; దిశలుగీడ్పడి యె - నవశంబులుగఁ జొచ్చె నఖిలభూతములు :
అప్పడు మౌని కోపాటోపవృత్తి తప్పక భావించి దశరథుఁ జూచి

- : వసిష్టముని దశరథునితో రామలక్ష్మణుల బంపువునుట :-

యావసిష్టుఁడు పల్కె “నర్క-వంశజులు - భూవలయంబున బొంకరెన్నఁడును ;
మిన్నందు నీకీర్తి మీ వారి కీర్త - లన్నియుఁ జెడుఁ గల్లలాడితివేని ;
విచ్చెద నని పల్కి యీకున్నఁ బొలియు - నచ్చగాఁ జేసిన యఖిలధర్షములు : 660

దశరధాధీశుండు ధర్షాత్తుఁ డనఁగ - విశదకీర్తల నీవు వినఁ బ్రసిద్ధుఁడవు :
పుడమిలో. నవనీశ ! భువనరక్షణము - గడవంగ ధర్మముల్ గలవె రాజులకుఁ ?
గాన రామునినిచ్చి గాధినందనుని - పూననీయునిఁ బంపు మానవాధీశ ;
ఘనబ లోన్నతులు రాక్షసు లీకుమారుఁ - డనికి దక్షుండుగాఁ డనుచు నీకొడుకు
శైశవంబున కింత శంకింపనేల ? - కౌశికుఁ డుండంగఁ గలుగునే భయము ?
అధిప విశ్వామిత్సు నత్యుగతపము - లధికసామర్ల gంబు లతివిచితములు ;
భూనాథ ! యిమ్లహాపుణ్యుండు దేవ - దానవగంధర్వదైత్యులకంటె
నెఱుఁగు దివ్యాస్త్రంబు లిమ్లహాబాహుఁ - డెఱుఁగని విషయంబు లెందును లేవు
జనలోకనాయక జయయు సుప్రభయు - ననఁగ దక్షునికూతు లాజయవలన
సుపభవలన రక్షోవధార్గముగ - సుపభుం డగు భృశాశ్వండు వేర్వేఱ 670

నస్తాకృతులఁ బుతు లరయ నేఁబండ - శస్తాకృతుల తనూజను లేఁబం డ ఁ
గాము గూపంబులు గలవారిఁ గాంచి - భూమీశ ! యిచ్చె నీపుణ్యాత్తునకును
ఆదికారణంబుగా నఖిలశస్త్రాస్త్ర - విదు డిమ్లనియు నీవు వెఱవంగవలదు ;
ఈ ముని మహిమ పెంపె ఱుఁగవే యకట 1 - యీమునితో నాడి యేణ తప్పెదవు ;
ఈము నిచంద్రుతో నేఁగ రామునకు - సేమంబు జయమును సిద్ధమ్లు సుము :
ఇతఁడు రక్కసులజయింపఁగా లేఁడె ? - హితమతి నీపుతు నిద్రచారి తు ,
నలఘుశస్తాస్త్రవిద్యలఁ బెదసేయ . వలసి యిచ్చటికి భూవర వచ్చెఁగాక
కాన రామునిఁ బంపు కతువు రక్షీంప - నీ నిర్త్పలాత్తుని కిచ్చుట మేలు."

-: కౌశికునితోడ రామలక్ష్మణులఁ బంపుట :–

అని వసిష్టుఁడు పల్క- నాత్త్మలో నమి - జననాథుఁ డారామచంద్రుని బిలిచి,
బాలభావము చూచి బాష్పముల్నించి - యాలింగనము సేసి యర్ధిదీవించి, 680

చిప్పకూఁకటిదువ్వి, చెక్కిలి పుడికి - తప్పక యొక్కింతతడవు చింతించి,
పుణ్యాహవాచనపూర్వంబుగాఁగ - బుణ్యవ్రతంబులు పుణ్యహోమములు
గ్రహపూజనలు సేసి, కమనీయ వస్త్ర - మహితభూషణములు మనసార నిచ్చి,
యొగిఁ దానుఁ గౌసల్యయును వసిష్ఠుండు - తగినదీవన లిచ్చి, దశరథేశ్వరుఁడు

పుణ్యలగ్నంబునఁ బుత్రరత్నంబు - పుణ్యాత్తుఁ డగు గాధిపత్తున కిచ్చి.
నెమియుఁ దెగువయు నెరిఁ బిరిగొనఁగ - నమ్లనిగొలిచి పౌమ్లని వీడు కొలిపె.
నప్పడు లక్ష్మణుం డా రాముఁగొలిచి . తప్పకభ_క్తితోఁ దాసును జనియెఁ.
బొదివి పువ్వులవాన పౌరిపొరిఁగురిసె - వదలక యనుకూలవాయుపు ల్వీచె.
వరఘోషమంగళవాద్యము ల్లో సె - సుర లాకసంబునఁ ఃూ చిరి ప్రీతి,
నా రాఘవుఁ డప్ప డరుగుచిత్రముల - నారిపాటుల మహోన్నత శస్త్రములను 690

మహితతూణీరముల్ మండలాగ్రముల . సహజంబు గా ( బూని సుప్రీతితోడ
నక్షీణతూణగోధాంగుళిత్రాణ కక్షలంబకృపాణ కలితులై దీప్య
శరచాపహస్తులై సంయమిపిఱుఁద - గరము సం ද්‍රි. తిమైఁ గదలి రాఘపుఁడు
ఆ వనజాప్పని నర్ధితో గొలిచి - పోవు నశ్విను లనఁ బోవుచో వేడ్క
నురుపుణ్యమతు లర్థయోజనం ευδή - సరయువుడ గ్గరశ్రమ ముఁబొందుటయు
రామసౌమిత్రుల రమ్లని యపుడు - తా మున్ను దారుణతపముచేగొన్న
కనకగర్భుని పత్రికల సర్వమంత్ర - జననుల సర్వదాసౌఖ్యవాయినుల
బల యతిబల యునఁ బరఁగుమంత్రముల - నెల మిమై వారలకిచ్చెఁ గౌశికుఁడు
ఆరామలక్ష్మణు లామంత్రశక్తి . నారూఢరవితేజులై బడలికయు
నాఁకలినీరువట్టాదిగా రుజు . సోఁకక బలవృద్ధి ಟ್ಥಿಲ್ಲಿ రంత 700

సరయూనదీతటస్థలినాఁటిరాత్రి і దరణ కోమలదర్బతల్పంబులందు
గౌశికుచేఁ బుణ్యకథలొప్ప వినుచు - దాశరథులు ప్రమోదమున నిద్రింప
నాగాధితనయుండు నా ప్రభాతమున - వేగంబె మేల్కని వేడ్కచిత్తమునఁ
దనరంగ నటఁదృణతల్పంబులందుఁ - గసుమోడ్చియున్న రాఘవుల నీక్నీంచి
"యరుణోదయంబయ్యె ననఘాత్తులార Ag నిరుపమపూర్వాష్ట నిత్యకృత్యములు
వలయునేమంబులు వరుసఁగావింప - వలయుట మేల్క నవలయు మీ' నినఁ
దెలిసి సంధ్యావిధుల్ దీర్చి కౌశికున - కలరుచిత్తములతో నతిభక్తి ప్రెక్కి
తరణివంశోత్తము ల్టారర్థిఁజనుచు - సరయు సురాపగా సంగమంబునను
బహుసహస్రాబ్దము ల్పాయనిని యతి - బహు తపంబులు సేయు పరమసంయములఁ
గనుఁగొని సంతోషకలితుఁడె గాధి - తనయుతోఁ బలి కె నాదశరథాత జుఁడు. 710

అంగదేశ వృత్తాంతము

"ఎవ్వనియాశ్రమంబిది సంయమీంద్ర - ఎవ్వరుండుదురయ్య ! యీతపోభూమి ?"
ననపుడు "రామ ! యనంగా శ్రమమన - వినఁబడు నిది లోకవిధ్యాతమగుచు,
నీయాశ్రమంబున నెలమితోఁ దపము - సేయుచు లీలమై శివుఁడున్నఁజూచి
కందర్పుఁ డతిదర్పగర్వితుం డగుచు - నిందు శేఖరుమీఁద నేయంగఁజూచి

యడరి యాదేవుఫాలాక్షానలమునఁ - జెడుట ననంగాఖ్యఁ జెందె లోకమున
నంగసంగతిఁ దదీయాశ్రమభూమి - యంగదేశం బయ్యె నంతనుండియును.
అరుదారc దపము లీయాశ్రమభూమి - జరిపించపుణ్యులు చరితార్థులెందు."
ననుచు విశ్వామిత్రు డతైఱంగెల్ల - వినిపించి యూరఘువీరులు దాను
నిలిచి నాఁ డావాహినీసంగమమున - విలసితస్నానాదివిధు లనుష్టించి
యానంద మందఁ దదాశ్రమవాసు - లైనమునీశ్వరు లాత్త్మలో నెఱిఁగి 720

రమణీయమూర్తుల రామలక్ష్మణుల - నమితతపోధనుడైన కౌశికునిఁ
గొనిపోయి వేడ్కలు గొనలొత్తనపుడు - వినుతార్థ్యపాద్యాదివిధుల బూజించి
పుణ్యకథాగోష్టి బొదలనారాత్రి – పుణ్యరాత్రముఁ జేసిపుణ్యసంయములు
మఱునాఁడు నిత్యకర్తంబులయ్యేటఁ - దెఱగొప్ప నందఱు దీర్చినమీఁద
నీనావికుఁడు నేర్చు నియ్యేఱు గడవ - భానువంశజులకుఁ బదిల మీనావ
యనుచు విశ్వామిత్రుఁడలరంగఁబలుక - విని రామలక్ష్మణుల్వెరవొప్పనపుడు
వారికిఁ బణమిల్లి వారు దమ్మనుప - నా ఋషి తోఁ గూడ నానావయెక్కి
సరయువుదాఁటుచో సరయువునడుమ - గరము విస్తృయమంది కరములు మొగిచి
"యివిమహాధ్వనులు పెల్లెసఁగుచున్నవియు - దివినుబ్బి యిది యేమి తెలుపవే "యనుడు
"గర మొప్పమీఱుచుఁ గైలాసశిఖరి - సరయువు మానససరసి జన్మించి 730

పొంగారుసాకేతపరిచుట్టు గవిసి - గంగలోఁ గూడెడుకరడుల మ్రోఁత"
యనిముని చెప్పిననర్థితో మ్రొక్కి - యనఘులన్నది దాఁటి యరుగుచో నెదుర
కరులు సూకరములు కాననంబులును - హరిణముల్ శరభంబు లజగరంబులును
పులులు భల్లూకము ల్పొదలుసింగములుఁ – గలమహాటవిఁజొచ్చిఘనుఁడురాఘవుఁడు
"ఖదిరతిందుకపూగఖర్జూరనింబ – బదరీవటప్లక్షపాటలీతరులు
బహుళకంటకలతాపరివృతవృక్ష . సహితంబు నిర్మానుషంబునునైన
నివ్వనభూమి మునీశ్వరచంద్ర - యెవ్వరియాశ్రమం? బెఱిఁగింపు" మనుచు
నడుగ విశ్వామిత్రుఁ డంతయుజెప్పఁ – దొడఁగి యారామునితో నిట్టులనియె
“నలు కనింద్రుండు వృతాసురుఁ జంపి - మలకలుష ప్రాప్తి మలినాంగుఁడెన
సురలను మునులును సుత్రాము నిటకు - దురితముక్తునిఁజేయఁ దోడ్కొనివచ్చి 740

పుణ్యోదకంబులఁ బుణ్యమంతములఁ - బుణ్యాభిషేకముల్పొలుపొరఁ జేయ
నామలకలుషంబు లనునవి రెండు - భూముల నిడ శుద్ధిఁబొంది వాసవుఁడు
మలయుక్తమైనది మలదంబు; కలుష - కలితమైనది యొప్పగాఁ గరూశంబు:
ననియుఁబాపఘ్నంబులనియఁబేరొసఁగి – జనపదంబునఁదొల్లిజంభారితనకు
నలవృత్రువధపాప మందుఁదీరుటయు - వినుతింప ధనధాన్యవిభవముల్పొదలఁ
బొలుపారవరములాపురముల కిచ్చి - వెలయించె నిఁకనొండు విను రఘురామ!

26 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ది (పద

ببيعG ー: విశ్వామిత్రుడు రామునకుఁ దాటకి వృత్తాంతము దలు పుట : Ко ధరణి దాటకి యను దానవురాలు - కరులు వెయ్యింటికిఁ గల లావు గలిగి పొలుపేది నీ రెండు పురములు సొచ్చి - యలవమై బాధించు" ననుడు రాఘవుఁడు *ఎప్వరు లా విచ్చి రీయింతి ? కింత . యెవ్వరినిజపుత్రి యిదుష్టబుద్ధి 2 యీపురంబులు రెండు నేలకాటించు - నీపాపకర్త రా లెఱిఁగింపు" మనుడు 750, "నవని సుకేతుఁ డకా యమ్లండు తొల్లి - తవిలిపద్మజునకుఁ దప మాచరించి యడరెడు నిష్టమై నతని మెప్పించి - కొడుకు వేడుటయును గొడుకు నీకీను వెలసిన గజముల వేయింటిలావు - గల కూతు నిచ్చితిఁ గనుము పొ మ్లనిన నా వరంబున దాని నాతండు గాంచి - భావించి సుందుని భార్యగాఁ జేసె : నతఁ డవ్వధూటియం దతి ఘోరస్పత్త్వ - వతులమారీచసుబాహులన్వారి బడసి లో కాంతరప్రాప్త డౌటయును - గొడుకులు దానును గూడి గర్వమున నాయింతి మఱి యగస్తా శ్రమంబునకుఁ . బోయిమానుల సారె బొదిలికాట్రింప గలశజుఁ డాపాపకర్తలఁజూచి - యలిగి రాక్షసులుగం డని శాపమిచ్చె. నదియాదిగా రాక్షసాకృతుల్పూని . యదయత మానవాహారముల్ గొనుచుఁ దా నిందు వసింుంచి ధరణిఁ గాలకించు - దీనిఁ జంపఁగలేరు తెగువనెవ్వరును, 760, నీ వొక్కఁడవుదక్క నీచేతఁ గాని - చావ దాఁడుది యని చంపరా దనకు. మొనసి గోబ్రాహ్రణహితమైనఁజాలుఁ - జనుఁజంపఁ గామినీజనుల రాజులకు. దొలి ధారణియేల c దు 0పఁ జింతించు - పలదురా లె నఁ బర్ణన్యుఁ డలిగి ^^ Y) \3£ دسمها (۲۳ ایسس ۹ السـح సంపన్నమతి విరోచనుకూఁతుఁబట్టి - చంపఁడె యది పశ_స్త్రముగా దె యెందు ; నెఱయ లోకంబు లనిద్రముల్గాఁగఁ தும் జెఱుపఁజిత్తంబునఁ జింతించుటయును నలుక దృఢవత యగు భృగుపత్నిఁ - జల మొప్ప విష్ణుండు చంపఁడే తొలి )ES rr السحه యదిగా న లోకహితార్థమై సతులఁ - బొదివి చంపుటయును బుణ్యంబులనఘ" -: "తాటక వధ' : యునిన విశ్వామిత్రనతులవాక్యములు తనతండ్రిపనుపును దలఁచిరాఘవుఁడు హాటక గర్బాభుఁ డగుహ"నిమాట - దాఁటక తాటక దండింతు ననుచు ఘనధనుర్దోషముల్ గగనంబునిండ - నినుచుటయును మండి నిండ గోపించి 770 కర్ణకఠోరమౌ కార్డు కధ్వనికి - ఘూర్జితారణనేత కుటిలాస్య యగుచు مساب .3£ ومسدسه రెండు హ_స్త్రము లెత్తి తెక్కలతోడి - కొండరి వ్వునవచ్చు కొమరు దీపింప విదితాట్లహాసంబు వెలిదం పరుచుల - వెదచల దివియెల వెసఁ బెల గిల ఁ Co. أنها 歌 )وہ ہم وہم وممه ל"י జరణఘట్లవములఁజటులసత్త్వంబు - ధరణికిఁ డెలుపుచుఁ దవిలియేతెంచు తాటక గనుఁగొని దశరథరాముఁ - డాటోప ముప్పొంగ ననియెఁ దమ్లునికి కావ్యము బొ ల కా O డ ము - ుగ్గా “జూచితే లక్షణ చూచితే దీని - నేచంద మే యంద మేయు గ్రదృష్టి దీనిఁజూచిన గుండె దిగు లేరికైన - మానునే యటుగాన మర్షింతు ఫ్రీ ని ” ననుచుండ గర్జన మాకసం బగలఁ - జనుదెంచి పదధూళి సకలంబుఁగప్ప నలిమీఱి ఘోరదానవురాలు తాలు - కలగొనఁగురియ రాఘవుఁడు గోపించి యనుపమా ప్రంబున నమ్లహాశిలలు - దునుమాడి దాని చేతులు ద్రుంచివైచె 780, నప్పడు లక్ష్మణుం డసురేశుచెలియ - కప్పాటు గావింతు నని యన్నకరణి ముక్కును జెవులును మొదలంట గోసె - నక్కామరూపిణి యక్కజం బొదవ మూయలు ధరియించి మఱియుఁ బెక్క-మ్లు . లాయింతిగురియ విశ్వామిత్రుడనియె “ననఘ ! సంధ్యాకాల మగుచునున్నదియు - దనుజుల నెందు సంఛ్యల గెల్వరాదు. నీ వింకఁ గృపమాని నెలకొని దీని - నీవిశ్వహితముగా నిట చంసు" మనుడు గా ధేయమునిమాట గడపక శబ్ద - వేదిబాణముల నవ్వెడమాయ లడఁచి పెడ పెడ నార్చుచుఁ బిడుగుచందమున - నడతెంచుచున్న దానవి నిరీక్షించె. మహితాస్త్ర మొకటి చన్తోన నాటనేయ - బహురక్తధారలు పర్వ నావ ని త్ర యసుర శిక్షారంభమం దదిరాము ( - డొసఁగెనో శరముల కుపహారమునఁగఁ, బ్రళయమారుతమనఁ H),ඕ సంధ్యాభ్ర - మిలఁగూలు తెఱఁగున నిలఁగూలెఁ దూలి'790 యప్ప డానందించె నఖిలభూతములు - నప్ప డానందించి రమరు 3ు మునులు ; ఆ రాము దీవించి యాలింగనంబు - గారవంబునఁజేసెఁ గౌశికుఁ డంత. దేవగంధర్వాదిది విజులు గొలువ - దేవేంద్రు డచటి కేతెంచి, “శ్రీరామ ! దేవునిఁ గాంచి ప్రార్ధించి పూజించి - దేవవిధేయు గా ధేయు నీక్షించి, “మమ్లురక్షింప నిమ్లహిఁబుట్టినట్టి தம் యమ్లహామహునకు నిమ్లు భృశాశ్వ సంతాన మైన యస్త్రములు శస్త్రములు - నంతయు" నని చెప్పి యరిగిన దివికి వినుఁడంతఁగ్రుంకె నయ్యెడను నాఁడుండి - ముని మఱునాఁడు రామునిఁ బ్రేమ(జీరి —: శ్రీరామునకు విశ్వామి త్రుఁడు భృశాశ్వసంతానములైన యత్ర శత్రుముల నిచ్చుట : —

  • రామ ! నీవిక మరణ కేళి చూచి - యేము మెచ్చితిమి ; నీ కిచ్చెద మింక నమరోరగాసుతయక్షయుద్ధముల - సమధిక మగున స్త్రశస్త్రంబు" లనుచుఁ దనశుద్ధితోడ సుస్థలినిగూర్చుండి - మునిపతిరాముఁ ద్రా ఖునిఁ గావించి 800 యమలమనస్కు-ఁడై యఖిలంబుఁదలఁచి - క్రమమున దండచక్రంబునుధర్మ చక్రంబు మలటి కాలచక్రంబు విష్ణు Įstä చక్రంబు శక్రువ జంబును నసియు c బాళిపాశము ధర్మపాశంబు కాల - పాశంబు నీళానుభయదశూలంబు

$ᏉᏑᎪ శ_క్తియుగ్లంబు నుగ్రమై మిగుల. - నెగడునుష్టానుష్ణనిర్మితాశనులు 28 శ్రీ ర ం గ నా థ రా మా య ణ ము ద్విపద ਸ੍ਤ یہ جنيpكنيسيليسيتي ختي కంకాలమును ఘోరకరవాలముసల - కంకణాఖ్యంబులుఁ గ్రౌంచబాణాది శస్త్రంబు లొగి నిచ్చి సప్తుదంబడర - న స్త్రంబులాగ్నేయ మననొప్పనదియు బ్రాహంబు తేజః ప్రభంబు నైంద్రంబు o బ్రహ్రశిరంబును బ్రిస్థాపనంబు నారాయణంబు పై నాకంబు శిఖర . దారుణ శౌర్యసుదామనంబులును బ్రశమనమును విలాపన దుసత్యంబు - విశద పభలఁ బొల్చు విద్యాఛరంబు వాయవ్యసౌమసం నర్తాస్త్రచులును - మాయాధరా ప్రంబు మానవ మథన 810: సౌమనసహరుద్రసంతాపనములు - తాపసమ"సల దర్పణాస్త్రములు హయశిరంబును మూయలడరించి చాల - జయమిచ్చుగాన్దర్వ సమ్లో హనములు సౌరిది నైష్టికమును శోణితాఖ్యంబు - నరుదుగ నాగ్నేయమును సాయకంబు గరుడబాణంబును గౌబేరశరము - నారసింహాస్త్రంబు నాగబాణంబు వారింపరానట్టి వైష్ణవాస్త్రంబు - వారకనుతికెక్కు వైద్యాధరంబు రౌద్రబాణంబును రాక్షసాస్త్రంబు - భద్రప్రదం బైన పాశుపతాస్ర మొగిఁ గర్తరీచక్రములును మేఘాస్త్ర - మగణితంబై నట్టి యస్రజాలముల నఖిలదారుణ మైన యమర మోదకియు - శిఖియనఁదగు నుల్లసిలుగదఖడ్గ వామనపైశాచ వాయవ్యశస్త్ర - సోమ సౌమ్యాఖ్యాన సంవర్తనములు . సామంబు మదనంబు సంతాపనంబు - తామ సంబును జగదాస్త్రదారుణము 820 కంకోల కాహల కరవాలముసల - కింకిణుల్ మొదలుగా ఁ గీలితాస్త్రముల నెలమి నిచ్చినదానినెల్లఁ గైకొనుచు - నలరి రామం డచుహాత్తునిఁ జూ చి *మునినాథ ! సకలాస్త్రములు భవత్కరుణఁ - గనికృతార్ధుఁడనైతిఁ ; గా పున నింక సలలితంబుగను పసంహరణాస్త్ర - ములనొసంగు, మటన్న ముదమంది యతఁడు సత్యవంతము రభసము పరాజఖము - సత్యకీర్తియు దశాక్షము నవాజఖము ప్రతిహారతరము మారణము సుశుచియు . శతపక్షదైత్యదృష్టములు లక్ష్యములు గ్రశనంబు కరవీరకరిసత్యకీర్తి - దశ శీర్షమును శతోదరము జ్యోతిషము విమలంబు మకరంబు విరుచి నిష్కలియు - బ్రమథనంబును సునాభంబును సర్వ నాభంబు మఱి దుందునాభంబు పద్మనాభంబుఁ దృణనాథనైరాశ్యములును గామ రూపంబు నౌ గంధర్వరణము - సౌమనమును నిదసంధానములను 830, మోహనవిషయాక్షములు మహానాభ - బాహువిభూతి జృంభకములాధాన్య ధనువులు వృత్తవంతము రుచిరంబు - నెనయ సార్చిర్తాలి ధృతిమాలియనఁగఁ గామరూపంబులుగల మహాస్త్రములు - భూమీశునకుఁ జెప్పి పొలుపాటు మఱియు వివియునుగాక యనేకశస్త్రాస్ర - నివహముల్ రఘువంశ నేతకు నొసగి తత్పభావంబులు తన్మంత్రములును - దత్పయోగంబులు తదుపసంహతులు విలసిల్ల శస్త్రాస్త్రవిద్యారహస్యములు సర్వమును దెల్ప మొగి రామునెదుట కావ్యము బా ల కా ం డ ము 29, నంగార సదృశంబులై కొన్ని ఘోర - భంగుల ధూప్రనిభంబులై కొన్ని యనుపమదీప్తిరమ్యంబులై కొన్ని - తనరారు బహుదివ్యతనువులై కొన్ని పరువడి చంద్రప్రభంబులై కొన్ని - పరికింప భానుదీప్తంబులై కొన్ని బహుళాంధకారవిభ్రమములై కొన్ని - మహితాబ్ఖహాసభీమంబులై కొన్ని 840, యకలంకమూర్తు లిట్ల మర నేతెంచి - ముకుళిత కరయుగ్రములతోడ నిలిచి, *మెకార్య మొనరింతు ? మేమిటఁ బనుప ; మాకేమియానతి ? మనుజలో కేశ " యనుడు నేఁదలఁచినయప్పడే మీరు - చను దెండు పొం డన్న సకలశస్త్రములు వలగొని మ్రొక్కి యవ్వసుమతీపతికి - నెలమితో మ్రొక్కుచు నేగె నంతటను. మునినాథుఁజూచికేర్హౌగిచి రాఘపుఁడు - వినయంబుభ_క్తియు విశ్వాస మెసఁగ *ననపు ! కృతార్థఁడ నైతి నీకరుణ ;" - నని వినుతించి విశ్వామిత్రువెంట నరుగుచో నట వామనాశ్రమ భూమి - కర మొప్పటయుఁ జూచి కాకుత్స్థకులుఁడు. “ఈ పర్వతము చెంత నిది యొక్కవనము - చూపుల కిం పారి సొంపుల నలరి పౌలుచు నానామృగంబులు గల ధ్వనులు - గలపషీమృగములు గలిగి చెన్నగుచు , నున్న దీయాశ్రమం ఫ్రో సంయమీంద్ర ! - యెన్ననెవ్వరిది ? యిందెల్లజంతువుల850 సుఖలీల నున్నవి చూడ నిక్కడికి ; - నిఖిలజ్ఞ ! యొక్క డ నీయజ్ఞభూమి 7 ఎటనుండిచనుదెంతు రేచిరాక్షసులు - చటులోద్ధతులునీదు జన్మంబుచెఱుప, యాగరక్షణముగా నఖిల రాక్షసుల - వేగంబె నిర్జింతు విశిథాళి" ననిన నక్కౌ-శికుఁడు జగదభిరాము రాముఁ - జెక్కిలి పుణికి సున్నేహుఁడై పలికె. “ననఘ ! నీ వెఱుఁగనియర్థంట్లు గలదె ? - వినుము నాచే విన వేడుకయే ని మును విష్ణుదేవుండు ముదముతోఁ దపము - గొనకొని కావించుకొఱకునై యిచట యుగములనేకంబు లుండఁగాననఘ - మగువామనాశ్రమంబం డ్రుము కాదీని s — : శ్రీరాములకు కౌశికcడు సిద్ధాశ్రమవిషయ మెకిఁగించుట:- 4ي మఱియును సిద్ధాశ్రమంబును ననఁగ . వఱలనీయాశ్రమవనము లోకముల జననాథబలివిరోచను తనూజుండు . ఘనరాజ్యపదమున గర్వంబు మిగిలి యేచి మరుత్తుల నింద్రాదిసురల - పేఁచి కాణింపంగ విబుధులు మునులు 860 నీయాశ్రమంబున కేతెంచి ప్రెక్కి- . తోయజనాభునితోడఁ దామ నిరి "శరణాగత ప్రియ ! శరణులోకేశ ; . సరసిజోదర ! మాకు శరణంబు నీవ పన్నుగా మమేఁచు బలి యనువాఁడు - చెన్నొంద జన్నంబు సేయుచున్నాఁడు అవ్వారి దానవయజ్ఞవాటమున - నెవ్వ రేమడిగిన నిచ్చుచున్నాఁడు క్రతువుదీఱకమున్నె కావింపుషూకు - హిత "మంచుఁ బ్రార్ధింప నెల్లదేవతలు. నాసమయంబున నదితితోఁగూడ - భాసుర వ్రతనిష్ట బరగు కశ్యపుఁడు 30 శ్రీ ర 0 గ నా థ రా పూ య ణ ము ద్విపద ఇమ్లులఁదపము వెయ్యేఁడులు సేయ - సమ్లదంబున విష్ణు సాక్షాత్కరించె, *నీ మహాతనువు న నిఖిలలోకములు - సోమార్కలోచన ! చూపుము మూకు నాద్యంతరహితండ వగు నిన్ను వేద '. వేద్యుని శరణంబు వే(డెద" మునినఁ గరుణ నావిష్ణుండు కశ్యపుఁజూచి - “వరము నీకిచ్చెద వాంఛితం బెద్ది 87ö యడుగుము నీ"వన్న నలరి కశ్యపుఁడు - కడుభ_క్తితోఁ గరకమలముగిచి,

  • యతిబలోద్దతి నాకు నదితికి నీవు . సుతుఁడవై జనించి సురల రషీంపు మిదికోర్కి నాకును నీ దేవతలకు . మదిలోన మన్నింప మమ్లనందఅను"

అనవుడు నావిష్ణు వదితిగర్భమున - ననుపమం బగు తేజ మలర జన్మించి వామనత్వముదాల్చివచ్చి యద్దనుజు . భూమి మూఁడడుగులు పౌసఁగంగనడిగి రెండడుగులనే ధరి తియు దివియు - దండి మైఁ గొలిచి యాధన్యుబంధించి లోలత నీమూడులోకము ల్వెలయ - నేలము నీవంచు నింద్రున కిచ్చె, నది గాన నిది వామనా శ్రమంబండ్రు - ఇదియ మాయా శ్రమంబీ పుణ్యభూమి సిద్ధించు నిటు దపస్సిద్ధులు তে 3ৈ - సిద్ధాశ్రమంబు నాఁ జెల్లు నెల్లెడల నీవె వామనుడవై నెగడి త్రివిక్ర - మావతారము దాల్చినట్టి విష్ణుఁడవు. 880 నాఁడును నిది నీవనంబు శ్రీరామ - నేఁడును నారీతి నీవనం బయ్యె."

ననుచుఁ గౌశికుఁడు నిజా శమంబునకుఁ - జని యందు రామలక్ష్మణులఁ బూజించె.

—:విశ్వామిత్రుఁడు యజ్ఞముచేయుట :— “.S لری یا నచ్చట మునిజనం బంతయు గొంత - ముచ్చట దీఱ రామునిఁ బూజ సేసె. నంతరాఘవుఁడు విశ్వామిత్రుఁజూచి - సంతసంబున “మునీశ్వర ! నేఁడు మీరు యాగదీక్షకుఁజొరుం డనుమాన ముడిగి - యాగశత్రులనెల్ల నడఁచెదనేను" అనిన విశ్వామిత్రుఁ డంత హర్షించి - మునుల రప్పించి యిమ్లుగ దీక్షవడసి యాగ వేదుల మును లర్థిగావింప I యాగాంగములఁ బూర్ణమయివేదియొపె 樹 నంచి తాజ్యాహుతులందందు దొరుగ - మించియగ్నులు మండి ఒుంటికిఁ ద్రాక హోమాగ్నిఁ బ్రభవించుచున్న తధ్వనులు - సామాది వేద ప్రసన్న ఘోషములు السحا నాతతదేవతాహ్వాననాదములు " . హోతలపుణ్యమంత్రోపనాదములు 890 దిక్కులన్నియునిండి తివిరి ఘోషింప - నక్క-జమయి యాగ మటు చెల్లుచుండ రామభద్రుఁడు ధనుర్ధరుఁడునై දිළී o సౌమిత్రియునుదాను జాగరూకతను రక్క-సుల్వచ్చు మార్గముమున్నె కింగి ம యక్కౌ-శికుని మౌనియైయున్నవాని విశ్వమంతయుఁ ద హెవృతము గాకుండ - శాశ్వతధృతిఁ గాంచుచంద్రార్కులనఁగ గాచిరి కంటికిఁ గనుతెప్పకరణి - నేచిన భక్తిన య్యెడ నైదునాళ్ల నలవమై గవ గూడి యాఱవనాఁడు - బలిమి మారీచసుబాహు లేతెంచి కావ్యము - బా ల కా ం డ ము 31. మేలిఖడ్గద్యుతు లైఱుఁగులు ሾጥ ‹ሾ ... గ్రాలుకాలాంబుదోత్కరములో యనఁగ, దళములు ( దారు నుద్బట వృత్తిమింట - నిలిచిగర్జనములు నిగుడించి మించి వదలక యయ్యజ వాటంబులోన . మదముననుప్పొంగి మాంసర_క్తములు గురియు చో హోతలకోలాహలంబు - గరిమ సదస్యుల కలకలధ్వనియుఁ 900 బరిచారకులదీనభాషణధ్వనియుఁ - బరికించి విని, రామభద్రుండు పొంగి ‘లక్ష్మణా ! చూడు నాలా" వంచు విజయ - లక్ష్మీధనుర్ధోషలక్షణం బెసఁగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపి - బలువడి వాయవ్యబాణ మేయుటయు నురవడిమారీచు నువ్వెత్తుగాఁగ . సరభసవృత్తిమై శతయోజనములు గొనిపోయి యణి ముణిఁ గ్రూర రాక్షసుని - వనధిలోపలఁ బాఱవైచె నాశరము ; అడరి వజ్రమునకు నళికి యంభోధిఁ - బడినమైనా కమై పడినయయ్యసుర యొకరీతి దరి చేరి యుగ్రాంశుకులుని - యకలంకవిక్రమం బందందఁబొగడి దనుజుల (బాసి యాతతనిష్టతోడ - ననయంబు నా సుచంద్రాశ్రమభూమి శూరతవిడిచి యాసురవృత్తి నడచి - కోరితపము సేయఁ గూర్చుండె నంత, అణిములకి రఘురాముఁడగ్నిబాణమున - నురక సుబాహుని యుర మేసి చం పెఁ 910 దక్కినరాక్షసదళముల నొకటఁ జక్కాడె మానవశరమహత్త్వమున సురలు మోదించి యచ్చో బుష్పవృష్టి - గురిసిరి మునికోటి గొనియాడె నతని, మున్నువృత్తాసురు మునుమిడి చంపి - సన్నుతింపఁగ దేవసంఘంబుఁ గూడి వెలుఁగొందు దేవతా విభునిచందమున - బలువిడిరాముఁడు బాహు శౌర్యమునఁ గడఁగియజ్జారులఁ గడఁగిశిక్షించి - విలసిల్లె రాముఁడు విభవంబుతోడ. నతినిష్ట వెలయ విశ్వామిత్రుఁడంత - గ్రతుకత్తమంతయు గడతేర్చివచ్చి, * నెలకొని రఘురామ ! నీ ప్రసాదమునఁ - గలఁగకఁ జెల్లింపఁగంటి నీ క్రతువు ననికృతార్ధుఁడనైతి" నని కౌగిలించి - వినుతించి రామదీవించి హర్షించి యనఘమానసుఁడు విశ్వామిత్రమౌని - యనురాగమును బొందియచ్చోటదాను భూవరు లారాత్రిఁ బుచ్చి యచ్చోట - వేవిన పూర్వాష్ట విధు లాచరించి 920. మునులకుఁ ಬ್ರಣಮಿಲ್ಲಿ మునులతో గాధి - తనయునిఁ గనుఁగొని “తాపస ప్రవర ! యింక నెయ్యెది కార్య ! మెఱిఁగింపునీకుఁ - గింకరులమునీదుకృపరుఁ బాత్రులము." అనిన నచ్చటిమా"నులందఱు గాధి - తనయు మున్నిడికొని తా మిట్టుల నిరి. “జలజా_ష్టకులవర్య ! జనక భూవిభుఁడు, చెలుచొప్పజన్నంబు సేయుచున్నాఁడు, మనమందుఁబోద ముమనుజేశునింటఁ - ద్రిణయను పాటించుదివ్యకార్తకము గంధాది పూజలఁ గర మొప్ప దేవ - గంధర్వయక్షరాక్షస వీరవరులు 32 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద ـسـاعة _: "రాముని మిథిలానగరమునకుఁ బోవ మునులు ప్రేరేపించుట : م حسب మొదలైనవారికి ము న్ననేకులకు - నదియె_త్త నెక్కడ నలవిగాకుండ నట్టివిల్లను బట్టి యటులెక్కుపెట్టి - గట్టిగా నెత్తిన ఘనునకు నతఁడు తన కూ (తునిచ్చెదఁ దప్పకనేను fo ననుచున్నవా("డని యందఱు నపుడు "జననాథ యాశరాసనలలామంబు - జనకునిజన్నంబు చనుఁ జూడ నీకు" 93(). ననుచు విశ్వామిత్రుఁ డాదిగా సకల - మునులు నావీరోత్తముల దాశరథుల లలితపుణ్యుల మిథిలాపురంబునకుఁ - జెలు వారఁ బయనంబు సేసి సమ్లదము నొంది, భాగీరథియు త్తర తటము - 3οδ, హిమాద్రియు సిద్ధాశ్రమంబు వలపట నిడి, యక్షవల్లభుదిశకుఁ _ బొలుపారc బొందిన భూరిమార్గమున మూడు యోజనములు మూఁడుజాములకు - నాఁడేగి యటశోణనదముతీరమున విడిసి తీర్థస్నానవిహితక స్త్రములు, నడిపి రమ్యస్థలి నరనాథసుతులు సంతోషమున మునీశ్వరులతోనుండి . రంతకె శికుఁ జూచి యూరాముఁడని 5ు. - : క్రౌ బ్రొంబి వw లై”ంతము : هانس (e “గరము ప్రజా వృద్ధిగలుగు నీదేశ - మరయ నెవ్వరిదేశ ? మానతిం" డన్సిన "భూనాథవిను బ్రహ్లాపత్రుండు కుపఁడు - నానొక్క మునీమహోన్నత కీర్తిగలఁడు అతఁడును వైదర్బియను నింతివలన "Η సుతులనల్వురగాంచె సురుచిరాకృతులఁ 94(?. శమితాత్తులధూర్తరజసుఁగశాంబుఁ - గుశనాభువసువు నక్కొచురులు మిగిలి యేనివార్య శార్యులై నునుపమలీలఁ - దనరుమహాక్షత్ర ధ్వర్షంబు నడుపఁ గొడుకుల చరితంబు గుణములు చూచి - యడరు సంతసమితో నాకుళం డనియె. “నిలఁబ్రజాపాలనం బెలమి గావింపఁ ; - డలఘుకీర్తులుగల్ల" నన ముదమంది కౌశలంబున నొప్ప నాకు శాంబుండు . కౌశాంబియను పేరుఁ గావించెఁబురము దశరథాత్తజమహోదయమనుపురము - కుశనాభుఁడొనరించెగుశలుడై ధరణి కూరుండు ధూర్తర జండు నిర్జించె - నారంగపురము ధర్షారణ్యమనఁగ వసువు నిమ్లల గిరి ప్రజ మను పేరఁ - బసదుగ ని_ర్థించెఁ బట్టణం బొకటి యిది ప్రీతి నవ్వసుఁ డేలాదేశంబు - ముదమంది గిరులై దుముందఱనొప్పె, చానగమధ్యంబునందును మాగ - ధానామమున నొకతటిని చెన్నొందుఁ 95(9. జాల నమ్లగధదేశం బెల్ల వసువు - పాలించుచుండును బరమధర్మమున వచ్చెరు వడరంగ నాకుశనాభుఁ - డచ్చరలేమ ఘృతాచియం దెలమిఁ గన్నులుమరునంపగములు నా నొప్ప - కన్నెల నూర్వురఁ గడురూపవతులఁ గనియో నత్తరుణులకమనీయకాంతి - వినుత యావనకళావిస్ఫూర్తు లమర ుం:శ్రీరమే లా మధురవాచాల - మంజులకంకణమధుశింజితములు కావ్యము బా ల కా ం డ ము 33 కరమొప్పఁగాఁదాళగతులనఁగూడి .. మొరయులీలాలాస్యములు సల్పువారు, మురిపెంబులింపార మొగిమృదంగాది - వరవాద్యములు వేడ్క వాయించువారు పాణిపల్లవలఘుస్ఫారితలీల - వీణామృదు క్వణ వితతంబుగా ఁగ మాకందమంజుల మధుపానమత్త - కోకిలధ్వనిఁ గూడి కొని పాడువారు నగుచు నుద్యానంబునందుఁ గ్రీడింపఁ - దగిలి యాచెలువలఁ దప్పక చూచి 960 కామాంధుఁడై శర్వగతుఁడైన పవనుఁ - డామూ నినుల ఁ జూచియర్ధితో బలికె. “మానినీమణులార ! మఱివినుఁడింక - బూనిచెప్పెదమీకుఁ బొస(గంగ నిపుడు నన్ను వరింపుఁడు నలినా కులార ! - చెన్నార నమరత్వసిద్ధి గైకొన (డు ; ఎన్నఁడు జరలేని యెలజవ్వనంబు - నున్న తయశము మీ కొప్పారఁగలుగు" నని న నల్లననవ్వి “యనిలుండ వఖల - జనహృదయంబులఁ జరి యింతువీవు, నీవెఱుంగుదు మమ్లు, నీమహత్త్వంబు - భావింప కిది యేమి పలికెదవకట ! నియతుఁడై వ_ర్తించుని_ర్జలధ_ - నయశీలుఁ డగు కుశనాభు కూ (తులము ఓడకమాతండ్రియుండమాయంత - గూడుటయట్లు సేయఁ గులహినిగా డె ? యిరవార మాతండ్రి యెవ్వరికిచ్చు( - బరికింప నాతఁడు పతి మాకు" ననినఁ బవనుఁడు కోపంబు పట్టలే కప్ప - డవయవంబులఁ జొచ్చి యూత లోదరులఁ 970 గుదియంగ దిగిచినఁ గుద్దిలై తండ్రి, - కదియెల్ల నెఱిఁగింప నందఱువచ్చి విన్నన్పై వదనారవిందముల్వాంచి - సన్నిధినిలిచి బాష్పములు నించుటయుఁ గుశనాభుఁ డప్ప డాకూఁతులకైన . దశ జూచి వెఱఁగంది తా వారి కనియె, “నిట్టిరూపములు మీ కెలనాగలార - యెట్టుగాఁ బాటిల్లె ? నెవఁ డిట్లు సే సె ? మీరేల పలుకరు ? మీరింత కేమి - కారణం ?" బనవుడుఁ గరములు మొగిచి తమతండ్రితోడ నాధవళాపులనిరి - "మముఁజూచి పవనుండు మానంబువిడిచి నన్ను వరింపుఁడు నలినా కులార ! - యన్ననామాటకు నౌఁ గాక యనక “మాతండ్రి నడుగు మీమాటనీ" వనిన - నాతండు కామాంధుఁడై యల్లి మమ్లు గుబ్దలఁగాఁ ল্ল ডেে గ్రూరాత్తుఁ ;* డన్సిన . నబ్దలోచనలలో నా తఁ డిట్లనియె. “తగవును ధ్వర్షంబు దలపోసి మీరు - తగదని శీలంబు దాఁట నో డి తిరి 980 కన్నియలార ! మీ గౌరవంబులను - నున్నతసత్కీ-_ర్తి నొందె నాకులము, దేవతా విషయమై తెగి యొల్లర్పైతి, - రీవిధి మీరు సహించుటే లెస్స. వమయో సత్యంబును క్షమయె శీలతయు, - వీమ యొ తపంబును క్షము యొ కీర్తియును శమయె ధర్షంబును క్షమయె లోకంబు . నమరంగ రషీంచు" నని విచారించి, తనమంత్రివరులతో దలపోసి చూచి.యనఘాత్ముఁ డగుచూడి యనుమునీంద్రునకుఁ 漸 క క, వుంబు దెల ఫ\) ; - கம், து విశ్వామిత్రుఁడు తన వం S) మొం - . . ു. 暈 * :్చూశీ త్రు దనుజన్లు డగు గుణోత్తరు బ్రహ్లాదత్త - డనువాని రప్పించి లో హార్డునకు 3 邻4 శ్రీ రం గ నా థ రా మా య ణ ము ద్విపద ధర్జపత్నులుగాఁగఁ దనదుకన్నియల - ని_ర్షలబుద్ధిమై నెమి నిచ్చుటయు - سنگ لی ) చూడిపుత్రుఁడు వారిఁ జూచికైకొనఁగ - వీడె నా సూర్వుర వికృతరూపములు అవనీశ 1 యది మొద లాప్సరోత్తమము - అవనిఁ గన్యాకుబ్ద మను పేర (బరఁగె. నాకుశనాభుండు నప్ప డొప్పారు - నాకృతుల్ గల తనయలఁ గనుంగొనుచు 990 నలరి యాకూతుల నల్లని ననిచి - యెలమిమైఁ బుక్ర కామేష్టిగావింపఁ గొడుకైన కుశనాభుఁ గుళుఁడు వీక్షించి - పడ సెదుపుత్రునిఁ బరమధర్షాత్తు వినుత నిర్ధలక్సీక్తి విఖ్యాతు గాధి - యను పేరు గల పుణ్యు నని యెఱిఁగించి పరమ పి యంబున బహలోకమున - కరిగె ; నాకును మ న డై ( పుటె గాధి, لیب س--سفه باس-- اسسس للسها أساحة దశరథాత్తజ ! గాధితనయుండ నేను - కుశవంశమునఁ గౌశికుండండ్రునన్ను, మతిధ_ర్త నిష్ణార్ల మాయక్క సత్య - వతిభ_క్తిమై సురేశ్వరలోకమునకు -τβ Θ. Φ بساط گسسته వేడుక దనప్రాణ విభుఁడైన రుచికు - తోడ శరీరంబు తోడఁ దా నరిగి యీ లోకమున లోకహిత మాచరింపఁ . ద్రాలేయపర్వత ప్రాంతదేశమున నది గౌశికీ నా మనది యయ్యెఁ దాను వెలయ నన్నదిచెంత విహరింత నేను, సిద్గాశమముఁ బవేశించినకతస - సిద్దంబుగాఁ దపస్సిద్గుండ నై తి ; 1000 سیستسله ெ ெ اسبتها لا دي) నాదినుండియు మదీయాన్వయస్థితియు . నీదేశ విధమును నేర్పడ వింటి ; నడురాత్రియరుదెంచె నరలోకనాథ 1 - కడుడస్సినా (డవు కను మోడ్డుగాక ! చలియింపకున్నవి సకలవృక్షములు - మెలఁగవు వనభూమి మృగసమూహములు; నెఱి విహంగంబులు నీడముల్చేరి . మఱిచియున్నవి తమపుంజులధ్వనులు : యామినీచరులైన యక్షరాక్షసులు - భూమి విచ్చలవిడి( బొరిఁ జరించెదరు ; దీఁటుగచీఁకటి దెసలు నాకసము - కాటుకఁబూసినకరణి నున్నదియు, నీలాంబరంబున నిండుము తైములు - గీలించి బ్రహ్లాండ గేహగోళమునఁ గడు నొప్పగా మేలుకట్టెత్తినట్ల - యుడుగణంబులతోడ నున్నది నింగి ومهم تاسيسه ومهم యడరంగజనులకు నానంద మొదవ - నుడురాజుపొడతెంచుచున్నాడటన్న నామాటలకు మెచ్చి యఖిలసంయములు . నా మునీంద్రునితోడనని రప్పడలరి 1010 *నెఱయ నీ వంశంబు నిర్మలం బనఘ 1 - గుఱిలేని మహిమ నీకులమువారెల్ల s బ్రహ్లాసమానులు పరికింవ నీదు - బ్రహ్లావర్చసమును బరికింప నొప్ప ;" ననిన విశ్వామిత్రు డమ్లనీశ్వరుల - వినుతించె నంత భూవిభులు, సంయములు, నారాత్రి నిద్రింప నా ప్రభాతపున - నా ఋషిపుంగవు లాగాధిసుతుఁడు, జననాథ ! నిద్ర యుఁ జాలింపు మనిన - విని తేటి పూర్వాహ్లావిధు లాచరించి, కౌశికుఁ జూచి “యగాధమై చూడ - నీశోణనదరత్న మింత యొప్పగునె ? యాకీర్ణమీనంబు నతిరమణీయ . సైకతంబును సుప్రసన్నతోయంబు. పరిచితహరితాదిపక్షిసంఘమ్లు - తరుణనీరోచ్చలత్తరళతరంగ కావ్యము బొ ల కా ం డ ము 35 حساسیت మై యున్న దీయేలు ; ననఘాత్తక ! మన - మేయెడదాఁటుద ? మెత్తెఱం" గనినఁ దఱుచుగా మునులెల్లదాఁటెడుమార్గ - మెఱిఁగిపోదమటంచు నెడదవ్వుపోవఁ 1020 గలహంససార సకారండవాది - జలపక్షీరవములు సరి దమ్లుఁ ඩීෆ්‍රො విధమునఁ జెలఁగంగ వీనులింపార - నధిపుఁ డాలించి, మధ్యాహ్న కాలమున సిద్ధమునీంద్రసం సేవ్యతీరమును o శుద్ధపుణ్యోదక సుప్రవాహమును గలిగి నదీతిలకంబై ధరిత్రి - బొలుపారుజాహ్నవి బొడగాంచి, ప్రెక్కి, “గా థేయ ! చూడ నగాధమై తోఁచు . నాధునీరత్నంబు నట దాఁటిపోవఁ దెరువింక నెయ్యెది ? దెలుపవే"యనిన . నరనాథ ! యట శోణనద ముత్తరించి మొుగి మూఁడు యోజనములు దా(టి పోవ . నగు నమ్లహానది యందాఁక మనకు దోయఫలాదులు ద్రోవఁడె"క్కనుచు - నా యేలు దాఁటి వారటు పోవుచోటఁ జెలఁగుసారసగణ సేవ్యమై పుణ్య - సలిలమై, యుత్బుల్ల జలజమై మిగుల ఫేనమై, నిత్యగంభీరమై చారు - మీనమై యతిపుణ్యమిళితమై యమరు 1030 గంగాతటంబున ఘనల తాసంఘ - సంగతంబగు సమస్థలమున నిలిచి, మనుజేంద్ర తనయులు పూధ్యాహ్నికంబు - లొనరించి ముదమంది యుచిత ధోజ్యములా నోజమై మునిగోష్టి నొప్పచున్నంత ; - రాజన్యతిలక మారామచంద్రుండు రాజహంసోద్ధూత రాజీవరేణు - రాజీవరాజితరంగత్తరంగ h గంగ నాలోకించి, కౌశికుఁ జూచి - 6 గంగ యీ వసుధ కేక్రమమున వచ్చె ? నే తెఱఁగునఁబోయె నిటనాకమునకుఁ ? - బాతాళమునకు నెబ్భంగిఁ దా నరిగె ? నేచి పారావార మేగతిఁ జొచ్చె ? - నేచందమునఁ బుట్టై నిమ్లహాతటిని ? చెప్పవే" యనవుడు శ్రీరాముఁజూచి - యప్పణ్యధనుఁడు విశ్వామిత్రుఁడనియెఁ. గమనీయకాంతులుగల రూపవతులు - హిమవంతునకు(గూతు లిరువురుగలరు ; అమరులందఱుగూడి యాగంబుకొఱకు - హిమవంతు వేఁడి యాయిద్దఱిలోన 1040 గురుపుణ్య యగు పెద్దకూతురిగంగ . నరుదారఁ గొనిపోయి రట నాకమునకు నటమీఁదఁ బార్వతియను పిన్నకూఁతుఁ - బటుతపోనిష్టతో బరితృప్తుఁడైన ఫాలలోచనునకుఁ బత్నిఁగా నిచ్చె - నా లోలలోచన నా నగాధిపుఁడు సురుచిరరుచిగంగసురలోకములకు - నరిగి తా సురనది యను పేరఁ బరఁగె ;" నని చెప్పిమునినాథుఁడవనీశుఁజూచి - “వినుమువృత్తాంతంబు వెండియు నొకటి, —: కౌశికుఁడు కుమారస్వామి జన్మము శ్రీరామునకుఁ " مــ: دارنة مرة قة పార్వతి వరియించి పరమానుర _క్తి - సార్వకాలంబును జంద్రశేఖరుఁడు అతిలోకగతిలోలుడై దివ్యవర్ష - శతము దా రతికేళి సలుపుచున్నెడను గమలాసనుం డాదిగా సర్వసురలు - దమలోన నెంతయు దారుచింతించి 36 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద వెలయనీయిరువుర విషమ తేజంబు - దలఁపనెవ్వరికైన ధరియింపవశమె యనుచు నందఱు నమ్లహాదేపుకడకుఁ - జనుదెంచి వినతులై సద్భక్తితోడ 1050 4 దేవదేవ ! మహేశ : దేవ ! సర్వేశ 1 - దేవనిస్తారక ! దేవ ! నీమహిషు సర్వగీర్వాణులు సన్నుతించెదరు - సర్వజ్ఞ మూకుఁ బ్రసన్నుండవగుమ s యేపార నీతేజ మొవ్వరు దాల్ప . నోపదు ; రటుగాన నుడుగు మీవిధము ; కరుణఁదపోవృత్తిఁ గైకొని మీరు - సరి బ్రహ్లాచర్యంబు చరియింపవలయు ;" ననవుడు నౌఁగాక యనుచు నాసురలఁ - గను(గొని ముదముతో గౌరీశుఁడనియెఁ 6 జలియించె నిదె నిజస్థానంబువలన . నెలకొని మీలోన నిర్జరులార ! యెవ్వరు దాల్చెద రీ తేజ" మనిన . నివ్వసుంధర దాల్చు నింపార" ననిరి, హరుఁడునాసురలతో నౌఁగాక యనుచు - ధరణిపై గావించెఁ దద్విమోక్షణము దివిజ లయ్యెడ నగ్నిదేవు నీక్షించి - 'పవనునితో(గూడి సావక నీవు ఇలమీఁదఁ బడియున్న యిమ్లహాతేజ - మెలమి ( బ్రవేశింపు మింపార ' ననిన 106 (ు స్వవశంబుగానట్టి శర్వు తేజంబు - పవనపావకులును భరియింపలేక యంగజహరువీర్య మప్పడు వేగ - గంగ లోఁగొన నిచ్చెఁ గరమర్ధితోడ నిచ్చిన నాయింతి యిరవోందగాను - మచ్చికధరియించె మమత రెట్టింపఁ దనవిభుతేజ మత్తఱిఁ దాల్పలేక - తన మది భయమంది తత్తఱపడుచు గంగాతరంగముల్ గరముఖీతిల్లి to పొంగెల్లి నడఁగుచుఁ బొదలుచున్నపుడు చిత్తసంక్షుభితయై శీఘ్రంబుగాను - దత్తీరదేశంబు దాఁ జేర్చుటయును శరవణంబునయందుఁ జయ్యనఁజొచ్చి - చిరతరంబుగ నందుఁ జెల్విందుచుండె నప్పడు ఋషి పత్నులందఱుఁగూడి - యొప్పగా ఁదమతమ యుచిత కృత్యములు తప్పక తీర్పంగఁ దామేగుదెంచి - రప్పడు నార్యుఁడు నాగంగఁజొచ్చి 1070; తోయంబులాడుచుఁ దొడరివే వేగ . “పాయక శరవణభవ్యస్థలమునఁ ద్రేతాగ్నులనుబోలి తేజరిల్లుచును - ద్రాఁతిగా బ్రచురమై పరఁగుచు లెస్స నున్నవి యీయగ్ను లొండొరుల్ మనము - చెన్నారఁ జలిచేత జిక్కి-స్రుక్కి-తిమి. మన్నన లింపొంద మనము నిచ్చటను - గ్రన్ననచేకొనఁగడఁగుద" మనిన నీశ్వర తేజంబు నిర వొందఁ బుచ్చి - శాశ్వతంబుగధర సత్కీ_వెలయ జాతవేదునిఁజేరఁ జనిన యింతులకు . నాతతంబుగఁ జూచినట్టియింతులకు నిర్భరవృత్తిమై నిలిచెగర్భములు to గర్భిణులై వారు కర మొప్పచున్న బహుభీతు లగుచు నా భామిను - అపుడు తహతహపడి మణి తన్షయత్వమునఁ దమతమయిండ్లకుఁ డారర్ధి నరుగ - శమితాత్తు లగుమునిసంఘంబు లప్ప డంత నావృత్తాంత మాయోగదృష్టి - జింతించి మును లల చెలువల క నిరి 1080 “మీసత్యశీలత మీదుగర్వంబు 矚 మీ సౌఖ్య మిప్పడు మిమ్లింత ಚೆ”, కావ్యము చా ల కా య డ ము 37 ననుచునాగ్రహమున నవనిగంపింప - వనితలమీఁద నవార్యకోపమున *మతిహీనులరు మిమ్లు మన్నింపనేల . పతిదూరలగు("డంచుఁబల్కినవినుచు మగుడ జాహ్నవి( జేరి మగువ లందఱును - దగునము ! నీకిది ? తగు నంచుఁ బలికి తమతమ బాహుల తాడనంబులును - దమగర్భములమీఁదఁ దగఁ జేసి రొగి ని. గరతాడనంబులఁ గలఁగి కంపించి - కర మొప్ప గర్భముల్ గరఁగి విచ్ఛిన్న గర్భంబులై యష్టు కాంతలవలన . నిర్భయంబున జాEటి నెఱయంగ నప్ప డాఱుఖండంబులై యవనిపై ( బడియె - జాeటిన యా ఖండచయము గ్రహించి శరవణంబున యందుఁ జయ్యనఁబెట్టి . యరుదలరఁగ లేచి యాతలోదరులు తపమున కరిగిరి తద్దయుఁ ప్రీతి . నుపమింప నటఁ జాల నుగ్రవీర్యంబు 1090 కవగూడి వృద్దియం గడుఁగల్గఁజాల . నవనిపై శ్వేతాద్రి యునఁ గడునొప్పె నరయ నాన్చైలంబునందుఁ గుమారుఁ - డరుదార జస్టించె నతని తేజమున, జనన ప్రదేశంబు శరవణం బగుట - జననాథ ! యత (డొప్పె శరజన్లుఁడగుచు నిలఁగృత్తికలు చన్ను లిచ్చుటఁజేసి . యలరచుఁ గా_కేయాఖ్యఁ జెన్నొం దె, నారయ నమ్గాత లార్వరుగాన - వారు సంతోషింప వదనంబు లా89ు ధరియించి సముచిత_స్త్రన్యపానంబు ந: సరినొప్పఁజేయుట ಏ೬ುಖ೦ డయ్యెఁ, దరు జేందుమాళి రేతస్కందమునను - నరుదారఁ గాస్కందుఁ డన నొప్పె నంతఁ, బరువడి ( దము సురల్ ప్రణుతింప 2δcβαλ - గిరిపుత్రి కన్నులఁ గెంపారఁజూచి, “సురలార ! సంతానశూన్యత మీకు . ధరణికిఁ గానిమ్లు : ధరణికి నింక 1100 బహు నాయకత్వంబు పాటిల్లనిమ్లు ; - బహువిధంబుల" నని పలికెఁ గోపించి కలఁగిరి సురలంత ; గౌరితోఁదపము - సలుప హేమాద్రికిఁ జనియె నీశ్వరుఁడు. అమరేంద్రుఁ డాదిగా నఖిలదేవతలు - కమలసంభవుఁడున్నకడకుఁ దా మేగి, “జలజసంభవ ! భుజాసత్త్వసంపన్ను - నెలమి సేనాపత్రి నిమ్లు మూ 'క నిన, వారిజగర్భండు వారినీ క్షించి - “గౌరీశుసుతుఁ డైన కా_ర్తికేయుండు సేనాధిపత్యంబు సేయు మీ" కనిన - నా నిలింపులు వేడ్క “నౌఁగాక" యనుచు జేకొన నాతఁడు సేనానియ య్యె - నాకనాయకున కున్నత సౌఖ్యమొసగ." ననిపల్కరఘురాముఁడధికసంతోష-మును బొంది మఱియు నమ్లనినాథుఁజూచి *యినా మహానది సంయమీశ్వర ; త్రిపథ . గామిని యగు పేమికారణం"బనీన ? -: గంగానదీ వృత్తాంతము : بسسسسسه

ననఘుండు కౌశికుఁ డారాముఁ జూచి - వినుమని యూకథవివరింపఁదొడ(గె. 1110

హిమవంతమున నాతఁ డిచ్చలోసుతులఁ - దమకించి భృగుగూర్చి తపమాచరింప 88 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద నంతనాభృగు (డును నాతపంబునకు - సంతుష్టహృదయుఁడై సగరునీక్షించి, “పృథివీశ కొడుకులు పెక్కండ్రనీకుఁ - బ్రథితో రుకీర్తులు పరఁగఁబుట్టెదరు అంచితకీర్తిని నతివలందొకతె - గాంచునొక్క నివంశకరుఁ డై న పుత్రు మఱి యొక్క సతి గాంచు మానుగా సుతుల - నఱువదివేవుర నతులవి కముల" నని వరంబిచ్చిన నారాజసతులు - విని కరంబులు మోడ్చి వినయంబుతోడ మునినాధునకు మ్రొక్కి"ముదమందనొక్క - తనయుఁడేసతి కన్నతనయులేసతికి?" ననవుడు "మీకోరినట్లయె పుత్ర - జననంబు"లనిపల్క సంతోషమంది, యంద గ్రమహిషి నిజాన్వయరుచిక - నందను నొక్కని నరనాథుఁ గోరె. 1120 మఱి కోరె నాయున్నమగువయు సుతుల - నఱువదివేవుర నధిక మోదమున సగరుండు భృగునకు సతులతో గూడ - నొగిఁ బ్రదక్షిణమంతనొనరించి ప్రీతిఁ బురమున కేతెంచి పొలుపారనంతఁ - గరము వేడుకఁ గొంతకాలంబుచనఁగ మానుగాఁ దన యగ్రమహిషి కేశినియు - సూనుని నసమంజసుండనువాని గనియె ; నా సుకృతియుఁ గాంతకుఁ బుట్టి T. ఘనతరంబై నట్టి గర్భతంబంబు కఱుకైన యూసౌర కాయలోఁ బుట్టి - రఱువదివేవు రత్యద్బుతలీల s నంత దాదులు వారి నాజ్యభాండములఁ - గొంతకాలము బెంపఁగొమరారి వారు రూపయా వనముల రూఢి మై బెరిగి . రా పెద్దవాఁ డందు నతులదర్పమున వాపోవఁ దమ్లుల వడి ( జుట్టి పట్టి - చాపలంబునఁ గట్టి సరయువులోన వైచిన నవ్వుచు వచ్చిన మగుడఁ - ద్రోచుచునుండు సోదుష్టాత్తుఁడైన 1 |30 యసమంజసున కంత నంశుమంతుండు - దెసలఁ దే జంబులు దీపింపఁబు. నాయసమంజసుం డతిదుష్టచిత్తుఁ - డైయున్న నతనిఁ బోనడఁచి యారాజు -: శ్రీరాముఁడు సగరులవృత్తాంతముఁ దేల్పు వునుట : سست శాశ్వతధర్జనిష్టాపరుం డగుచు - నశ్వమేధము సేయ ననురక్తిఁ దొడఁగె. ననినఁ గౌశికుఁ జూచియారాముఁడనియె - మునినాథ ! పూవంశముల వారిర థలు వినవేడ్కపటైడు వివరించి చెప్ప" - మనిన విశ్వామిత్రుఁ డనియె రామునకు & است 4విడువక హిమశ్చైలవింధ్య శైలముల - నడుమ నాసగరుజన్నంబువర్తించి యాగంబుచేరువ నంశుమంతుండు - రాగిల్లి యశ్వంబు రవీంచునెడను, ననిమిషపతి దై త్యుఁడై ముచ్చిలించి - కొనిపోయి పాతాళకుహరంబు సొచ్చి المسيلا كسلا سسهگ కపిలసంయమిచెంతఁ గడఁకతో గట్టి - యపరిమితానందుఁడై పోయె దివికి. భూపాలుఁ డశ్వంబు పొడగానకిచ్చఁ - గోపించి మండుచుఁ గొడుకులఁజూచి 1140 *యిట కాన మశ్వంబు నెవ్వఁడో వచ్చి . కుటిలుఁడై వ్రుచ్చిలికొనిపోయినాఁడు. | మూఁడులోకంబులు మును మిడి వెదకి - వాఁడెవ్వఁడైనను వానినిర్దించి 3 కావ్యము బా ల కా ం డ ము 39 উ০ঠৈ৩ గుఱ్ఱము వేగ తెగువమైఁగడఁగి సా 3* డన్న సాగరుల్ భుజశ_క్తి మెఱసి నెరసి బహాండంబు నిండ గరించి - యలు వదివేవురు నా పౌ దె కదలి دم) أمسح\ 3£ نادس أمسيا యానాకమ_ర్త్యంబు లంతయు వెదకి - కానక ధరణి వక్కలు సేయఁదొడఁగి, للسفا *5ు STP _క نسبه ס-סמ . నక ཨའོ་༽ వ యొక్కొక్క-( డొక్కొక్క_యోజనం బుర్వి-నక్క-జంబుగఁ ద్రవ్వఁ డని యేర్పరించి పరువడి పూర్వదిగ్భాగంబు తొడరి - ధర ప్రదక్షిణముగా దప్వుద" మనుచుఁ بسته る"ö(5°ö కుద్దాల భూరిశూలముల - ధర రసాతలమునం దాఁకఁ ద్రవ్వచును బాతాళవాసులఁ బ్రకట సత్త్వముల - భూతసంతతులఁ జంపుచుఁ జెలంగుచును వెస నప్ప డఱువది వేలయోజనము - లసమునఁ ద్రవ్వి రాయసమూనబలులు. 1150 భూరిసత్త్వముల ( జంబూద్వీపమిట్లు - చారక దిరిగి రావడి ద్రవ్వటెఱిఁగి, أسسها (مہم علـص. యమరగంధర్వసిద్ధాదులు బెదరి - కమలగర్భుం డున్న కడకేగి మొక్కి, كمستحلا نسجة “వనపర్వతద్వీపవతి యైనభూమి - చని త్రవ్వచున్నారు సగలనందనులు బలువడి స_త్త్వసంపన్నంబులైన i. జలచరంబులఁబట్టి చం పుచు, మఱియు వీఁడు యజ్ఞమునకు విఘ్నంబ (జేసె - వీఁ డళ్వహరుఁడంచు విడువక పట్టి, బలియులై తమచృషి ( బడువారి నెల్ల - జలజసంభవ : వృథా చంపచున్నారు. దలఁచి నీ విది సమాధానంబు సేయ - వలయు" నన్నను బ్రిప్త వారితో నని యెఁ “గపిలమునీంద్రుఁడై కై_కొన్నవాఁడు - తపము నవ్యయుఁడునై దామోదరుండు అమునికోపాగ్ని యందంద వారిఁ - గమి భస్తంబుగాఁగలవార లింక" -3 3- نجحدم بييـيا ననిపల్క- సురలెల్ల *నే" ( గాక" యనుచుఁ. జని;రంత నక్కడ సగరనందనులు 1160 పిడుగులఁ బోలెడు భీకరధ్వనులు - కడు హైయనిలఁబ్రదక్షిణముగా గల య జట్టును ద్రవ్వి యొచ్చోట ఘోటకము - పట్టుగానక తండ్రిపాలి కేతెంచి, “యశ్వంబు పొడగాన మఖిలంబు వెదకి - యశ్వచోరునిఁగాన మైతిమి దేవ ! యే మేమి సేయుదు మిటమీఁద"ననిన - భూమీశుఁడలిగి యాపుత్రులకనియె “విశ్వంబు కల గొని వెదకి నా యెదుట . నశ్వంబు దేక మీ రరుదేరవలవ" దనిపల్క- * నౌ గా క్ర' యనుచు నా సగర . తనయు లుద్ధతి రసాతలమున కరిగి యెలమి శిర కంప మలుక ఁ గావించి - తలకొని యుందంద ధరణి కంపింపఁ “బరువడి పూర్వది గ్భాగంబు (దొడఁగి - ధరఁబదక్షిణముగా ( ద్రవ్వద 'మనుచు للسحا اسبا దొరకొని యందఱు తూర్పుదిక్కెల్ల - నరసి గుఱ్ఱముఁగాన కచ్చోట సకల ధారణీమండలోద్ధరణముకుంద - చారభుజాదండ సమదండకాండ 1170 చతుర గ ములధరాచకంబుమోవఁ - జతురతగల శు భసామజేం దంబు r لبسا است با للسلا أمسيا బొడగాంచి సం పీతి ( బూజించి యచటఁ - దడయక మరిబృహద్భానుదిక్కునకు بسیا బోయి నానావిధంబుల నందు వెదకి - యాయశ్వరత్నంబు నందుఁ జొప్పడక సతత దానచ్చటాసమ్లదామోద - భృతశిలీముఖ పుండరీకాఖ్యగజముఁ 40 శ్రీ రంగ నా థ రా మా య ణ ము ద్విపద గనుఁగొని పూజించి కడు వేడ్కతోడ - వినుతించి యవ్వల వెదకుచు యామ్య భాగంబునకు నేగి పరికించి హయము - లా గొకింతైనను లక్షింపలేక ఘనతరత్వము త్రివిక్రము నాక్రమించు నని మించువామనం బను దంతిఁ గాంచి యర్చించి యవ్వలికరిగి నైరృతిని - జర్చించి యందు నశ్వము గానలేక కుముదమార్దవమునఁ గుముదవర్ణమునఁ - గు ముదంబు నౌ నొక్కకుంజ రేంద్రంబుఁ గని నమస్కారంబు గావించి యవలఁ - జనిచని పశ్చిమాశా ప్రదేశమున 1180 శోధించి తురగంబుచొప్పింతయైన - సాధింపలేక యంజనశైల మనగ, రంజితమదనిర్ధ రంబులు గలిగి - యంజనం బను నేన్లు నచ్చోట ( గాంచి వివిధసత్కృతులు గావించి యామీఁదఁ - బవనుని దెస కేగి బహువిధంబులను నెమకి గుఱ్ఱముఁ గాన నేరక యచట - నముచిసంహరవారణ ప్రతిమాన దంతమయ్యును బుష్పదంతాఖ్య(బరఁగు - దంతినీ క్షించి మోదమునఁ బూజించి యటఁబాసి చని కుబేరావాంతరమునఁ - దటుకున నరసి సైంధవముఁ గానంగ లేక యచ్చట నొక్క లేఖాధినాథ . లోకగజాధిప లోకైకసార్వ భౌమ మోయన సార్వభౌమాభిధాన - సామజేంద్రము గాంచి సద్భక్తి మ్రొక్కిసార్వభౌముని పుత్ర సంఘంబు గదలి - శర్వనిదెస కేగు సమయంబునందు ననతిదూరమున హుతాగ్ని నిబోలి . కనుఁగవ మోడ్చి యేకతమగూర్చుండి 1190 తననిష్ట పెంపునఁ దపమాచరించు . ననఘాత్తుఁ గపిల మహాముని ( గాంచి యతనిచెంగట నున్న హయము నీక్షించి - యతని భర్ణించిన నతఁడు గ దృష్టి నటీమణి సగరుల నలిగి చూచుటయు - నఱువదివేవరు నట భస్తమైరి. –: అంశుమంతుఁడు అధ్వరాశ్వముఁ దెచ్చుట, :— కొడుకు లయ్యశ్వంబుఁ గొనిరాక చాలఁ . దడసిన సగరుండు దాపంబు నొంది మనుమని నయ్యంశుమంతుఁ బంపుటయు 6 - జని యంశుమంతుఁ డా జాడనే పోయి యమరేంద్రుదెస విరూపాక్షంబు గాంచి - సముచితస్థితి ప్రదక్షిణముగా వచ్చి “చూతంగప్పంగవ | మాపినతండ్రు లే తెంచి రెటు పోయి ? రెందున్నవారొ ? తురగచోరకుఁ డెందు(దూరనవాఁడొ ? . వరుస నీవెఱిఁగింపవలయు నా"కనిన నాదిగ్గజాధీశుఁ డా యంశుమంతు . నాదరంబునఁ జూచి యప్ప డిట్లనియెఁ. బ్రియమార నొక్కెడఁ బృథివీశతనయ; - హయముగాంచెద" వన్న నౌఁగాక యనుచు నున్నదిక్కరులను నొగి దాఁటిదాఁటి - నన్నిట నిబ్బంగి నడుగంగ నవియుఁ, బరువడి తామిట్టు పలుకంగ వినుచు - నరిగి యాముందర నధ్వరాశ్వంబు నరయుచుఁ గపిలసంయమిపొంతఁ గనియె - సరి ప్రోవులై యున్న సగరభస్మములు, కని చాలశోకించి కరగి తండ్రులకుఁ - బొనరఁ ది లోదకంబులు వోయ వెదకి కావ్యము బా ల కా O డ ము 41 యుదకంబు గానక యున్న యయ్యెడకు to సదయుఁడై గరుడుండు సనుదెంచి పలికెc. _: Kంగా వతరణ కథ :

  • గపిలుని నలుకమైఁ గలచి యద్దని - కుపితాగ్ని సగరులు కూలి నీతైరి, యిదియేల శోకింప ? నిటు శోకమంద - నిది వేళగా : దొక్క పేర్పడ వినుము . సఃసిజాసనవంద్య చరణారవిందుఁ - డరవిందదళనేత్రుఁ డాదిపూరుషుడు బలిదాన వేశ్వరు బంధించునప్ప - డలుక ది వి క ముఁడె నిండఁ బెరిగి.

استانها با است యగణితశ_క్తి రెండడుగులయందు . జగతీతలంచెల్ల సరి నాక్రమించి, 1210 జలజాత జలచర శంఖుచక ము . లలవడునట్టి మూఁడవ పదాంబుజము 3- بسیا కడుకొని బహలోక ముదాఁక జాపఁ - గడు వేగమున వచ్చి కమలసంభవుఁడు తలకొన్న కో దనకచుండలువు - జలముల ( దత్పాదజలజముల్ 汽&7°C。 బొగదొం దఁ ಜಿಜ್ಜಲ೦ಬುಲು నభో వీథి ( . దగిలివర్తించు మందాకి ని యనఁగఁ, గావున నీవింకఁ గదులసంభవుని - భావించి తప మతిభ_క్తిఁ గావించి కడక మై నాకాశగంగ దొర్తెచ్చి - తడయక భస్తముల్ తడిపినఁగాని, పరలోకసుఖములు పడయరు వారు - గురుబుద్ధి దురగంబుగొని యేగు "మునిన దుర గల బు గొనిపోయి తొడరి యంతయును . దరమిడి యాతఁడు తమ తాత తోడఁ జెప్పిన శోకించి చేయఁ గైకొన్న - యప్పణ్యమఖము సమా_ప్తంబుచేసి కామించి యూ కాశగంగ నీ యుర్వి L. కెమైయిడెత్తునో ? యేనంచు (జింత 1220 విడువక ముప్పదివే లేండ్లతప మొ - పుడమినెంతయు జేసి పోయెను దివికి. నారాజుమనుమ ( డయ్యంశుమంతుఁడు - ధారుణిగంగకుఁ డస మొప్పఁబూని, వరుస మొప్ప దెవేలవర్షము ల్సలిపి - పరలోకగతుడయ్యెఁ దివపడి యతఁడు, అతనిపుత్రుఁడు దిలీపావనీనాథుఁ - డతినిష్టతోడ జాహ్నవిఁ దెత్తు ననుచు విడువక ముప్పదివేలేండ్లుతచము - గడపియు నతఁడు రోగములచేఁ జచ్చె. నన ఘు ఁ డాత నీపుత్రు డగుభగీరథుఁడు - దనరాజ్యమరయఁ బ్రధానుల నిల్పి సారధర్మజ్ఞులు సద్గుణోజ్జ్వలలు - శూరులు నగునట్టి సుతులను గోరి, యెల పాపంబుల నిలమీఁదఁ బాపఁ - డెల్లంబుగా గుగఁ దెచ్చెద ననుచుఁ గరమర్థిదపమ గోకర్ణాశ్రమమున - నరుదుగా ( బదివేలయబ్దము ల్సేయ ననుపమం బగుచున్న యాతపంబునకు - వనజసంభవుఁ డంత వరదుఁడై వచ్చి 1280 యడుగుము వరమన్న నా భగీరథుఁడు - కడుభక్తి బ్రహ్లాకుఁ గరములు మొగిచి “భారతీనేత 1 ప్రపంచ నిర్లాత ; - సౌరలోక త్రాత ! సత్యసంఘాత ! ధాత ! మా తాత లుదగులై వచ్చి యాతతక పిలుకోపాగ్నిచే గ్రాగి, నూఱు వేలేండ్లు సన్నుతగతిలేక . నాఱడిపడి భస్తమై యున్నవారు ; 42 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద ف కడగి యాభస్మముల్ గంగోదకములఁ - దడుపక గతిలేదు దయసేయు" మనిన “హరుఁ డొక్కరుఁడు దక్క- నన్యులాగంగ - ధరియింపనేరరు దగిలి యెవ్వరును ; నీవింక హరునకు నిష్టమైఁ దపము - గావించి ప్రార్ధింపు గంగ థ దింప' ననిపల్కి మదిలోన నతఁడు పార్థించు - తనయులనిచ్చి యుద్ధరణీశుకొఱకుఁ దనరంగ నా గంగ ధర కేగు ననుచుఁ . జనియె పద్మజు ( ; డట(జని భగీరథుఁడు అంగుష్ట మొక్కటి యవనిపై మోపి - యంగజహరునకు నతి ఘోరతపము 1240 దలకొనిచేయఁ బ్రిత్యక్షమై శివుఁడు - “తలదాలు దెమ్లు మందాకి సి" ననియె నంత భగీరథుం డర్థిఁ ద్రార్థింప ■ నంతరిక్షస్థలమందుండి గంగ గగనమండలము నక్షత్ర మండలముఁ - బగులలోకము లెల్లఁ బగుల మై యుచును గులపర్వతములతోఁ గుంభినితోడ - బలసి మహా దేవుఁ దా తాళమునకు గొనిపోవు తెఱఁగున ఘోరమై పర్వి - చను దెంచు నురవడి జగములు బెదర వచ్చు నా గంగగర్వముఁ బాప శివుఁడు - హెచ్చి జూటముఁ బెంచె నింతలో గంగ వచ్చి మహా దేవు వరజటావీథిఁ - జొచ్చి వెల్వడు త్రోవ చొప్పడకున్న —: భగీరథుఁడు గంగను దెచ్చుట :— హరు జటాజూట మహాటవిఁ జిక్కి - తిరుగుడుపడుచు వర్తించుచునుండె. నంత భగీరథుని "డతుల ప్రవాహ - మంతయు నిప్ప డెందరి గెనో " యనుచు వెఱగంది మఱియును విషకంధరునకుఁ - దటిగొని యత్యు గత ప చూచరించి 1250 నపరిమిత ప్రీతి నాభగీరథుని - తప మంత మెచ్చి కందర్పహరుండు లోలత ( దనమాళిలోనున్న గంగ . “భూలోకి మున కింకఁ బొ"ప్తుని యనుప వలనొప్ప జూటంబు వాకిలి వెడలి - బొలు పొందఁ బాతాళమునఁ జూ పనిలిపి తనదివ్యదృష్టి మందాకిని కపిలుఁ - గని “మ. నిమహిమకుఁ గడుఁ జోద్యమంది తగిలి నిన్నలచిన దారుణాకృతుల - సుగతికిఁ బంపవచ్చుచు నున్నదానఁ గినియకు మీవని కేలర్థి మొగిచె" - నన బద్దమికుళంబు ల మరఁ జూపఱకు నడరు నమ్లునికిన్క- నటుపోవ వెటచి - సుడివిడ తెఱఁగున సుడులొప్ప మిగుల మామీఁదజను దెంచుమలయు యు గంగ - యే మెక్కడికి దోచు మిటమీఁద నను:ుఁ బఱతెంచి సగరులపాలిపాపములు - మొఱ పెట్టుచున్నవి ముక్క-ంటి కనఁగ నోలిఁబంకజముల నుండరాకున్న • దూలి యూ 3 సమునఁ దు దైవ ల్లోయ 1260 భూతాధిపతి జూట ముననుండి ధరణి - కే తెంచు గుగకు నెండ గాకుండఁ గొడుగులువట్టిన కొమరున హంస - లుడు వీథి సుడిపడి యొప్పారుచుండఁ, దొడల్ యాసగరులకోప్లోత్కరములు - కడకి మై బోద్రోమకరములో యనఁగ గమనీయతరములై ఘనతరంగముల - గములంతకంతకుఁ గరి మొప్ప మిగులఁ కావ్యము బా ల కా ం డ మ 4 s దనవారిలోపలఁ దగ భగీరథున - కనుపమసితకీర్తు లందంద ఁ బుటి నెఱసి భూతలమెల్ల నిండనే తెంచు - వఱుసన నుబవులు వఱలంగ, గంగ యప్పటప్పటికిని నతుల ఘోషంబు - లుప్పొంగి యుప్పొంగి యుడువీథిముట్టి బ్రహ్లాండభాండము ల్వగులఁ బెల్లబ్బి άmi బ్రహ్లాదిదేవత ల్బ_క్తితోఁబొగడ శివుఁడు ధరించిన శ్రీ గంగయపుడు - భువి చామరుల కెల్లఁ బుణ్యంబునీయ వచ్చితిననిగంగ వరుసగాఁజెప్ప - వచ్చినవిధమున వరుస ఘోషించి, 1270, సురలు ఖేచరులును సుముఖులై చూడ - గరుడగంధర్వులు గరము భూషింపఁ జనుదెంచి బిందువ న్సరసిలోఁ జొచ్చి . యెనయఁ బ వాహంబు లేఱులై పాటి యనఘాత్త 1 పావని ప్లదిని నలిని - యనఁబ్రవాహములు మూఁ డరిగె చూర్పునకు : సీత సుచక్షువు సింధువు నా (గ - భౌతితో మూఁడేగె ( బడమటి దెసకు నడరుచు నుప్పొంగి యందులో నొకటి . కడ(గి భగీరథ పాలు పిఱు (ద ఘనతర విశదోదక ప్రవాహంబు - వినువీథి శరద భ్రవిభ్రమం బెసఁగ దివి కేగ మదిలోనఁ దిపురుభూజనుల - కి విరళ ని శ్రేణు లమరుచందమున నిలయు నింగియు హైఁగు నెడబ్రవాహంబు - గలయ నానా మాలికలు వీచులమర నీ భంగి ఁ దిప్పదునెల్ల పాపముల - నా భంగి (జూడు (డీ యన సుడులొప్ప జెలిమిదాలకోడఁ జేయఁజన్కరణిఁ - బెలుచ నింగికి నంబు బిందువులెగయ, 1280 ధర్షాత్తులగువారి ధర్మకీర్తులకు - నిర్హలస్థానమై నెఱిఁబొల్తు ననుచుఁ

  1. ಏ నయ్యాపగా కీర్తులు నవ్వు - లీల డిండీరమాలిక లుల్లసిల్లఁ బెక్కు (గన్నుల(గాంతుఁ బృథివి పెంపెల్ల - మక్కువనను భంగి మత్స్యములొలయఁ జరియించు కొమరారు జలచరావళులు . పౌరినొప్ప నేతెంచె భూలోకమునకు. నంత శతార్క-పై యమరుచందమునఁ - గాంతిమదృహురత్నఖచితంబులైన నిజభూషణంబుల నింగి వెలుcగ - గజవిమానాదులు కర మర్ధినెక్కియమరగంధర్వ సిద్ధాదులు చూడ - నమరంగ నేతెంచి రజుఁడు నేతెంచె నట మహా నాగంబు లా ప్రవాహంబు - చటుల వేగము చూచి యట ప్రెగ్గుటయును అంతయు నా నిర్ణరాదులు చూచి - చింతించి జపములు చేసి రాలోన నా నదిగట్లనే యవగాహ మంది - యానందమును బొంది యాడి రచ్చరలు 1990; అమరమునీంద్రాదు లంత సంతోష - మమరఁగాఁ బువ్వల నర్చించి రెలమి, నా పుణ్యనదిలోన నతి పాపర తులు - శాపదగ్ధులు కృతస్నానులై దివికిఁ జనుచుండ సురలు నచ్చరులు గంధర్వ - దనుజపన్నగయక్షదైత్యరాక్షసులు కిన్నరాదులు నాభగీరథుకథము - పెన్నాడి కనుగొంచు سبيكة نة నేతేరఁ బెరిగి పర్వతములు భేదించుకొనుచు - నరుగఁ జహ్నఁడు యాగ మాత్రోవఁజేయ వరదగా నటుపచ్చి వలగొనిగంగ - సరిచుట్టుముట్టిన సరగున నపుడు

§ اني 44 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద యాగోపకరణంబు లవి వెల్లిబోయి - యాగవిఘ్నంబైన సతఁ డాగ్రహించి నింగికి నుప్పొంగి నెఱి నేగుదెంచు . గంగ నాకర్షించి కలుషించి క్రోలె. అనిమిషమునివరు లాభగీరథుని - గనుగొనిపల్కిరి కరమర్థిమీఱి “నీ మహాగంగ ని బ్లీమునీశ్వరుఁడు - ఈ మాడ్కి (గ్రోలెనే యిప్పడె నీపు కోపంబులేకుండఁ గోరి యీ పూ ని . నీ పట్ల వేఁడిన నిచ్చును గంగ" 1300 అని ಯಲ್ಲ దేవత లందఱుఁజెప్ప - వినయంబుతోఁ బోయి వేడ్క-నష్ట ని గనుగొని ప్రెక్కుచు గరములు మొగిచి - వినయసంభరితుడై వేడ్క నిట్లనియె "వినవయ్య మునిచంద్ర 1 విమలచారిత్ర 1 - ఘనమైన గంగను ఘనమైన తపము చేసి యుర్వికి గంగఁ జెలఁగుచు నిపుడు - వాసి మైఁ దెచ్చితి వరుసనిచ్చటను మోసమై మీచేత మొనసికోల్పడితి - నో సంయమీశ్వర ! యోపరబ్రహ్లా దయచేసివిడిపింపు ధన్యచారిత్ర - దయచేయు సంయమీ ! దయచేయు" మనుచు వినయంబుతో (బల్క విని మౌని వరుఁడు - మనమునఁ గృపవుట్ట మఱియు నిట్లనియె. నోభగీరథచంద్ర ! యో మహారాజ ! - యీ భంగి గంగను నిలకుఁ దెచ్చుటకు 1810 సీమహ_త్త్వంబును నీ తపోమహిమ - నేమని చెప్పదు నిఁక నీదుకీర్తి విడిచెద గంగను విడిచెద నిపుడు - పుడమిలో నాకీర్తి పొలుపొందు" ననుచు నుమిసి యొంగిలి సేయ నొల్లక యతఁడు - రమణమై దనకర్ణరంధ్రంబునందు, వెడలింప నెప్పటివిధమున గంగ - యడరుచు జాహ్నవి యను పేర (బరఁగెc. బురుషపురాకృతపుణ్యంబు నడుమ - దొరకొన్న విఘ్నంబు ద్రోచి యేతెంచు వెరవన నారాజు వెంటనే వచ్చి Lä శరనిధిఁజొచ్చి యాజాహ్నవీ దేవి దిగి రసాతలమునఁ దిరిగి యందున్న - సగరు లభ_స్తము ల్సరినిండఁబాటె. నంత నంబుజగర్భుఁ డాభగీరథుని - సంతసంబునఁజూచి “జననాథ ! వినుము జల నిధి నెందాఁక సలిలంబులుండుఁ - దలఁప నీసగరుల తనయు లంధా (క దివ్యభూషణముల దివ్యాంబరముల - దివ్యమాల్యంబుల దివ్యగంధముల 1320 దివ్యమూర్తలనొప్పి దివిజలోకమున - దివ్యభోగముల వర్తించుచుండెదరు అడరంగ నిది మొద లనఘ నీ పేర . నడుచు భాగీరథీనామ మీనదికిఁ ద్రిపథయనంగ వ_లువరదయన - నృపజాహ్నవి యనంగ నెగడు లోకముల అనఘ ! మీసగరుండు నంశుమంతుండు - ఘనుఁడు దిలీపుఁడు గైకొన్నవ్రతము నెఱపఁజాలమి నీవు నెఱపంగఁ దివిరి - తెఱఁగొప్ప నీగంగఁ దెచ్చితి కాన గంగాంబునిర్షలకమనీయపదము - మంగళచిరకీర్తిమహితుండ వగుము, కాకుత్స్థకులజుల గౌరవశ్రీల - కాకరం బగు తనయావళిఁ గనుము లలితధ్వర్ణముల మూలస్తంభమైతి - పౌలుపార నింక నీపుణ్యోదకముల Tవెలయఁ దీర్థస్నానవిధు లొప్పఁదీర్చి - ఫలము గైకొను" మంచుఁ దిద్దసంభవుఁడు కావ్యము బా ల కా 0 డ ము 45. తనలోకమున కేగెఁ ; దదనంతరంబ . తనర నాగంగఁ గృతస్నానుఁడగుచు నఱువదివేవుర కాభగీరథుడు - నెఱిఁ దిలోదకములు నిష్టతో నిచ్చె. 1330. నాతిలోదకముల నమరులై సగరు . లాతని దీవించి యరిగిరి దివికి ననఘుండు మఱి యయోధ్యాపురంబునకుఁ - జని భగీరథుఁడు రాజ్యము సేయుచుండెఁ గలుషఘ్న మీయుపాథ్యానంబు భ_క్తి - చెలు వార (జదివినఁ జెప్పఁగా విని న నొనరఁ బుణ్యముల నాయుష్టంతులగుచు ΕΙ ధనధాన్యకీర్తులఁ దనరుచునుందు ; రెప్పడు వారల కెల్లదేవతలు - నొప్ప(బ్రసన్నులై యుండుదు రెలమి, నమరంగ సిద్ధించు నఖిల కార్యములు : - సమకొను నంచిత స్వర్గభోగములు పెనుపారఁగా వారి పితృగణంబులకు - ననుపమసద్గతు ల నిశంబుఁ గలుగు ” ననిన రాఘవుఁడు గంగావతారంబు - విని కౌశికునిఁ జూచి వినుతులు సేసి, నేఁడు విశ్వామిత్ర నీచేత వింటిఁ ; - బోడిమి నీగంగ భూలోకమునకు వచ్చిన తెఱఁగును, వారి తెఱంగు - నచ్చెరువడరంగ నని ముదంబంది 1340: యారాత్రి యందుండి యఖిలలోకముల - నారూఢికెక్కిన యానది గ్రుంకి, యాహ్నిక కృత్యంబు లన్నియుఁ దీర్చి - జాహ్నవిదాఁటి, విశ్వామిత్రుతోడ నుత్తరతటమునందున్న సంయములఁ - జిత్తంబులలరఁ బూజించి, వీడ్కొ- నుచుఁ జని చని యెదుట విశాలయన్పురము - కనుగవకింపైన గా ధేయు(జూచి — : అమృతోత్ప_త్తి : اسے “యినా పురి పే రేమి ? యేరాజవశ్యుఁ [...so డేపు మైఁబాలించు ? నెలజీ (గింపు' మునిన ఘనుఁడు కౌశికుఁడు రాఘవుఁజూచి పలికె - విను మింద్రుకడ మున్ను విన్నాఁడ నేను దితిసుతులైన దైతేయులు నదితి - సుతులైన సురలు భాసురలీలఁ దొల్లి నోలి రసంబులు నోషధుల్ నించి - పాలసముద్రంబు పరువడి ద్దచ్చి క్రమ మొప్పనమృతంబుగైకొందమనుచు - సమమై త్రినా సుధాజలరాశి డాసి 1850, కవ్వంబు తరిత్రాడుగా మందరంబు - నవ్వాసుకిని జేసి యమృతాబ్దిఁదరువ వెలయంగ నటఁ బుట్టి విష ముగ్రమగుచుఁ గలయలోకంబుల గాలకించి మించ బరగ రోషానల పరుషంబునైన - హరుఁ డదిగొని మ్రింగె నంత నుమియుట నురగముల్ ధరియించె నోలిఁదద్విషము - మఱి మఱి తరువంగ మఱియును బుకై వంచన మ_న్ద థావాప్తిలోకముల ముంచియెత్తగఁజాలు మురిపెంబు అమర గాంచీరుణత్కారఫుననితంబములు - నించుక నడుమును నెఱియుఁ జన్లవలు చంచలతనులత ల్సరిదంతచయము - మించు కన్లవయును మెఱయు మోవియును. గోమలమ్రాల తాకోదండు డైన - కాముని విలువిద్యగతి చూప నొప్పి కడఁగంటిచూపులఁ గశదీధితుల - వెడలించు భుజలతావిక్షేపములును 46 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద అమర నూతనయా వనాభిరామముల - నమర నరువదికోట్ల యప్సరోగణము లీలమై నచ్చరలేమలనెల్ల - నోలి దేవతలు దైత్యులును గైకొనిరి. 1360 వారక దరువ నా వరుణాత్తజాత - వారుణి ప్రభవించె పైభవం బలర నాసురది తిసుతు లపుడొల్లకున్న నసురులై ليفركة రవని నెల్లెడల సుర నాదితేయులు సౌరిది గైకొన్న - సురలనఁబ్రఖ్యాతి శోభిల్లిరపడు సంతసంబున రమా సతి దురంగంబు - కాంతిమిన్నగు దంతి కౌస్తుభమణియు, నమృతాంశుఁడును బు, నమృతంబు సురభి - నవురు సుధాపూర్ణ మగుకమన్దలువు కలిగి ధన్వంతరి కర మొప్పఁబుట్టె _ వెలయంగమeటి పు విష ముగ్రముగను నంత సురాసురు ల మృతంబుకొఱకు - నెంతయుఁ దములోన నేచి దర్పమున ననుపమస్థితిఁబోర నసురుల సురలఁ - గనుగొని సురలపై గరుణించి మించి మాని నిరూపమై మధుమర్దనుండు - తా నమృతముఁ బంచి తగ నిచ్చువేళ రాహుకేతువు లను రాక్షసులప్ప - డూహించి పం_క్తిలో నొగిఁ గూరు చుండి 1870 చె యిచాచి పట్టిన జెలఁగుచుసుధను - మెయిచాయ జూడక మెలఁత యిచ్చుటయు రవిచంద్రులప్ప డారమణిని జూచి . కవగూడి యిద్దరుఁ గళవళoబంది కనుసైగ నటుచూపఁ గనలుచు - వనువొందఁ జక్రంబు నటుప్రయోగించి శిరములు ఖండించి సృష్టిలోపలను . కఱకురాక్షసుతలల్ కడు గ్రహంబులుగ నామింట నిలిపెను నమృతంబు ద్రావ - నేమియుఁ జెడకుండ నెప్పడు వారి నాదిగా నెప్పడయ్యాదిత్యుఁజంద్రు - బాధించుచుందురు పర్వంబులందు నసురుల గను బ్రామి యమృతంబుసురల - కొసఁగి వారికి జయంబొసఁగె యుద్ధమున. దైతేయకోటియందఱఁ ద్రుంచి యింద్రుఁ - డాతeటి ద్రి జగంబు లర్థిఁ దాలింప దితియంతఁ దనసుతు ట్టెగుటకు నొగిలి III పతియైనక్యపద్రార్ధించి, "యింద్రుఁ జంపఁ జాలిన మహాసత్త్వ ప్రతాప - సంపన్ను నొకనిఁ బ్రసాదింపు" మనిన నంగీకరించి "సహస్రవర్షంబు - లంగన ! ఘనపచిపై యుండఁగల్గు ! 1380 మూఁడులోకంబులు మొగి గెల్చువాని - వాఁడిమిమై నింద్రు వధియించువాని గనియెద నొకపుత్రు గాంత నావలన" - నని పల్కి దితి మేను హస్తాంబుజమున నయమారఁ బరిమార్దనము నేసి మఱియు . దయజూచి యతఁడేగెఁ దపమాచరింప, జనియో నా దితియును సమ్లదం బెసఁగఁ - జని యుగ్రతప మొప్ప సల్పుచునుండె. నంతట మఘవంతుఁడ తెఱం గెఱిఁగి - చింతించి దితిఁ జేరి శిష్యుండువోలె, పాయక కుశసమితృలమూలభవ్య - తోయాదు లతిభక్తితోడఁ దెచ్చుచును జరణంబు లొత్తుచు సత్కృతుల్టణియు - బరిపాటి సేవయుఁ బరిచర్య సేయ నే వేళ నెచ్చట నేమిగావలయుఁ . గావలసిన వెల్లఁ గనుసన్నఁ దెచ్చి యుపచరింపుచు వేడ్కనుండెఁ బెక్కే-ండ్లు! - నపుడొక్క నా( డిందు నాదితి చూచి أسبا ومجمع కావ్యము బా ల కా య డ ము 47 యలరుచు మదిరహస్యము దాఁపలేక - “బలభేది 1 వినుము నా పల్కు నీవొకటి 1390 తనయునిఁ గోరి మీతండ్రి నేనడుగ - వినుము వెయ్యేఁడులు వెడలిన పిదప నిచ్చితి సుతునంచు నింపార నాకు - నచ్చుగా వరమిచ్చె నటుగాన నీకు నిటమీఁదఁ బది యేఁడు లేగిన పిదపఁ - బటుశ_క్తి దమ్లుఁడు ప్రభవింపఁగలఁడు అలరంగ నీవును నాతండు గూడి - పౌలు పార నేలుఁ డీభువనత్రయంబు వినుతకీర్తుల మీరు విలసిల్లుచుండు" డనిపల్క నంత మధ్యాహ్నకాలమునఁ దల నిడి కాల్గడ దలయం పిగా (గ . నలతమై నిద్రించు నాదితిఁ జూచి, శతమన్యుఁ డెంతయు సంతోషమంది - వితత వైఖరి నిదే వేళ నాకనుచు, దితిగర్భ మతియోగధీశక్తి జొచ్చి . శతకోటిచేఁ దనశత్రువొ శిశువు నేడుతున్కలు సేయ నెలు గె_త్తి బాలు - డేడువ దితియు నయ్యెడ మేలుకాంచె, మఘవుఁడు మారుదో:మారుదయనుచు. లఘురీతిఁ బలుక “బాలకు (జంపవలదు. 1400 "వల" దనియెడు దితివాక్య మాలించి - వెలువడి గర్భ మవ్వేళ వాసవుఁడు కరములుముకుళించి కలఁక చిత్తమున - తిరమైనభ_క్తి చే దితితోడఁ బలి కెఁ. “దనరంగ గాల్గడ తలయంపిగా ఁగఁ - గొని ముక్తకేశివై గూర్కుటఁజేసి యరసి నీ వశుచి వైతివి గాన తెగువఁ . గార్యంబుకొఱ కేను కడుపులో (జొచ్చి గొనకొని నినుఁజంప కోడి గర్భంబు - దునిమితి నేనేడుతునియలుగాఁగ సన్నకు సన్న నాశత్రుండు గానఁ - జిన్ని పాపనిఁ బరిచ్ఛిన్నుఁజేసితిని జనని ! ధ రజవె సైరింపవలయు" - ననిన దుఃఖింపుచు నాయింద్రుఁజూచి سیستم تا ن-سسه “నా నేరమంతయు నాకలోకేశ . నీ నేర మదిలేదు నిక్కువం బరయ” నని పల్కి మరుదాఖ్య లమర ఁదే జంబు - లెనయంగ ఖండంబు లేడ్వురునగుచు నిముల నాపు తు లెలమి నెలైడల - స మదమింపార చరియింపనిము 1410 -B م لعبتيهاry -نسع —& స_ప్తఖండంబులై సరినొప్పవీరి - సప్తమారుతగణ స్కంధనాయకులఁ గావింపు" ముని వేఁడగా నట్లుచేసి - దేవేంద్రుఁ డమరావతికిఁ బోయె నంత వారును దేవతా వల్లభుచెలిమి - మారుతగణ సంజ్ఞ మటిదివ్య లైరి. దేవేంద్రుఁ డతీభ_క్తి దితికి శుశ్రూష - గావించె నీ పుణ్యగణ్యదేశమున ; أسس حلا گسسته السحا నీపుణ్యధరణి మున్నివ్వొకునృపతి - భూపవర్యుం డలంబుసయందుఁ గన్న కొడుకు విశాలుఁ డన్కు వలయాధిపుఁడు - పుడమినేలి విశాలపురి యిందొనర్చె. "నావిశాలునిపుత్రుఁ డై హేమచంద్రుఁ - డావిర్భవించెను నతఁడు సుచంద్రు المبا أسسها سـت۹ ٪يا నతఁడు ధూమ్రాళ్వుని నతఁడు సృంజయుని - నతఁడంతసహదేవు నతడు కుశాశ్వు నాతండు సోమదత్తాఖ్యఁ గాకుత్స్టు - డాతని కెంతయు నమరంగ సుమతి 48 శ్రీ రంగ నా థ రా మా య ణ ము ద్విపద _: సుముతి యను రాజు విశామిత్రు నెదుర్కొనుట :భావింప నెప్పడు పరమధర్ధముల - నీ విశాలాపురం బేలెడి రాజు, 1420. లనఘ ! వైశాలికు లన వీరుజగతి - వినుతికెక్కిరి ధ విభవసంపదల ; నిచ్చల రఘునాథ ! యిచట నీూత్రి - బుచ్చి పేగినఁ జూడఁబోద ; మిజ్జనకు ననునంత గా ధేయుఁ డటవచ్చు టెఱిఁగి - మనమున సంతోషమగ్నుడై సుమతి తనపురోహితులును దనబంధుజనులు - తనతోడఁజసుదేరఁ దనపట్టణంబు వెలువడి చనుదెంచి విహితమార్గమున . నెలమితో నా సంయమీంద్రుఁబూజించి కరములు ముకుళించి కడుభ_క్తిబలికె - “ధరణిలోపల నేఁడు ధన్యుడనైతి జరితార్థమయ్యెనాజననం" బటంచు ( - బరపు పి యంబునఁ బలికి యొుండొరుల నమరంగఁ గుశలంబులడిగిన పిదప - సుచులి విశ్వామిత్రుఁజూచి లౌ న నియె : അൾ & & དག་༽ © 軌 هس-سیاحیه : సువుతికీ శ్రీరామలక్ష్మణు నుగూర్చి కౌశికుఁడు తెల్పుట 曹 *ము నినాధ ! యసమానమూర్తులీఘనులు i. ఘనభుజులనిమిష క్రమపరాక్రములు కరి రాజగమనము ల్కంఠీరవములఁ lது) బురుడింపఁ జాలిన భుజసత్త్వములును 1430 లలితంబులైన పుల్ల సితారవింద puis దళములఁ దెగడు నేత్రములు జెన్నొంద గరవాలములు(గార్డ్నుకంబులు దొనలు - ధరియించి దమదు పదన్యాసములను జగతి నారవిచంద్ర సంచారరీల - మగు నాక సమువలె నలరించువార లిరువురు దమలోన నెల్ల చందముల - సరియగుచున్నారు జనులచూడ్కులరు నీకుమారకు లెవ్వ రెవ్వరీసుతుల - నాకు నేర్పడ గాధినందన చెస్సమ" యనిన విశ్వామిత్రుఁ డాతనిఁజూచి - వినిపింపఁదొడఁగెను వీనులుబ్బంగ "నో రాజకులచంద్ర | యోసుగుణాబ్ది ! - వీరివృత్తాంతంబు వినుము దెల్పెదను ; సరయు వృపొంత గోసల దేశమునను - నరుదొప్పఁగ నయోధ్యయను పురియొప్ప నాపురినేలుచు నాదశరథుఁడు - నేపమై మనుజుల నెల్లఁ దాలించు నాతనివరపుత్రుఁ డైనరాముండు - నితనికి ననుజాతుఁ డీలక్ష్మణుండు 1440 మఖము సేయుటకునై మటి నేను వేఁడ - సుఖమున నిచ్చెను సుతులనిధ్వని మావెంట వేంచేసి మఖమును గాచి - వేవేగఁ దాటక వెస సుబాహుపును ఆటోష మొప్పంగ ననిలోనఁగూల్చి - మాట షూ త్రంబున మారీచుఁబోలి యాగంగ నటదాఁటి యటుమిథిలకును . నేగంగఁదలఁచుచు నిటకువచ్చితిమి ; ఈ రాజశీతాంశు లినవంశకులులు - వీరిసామర్థ $ంబు వినఁగఁజోద్యంబు" ననిన విశ్వామిత్రునతులవాక్యములు - విని చాల సుమతియు విస్తయందింది యారాఘవుల నప్ప డర్థిఁ బూజింప - వారును బూజలు వరుసఁ గైకొనుచు. నారాత్రియందుండి యాప్రభాతమున . నారాజు తముఁ బంప నర్ధితో జనిరి. కావ్యము బా ల కా O డ ము 49 – : గౌతమాశ్రమము #86ex :— చనిచ ని గౌతమాశ్రమము రాఘవుడు - క్రి నుఁ గొని పలికె నాగాధినందనుని

  • సలలిత పల్లవసం ఎద ల్లగి - వెలయు మామిళ్లను వేఱుపనసలు 1450 నారంగ జంబీకి నారికేళ లు - పారిభద్రంబులు బదరికాతతులు పూతులుంగ లవంగ మంజీరతరులు - శ్రీ తరు సంపంగి సింధువారములు పొన్నలు పొగడలు పోకవ్రూకులును - నెన్నంగనరఁటుల నెఱయుపుప్పొళ్ల చిత్తజాంబకములై చెలఁగునశోక - లత్తుక దాడిమ లలితమల్లికలు

తిందుకంబులు శివతిలకశాలలులు - చందన కర్పూర సహకారములును భల్లాత గుగ్గులు బ్రహ్రకౌశికి ము 疊 లెల్లచో నల్లిన యే లకీలతలు అల్లిన మొల్లలు నలరుచేమంతి - చల్లనిపుష్పవాసనలఁ జెన్నొందు కాసారములచేత ఁ గడు రమ్య మగుచు - భాసిల్లపక్షుల పటురవంబులును సమధిక మిట్టి యాశ్రమ మామి సకల - రమణీయమయ్య నిర్ణన మేటికయ్యె ? మున్నిందుఁదపమున మునివర్యుఁడెవ్వఁ-డన్నియు నెఱిఁగింపు" మనిననిట్లనియె, 1460 “గౌతమం డిక్కడఁ గడఁకతోఁ ದಿಲ್ಲಿ To యాతతనిష్ట నహల్యతోఁగూడి యతి ఘోరతపము సేయఁగ నింద్రుఁడెఱిఁగి - యతని తపంబు దానంతయు జెఱుపఁ గుక్కుటంబై పోయి కుటజంబు సేరి - కొక్కొరొయని కూయఁగొమరొప్పమాని మనమునజింతించి మఱియొక్క-నాఁడు - మునినిజానుష్టానమునకుఁ బోవుటయు గౌతమాకారంబు గైకొనివచ్చి - యాతనిసతి నహల్యాదేవి గదిసి "ఋతుకాలమనరు కోరిక గలవారు - మతిఁదలంపఁగఁ బ్రొద్దు మఱి చాలఁగలదు పౌలఁతుక నీ తోడి భోగేచ్చ నాకు - వలయుట ఁదలపోసి వచ్చితి" ననిన నెఱిఁగి యహల్య నీవింద్రుండవగుట - యెఱుఁగుదు గాకేమి ? యిందు రమ్మనుచు జలజాక్షి తమ పర్ణశాలలోపలికి . బలభేదిఁ గొనిపోయి పరఁగఁగ్రీడించె. సురనాథుఁడప్పడు స్టుక్కు-చు భీతి - నరుగుచో గౌతముఁ డంతలో వచ్చి 1470 “యోరి పాపాత్త్మక ! యుచితమే నికు 1-నారూపు గైకొని నాపత్నిఁ గవయ నీపాపఫలమున నీ వముష్కుండ - వైపొమ్లుపొ"మ్లని యంత శపించె. గౌతము శాప మఖండమై తాఁకి - యాతని యండంబు లంతలోఁ దెగియె, = : గౌతముఁ డహల్యకు Tూప మిచ్చుట :— నడరి గౌతముఁ డహల్యాదేవిఁ జూచి - •పడఁతి 1 పాషాణమై పడియుండు మీవు ; కరము గ మగు నెండ గాలి పెంధూళిఁ - బొరలుచు నెందును బొడగానఁ బడక * అనీన శేశాపమున కెయ్యదితుదినాకు" - ననిన నహల్య కిట్లనియె గౌతముఁడు కవైకుంఠధాముఁ డవా_ప్తకాముండు - రోకరక్షణ కళాలోల తత్పరత 4. 50 శ్రీ ర 0 గ నా థ రా పూ య ణ ము ద్విపద రాముడై వచ్చి పురాణపూరుషుఁడు - భూమిపై జన్మించి పొగడు దీపించి చనుదెంచి కౌశికుజన్నంబుఁగాచి - యినకులాధీశ్వరుఁ డీగ్రోవవచ్చి తొలగిపోవక నిన్నుఁ ద్రో క్కినజాలు . జలజలోచస ! నీదుశాపంబు దీఱు" 1480 నని చెప్పి శీతాద్రి కరిగె గౌతముఁడు - మునిపత్ని డారూ పమున నుండె సంత. సురరాజు దనపాటు సురలతో (డెల్పఁ - దరమిడి పితృదేవతల వారు చేఁడి వెరవరులై మేషవృషణముల్ దెచ్చి - సురలు సంధించిరి సురలోకపతికి, నతులపుణ్యాత్తకు ○らG35°ör"c冷 - గ్రతువులఁ జంప్పదు -డఁగి మేషముల నాఁడాదిగా మునినాథుశాపమునఁ . బోఁడి మిచెడి యీ తపోవని నున్న యాయహల్య నతుల్య హతమనశ్శల్యఁ . జేయవే శ్రీరామ 1 చిరపుణ్యధామ " యనిచెప్పి గౌతము నాశ్రమంబునకుఁ . జను దేర శ్రీరామచరణంబుసోఁక మొగు లెల్ల విరియ సోమునికళ వోలె - బొగ యడంగిన హద్యమక్కీలవోలె గలఁకఁదొలంగిన కమలినిచోలె - బలుమష్టుగడిగిన బంగారు కేలె శ్రీరామపాదరాజీవపరాగ . దూరీకృతాఘసందోహయై య:్పడు 1490 వెలఁది యంతయు శిలా వేషంబు మాని - తిలకించి తన తొంటి దేహంబు పూని మునిపతిచేతరాముని మహత్త్వంబు - వినినది గాన నా పేదండయాన యామహామహునకు నాతిథ్య మొసంగి - “శ్రీమీఱ నిటకు విచ్చేసితిగానఁ జరితార్థనై છે ; మీచరణపద్దములు - దరి నిచ్చి రఘునాథ ! లోక్యనాథ మీపాదతీర్థమౌ మిన్నేరు భుపన - పాపంబులెడఁజాపఁ బాల్పడె సనగ, నిలయెల్ల నొకటమిన్నొక్క-టఁగొలిచి - బలిమెట్టి బ్రహ్లాండభాండంబుముట్టి నేదశిరోవీధి విహరించునీదు . పాదముల్ నాదుశాపము ( డాచు టరు డె ?" యనిరాము వినుతించె నంత గౌతముఁడు - సను దెంచి రఘురామచంప్రణూజించి ప్రాకట జన్మసాఫల్య నహల్య - గైకొని తొల్లింటిగతి విలసిల్లె. గ్రోవ్విరిజడివాన కుంభిసి C గురిసె - నవ్వేళ దేవతూర్యంణులు మొరసె ; 1500 ఘనపుణ్యు లందుండీ కదలిమిన్నంటి - తనరుప్రాకార సౌధములయూథముల నమరిక రత్న గేహములవాహముల - రమణీయ రాజమార్గముల దుర్గముల నలనొప్ప శృంగారవనుల జవ్వనులఁ - బొలుచుసంతతశుభంబుల నిభంబులను -: శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలఁజేరుట : س-- ననువొందు వైరివర్గాశిథిలకును - జనకుని మిథిలకు జనుదెంచి రంతఁ. గాళింగ నేపాళ కర్ణాట లాట - మాళవ సౌవీర మగధ పాంచాల కురు పాండ్య బర్బర కుంత లావంతి - మరు తురుష్కాభీర మనుజవల్లభుల ومما ఘనతర యాగోపకరణభాగముల - ననురూసపశుగణాయతనయూపముల కావ్యము బా ల కా ం ,డ ము 51 భూరి దధిక్షీరపూర్ణకుంభముల - సారసమిద్భార చారు దేశముల నడరి ఘోషించు సామాది వేదముల . నుడుగక చనుదెంచుచున్న తాపసుల నుడు వీథి నుప్పొంగు హోమధూమముల - నడ రెడు దేవతాహ్వానరావములఁ 1510 బూజలు గైకొన్న పుణ్యసంయములఁ - బూజింపసాలయ నిభూసురోత్తముల నరుదైన జనకుని యజ్ఞవాటంబు ΠΠ కరమర్థిఁ జొచ్చె నగ్గాధినందనుఁడు. ఆంత నాజనకమహారాజవర్యుఁ - డెంతయు మహిమతో నెదురుగా వచ్చి మునినాథునకు మ్రొక్కి ముద మొప్ప తోడు - కొనిపోయి పూజించి కుశలంబు లడిగి. “నీవు వచ్చితికాన నేఁడు నేమిగులఁ LĮ బావనాత్తుఁడనైతి బ్రబలె నా క్రతువు" లని చాలఁ గొనియూ డి యమునిచంద్రు - వెనుకనె చినతులై విలసిల్గచున్న గురుతరస్ఫీతవత్తులఁ గాక పక్ష - ధరుల మహాధనుర్ధరుల శ్రీకరులఁ గోమ లాంగుల నభంగురయశోనిధుల - భూమి జరించు వేల్పులఁ బోలు ఘనుల సదయాంతరంగుల సతత ప్రసన్న - వదనుల భువనపావనచరిత్తులను చారు ప్రభాభానుచంద్రసన్నిభుల - ధీరుల నయ్యశ్విదేవతాకృతుల 1520 నాచానుబాహుల నతులవిక్రముల Ļist రాజీవనేత్రుల రామలక్షణుల జూచి "యాశరచాపశోభితాకారు . లీచతురాత్తకు లెవ్వరివార ? లీపల్లవారుణ మృదుపాదపద్దు - లేపగిదిని వచ్చి రిచటికి నడిచి " యనిన విశ్వామిత్ర “డనఘులు వీరు - జననాథ ! దశరథజనపాలసుతులు నాయతశ_క్తినాయాగంబుగాచి - యాయహల్యను ద్రోచి, యనుకంప నేచి, నిరుపమ తర శ కి నీయింటనున్న - హరునిచాపము (జూడ నరుదెంచి" రనుడు § ل-د (گسمبے మునినాథుమాటకు ముదమంది జనకు c- డనునయంబునవారి నర్థిఁబూజించెఁ. _: శతానందుఁడు విశ్వామి ప్రభావంబు ةex\دساس: دغ తు ألفا గౌశికుఁ గనుఁగొని గౌతము సూనుఁ - డాశతానందుఁ డిట్లనియె రాగిల్లి 4నీవు రామునిదెచ్చి నెమి మ ప్రేరి - తీవిశ్వవిభుఁదేర నెవ్వరితరము అడరి మాతల్లి యహల్యపాపములు - కడఁగి రాముని పాదకమల రేణువుల 1530 గౌతమ శాపదుర్గతి నిస్తరించి - గౌతము c గ్రద్దఱఁ Key动 మాతల్లి Af రామచంద్రుని పాద రాజీవమహిమ - లేపుందు " నని రాము నీక్షించి పలికె శనీకౌశికుఁడు పుణ్యుఁ డీడోణిమీఁద - నీకు రక్షకుఁడఁట నీ కేమి కొదువ యరయ విశ్వామిత్రునతుల ప్రభావ - మరిది ప్రస్తుతిసేయ నైనను వినుము దశరథాత్తజ బ్రహ్లాతనయుండు కుశుఁడు - గుళుఁ డర్థి తోడుతఁ గుశనాభుఁ గనియో గుశనాభునకు గాధికొమరుఁడై పుట్టెఁ ... I గుశపవిత్రుడుగాధికొడుకయ్యెనితఁడు అతిధర్షనిరతుడై యఖిలంబు పొగడ - నితఁడు మహీచక్ర మేలుచునుండె. る2 శ్రీ ర ం గ నా థ రా మా య ణ ము ద్విపద, నొలసినవేడుక నొకనాఁడు దన్నుఁ - బలసి యక్షోహిణీబలములు గొల్వ వెడలి కాననముల వేడ్క-లుసల్పి - పుడమియంతయు cజరింపుచుఁ జాలబడలి బహుగంధబంధుర ప్రసవమంజరుల - బహుఫలంబులనొప్ప పాచపావళుల 1540 బహుపక్షిరవముల బ్రహ్లా ఘోషముల - బహుసరి వరముల బహుళ వేదికల నలరుచు జాతివైరాదులులేక - మెలఁగు నానావిధమృగసమూహముల ననిలాంబుజీర్ణపర్ణాశులై తపము - నొనరించుతపసుల యోగిపుంగవులఁ బన్నగ ఖేచర ప్రముఖగంధర్వ - కిన్నరాదుల వాలఖిల్యాదిమునుల గడునొప్పి బ్రహ్లాలోకము వోలె మిగుల - నడరు వసిష్టునియాశ్రమంబునకు నతిముదంబున వచ్చి యావసిష్టునకు - నతినిష్టమైుక్కిన నతఁడు దీవించి యుచితాసనంబున ను నిచి పూజించి - ప్రచురిరసస్వాదు ఫలమూలతతుల వరుసతో నిచ్చినదానిఁగై కొనుచుఁ - గరములుముకుళించి కడుభక్తిఁబలికె ననఘాత్త తిపసులు నగ్నిహోత్రి ములు - జనలోకనుతములై జరుగుచున్నవియె జ మీరును శిష్యులు మీయాశ్రమ మిన . నారంగ వీరు వా రన కెల్లవారు 1550మదమున నున్నారె ? మనినాథ " యనిన - నొదవు సమ్ల ఏ మొన నున్నార మేము. నీతితోఁజేయుదె ! నీవు రాజ్యంబు ? - ప్రీతిమై భరియింతె భృత్యవర్గముల ? ముద మొప్ప రాజ్యాంగములు పరీక్షింతె ? - వదలక నిర్జింతె వాలుశాత్రవుల ? గుశలమే సర్వంబు కుశలమే నీకుఁ ? - గుశలమే నీపుత్తకులకుఁ బత్నులకు ?" ననిపల్క- • మీకృప నఖిలంబు కుశల" - మనియెఁ గౌశిక ( డంత నవ్వసిష్ఠుండు కరమర్థి నాయింటికడ విందు గుడిచి - యరుగుమ యీ'వని యతని ద్రార్ధింప. నందుకు కౌశికుం డనుమతించుటయయి - విందుసేయుటకునై వేగంబ యతఁడు తనహోమధేనువు దలఁచి రప్పించి - జననాథవరునకు సకల సేనలకు వివిధభక్ష్యంబులు వివిధభోజ్యములు - వివిధ భంగులవిందు వేడ్కఁగావింప వలయుఁగావున నీవు వలయు వస్తువులు - గలిగింపుమనవుడుఁగామ ధేనువును 1560 గలమాన్నత తులు శాకములు భక్ష్యములు - గలవంటకము లూరు గాయ లంబళ్ల ఫలవిశేషంబులు పాయసాన్నములు - చెలువారు వెన్నలు చీని చక్కెరలు సద్యోఘృతములు రసాయనంబులును - మద్యవిశేషముల్ మాంస భేదములు వావిరి మఱియు నెవ్వారికి నేమి . కావలె నవి యడుగకయె కల్పింప నా ధేను మహిమ కత్యాశ్చర్యమొంది - గా ధేయుఁడప్పడు కడిమాడ సేయఁ గుడిచి సేనలు దాను గోర్కిదీపింపఁ - గడుఁదృప్తినొంది, యా గాధితనూజుఁ డీకామధేనువు నెబ్భంగినైనఁ - జేకొందు ననుచు వసిష్ఠునిఁ జేరి 5లక్షగుజ్జంబులు లక్ష ధేనువులు - లక్షయేనుఁగులు వేలక్షలు మణులు విచ్చెద నీదేను విమ్లు నా"కనిన - నిచ్చలో మునినాథుఁ డెంతయు వగచి కావ్యము బా ల కా ం డ ము 53 46 యిది నాకు జీవనం బిది నాకుఁ బ్రాణ - మిది నాతపంబులకెల్లసాధనము : 1570 హ వ్యకవ్యంబులు నతిథిసత్కార - మవ్యాహతముగ నీయావుచే నడుచు ; నీ పుణ్య ధేనువు నీఁజాల" ననిన - నాపూర్ణబలుఁడు విశ్వామిత్రుఁ డలిగి —:విశ్వామిత్రుడు వసిష్ఠుని కామధేనువుఁ గొంపోఁజూచుట: 48యిమ్లని బతిమాలి యే వేఁడనేల . ర"మ్లని భటసహస్రంబులుఁ దాను గోవు నుద్ధతిఁ బట్టికొనిపోవఁ బోవ - బోవక యది మునిపుంగవుఁజూచి 46యనఫు ! వసిష్టసంయమిచంద్ర ! నన్నుఁ - గొనిపోవు చున్నాఁడు క్రొవ్వి కౌశికుఁడు వారింప వకట దుర్వారుండవయ్య - నూరకతగునయ్య యొప్పింపనన్ను ననఘాత్త ! నీయెడ నపరాధిగాను - నను ను పేక్షించుట నాయమే నీకు ” ననుడు ధేనువుమాట కొవసిష్ఠుండు - మనమునఁ గృపపుట్టి మఱుమాట బలి కె. 46నే నేలవిడుతు నిన్నెంతయు బలిమి - ఛూనాయకుఁడు గొనిపోయెడుఁగాని క్షత్రియు లుద్దండచారిత్రు లైన - ధాత్రిసురోత్తము ల్టారెంతవార 1580. లీగ్రోణి కధిపతి యీ గాధితనయుఁ - డక్లౌహిణీబలం బతనికిఁ గలదు. ఏవిధంబునఁ గెల్తు నితని నే" ననిన . నావసిష్ఠునితోడ నా ధేను వనియె, క 6 మునినాథ ! నృపతేజమునకంటె నెందు - విసుతింప నెక్కుడు విప్ర తేజంబు : గావున నీకంటెఁ గౌశికుండెక్కు - డేవెంట గాకుండు టే నెఱుంగుదును ; బనుపుము నన్ను నీబలములనెల్ల - మును కొని యడఁచెద మునినాథ " యనిన నా వసిష్ఠుఁడు ధేను నపుడు 6 సైన్యములఁ - గావించుబలముల ఖండింపు ముఱక" నన విని హుంకారమడరించుటయును - గనుఁగొని ధేను హుంకారంబునందు ఘనవాలలతయందుఁ గర్ణంబులందుఁ - దనురుహంబులయందు దంతంబులందు ఖురమధ్యములయందుఁ గొమ్లులయందు - నురులోచనములందు నూర్పులయందు మొనయ జంఘలయందు మోకాళ్ళయందు - ననువొందఁ దొడలందు నధనంబునందు గాఢతరం బైన గంగడోలందు - రూఢిగా గూడిన రోమకూపములఁ గెరలురంకెలను సప్రదేశమునఁ - బొరి నుద్భవించిరి భువనభీకరులు కైరాత పల్లవ కాంభోజ యవన - వీరులు పెక్క-ండ్రు విషమవిక్రములు చిత్రరూపాడ్యులు చిత్రాయుధులును - జిత్రవిలోచను ల్చిత్రహంకృతులు నై వీరులై ధీరులై మహోదారు - లై వారు సేనా సహాయులై మఱియు హరులతోఁ గరులతో నందందఁగడిమి - బరగి విశ్వామిత్రు బలములఁ ద్రుంపఁ జూచి యాకౌశికు సుతుల నూర్వురును - నేచి నానా హేతి హేతులు నిగుడ వచ్చి వసిష్టుని వధియింపఁగడఁగి - యచ్చట భస్తమై రతని హుంకృతికి.

నంత విశ్వామిత్రుఁ డఖిల సైన్యంబు - లంతకు వీటికి నరుగుట చూచి 54 శ్రీ రంగ నా థ రా మా య ణ ము ద్విపద,

యతులపరాకము లగుచున్న తనదు - సుతులచావును జూచి శోకించి యంతఁ 1800 أسيا దనరాజ్యమున నొక్క తనయుని ను నిచి - చనిహిమాచలమునఁ జలమున నిలిచి తిపురారిఁ గూర్చి యతి పయత్నమునఁ - దపమొనరింపఁ బ్రత్యక్షమౌటయును بسیا لمصحة - : కౌశికుఁడు ఈశ్వరుని చేత నస్థాదులు వడసి వసిష్ఠునితో حس-: وهٔ نکاغ * موه హరుచేత వివిధశస్తాస్త్రము ల్వడసి - యురపడిఁ జనుడెంచి యుగుఁడై కడఁగి سیسیلک بسی. " (عیا మొగివసిష్టాశ్రమంబున వహ్నిశిఖలు - నెగయ బెల్లెగసె నాగ్నేయబాణముల (مہا نG నప్పడు బాణాగ్ను లా శ్రమంబెల్లఁ - గప్పి మండుటయును గని పిసిష్ఠుండు కాలదండముగొన్న కొలుండొయనగఁ - గేలదండము దాల్చి కినుకతో వెడలి 4యోరివిశ్వామిత్ర ! యోరిపాపాత్త - భూరిపుణ్యాశమంబులు గాల్పఁదగునె ? أسبا جہانس- اساسی كمد 钟曹 ുക് പ്പ് గ్గ్స R R3 وبه لیسه యొనయ నీవెక్కడ నేనెక్క." డనిన - ఘనరోషచిత్తుఁడై ద్ర్చౌ క్రుం డప్ప డతనిపై రౌద్రంబు పాశుపతాస్త్ర - పటుతరవజంబు బ్రహపాశంబు إم مح- ليبيا اسحا కనలు పె శాచంబు కాలపాశంబు - ఘనవిష్సచక oబు కౌలచ కంబు 1610 لمسا لسبا له تع مبسےQ వారుణ గాంధర్వ వాయవ్యసార . ఘోరాస్త్రకోటులు క్రూరుఁడై యేయఁ . أسس حلا Cسلسل గలయంగ విస్ఫులింగంబులు చెదర - బలువిడి నుగ్గాడె బ్రహ్లాదండమున. నలుక్ష విశ్వామితుఁ డంతబ్రహ్లా స్త్ర - మలవడసంధించియార్చియేయుటయు సకల గీర్వాణులు సకలసంయములు - సకలగంధర్వులు సకలపన్నగులు సకలభూతంబులు సకలదిక్పతులు - సకలతారాగ్రహచంద్ర సూర్యులును సకలలోకంబులు చలనంబునొంది - సకలదిక్కులు మండఁ జండ వేగమున బ హాండభాండంబు బలు విడి నెగడి - బహదండముదాఁటి పర తేర ఁజూచి نہ سے لیا o o حبسه لسبة బ్రహాదులకు నడ్లపడరానియట్టి - బ్రహాస్త్ర మవలీలఁ బట్టుక మింగె, سسه این تاسس لنسبيا GJ فته تاسسه لسبة సురుచిరబ్రహ్లాతేజోమూర్తి వెలుఁగ - నరుదార నమ్లనియంగరోమముల నెఱిమంట లెగయ ననేకబాణంబు - లటిముటి వెడలి విశ్వామిత్రుఁ దాఁకి 1620; చుఱబుచ్చఁ దొడఁగినఁ జూచి కౌశికుఁడు . నెలటిచెడి యెంతయు నిజసత్త్వ మెడలి తరమిడి యాబహదండ మొక్క టను - వరశస్త్రకోటులు పపులె పౌలి సె. いーノー3 * --3 بلనత్ర స్త మచల మీయనబైపబలము - క్షత్రబలంబది గాల్పనే" యనుచు -: విశ్వామిత్రుడు బ్రహర్షి పదంబునకై తపంబు చేయుట : اس سے చెనటియై మగిడి కౌశికుఁ డాలు దాను - జని ఘోరతప మర్థి సలుపుచునుండె . ఆటమీఁద సుతుల విశ్వామిత్రమౌని - పటుసత్త్వవంతులఁ బడసె నల్వురను. వినుము దుష్యంద హవిష్ట్యందనాము - ෆබ් దృఢనేత్ర మహారథులనఁగఁ జలము డింపక పెక్కు- సంవత్సరమ్లు | | లలఘు నిష్టలఁ దపం బటు సేయ మెచ్చి, కావ్యము బా ల కా 0 డ ము - 55 عكسـ వనజసంభవుఁ డంత వచ్చీ కౌశికునిఁ - గనుఁ గొని యెంతయు గరుణించి పలికె. నీతపంబున మెచ్చి యిచ్చితి నీకుఁ - 8. యని పోవ గా థేయుఁ డత్తిదీనుఁ డగుచు - నెనయంగ నీతపం బెంత చేసినను 1680 గడపట బ్రహ్లార్డి గా నేర నైతి . నెడపడి చెడిపోయి యీయు గ్రతపము o ఈ రాజబుషి పదం జేనొల్ల ననుచు - ఘోర తపంబు గె కొని సేయుచుండె . مساسل 蚌 తిమై నిట రాజుషి పదం బనఫు ;" అంత నిజ్వెకుకులా గ్రణియైన - సంతతకీర్తి త్రిశంకు డవ్రాజు తనువుతోడను గూడి తానాకమునకు . నొనరంగఁ జసు జన్న మొనరింపఁ దల (చి భ_క్తి సిష్ఠునిపాలి కేతెంచి - యుక్తమార్గంబున ను పచరించుచును 66 దివి జలోకమున కీ దేహంబు తోడ . సవనంబు గావించి చనఁగోర్కె నాకు ననుర_క్తిఁ గావింపుఁ డనఘు నాచేత - మునులరప్పింపుఁడు ముద మొప్ప" ననిన నరనాథ 1 యొడలితో నాకలోకమున - కరుగ నసాధ్య మీయవనీళులకును." అనవుడు రాజన్యుఁ డటదక్షిణమున - ఘన నిష్టఁ దపమర్థిఁ గావించుచున్న చిరపుణ్యులైన వసిష్టపుత్రులకుఁ in గరమర్ధి బ్రిణమిల్లి కరములు మొగిచి 1640 46 దేవలోకమున కీ దేహంబుతోడ - బోవచ్చుయాగంబు పూని నాచేతఁ صة జేయింపు" డనిన, వసిష్ఠుడీ తెఱఁగు - సేయుఁడి యనె నేని చేయింతు" మనుడు. నారాజచంద్రుఁ డిట్లనియె. వసిష్ణుఁ - డే రాజులునుజేయ రీక్రతు వనియె 6 మీకడనిటురాక మీరైననన్నుఁ - జేఫ్రాని యజ్ఞంబు సేయింపవలయు. నరయఁ బురోహితు లగువారుగారె - ధరణీశులకు సర్వధర్మసాధకులు" అనిన వాసిష్టు లాయవనీశుఁజూచి - 6ఘనుఁడు వసిష్ఠుండు గాదన్న తెఱఁగు నిర్త్మలమతి నొరు ల్నేర్తురే సేయ ? o దుర్తతి వగు నీకుఁ దోఁపడు గాక." యనిపల్క నిర్విజ్ఞుడై సంయమీంద్రు - తనయులఁ జూచి యాధరణీశుఁడనియె. 4మీతండ్రినిరసించె ; మీరునుజేయ - రైతి : రేతెఱఁగుననైన నీక్రతువు rr= హీతబుద్ధిలేని మీ రేల నా క్రింక ? - నితరులచేతఁ జేయించెదఁగాక !" 1650 యనిన ( 16 జండాలుండ వగు" మంచున లుక - గనుఁ గొనిపల్కి రాఘనపుణ్యులంత. భాసురంబగు భూమిపాలు తేజంబు - వాసిష్ఠకోపాగ్నివడి గా లెననఁగ 3 * నారయ నీలదేహంబును నీలి - చీరయు జుంజురుశిఖయును దనర నంట నపద్ధంబులైన చూలిన్య - మంటించు నీ రూప మనుభంగిఁ దోఁపఁ బ్రణుతవర్ణస్ఫూర్తిఁ బరఁగిన కనక - మణిభూషణము లోహమయములై తనర నో జమైఁ గష్టనామో క్తిభేదముల ... నా జాతి కను రూపమైన రూపమున జననాథుఁ డతీ ఫెూర చండాల భావ . మొనరంగఁ జేడ్పడియున్న నీక్షించి పౌర భృత్యామాత్యబంధువర్గంబు ... లారా జ3 వర్ణించి ; రంత నా రాజు నొదవినభయమున నొయ్య మెట్టుచును - నొదుకుచు జనులకు నో సరించుచును 56 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద జని మహామహుని విశ్వామిత్రుఁ గనిన - గనికరం బొదవ నాగాధితనూజు 1660 46డిల నయోధ్యాపురం బేలెడినీకు . నెలిమిఁ జండాలత్వ మేల పాటిల్లె o నేతలంపునవచ్చె నెఱిఁగింపు" మనిన . నాతండు ముకుళి3 హిస్తుఁడై పలికె నిరవోందఁ బొందితో నింద్రలోకమిన - కరుగఁ జొప్పడునట్టి యాంబు మున్ను చేయింపుఁడనిన వసిషు( డీ తెఱఁగు - సేయింపరాదని చెప్పెని తర మి. నావసిష్ఠునిపుత్రు లగుచేట న (: - గా పింపఁగా దన్నఁ గాదని పలికి ; రితరుచేతఁ జేయింతు సన్తో £3 - తి హోష యిన బూు వగు ఒన్న నైతి : ననఘ ! నాచేసెద నన్న యవ్వుము - నొనరింతు నామాట కొగిదొం:ులేమి ; ఇట్టియాపదయందు నిటమీఁచినైన నెట్టని సత్యంబు నెగడ (బాలిuతు ( ; బెక్కు-ధర్మంబులు పెక్కు-జన్నములు - పెక్కువతోఁ జేసి పెుపుగైకొంచ్ గురులఁ బూజించితి గురులునావలనఁ - గరుణచాలమి ధర్త కార్యంబు నిలిచి | 670 పౌరుషం బది దేవ ఫలములేకున్న - నేరమి వాటిల్లు నిక్కు-వం ఒరయ ; నేవిధంబుననైన నీవు నాపాలి - దైవమై క్షీంపఁ దగుదు నా" నియె. ననిన విశ్వామిత్రుఁ డత నివీక్షించి - జననాథ ! నీవింక సంతాప డుగు -: త్రిశంకునికై マ"3字oc3S యజ్ఞంబు చేయనారంభి చుట : سس۔ దీనునిఁ జేపట్టితిని ద్రిశుద్ధిగ - మౌ మలుప్పించి - మఘ - సేయించి, దేహంబు తోడనే తివిరి నేఁబలుక - పో హిల బుగాకుండఁ బుచ్చె ఫి ది ఏకీ. విను నిన్నుఁబరమపవిత్రుఁ గావింతు' - ననిపల్కి శిష్యుల నం కఱఁ జూచి మునుకొని మీరెల్లమునుల ఋత్విజులఁ - గొనిరండు, వేత్రిశంకుని యాగమునకు" నని నియోగించిన నట్లవారేగి . మునివరేణ్యులనెల్ల మొగిఁదో డి తెచ్చి కలయ విశ్వామిత్రుకడకు నేతెంచి - చల మేది నిల్చిరి సంయమీశ్వి "ులు : వారు వసిష్టు నాశ్రమవాసులెల్ల - వారలుదక్క-ంగ వచ్చిరం చ9ును ; 1680 ఆవసిష్ఠునిపుత్రు ల్లాడిరి కొన్ని - యావాక్యములు వినుమంu. వార నిరి. 56మతివిచారింపక మఘము సేయించు - నతఁడు రాజఁట ? మాలఁడఁట సేయువాఁడు : చండాలుమఘమున సకలమునీందు - లుండి భోజనము లే యు_క్తిఁ జేసెదరు ? ఆడ కేమొగముల నరుగుదెంచెదరు ? - వేడుక సురలు హవిర్భాగమునకుఁ బరుఁగ విశ్వామిత్ర పాలితుండైన 最 నరుడెట్టులొందెడు నాక లోకంబు ? విన విస్త్మయం బని వెలయు దూషించి' - రన్సిన విశ్వామిత్రు డగ్నిమైమ3డి కడు నిష్టఁదపమిట్లు గావించునన్ను - నడరి దూషించు పాపాత్తులించి అును నూతన గతి నేడునూఱుజన్మముల - బాగుగాఁ గ్రవ్యాదభావంబుఁ దాల్చి మానవశునకాదిమాంసము ల్డినుచు - హీనులై చరియింప నిమ్లు లోకముల. కావ్యము # బా ల కా 0 డ ము + 57 నసమున నన్నాడు నామహోదయుడు - వసుధ నిషాదుడై వర్తింపనిమ్లు" 1690 అని శపింుంచి సంయ ములవీక్షించి . 66 మునులార ! యీ రాజముఖ్యుఁద్రిశంకు నున్న తకులశీల నురుకీర్తిలో - సన్నుతధర్తజ్ఞ సత్య ప్రతిజ్ఞ గ్రతువు సేయింపఁడు గాత్రంబుతోడ - ని 3 డిగ్రపరికేగు నిరవొప్ప" ననిన నా ఋషిమాటల కిమ్లహామునులు - దారువిచారించి తమలోనననిరి. -త గాధిసూనునిమాట గా దంటి మేని . క్రోధించి శపియించుఁ గ్రూరవాక్యములఁ. గానఁ జేయిం3 ము క్రతువు కౌశికుఁడు . మానుగాఁజెప్పిన మహితమార్గమున" ననిపల్కి-ఋనులెల్ల నవ్వరకర్త - మొనరింప నామంత్రయోగాదు లమర నాగాధిత నయు డిు యాజకుండగు ను - యాగభాగములకు నమరులఁ బిలిచెఁ. బిలిచిన 66 రా "మంచుఁ బేరెంగెత్తి . పలికిరి సుర ; లటు పలుక గౌశికుఁడు కుశపవిత్రముచే3 గొనిస్రువం బెత్తి கம் దిశ లరోషానలదీపులు నిగుడ 1700 నా కేంద్రలోకంబునకుఁ ద్రిశంకుండ - నీ కోరినటువలె నిన్నుఁబుచ్చెదను : శ6నడరంగనేబాల్య మాదిగా నియతి - విడువక తపముగావించితినేని, బొందితోడనె కూడఁ బోయి స్వర్గంబు - నందుము పౌ"మ్లన్న నా త్రిశంకుండు తత్తపోబల ఋనఁ దడయక యెల . సత్త్వము లేగెడి సరణిఁబోవుటయు :జండాలుఁడవు నీవు స్వలో 3 మున - నుండ నీనని యిందుఁ డు రిత్రోపింపఁ గడఁక విశ్వామిత్ర ! కావవే' యనుచు . వడిఁవల క్రిందుగా వచ్చుచునున్న శరణార్షియైన త్రిశంకునిఁ జూచి - కరుణావిధేయుడై గాధేయుడపుడు శ8 జననాథ ! నీవాక సమునందె నిలువు - మని పల్కి-నిలుపు కు నట(దక్టణమున నలకత్రిశంకున కమరేంద్రతోడి - చలమున వేతొక్క స్వర్గంబు సేసి లలి నందు సప్తర్ల లను తారకముల - నలవడఁగల్పించి యూ నాక మునకు 1710 వేఱు దేవతలఁ గావింప నిందునకు - మా కింద్రుఁ గల్పింప మదిఁ దలంచుటయు , :జాలభీతిలి సర్వసంయము ల్సురలు - నో బ్రి విశ్వామిత్రునొద్ద కేతెంచి యిలలోన మునినాథ ! యీ త్రిశంకుండు - దలపోయ గురుశాపదగ్ధుండు గానఁ దగ నాకముననుండఁ దగదన్నమాట - తగవుగా(గొనిగాధితనయుండుపలికె. శసురలార ! యీతని సురలోకమునకు - నరిగెడి మేనితో " నని పల్కినాడ నామాటనిజముగా నైన నీనాక - మీమహీనాథున కిటు చెల్లనిండు. ప్రభనొప్ప లోకము ల్పరఁగునందాక - నభమునఁ బొలిచి యీనక్షత్రములను గలయ నచ్చరవీథికంటెను మీఁదఁ . దొలఁగని తేజంబుతోఁ జెలువొంది బృందారక స్ఫూర్తి పెంపొందు శిరము - క్రిందై త్రిశంకుండు కృతపుణ్యుఁడగుచు కరమొప్ప నీతారకంబుల నడుమ - నురుతరకీర్తిమై నుండనిం డనిన 1720 ననుమతించుచు నప్ప డాయనుగ్రహముఁ - గొనియాడి మునివీడుకొని సురల్ల్మనులు 58 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద අාමීව నిజస్థానంబులకు నేగిరంత - నెలమి గౌశికుఁడు మునీంద్రులఁ జూ చి యిమ్లుగా నటమీఁద నిదితపంబునకు - సమర్ల మిక్కడ జాలంగఁగలుగు. ‘మునులార ! మనమింకముదముచిత్రమున.దనర నొక్కెడకుఁ బోదము రణ"డటంచు. గడఁక నక్కడఁ బాసి కదలి విశాల - కడకేగి యందు బుష్కరతీర్ధమాడి, -: అంబరీషుఁడు యజ్ఞపశువుగా శునశ్శేఫునిఁ గొని పోవుట : యంబు ఫలా హరి యగుచుఁ చెక్కే-ండ్ల పంబిననిష్ట దపంబు గావించి, యంబరీషుం డయోధ్యాపురివిభుఁడు - శంబరరిపునూ_ర్తిసముఁ డట్టియెడను వెలయంగఁ గ్రతువుగావింపఁగాఁ బూని - బలభేదిచే యాగపశువు గోల్పోయి యరసి లేకున్నఁ బ్రాయశ్చిత్తవిధికి - నరపశు వడుగును నానాశమముల .* عي أسدا علاس- ألبسها నరయుచు నందంద నటనొక్క మౌని - వరునింటికడకు భూవరుఁ డేగు దెంచి 1730 భృగుతుంగవాసియై పేదమై నియతిఁ - దగనున్న రుచికునొద్దకుఁ బోయి ప్రైక్కి, 4కరుణాఢ్య ! యేను యూగము సేయఁగోరి . పరికింపనేరక పశుపు (గోల్పడితి. గొనకొని యొకలక్షగోవులఁ బుచ్చు - కొనియాగపశువుగాఁ గొడుకునాకిమ్లు" నావుడు నాతండు నా పెద్దకొడుకు - పై వేడ్కసేయుదుఁ బళువుగా నీను నావుడు మునిపత్ని నా పిన్న కొడుకు - పై వేడ్కసేయుచుఁ బపపుగా నీను.” అని యిరువురు పూని యాడువాక్యములు విని శునశ్శేఫుఁ డుర్వీపాలు(జూచి తన పెద్దకొడుకు మాతండ్రిపాటించుఁ ; - దనపిన్నకొడుకు మాతల్లిపాటించు వారలు నీకేల వచ్చెద నేను . కోరి వీరలకిమ్లు గోసహస్రముల" ననిన నట్ల యొనర్చి యమ్లనిపుత్రు-గొని రథం బెక్కించుకొని శీఘవృత్తి జననాథుఁ డెంతయు సంతోష మొప్పఁ - జనిచని పుష్క-రాత్రమభూమిఁ 33. 1740 నచట శునశ్శేపుఁ డతితపోనిష్ట - నచలుఁ డైయున్న విశ్వామిత్రుఁగాంచి తన మేనమామ యాతఁడుగానఁ బ్రేమ - ననరొత్తనుచిత ప్రణాముఁడై పలికె, “ననుఁదలిదండు లీనర వరా గణికి . ననపూ త ! పశువుగా నమి పౌ మునిరి ; ידי-- 5~ 3- بسته المسسح\ చెలువొప్ప నీరాజు సేయుజన్నంబు - ఫలియింపఁ జేసి నా ప్రాణముల్గాపు ; దల్లి యుఁ దండియు దె వంబు గురుపు - నెల చుటములు నా కీచేళ సీవ ;" لينا وميم مسلسلام امساب (مما యనిదైన్య మొంద విశ్వామిత్ర మౌని - దన తనూభవుల నందఱఁ జూచి పలికె(. బ్రాకటంబుగఁ దమ పరలోకమునకు . నై కదా సుతులఁబుణ్యాత్తులు గనుట పరలోకమిదియ నా పొలికి నన్ను - శరణంబుఁ జొచ్చె నీ సంయమీపుత్రుఁ; డితఁడు నా మేనల్లుఁ డిత నిరక్షింపుఁ ;-డితనికై ప్రాణంబు లిడుఁడు మీరొకరు అడిగెద" మిమ్లన్న నటుసేయఁ గొడుకు - లౌడబడమన్న నత్యగుఁడై మండి 1750 1ళునకమాంసము దించు సౌరిది వేయేడు . లనుభవింపుఁడు దుఃఖ' మని శాపమిచ్చి. 下。 مساسطة 下。 కావ్యము තං ෆ ඡ” ට ඨි කා 59: కౌశికుఁ డత్యంతకారుణ్యబుద్ధి to- నాపన శ్ళేపు నొయ్యనఁజేరఁబిలిచి యేను మంత ములు రెం డిచ్చెద నీకు . వాని ననుష్టింపు వదలక నీవు అవి నిన్ను రక్షించు నంబరీషునకు - సవనతంత్ర ంబును సఫలంబు సేయు' నని చెప్పి మంత్రంబులవి రెండు నిచ్చె - ననుపమభక్తితో నతఁడు గైకొనియె. మఱునాఁడు వచ్చి యప్తునుజవల్లభుఁడు - వe లేడు యజ్ఞవాటంబుఁ జొచ్చి విశసింపఁబూని యావిమలాతు దెచ్చి - పశుపూజ చేసి యూపమున బంధించె . నంత శునశ్శేపు డమ్లంత్రపము - శాంతుఁడై చేయుచుఁ జలియింపకున్న. నచటి కింద్రోపేందు లతో వచ్చి . సుచరిత్రు నంబరీషునిఁ జేరఁబిలిచి نیا المسجلا سمحلا 4. أسـلا క్రతుపూర్ణఫల మిచ్చి కడనున్నరుచికు - సుతుఁ జిరాయుపుచేసి సురలతోఁ జనియె. అరుదె న తపమున నంత వెయ్యేండ్ల . జరిపిన బ హ విభౌమితుఁ గదిసి أسدا لا نام سسه امبا רי) じ ඍ اسلحه 16 నీకు ఋషిత్వంబు నీ తపశ్చ 8 c. జేకూ దే’ నని యొు ...)" జెప్పి విచ్చే సె. నంతటఁ దనియక యత్యుగతపము - సంతత నియతితో సలుపుచు నుండఁ أسسا గాముదీమములీలఁ గైకొన నేర్చు - కాముని బాణంబు కమనీయకం టు Y " 3لمبس سے r" ప -: విశ్వామిత్రుడు మేనకను గూడుట سیاست చెలువొందనప్సర స్త్ర్సీమూ_ర్తిదాల్చి - మెలఁగెడు గతితోడ మేనక యపుడు లలితయా"వనకళా లావణ్యగణ్య - జలకేళిఁదేల నాసతిజారుకొప్ప చికిలిచూపులనునుడెక్కులమద్ధ - మొకము కెంపుల మోవి మొలకనవ్వులును బొంగారుకుచకుంభములు పదార్వన్నె - బంగారుపొడిరాలు బాహుమూలములు. చిన్నారినూ(గారు సింగంపుఁ గౌను - పొన్నపూపొక్కిలి బొదలెడుపిఱుఁదు లూరులతీరు నోరూరఁగాఁ జూచి - పేరు వాడిమరుండు పెళపెళనార్వ. 1770. ధ్యానంబుమా"నంబు దపముఁబోకార్చి - మేన గళ మ్లు మేనక(జూచి, “నన్నుఁ గాయజు కేళి నలినాక్షిపొందు" మున్న నామాటను నంగీకరించి, పదియేండ్లుమదిసోలి భావజుకేళి - సదమదంబుగ సౌఖ్యసరసిని దేలి, మఱి వివేకము పూని మౌని యెం తేని - దఱుగనిత సతపోధనము పోవుటకుఁ బరితపించుచు మది పదిలంబుచేసి - సురలోకమునకు నాసుచతివీడ్కొలిపి, యింద్రు నియత్నంబులివి యంచుఁ దెలిసి - యింద్రియజయసద్ధి యేఁ గాంతుననుచు, శీతాద్రి కరిగి కౌశికి చెంతఁ జేరి - యాతపంబునను మహాతపం బపుడు వర్షముల్ పెక్కైన వచ్చి విరించి - హర్షించి “నీవుమహర్షి వై" తనిన నీరజాసన నన్ను నీవు నీచిత్త . మూరంగ బ్రహర్షి' యన్నంతదాఁకఁ జరియింతుఁదప' మున్నఁ జరియింపు'మనుచు. నరవిందభవుఁ డేగె నంత గౌశికుఁడు. బ్రహ్లాదేవుఁడు పోవఁ బరమపావనత . బ్రహ్లార్షితనము నుబిడ సెద ననుచు 80 శ్రీ రం గ నా థ రా మా య ణ ము ద్విపద నూరుపు పుచ్చక యూర్ధ్వబాహుండు - పూరుతాహరుండు ము" ని యు నగుచు బనివడి వేసవి బంచాగ్ని మిధ్య - మన వాన కాల మిమ్లులబటబయిట మంచు కాలంబున మడుఁగులయం మి - నుచితంబుగఁజేసె నత్యు గతి పము. నీ భంగి వెయ్యేడి లేగిన పిచ ఏ - సౌభాగ్యవతి రం భ జల ధారి చూచి 4 యొలమిమై దేవతాహితి క్యా మొు టి చెు "ు నే నీకుఁ జె ్పద విఘము. సురహితంబుగ గా ధియాను 3 వింబు - సురుచిరంబుగ బూన్పు సుందరి" యనుడు 46 గూరత పంబు గై . యున్నయ 3 ని జేునాత రమె . చీనాథ ! నీ "ు ! నిమ్లహి మూర్తునిదిక్కు- సిక్కి చూడఁగనోప నీపా మూ న شبية يع నాకేశ : కోపించునన్నుశ పింు - నాకౌశికు సైపనని జాలిఁ బడు:ు 790 నెఱిఁగియెఱింగి తారెవెగ లు - కొఱవిచేఁ ల(గోకు కొను వారు గల రె ?" యన విని యింతభయం బేని నీకు - మనసిజమా ధవు ల్మణి సహాయముగ వత్తురు చను "మన్న వనిత యు నతి ని చిత్తి మెఱింగి చెచ్చెఱ భూు కరిగి గాధిసూనుల డున్న ఘనత పో వనము - మాధవ మన్మథు ల రిసూ యముగఁ గీరకోకిలసమాకీర్ణ మయూ: . శారికానిజసఫీసహితమై చొచ్చి యారంభియు ను మునో బార లాస్యగరిమ - నారంభ మొనరి పి నలిగి కౌశికుఁడు - "పదివేలవర్షము ్పూషాణ భావ - మొచ వింగఁ గైకొని యుండి యాపేుఁద నురుత పోనిధియైన యొు • వి పుషి లన - సరసిజానన ! పొందు శాప మోక్షంబు" ననిపల్క-c బాషామ య్యె నారంభ - మనసిజుండును నే గె మతిభీతుఁడగుచుఁ. దనత పం బొక్కింత దఱిగిన నంత - దనలోన నగ్గాధితనయుఁ డూహించి 1800 యపుడు కామంబున నిడ గె నాతిపము - నిపుడు క్రోధంబున కిచ్చితి ననుచు. మదిలోన వగచి కొ ము0బు క్రోధంబు - వదలి నిరాహా వంతుఁడై నియతి విజితేంద్రియుండునై వేయువత్సరము - లజుఁడు మెచ్చఁగఁ దపం బతినిష్ట జేసి యనయంబు బ పర్షి నని పిలచుకొందు . నని యు త్తరము ವ್ರಸಿ యటదూర్పు దెసకు నెనసి వెండి యును దేవేందుండు సేయు - ఘనవిఘ్నకోట్లకుఁ గదలక నిలిచి - యరుదెంచి యంత సిద్ధాశ్రమభూమి - నురు ఘోర తపము సేయుచునుండఁగలిగె, వరతపోనియతిమై వర్ష సహ స్ర - మరుగఁబారణ సేతు ననియున్నచోట నివ్వరిబియ్యంబు నెరినెరిఁ దెచ్చి - యవ్వియన్నియుఁ బాకి యత్నంబుచేసి యూరయ దేవతార్పణముగా జేసి - వా రవి భుజియింప వడిఁ దలంచుటయు బలభేది యొకముదిబాపఁడై వచ్చి - నిలిచి గ్రాసము వేడ నెమ్లితో నిచ్చె. 1810 నాయమరాధీకుఁ డడరి భోజనము - చేయుచో నన్నంబు శేషింపకున్న మఱియును వెయ్యేండ్లు మౌనియై నిలిచి - తఱుగని నిష్టతోఁ దపమాచరింప. నప్పడు మునినాథు నౌవలఁ బుట్టి - కప్పె లోకి ముల నుత్క-టమైన పొగయుఁ, కావ్యము బా ల కా ం డ మ 61. గలఁగెఁ బయోధులు కంపించె ధరణి - కులగిరు లదరె దిక్కులు చిక్కువడియె. నమరులు గంధర్వు లఖిల సంయములు - కమలగర్భుని బీ తిఁ గని ప్రెక్కి- యనిర్కి యాయతచిత్తుడై యత్యుగ్రతపము - చేయుచు నున్నాఁడు చెలగికౌశికుఁడు . అతనిమనోరిథం టర్థి సిద్ధింప - మతిమెచ్చి తి ప మి- • మిన్పకి యున్న యనఘు విశ్వామిత్సునత్యు గమైన - ఘనతిరవహి చేఁ గాలులోకములు." అన విని వారితో నప్పడు కదిలి - వనజాసనుఁడు వచ్చి వరదుఁడై నిలిచి 4విను మి కౌశిక 1 యింక విపరీత తపము - పనిలేదు చాలింపు బ్రహ్లార్డివై తి." 1820) వనినఁ గౌశి3 (డు బహ్లాదిదేవతిలఁ - గనుగొని పల్కె నక్క-జమైనభ_క్తి 44.బహ్రరి పచ మేను పడసితినేని - బహపుత్తుఁడు లోకి పావనమూ_ర్తి (یا - نمب- میv - با ۱ مساح سیاست ه చిరపుణ్యశాలి వసిష్ణుఁడి వచ్చి - యరసిన కా బ్రహర్షి వనకున్న నమ్ల" నని , వసిష్ఠుని నద్దిసంభిపి ఁడు - ననిమిషులను బిల్వ నర్ధితో వచ్చి "బలిత ( పుఁ దపము. న బ్రిప్తర్షి_తి - తెలిసితి మింక సందేహంబులేదు ముది మొ-్పఁ జను" మన్న ముని వసిష్టునకుఁ-బదిలుఁడై ప్రెక్కి- సద్భ_క్తిఁ బూజించె నంత విశ్వామితు నఖిల దేవతలు - నెంతయు దీవించి యేగిరి దివికి. నారూఢపటు (డు విశ్వామిత్రుమహిమ . లారయ నిట్టి మహాద్భుత క్రియలు." అనిపల్కరాముఁడు నాలక్ష్మణుండు - జనకాదులును సభాసదులు మోదిలిరి. యిల్లడజనకునియింట నుగ్రాముఁ డెల్లరెఱుంగ ము న్నిడినచాపంబు 1830; కడ 3 మై విఱిచి రాఘవుఁ డేపు మెఱసి - కడు మోదమున సీతఁ గైకొను నెల్లి నని రసాతలమున కంతయుఁజెప్పఁ - జనినచందమున భాస్కరుఁ డి_స్తమించె. జనకు వీడ్కొని గాధి సంభవుఁ డొక్క- - యునికి పట్టున రామయు క్తుఁడై యుండె. ననుపమ ప్రీతితో నారా తి గడపి - యినుపొడుపున నిత్యకృత్యము లీర్చి జనకు చెంతికు రామసహితుడై పోయి - యనియె విశ్వామిత్రుఁ డందఱవినఁగ. “నినకోటిసమతేజ లీవిశ్వమూర్తు - లనఘకీర్తులు వీ రనన్యగోచరులు, ఈ పుణ్యధనులు నీయింటిలోనున్న - చాపంబుచూడఁగఁ జనుదెంచినారు. —: జనకుండు శివునిచాప మెఱింగించుట : ಆವಿಲ್ಲು దెప్పింపు' మనవుడు జనక - భూవరుండప్ప డద్బుతమందిపలికె ? 46భవcడంధ కాసుర భస్తాసురాది . దివిజారివరుల సాధించె నావింట. నుల్లోకుఁడై శివుఁ డు గ్రదానవులఁ - దొల్లి యనేకులఁ ద్రుంచె నావింట 1840. విపులకోపాటోపవిభపుఁడై హరుఁడు - తి పురదుర్గములు సాధించె నావింట ! హెవింటమఱి దక్షయాగంబుఁజెఱిచె : - దేవేంద్రముఖ్యులఁ ద్రిదశలఁదోలి, నియతాత్త ! మాతాత నిమిచక్రవర్తి - నయనయాన్వితునకు నా అవతరము $62 శ్రీ రం గ నా థ రా మా య ణ ము ద్విపద నగు దేవరాతుచే హరుఁ డిచ్చె దొల్లి : . యగణితబలమైన యావిల్ల పిదప నదియూదిగానుండు ననఘు మూయింట - విదితమై యావిల్లు వినుతుల నొప్పి జన్నంబు గావింప సమకట్టి యేను . సన్నుత నియతభూస్థలి పద్ధికొఱకుఁ గతుశాల దున్న నాఁగటిచాలులోన . నతులితంబుగఁ జాలునందొప్ప మిగిలి మందసంబను రాఁగ మది నుబ్చి చూచి - మందసంబును నేను మమత దీయంగ నతివైభవంబుగా నందులో నపుడు - నతివయొక్క తె పుట్టె నాశ్చర్యలీలఁ. బ్రీతితో సీతయకా- పేరొప్పఁబెట్టి - యాతన్వి నాకూ ఁతు రని పెంచుచుండ, 1850 నిలవసంతంబుల నెలతీఁగెఁ బోలి . నళినారికళఁ బోలి నానాఁటఁ బబలి యింతయైయంతయై యెలజవ్వనమున - వింతయై యాయింతివెలయుట జూచి, తలకొని తరుణికై ధరణివల్లభులు - బలియులై యేతెంచి పడుచును దమకు నడిగినవారలకంటి నేనప్ప డుడురాజబించాస్య కుంకువ గలదు హరునివి లిది దీని నతిస్పత్త్వయు_క్తి - బెరిగి యేతెంచి మోపెట్టినఁజాలు నతనికి సూకూ (తు నబ్జాక్షి నిత్త ! - నతి మోదమున" నన్న నన్నరేశ్వరులు నెత్తినకడకతో నేతెంచి చాప - మెత్తఁజాలక పోదు రెందరేనియును : ధనువెత్తఁజాలనిధరణీకు లెల్లఁ - దనరారు సిగ్గునఁ దల లెత్తలేక 44కూఁతు నిచ్చెద నని కోదండ మొకటి.వ్రాఁతిగా నెపమిడి భ్రమియించె చు నల. జనకుఁ డాతని నింక సకలయత్నపుల - నని సేసి సాధింత ' ముని విచారించి 1860 చను దెంచి కోటపై సంవత్సరంబు - ఘససైన్యములతోడఁ గడిమి మై విడియు c దగమున్ను గూర్చునాధాన్యాదులెల్ల . నొగిఁ దీర మదిలోన నొకటి చింతించి వడిదేవతలఁ గొల్చి చారిచే నపుడు - వడసినచతురంగబలము గైకొనుచు విడిసినబలముపై వీఁకతో నడువఁ - దొడర (జాలక భీతితో కొంద అరుగఁ, గొందఱు మాతోడ ఘోరాజిచేసి - చిందరవందరై చెడి వారలోడి ; రక్కజమగుశక్తి నావి రాముఁ - డెక్కువెట్టినఁ గూఁతు నెలమి నిచ్చెదను : నిల్లన్నమందస వేగ తెవ్లు"నుచు - బల్లిదులగువారిఁ బదివేలఁబనిచె ; నదిలోహమయమును నత్యాయతంబు - విదితాష్టచక్రంబు విపులంబునగుచు నమరెడుమందస మావింటితోడ - తమతమ స్పత్త్వము ల్డగఁగొని వారు కనకాద్రితో గూడఁ గమలజాండంబు . గొనివచ్చుగతి నీడ్చుకొనివచ్చుదాని 1870 జనకునంతఃపురచారులౌ వారు - పనివడి దాదులు పర తెంచి వేగ జానకి నూర్తిళ జనకునిదేవి - కానంగఁ జనుదెంచి కని చెప్పి రెలమి : 4వినరమ్ల 1 చెలులార ! విన్నపం బొకటి - మన రాజసభలోన మఱిమునులుండ గాధినందనుఁడైన కౌశికువెనుక - నరవరోత్తముల నాజానుబాహువుల నమరంగ దేవగంధర్వులకన్న o: కొమరైనతేజంబు కొమరొప్పవారి, కావ్యము ూ ల కా O డ ము 63 చెలువై న తేజంబు చెల(గివీక్షించి - యలవీరులెవ్వార లని జనకుండు అడిగినఁ గౌశికుఁ డతిహర్ష మాత్త - నడరంగ దశరథునాత్తజు ల్వీరు హరచాప మెక్కిడ హర్షించి రిటకు . ధరణీశ ! తెప్పింప తగువారి బనిచి : యననిట్లు కౌశికుననుమతిమీఱఁ - దనమంత్రులనుబిల్చి ధనువుదేఁబ నిచె సోరణ గండ్లలోఁ జూడఁగవచ్చు . నారయ వేగ రం" డనినాఁతి పిలువ 1880 కులము శౌర్యము రూపు గుణమును బొగడ - చెలఁగి చెవులసుధ చిలికినట్లుండ ప్రేమ చెగ్గలమైన పృథివీజ కపుడు - రోమాంచ మయ్యెనారూఢమై మేన است. ప్రియమును భయమును బిరిగొని పొదల . నయమెంచి తలవాంచి ననఁబోణియుండె, అలివేణి సిగ్గున నటఁబల్కకున్న - చెలువకుఁ బరిచర్య చేసిరి సఖులు ; పన్నీటకుంకుమ పద నిచ్చి యొకతె . చెన్నార మకరిక ల్చెక్కి-ళృవ్రాసె ! తట్టుపునుంగును దగుచందనంబు ( - దట్టంబుగా బూ సెఁ దరళా క్షి కొకతె ; నుదుటఁ గస్తురిలేఖ నుతముగా (దీర్చె - నెదుట నద్దము (బెట్టె నెలనాఁ గయోుకతె ; కురులునున్నగఁదువ్వి కొప్పమర్చుచును - విరులందు నొకతన్వి వింతగాఁదురిమె ; వాసించుదాగాలు వడి నాకుమడుపు . లాసతీజనమణి కందిచ్చె నొకతె ; అలినీలవేణికి నంచంబుగాను - మొలనూలిఘంట లిమ్లల హైయ నిడియె ; 1890 కులుకు(బాలిండ్లపై గొప్పముత్యముల - విలసిల్లహారముల్ వేసె నొక్క_రితె ; కాంతగట్టినచంద్ర కావివల్వలను - వింతగా నెరినొప్ప వెసఁ దీర్చె నొగ్రతె ; యీమాడ్కి చెలికత్తె లెలమిఁ గై సేయ . "హేమపీఠంబున నెలమితో నుండ నప్పడు కల్యాణి నపనినందనను - తప్పకవీకీంచి తల్లిదానపుడు 4కనక సౌధగవాక్షకలితగా నపుడు - వనజాక్షిఁ దోడ్కొనివచ్చె నాయెడకు నెప్పడు వీక్షింతు మిసవంశ జాతు ? - నెప్పడు గనుఁగొందు మేము రాఘవుని ?" అనివార లందఱు హర్షంబుతోడ . ఘనగవాక్షములందు గనుఁ గొనిరంత : రాముని లోకాభిరాముని దివ్య . ధామునిఁ గన్లోని తరలాడ్లలపుడు ఘనశౌర్యరూపముల్ గలిగినవానిఁ - గనకచేలునిమాడ్కి ఁ గశలోప్ప వాని, జోకపువ్వులబిల్లఁ జొనిపినవాని - జ్యాకిణాంకిత హ_స్తజలజుఁడౌవాని 1900: రూపంబులొక్కట రుచిరవర్ణముల - నేపారవేఱుగా నెన్నఁగవచ్చు శ్రీపతియంశజుల్ క్షితిపాలసుతులు . భూపాలరత్నము ల్పొలు పారు టౌర ; జనకజ దగు రామచంద్రున కిరవు - ఒనరు సౌమిత్రికి నూర్తిళ యనుచుఁ, దనరుఁగా కని వారు దగనెన్ని కొనుచు - ననుపమ ప్రేమతో నట(జూచుచుండ ; నమరేంద్రసభఁబోలు నాసభనడుమ - నమరంగ మందస మటఁ జేర్చి రపుడు : సభలోన నునుపంగ జనక భూవిభుఁడు - శుభమూ_ర్తి నగ్గాధిసుతుని వీక్షించి కిన్నరగంధర్వగీర్వాణయక్ష పన్నగరాక్షసప్రభృతు లెప్వరును 64 శ్రీ ర ం గ నా థ రా మా య ణ ము ద్విపద, నెక్కుపెట్టఁగజాల రీచాపమనినఁ - దక్కిననరులకుఁ దలఁపంగఁదఱమె 三"35 రామలక్షణులకు జూపు - మీశ రాసన ' మన్న నెలమి నమ్లనియు రామచంద్రుని జూచి (రఘువంశవర్య -యీమహాధను వెత్తి యొక్కిడి తివియు 1910 మాది వరాహమై యవలీలగోట - మేదినీతల మెత్తి మెఱసిన నీకుఁ దనర నీవిల్లెంత ? తలపోయ ననఘ” - యని యిట్లు మునివరుఁ డానతిచ్చినను, మనువంశతిలకుఁడు మఱి వేగఁబుత్తు - నని ముని సభలోన నారాజు కియను సౌమిత్రియును దాను జయ్యనలేచి ప్రేమయుఁ దమ కంబు పెనగొనుచుండ జెలఁగుచుఁ దనమీ (ది చెఱఁగురా(దిగిచి - మొలసూలు బిగఁజుట్టి మోహనాకృతులఁ దిరముగా నిగ్గుని దిశలలోభిల్ల . నరవిందలోచనుం డసమసాహిసుఁడు మొలనూలిఘంటలు మరువు మించగను - మలఁగుచు నవరత్నమాలిక ల్పొరల బాహుపు ర్లంగరా ల్పటుకంకణములు - బాహువు లుగుళాపిళికాంతు లీన నమరంగఁ గర్ణభూషాదులకాంతి - కొమరారు చెక్కిళ్లు గుది ని మెఱయ అలకలు పెడత నట సెృత్యమూడి - తిళుకొuచు బంగారుతి ను కాంతు లీన 1920, కోటిమన్హథలీలఁ గొమరుదీపింప - నీటుగానటువచ్చి నెఱి యెల్ల రెఱుఁగ జనకుని సభలోన జననుతంబై న - మనువంశ తిలకుండు మందస దెఱిచి ధరణీతలంబెల్ల దనమీద నునిచి - చిర నిద్ర సుఖియించు శేషాహి యనిఁగఁ గాల మేఘములోనఁ గదలనిరుచులఁ - దూలక పొలుచు విమ్యద్దండ మనఁగ విరుఎమూ కొరత నిండారియందుఁ - గర మొప్పవిల్లెత్తి గవిసెన వుచ్చి – : శ్రీరాములు శివునివిల్లును విఱుచుట : గర్వించి తను నెత్తఁ గడఁగి యేతెంచు . నుర్వీశబలము లాహుతులుగ మ్రింగ నరుణరత్న ప్రభ యనుమంటలొలుక - బెరుఁగు చు నిలుచున్న పెనుచిచ్చువోలె నక్కజమగు శ_క్తినావిల్లు రాము ( - డెక్కుపెట్టుచు నుంట నెఱిఁగికౌశికుఁడు 46హరుని చాపము రాముఁ డతిసత్త్వయుక్తి - బెరిగి నేఁడి దె యెక్కుపెట్టుచున్నాఁడు: అదరకు భూదేవి ! యాత్త్మలో నీవు - చెదరి చలింపకు శేషాహి ! నీవు 1930. కడక ధరింపుము కమలేంద్ర! నీవు - కడునేమరకుఁడు దిక్కరులార ! మీర" లని ముని పల్కఁగ నా మేటివిల్లు - గొనయ మెక్కించి కైకొనక రాఘవుఁడు తనబాహుసత్త్వంబు దర్పంబు మెఱసి . జనకుని కనియె నాచాపంబు చూచి 4ళయిది చాలఁ జులకన యిదిచాలఁ బ్రాఁత - యిదిచాల నిస్సార మిది చాలనలఁతి తెగఁగొన నిలువదు దీని నాయెదుటఁ - బొగడితి పలుమాఱు భూపాల" యనుచు. సురలు ఖేచరుల భూసురులు కిన్నరులు - నరులును నృపతులు నలిఁదిర్విచూడ. నెడపక త న జయం బెల్లెడఁజాటు - వడువున విలుగుణధ్వని చెలంగించి కావ్యము బా ల కా 6 డ ము 65 సీతగుణంబులు చెవిసో కె ననఁగ - చేతివింటిగుణంబు చెవిసోఁక దిగువ వడిరక్క-సులపట్టు వదలె నన్నట్లు - పిడిపట్టువదలినఁ బెకలి పేటెత్తి పెళపెళధ్వనులును బెట పెటధ్వనులు - కలయ దిక్కు-లద్రు লে ে బెల్లవిఱిగె ; 1940 విఱుగ రాజన్యుల విపులమానములు - పటియలువాజె భూభాగమంతయును జిది సె దిగ్గజములు శేషాహి ప్రైగ్లి - బెదరె భూతములు గంపించె లోకములు ; జనకుఁడు రామలక్షణులును గాధి - తనయుండునొగిఁ దక్క-ఁ దక్కినవారు, బిట్టులి- మూర్ఛిల్లి పృథివిపై (బడిరి I నెట్టనఁ బొడము నానిష్టురధ్వనికి, జనక భూవిభుఁ డంత సంతోషమంది - ఘనవి స్త్రయము నొంది కౌశికుఁజూచి నామాటదప్పక నాముద్దుకూ (తు - నీమహి తాత్తున కిచ్చేద నింకఁ దడయక పెండ్లికి దశరథాధీశుఁ - గడుసంభ్రమమున నిక్కడికి రప్పింతు" ననిదశరథునకు నత్తేఱంగెల్ల - వినుతించి తోడ్డెర వేడ్కతోనపుడు తనయా ప్తమంత్రులఁ దడయక పిల్చి - పనిచిన పనిపూని పరువడి నేగి జవనాశ్వములమీఁద సాకేత పురికి - దివసత్రయమున నెం తే వేగవచ్చి 1950 తనయుల సేమంబు దలపోసి పోసి - వనరుచునున్న యవ్వసు ధేశు గాంచి వినతులై జనక భూవిభుఁ డంపినట్టి - జననుతవస్తువుల్ సన్నిధి నునిచి నీకుమారుడు శౌర్యనిధి రామచంద్రుఁ - డాకౌశికుని యాగ మర్ధితో గాచి జనకు జన్నముఁ జూడఁ జనుదెంచి యందు - మునులు రాజన్యులు ముదమంది చూడ ధర సురాసుర లకు ధరియింపగాని - హరువిల్లు మో పెట్టి యవలీలవిఱిచె ; విఱిచిన జనక భూవిభుఁ డిచ్చెసీత - నఱలేకతనకూ ఁతు నారాఘవునకుఁ బ్రియమునఁబెండ్లికి బిలువఁబుతైంచె - రయమున విచ్చేయు రాజన్యచంద్ర 1” యనవుడుఁ దనమది నానందమంది - జనపతి పెండ్లికిఁ జాటింపఁ బనిచి జనకుమంత్రులకు నుత్సవ మొప్పనిచ్చే - ఘనరత్నభూషణకనకాంబరములు ఆఱలేనికులగురుఁ డైనవసిస్టుఁ - దెఱఁగొప్పఁ దావామదేవు జాబాలి 1960 ఘనునిఁ గశ్యపునిమార్కండేయు నత్రి - దనరుబాంధవులను దనయమాత్యులను నిమ్లులఁ బిలిపించి యిట్లనిపలికె ; U. సమ్లదంబడర విశ్వామిత్రునొద్దఁ దేజంబు తోడ విదేహ దేశ హమున . రాజిలుచున్నారు రామలక్ష్మణులు s అందు రాముఁడు రాజు లందఱు చూడ - నెందు నసాధ్యమౌ నిందు శేఖరుని చాపంబు విఱిచిన జనకుండు సీత - నేపార రామున కీనిశ్చయించి యెలమిఁ జెండ్లికిని మ ప్లేగుదెమ్మనుచుఁ - బొలుపార నిట వీరిఁ బుత్తేంచినాఁడు. జననుతం బగుఁగదా జనకుసంబంధ' - మనిన నందఱు మెచ్చి యమ్లలునాఁడు, -; దళరభుఁడు మిథిలకుఁ బోవుట : మొగి వసిష్టాదిసన్లులతో గూడఁ - దగు బంధురాజన్యతతులతోఁ గూడ 5 66 శ్రీ రం గ నా థ రా మా య ణము ద్విపద రమణీయదివ్యాంబరములతో గూడ - విమలమౌక్తి కవజ్రవితతితో(గూడ గరిరథభటతురంగములతోఁగూడ - బరమాప్తవరమంత్రిపతులతోఁగూడ 1970 వినుతపుణ్యాంగనావితతితో(గూడ ( . ననుపమ వైభవం బలరఁగై సేసి, కరమొప్పరథమెక్కి కల్యాణమునకు - నరనాథతిలకుఁ డానందముప్పొంగఁ గడుఁగెలంకుల గజస్కంధంబులందుఁ - గొడుకులుముత్యాలగొడుగుల నీడఁ బరమస వ్రుదమున భరతశత్రుఘ్ను - లిరువురు గొల్చిరా నేపుదీపింపఁ గ్రందుగా నిండి మంగళతూర్యకోటు - లందంద మొఱయ మహాభూతి మెఱయ నెడనెడ విడుదు లనేక వస్తువులు - నడపింప మంత్రులు నాల్గుదినములఁ జనియెను మిథిలకు ; జనకుండునంత - నినకులాధిపునకు నెదురుగా వచ్చి. కొనిపోయి వేడ్కలు కొమరొత్త నపుడు - జనపతి కుచితోపచారముల్ సేసి మునివరనివహంబు ముదమంద జనకుఁ - డనియొ మహానంద మలర నాతనికి నాకూఁతు దశరథనరనాథ యేను . నీకుమారునికిచ్చి నెమ్రి బెండ్లికిని 1980 నటుపిల్వఁ బంచిన నీవు విచ్చేసి - తటుకాన నేనుకృతార్థండ నైతి నీవసిష్ట మహామునీంద్రుఁ డీవామ - దేవాదిమునులు నేతెంచుటఁజేసి నాకోర్కి సిద్ధించె నాజ స్త్రమల రె ; - నా కులం బతిపావనంబయ్యె నేఁడు ! రవికులోత్తములైన రాజులతోడి - యవిరళ సంబంధ మది నాకుఁ గలిగె ; నెల్లి పెండ్లికి లగ్న మిష్టులఁ ඕව්ඩ් - తెల్లంబుగా బ్రివర్తింపుఁడు ప్రీతి" ననవుడు దశరథుం డట్లగా కనుచు - ననురాగ మొుంది యత్యంతపుఁ బ్రీతి జనకుఁ డమర్చిన సదనరాజమున - ననుర క్తి వసి యించె నంత నచ్చటికిఁ గడుఁ బ్రీతి రామలక్షణులతో గూడ - నడరివిశ్వామిత్రుఁ డరుగుదెంచుటయు ననఘుండు దశరథుం డమ్లహామునికి - వినతుఁడై పూజించి వినయంబుతోడ దనరార నీదయ ధన్యుండనై తి - ననఘాత్త” యన విని యక్కౌశికండు 1990 అకలంకచరితండ వైన నీ వనఘ - సుకృతంబు గావించి శుద్దండ వైతి, రవికులోత్తముఁడైన రాముండు పు త్తుఁ - డవుట విశేషించి యధికపుణ్యుఁడవు క్రతురక్షణార్థమై కడఁగి రాఘవుల . హితబుద్ధి నీవె మాకిచ్చితి నాఁడు ; నెవ్రుదినున్నారు నీసుతు ల్వీరె - నెమిఁ గన్లోను' మన్న నృపతి కాసుతులు ত-5*3 ప్రెక్కిన నలర దీవించి - యాలింగనముచేసె ననురాగ మెసఁగ ; జనకుండు నాదివసంబున నంత - దన యాగకర్ణ మంతయు నెఱవేర్చి యలరువేడుక నినుఁ డస్తాద్రి కరుగఁ . బొలుపొంద నారాతి పోయిన పిదప لبا دگماتیسم మఱునా ఁడు కల్యాణమంటపవేది - నెఱయ మంత్రు లతోడ నిండుగొల్వుండి యిమ్లలఁ దనపురోహితు శతానందు . సమ్లు దంబునఁ జూచి జనకుండుపలికె. కావ్యము బా ల కా ం డ ము 67 - ఊర్తిళాదుల 3לטaסה בסיס యత్నము : ననఘాత్త 1 మాతమ్లుఁడగుకుశధ్వజుఁడు - కనుగొనవలయు నీకల్యాణ మతఁడు తిరముగా నిక్షుమతీతీరభూమి - బొరి నొప్పసాంకాశ్యపురి నున్నవాఁడు అతనిఁ దోడ్లేర నీవరుగు" మనంగ - నతిజవాశ్వములతో నమరు తేరెక్కి యతివేగముగ నేగి యాకుశధ్వజుని - నతులితంబుగఁ గని యర్ధిమైఁ జెప్పి జనకపుత్రికి నేఁడు జననాథవర్య : - మనువంశచంద్రుఁడౌ మనరామునకును ఘనముగఁ బెండ్లియా" గడువేడ్కతోడ - జనకుండు యత్నంబుజరుపంగఁగోరి పతినిన్నుఁదో డేరఁ బనిచె నన్నిపుడు - సతులతో హితులతో సకల సై న్యయుతిఁ గదలుద మిప్పడే ఘనత మిథిలకు - పద' మునిచెప్పినఁ బరఁగనందఱును దనరారు వేడుకఁ దగ రథంబెక్కి - తనయాద్వయముతోడఁ దానేగు చెంచి యనఘమానసుఁడు శతానందునకును - జనక భూవిభునకు సద్భక్తి ప్రెక్కియెలమి నమ్లానవాధీశుసప్తుతిని - నలువొప్ప సింహాసనమునఁ గూర్చుండె, 2010 నంత సుధామాఖ్యుఁ డనుమంత్రి జనకుఁ - డెంతయు ముదమున నీక్షించి “నీవు చని వసిష్ఠునితోడ సచివులతోడ - దనయులతోడ నాదశరథేశ్వరుని వెరవారఁ దోడ్కొని వేగ ర"మ్లనిన - నరిగి యాతఁడుఁ బ్రీతి నమ్లహీపతికి వినతుఁడై యిట్లను వేడ్కతోనున్న - జనకుఁడు పుత్తెంచె జనలోకనాథ ! నీయుపాధ్యాయులు నీతనూభవులు - సీయమాత్యులు నీవు నేతేరవలయు." ననిన నాదశరథుం డందఱితోడఁ - జని సుఖాసీనుఁడై జనకుతో ననియెఁ 4బరఁగ వసిష్ఠుండు పరమదేవతయు - గురువు నీయిజ్వెకుకులమున కెల్ల సర్వజ్ఞఁ డగుట నీసంయమీశ్వరుఁడు - సర్వకాలములకుఁ జాలు మాకనిన" నప్పడు దశరథునన్వయక్రమముఁ - జెప్ప భావించి వసిష్ఠుఁడిట్లనియె. -: దశరథుని వంశక్రమము : سمات 4నరనాథ 1 విను నిర్గుణ బ్రహ్రమైన - హరి సగుజై కలీలాకృతిఁ దాల్చి 2020 س-سه 3- لیسسته నిజలీలకై నాభినీరజంబందు . నజునిఁ గల్పింపంగ హరి కజుఁ డొదవె . భూమీశ బహకుఁ బుటై మరీచి - యామరీచికిఁ బుటై నవనిఁ గశ్యపుఁడు O& )8 ن-سسه السسيه నతని కర్కుడు సుతుఁ డాజగదా_ప్త - మతికి వైవస్వతమనువు నందనుఁడు నతనికి నిక్ష్వాకుఁ డనురాజరత్న - మతనికిఁ గు క్షి యూ" నాత్తసంభవుఁడు కుదీయకా-భూనాథుకొడుకు వికుడీ - యక్షరాత్తుఁడుబాణుఁ డతనినందనుఁడు నతనికి సనరణ్యుఁ డతనికిఁ బృథుఁడు - చతురమూససుఁడు ద్రిశంకు డా తనికి నతనికిఁ దనయుండు నా హరిశ్చంద్రుఁ - డతనికి లోహితాస్యాఖ్యపుత్రుండు అతనికి దుందుమారావనీనాథుఁ - డతనికి యువనాశ్వుఁ డను నరేశ్వరుఁడు 68 శ్రీ ర ం గ నా థ రా మా య ణ ము ద్విపద

  • 喀、

كسكسيد - : వసిష్టుఁడు యువనాశ్వునివృత్తాంతముఁ దేల్పుట آج سے నతనికిఁ బ్రియభార్య లతిరూపవతులు - సతులిద్దఱకుఁ బుత్రసంతతిలేమి నంతట నారాజు నఖిల సన్లునుల - సంతతికొఱకునై సరగ రప్పించి 2030 యామహాత్తులకును నర్థ్చ పాద్యములు - ప్రేమతో దగ నిచ్చి ప్రియ వాక్యములను 4ఘనులార ! నన్నును గరుణించి మీరు - దనయుల నాకును దయసేయవలయు." నని విన్నవించిన నారాజునకు ను . ననుచొంద నమ్లను లపు డిట్టులనిరి. 4ఐంద్రయాగము సేయు మవనీశ ! భ_క్తి மு సాంద్రంబుగా బుత్రసంతతి గలుగు ** నన జన్నమున కప్ప డభిలవస్తువుల - ననునొందఁ దెప్పించె నా క్షణంబునను న్చైంద్రయాగం బను నామఖం బపుడు - సాంద్రాను మోదులై సంయమీశ్వరులు పుత్రలాభంబుకై పౌలు హింద నంత . చిత్రయజ్ఞము దారు సేయఁగ నందు జలములు మంత్రించి జలకుంభములను - నలరార నియతిచే నటు దాచియుండ ధరణీకుఁ డారాత్రి దప్పితో నంత - మఱపొంది యాయజ్ఞమందిరమందు కలశంబులో నీళ్లు عکاسان مککن ద్రావ - జలహీన మగుకలశంబును జూచి 20 #0 శ4 యో వరు ద్రావిరి జలం ? బెటు పోయె ? " ననుచు - ప్రవిలాత్తులు వారు భావ నిరీక్ష నరసి యానృపతియే యానీయ ద్రావు - Τέδcβς ή చోద్యం బి0ది యిది దైవమాయ యని చూచుచుండఁగ నానృపాలకుఁడు - ఘనమగు గర్భంబు కడువే గఁదాల్చె గర్భమంతటఁబడి కడుచోద్యచులర - నర్భకుం డుదయించె నారాజు చచ్చెఁ గడఁగుచు ఋషులెల్లఁ గడుదుఃఖమంది - సడలనియమ్లం త్రసామర్ధ ములను బనివడి యవనాశ్వు బ్రతికించి రంత - ననుపమ శుభమూర్తియైయుండి యతఁడు వరుసతోడుతఁ జక్రవర్తిచిహ్నంబు - లరుదార నుండెడి యాపుత్రుఁజూచి యితఁ డేడుదీవులు నేలునటంచు - చతురత ఋషులెల్ల సంతోషపెడిరి, అలయువనాశ్వుండు నామా"నిజనుల - కెలమితో ధనూసు లిచ్చినఁ జనిరి తల్లియే లేనిక తంబున బాలు - డల్లన నాఁకొని యట నేడ్చుచుండ 2050. వరుస నా యింద్రుండు వచ్చి తానప్ప - డరయంగ నా శిశు వా(కలిదీర బెను పొందఁగా నోరఁ బెను ప్రేలు వేగ - ను నిచిన నమృతంబు నొయ్యనఁ దావc సుధ గ్రోలుటయుఁజేసి శుభయుత పేరు - బుమలతో మాంధాత భూమీప āనుచ. నతనికి నామధేయంబటుచేసి - యతి వేగమునఁ బోయె నా బిడౌ బ్రుండు అంత నామాంధాత యలపూర్ణచంద్రు 彎 నంతటి ప్రభతోడ నతిశయిల్లుచును రూఢిగా యావనారూఢుడై యంత . గాఢశౌర్యస్ఫూర్తిఁ గడుదేజరిల్లి రావణాదుల బహురణముల 7cmé)2)ー భూవలయంబెల్లఁ బొందుగా నేలి , విష్ణునిభక్తుఁడై వెలసి యాగములు - జిష్ణుబలంబునఁ జేయుచునుండె కావ్యము బా ల కా ం డ ము' = 69. నారాజు నకు విమలాంగియన్సతికి . భూరి తేజోయు తు ల్పు తరత్నములు నరయంగ ముచుకుందుఁ డాసుసంధియును - దరుణు లేండ్రున దగ జనియింప9060 సుదతుల ప్రా యంబు సౌరిది వచ్చినను . ముదమున సౌభరి మునిపతి కిచ్చె నతివల క గజుఁడగు ముచుకుందుఁ - డతివేడ్క హరిభక్తుఁడై యేగె దివికి. నాతని సోదరుం డాసు సంధియును . నాతతపుణ్యాత్తుఁ డై భువినేలె. నతనికి ధువ సంధి యనురాజుపల్లై - నతఁడు ప్రసేనజి త్తను రాజుఁ గనియె. దొరయ ప్రసేనజిత్తుకు భరతుండు - నరయ నాభరతున కసితుండు పుట్టె నతఁడు రాజ్యము సేయ నాతనిశతు - లతులపరాక ము లైన హైహయులు దారు డౌ కారులు తాళజంఘులును నారంగసేనబి దనువాడు గూ డి యతి ఘోరయుద్ధంబు నతులతఁజేసి - యతనినె యనిలోన హతుఁ జేసి చనిరి. అంత నాతనిసతు లతిదుఃఖమంది - మంత్రుల రాజ్యంబు మఱిఁదీర్పనునిచి మేలిమి నుండిరి మెలఁత లిద్దఱును - కాళింది యనుసతి గర్భమైయున్న 2070 మేలోర్వలేక యా మెలఁతలం దొక తె - చాలంగ సవతిమచ్చరమునఁజేసి గర్భిణియైయున్న కాళిందికపుడు - గర్భంబుఁజెఱుప నొక్కతె విచారించి యోర్వక విషము ప్రయోగించె నంత - నావిషమున గర్భ మట వీడిపడక తా వేగి వేదన తల్లడంబంది - యావనితయుఁ దుషారాద్రికిఁ జనుచుఁ చ్యవనుని గాంచి యాసంయమీంద్రునకు - నవిరళభక్తితో నల్లన మ్రొక్కి తనదు వృత్తాంతంబు తగవిన్నవింప - వినియు నా పత్రివి వెఱవకు మనుచుఁ బొందానఁ గరుణతో బూఁబోడినెత్తి - కందువదృష్టిని కడఁగి లోఁజూచి ప్రతిపక్షదమనుండు పరమధార్మికుఁడు - నతుల తేజండు మహాత్తుండు నగుచు వరకీర్తివంతుండు వంశపర్ధనుఁడు . పరమ రూపంబున భాసిల్లుజగతిఁ బొగడొందఁ గరముతోఁ బుత్రుండ నీకు . నగుఁగాక ( గాళింది' యనుచు దీవించె వలగొని యమ్లనీశ్వరునకు మ్రొక్కి - యెలమితో దనయింటి కేగి యాయువతి యతిముదంబుననున్న యా శుభాంగికిని - సుతుఁ డుదయించెను శుభముహూర్తమునఁ గర మొప్పఁ బుత్రునిఁ గాంచి కాళింది - గరముతో ముదమందెఁ గడుసంభ్రమమున. నాతండు శత్రుల నణఁచిరాజ్యంబు - చేతో ముదంబునఁ జేయుచునుండ సతతంబు విలసిల్లె సగరుఁడ ఇ-పేర - నతనికిఁ దనుజన్లు డసమంజసుండు అతనికి సుతుఁడయ్యె నంశుమబాఖ్యుఁ - డతనిపుత్రుడు దిలీపావనీనాధుఁ డతనికున్నతపుణ్యుడగు భగీరథుడు - సుతుఁడాతనికిఁ గకుత్స్టుండను రాజు నతని సూనుఁడు రఘు వనుమహీపాలుఁ - డతనిపు త్రుఁడు పురుషాదకుండగుచుఁ గమనీయసితకీ ర్తికల్లాషపాదుఁ - డమర శంఖణుఁడయ్యె నతని కాతనికి పుతుఁడు సుదర్శనక్షోణీతలేశుఁ . డతని తనూజన్లు డగ్నివర్ణండు . . 2090. 70 శ్రీ ర ం గ నా థ రా మా య ణ ము ద్విపద అతనికి ఋతుపర్ణుఁ డతనికి మరువు - అతనికి శీఘ్రగుం డతనికి మనువు సుతుఁ డయ్యె నంబరీషుం డనురాజు - సుతుఁడాతనికి జనస్తుత్యుండు నహుషుఁ డతనికి సుతుఁడు యయాతియకా-మేటి - యతనికి నాభాగుఁ డాతనికజుఁడు అతనికి దశరథుఁ డనఘ ! నీపుణ్య - సుతుఁడయ్యె సఫలనిస్తులమనోరథుఁడు రాముఁ డీదశరథరాజతనూజుఁ - డేమనివర్ణింతు ? నింక నేనధిప ! యితనికి నీకూఁతు నీఁగంటి వీవు - కృతకృత్యుఁడవు శుభాంకిత మయ్యెఁగులము" అని యిటు రఘువంశ మభినుతిసేయ - విని శతానందుండు విమల మానసుఁడు జనకానుమతి సభాసదు లెల్లవినఁగ too మునివసిష్ఠునిఁ జూచి ముద మొప్ప (బలి కె. “మునినాథ ! మీచేత ముదమార వింటి - ననఘాత్తు దశరథునన్వయక్రమము సన్నుతికెక్కు నే జనకునన్వయము - చెన్నగు మీ కేను జెప్పెద వినుఁడు. 2100 _: శతానందుఁడు జనకు వంశక్రమంబు దెల్పుట : مسمصه సద్విజపరమహంసప్రతిపాద్యుఁ α"η డద్వితీయబ్రహ్లా మైన యచ్యుతుని నాభిసరోజంబునను బ హపు టై - నాభూత ని రాత యగు ధాతవలనఁ يحصد ( ت - نيمسس ليبيا బుటె మరీచి యాపుణ్యవ రను ని . పటియె కశ్యపబహజనించె. & --نحس ليبيا مصابك لنا سلس నతనికి దిననాథుఁ డాత్మజుండయ్యె - మతిమంతుఁడతనికి మనువు జన్మి o#S, నమ్లను వచ్యుతధ్యానకాలమున - దువుఁగ వై వస్వతుఁడు తుమువలన 5(- سده ;t- نص నిర్ధలాచారుఁడు నీతికోవిదుఁడు . ధ_ శీలుఁడు జగద్భరితమానితుఁడు విమలమూర్తి త్రిలోక విశ్రుతకీర్తి - నిమి యను రాజు మానిత తేజఁ డొప్పె నతనిపుత్రుఁడు మిథి యతనికి జనకుఁ . డతనికుదావసుం డమ్లహీజాని తనయుండు నందివర్ధనుఁడు సుకేతుఁ . డను విభుఁ డతనికి నమ్లహాత్తునకు రాజర్షియగుదేవరాతుఁ డెల్లెడల - రాజిల్లె మటి బృహద్రథుడు దత్పుతుఁడు 2110 నతనినందనుఁడుమహావిభుఁ డతని - సుతుఁడయ్యెసుధృతి యాసుధృతికి ధృష్ట కేతుఁ డాత ని కురుకీర్తిహర్యశ్వుఁ - డాతనికిని మరుం డామరునకును సుతుఁడు ప్రతీంధక క్షోణీళుఁ డతని - సుతుఁడు కీ_రథుండు సుతుఁ డావిభునకు దేవమీఢుండు తదీయుఁ డౌ విబుధుఁ - డావిబుధునిపుత్రు డామహీధునకుఁ గీర్తిరాతుఁడు వానికిని మహారోముఁ . డా రీదూరుఁడు వాని కాస్వర్ల రోముఁ ES گسست డాస్వర్ణరోముండు ప్రస్వరోమాఖ్య - భాస్వర గుణశాలిఁ బడసె నాతనికి జనకభూపాలకుశధ్వజుల్వీరు - జనియించి రిరువురు సౌజన్యధనులు జనకుఁ డంతట మహీజనులఁ బాలింపఁ - గని యొక్కనాఁడు సాంకాశ్యభూవిభుఁడు. ధన్యవిక్రముఁడు సుధన్వుఁ డన్వాఁడు సైన్యసమేతుడై చనుదెంచి మిథిల సీతాసమేతంబు శివునివిల్లడుగ . దూతఁ బు తెంచినఁ దోపించె వెడల 2120. 專 البصح\ هـسه ל"י) కావ్యము బా ల కా ం డ ము 71 పై వచ్చి హరునిచాపంబు సీతయును . గావలె నని ఘోరకలహంబుఁ జేయ జనకుండు సంగరస్థలి వానిఁగూల్చి - తనతమ్లు బూన్చె నద్ధరణికి ననుచు, జనకు c డాదిగ వంశజాతు లందఱికి . జనక నామము ప్రశస్త్రము ధాత్రి లోన నిమివంశమునఁ బుట్టు నృపతు లందఱును - సమధిక యోగవిజ్ఞానసంపదల చిరజీవు లటుగానఁ జెచ్చెఱ వీరి .తరమును కొంచెమై తగును లెక్కకును జనకునివంశంబు సద్వర్తనంబు - గొనియాడి యాసీతగుణమును బొగడి విశద ప్రతాపుని విమల భాషణుని . దశరథుఁ గనుఁ గొని దశరధాధీశ ! నీతనూజుని రాము నిత్యాభిరాము - సీతతోడుతఁ బెండ్లి చెలు వొప్పఁజేసి యలఘుకీర్తులఁ బొందు' మనుశతానందు . పలుకుల దశరథపతి యుత్సహించి ఘనుఁ డావసిష్ఠుని గాధినందనునిఁ . గనుగొని వారితో గడువేడ్కఁబలికె. 2130 68చారువిచారుసీజనక భూవిభుని . మీరడుగుండు సౌమిత్రికూళను బ్రకటగుణోత్తరు ల్బరతశత్రుఘ్ను . లకుఁ గుశధ్వజనృపాలకుని కూఁతులను' అన్న వారు జనకున కత్తెఱం గెల్ల - వినిపించి యనుమతి వే వేగ పడసి జనకుని వాక్యము ల్సకలంబు ع سان كثة - దనరార ఁ జెప్పి రా దశరథుతో డ, ననురాగ ముప్పొంగ నా మఱునాఁడు - ఘనశుభగ్రహదృష్టి గలుగుట జేసి పనివడి యుత్తర ఫల్గునియందు - జనకుండు లగ్న నిశ్చయము సేయించి -: పురాలంకారము : పురమును దనయంతిపురముఁ గై సేయఁ - బరిచారకుల వేగ పంపిన వారు గంధకస్తూరికాకలితాంబుపూర [.. గంధిలసకలమార్గధరాంగణంబు చీని చీనాంబర శ్రేణీవితాన - నానామణీతో రణధ్వజాంచితము ఫలభారకపురంభా స్తంభపూగ to . కలితప్రతిద్వారకక్ష్యాంతరంబు 2140 సాంకవల్పిస్త్రవిస్తారవితర్జి Insi కాంకితరంగవల్ల్యాదిశోభితము 露 మణి శాతకుంభ కుంభవితర్కితార్క- - గణసౌర గోపురోత్కర శిరో గ్రంబు దీపితమాణిక్య దీపసాంద్రాణి - ధూపపుష్పకలాప ధూర్వహణంబు నై పుర మెల్లెడ నలరఁగైసేసి - నైపుణి మెఱసి యంతఃస్పరం బంత గర మొప్పఁగైసేసి కల్యాణ వేది - విరచింపు ("డన శిల్ప వేదు లంతయును బచ్చతాజగతిపై బసిడి కంబములు - మెచ్చుగా నిల్పి యామీఁద నీలంపు బోదెలు గురువిందముల దూలములును - పాదుగా నిడి తీరుపడఁ జెక్కడంపు గోమేధికంబుల కొణి గెలుబరివి - గా మల్చి పై వజ్రగార యొసంగి హాటకమణిమయాయత కవాటములు - వాటంబుగా నాల్గవాకి ళ్ళమర్చి అందుల బంగరుహరువు చిత్తరువు - లందంబుగా దీర్చి హరినీలగరుల 2150 72 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద గమి గమిచినపటికంప సింగముల - గమక చూ" సెూపానగతు లేర్పఱించి కలితలామజ్ఞకకాయమానములు - కలువడంబులు డంబుగా ఁ జుట్టికట్టి యాలోన నేకాండ మౌ బలుపచ్చ - మేలిపెండ్లియరుంగు మృగనాభి యలికి ముత్తెంపునిగ్గుల ముగ్గులేర్పటిచి " _ చిత్తజజనకలక్ష్మీవివాహంబు గుజరాతి కెంపులగోడ లిఖింపఁ - బ్రజలకుఁ గన్నులపండువై රත්‍ය ෆයි. అంత వసిష్ఠవిశ్వామిత్రమునుల - సంతతపుణ్యుల జనకుండు చూచి మీర లయోధ్యకు మిథిలకుఁ గర్త - లేరూప ముచిత మౌ నిటమీఁది పనులు –: దాశరథుల నలంకరించుట :_ అది సేయుదురుగాక" యనవుడు వారు . చదురొప్ప దశరథజనపాలచంద్రు కొడుకుల నల్వురఁ గొమరొప్ప నప్ప - డెడతెగనట్టి Cసూ యెల్లవాద్యములఁ బాటలు పాడుచుఁ బరఁగ నంగనలు - తేటగా నందఱు తెచ్చి పీఁటలను 2160 గూర్చుండఁ దలలంటి కుదురుగ వార . లేర్చి నల్వలు పెట్టి యెంతయుఁబ్రీతి స్నానముల్ సేయించి చక్కగా నుదుట - మానవతిలకంబు మఱిభూషణములు చీనాంబరంబులు చెలువొప్ప నిచ్చి - నానా విధంబుల నలువుగఁబొంగి దశరథుభార్యలు దశరథేశ్వరుఁడు - విశదప్రతాపండు వేడ్క నుప్పొంగి సకలభూషణములు సరసతఁ బెట్టి - యకలంకమతితోడ నంతటనుండి యాయతశుభమైన యభ్యుదయంబు - సేయింప నర్ధితో 否さ నవ్విభుఁడు ఎక్కుడుసంతోష మెసఁగఁ జిత్తమున - నొక్కొక్క సుతున కభ్యుదయంబుకొఱకు వెలయంగ నన్నియు వేదోక్తయుక్తి - గలయఁ బదాఱు లక్షల ధేనువులను గల ధౌతఖురములు కనకశృంగములు . తలకొని చెలువొందు తాస్త్రపుచ్చములు దొరయ మించినకాంస్యదోహళంబులును . వరుస వేష్టించినవరవ స్త్రములును 2170 గలిగి సవత్సలై కర మొప్ప వాని - లలి భూసురోత్తములకు భ_క్తి నిచ్చి మఱియు నసంఖ్యాతమహిత హేమములు - తఱుచుగా నంతట దక్షిణ లొసఁగి భూదానవసుదానములు మొదలైన - వేదోక్తదానము ల్వేర్వేఱ నొసగి తదవసరమున యుధాజిత్తు ప్రేమ - తుదమీఱఁగా భరతుని మేనమామ తనతండ్రి కేకయధరణీశ్వరుండు - మనుమనిభరతుని మైత్రిఁ దోడ్జేరఁ దనునంపఁగా నయోధ్యకు వచ్చి యచటఁ - దనయుల పెండ్లికి దశరథేశ్వరుఁడు జనకుని వీటికిఁ జనుట యెఱింగి - యనుర క్తి వేవేగ యచటి కేతేర దశరథుం డతని నాదరణఁ బూజించి - కుశలంబులెల్లఁ బేర్కొనుచుండె నంత. మఱునాఁడు స్నాతకమహితకృత్యములు - తఱి తోడఁ గావించి తమ్లులుఁ దాను డాముఁ డత్తటి దశరథునొద్ద నిబవ - శ్రీ మీఱ నతనిఁ గై సేయింప నృపుఁడు 2180 కావ్యము బా ల కా ం డ ము 73 నారాము నౌఁదల నమరె గిరీట . మా రోహణాద్రిశృంగాగ్రమో యనగ, బద్ధకంకణుఁ డయ్యె భక్తులఁద్రోవ - సిద్ధ మన్నట్లు దాల్చెను గంకణములు. ఎద మున్ను పుట్టినయించుదీధితులు - పౌ వలె నేఁడన హారములు చెన్నమీతెఁ దన కనకాంబరత్వము భూమిఁ దెల్పె - ననఁ గనకాంబరం బలరారెఁ గటిని. గష్టరావణునిచే గాసిల్లినట్టి యష్టదిక్పాలుర యశము లిర్వంక మౌ_క్తి:చ్చలమున మనవులు ದಿಲು - యుక్తిమైజౌకట్టులొప్పె వీనులను వదనశృంగార మీవైఖరినొప్ప - బొదలినఁ గస్తూరిబొట్టు చూపఁ. బదపడి లక్ష్మణ భరతశత్రుఘ్ను - లుదయార్క శేజు లొండొరులు వేర్వేఱఁ గుండల కేయూరకోటీరహార - మండనావళి సుకుమార దేహములు గై సేయ నందు దిక్పతులమధ్యమున - వాసవుం డన రామవల్లభుం డొప్పె. 2190: అంత నక్కడ జనకావనీనేత - కాంతి మై నలువురు కన్య కామణులఁ గై సేయ సైరంధి కలఁ బంప వారు - భాసురమణిపీఠిపై వారి నునిచి పేర (టాం ద్రోగి బాడు పెండ్లి పాటలకు . శారి కాకి ర పు ల్సందడి సేయఁ గుంకుమకస్తూరిగోరోచనంబు - సంకు మదంబు వాసనఁ గదంబింప నలుగురి కొక్క-ట నలు (గులు పెట్టి - కల మృదు ధ్వనులఁ గలకణములు మెఱయ కురులసం పెఁ గనూనె ఁ గూర్చియింపొంద - హరిచందనంబుల సట కలు పెట్టి ఘనసార సురభినఖంపచాంబువుల - జనక పత్రికలకు జలకము క్టీర్చి జిలుఁగులఁ దడియొ_త్తి చెంగావివన్నె - చలువ పావడలపై జాళువాసరిగె కొంగులనొప్ప దుకూలము ల్లట్టి - శృంగారములు గుప్పఁ జేసి రో యనఁగ ! గొప్పగా నొప్పగాఁ గొప్పలమర్చి - విప్పగా జాజివ్వియ లందుcదు టిమి 2200 పచ్చకప్పరముతోఁ బన్నీటితోడ - వచ్చిక స్తరికలపము గూర్చి యల(ది బంగారు సరిగెగన్పడు కుట్టుపనుల - కంగుల అయికలు కనాపట్లఁ 5°&A చనుకట్ల మీఁదఁ బచ్చలబన్న సరము - లును దాకి హానంబులును బొందుపఱిచి ముద్దుమోముల కొక్క ముఱువుకాఁ గోరఁ . దిద్దు మఁ గస్తూరితిలకము ల్జీర్చి చెక్కుల మకరిక ల్చి త్రించి గొప్ప - ముక్కర ల్నా సాగ్రములఁ గీలుకొల్చి మగరాలతళుకుఁగమ్లలును గట్టాణి - బొగడలు చుఱుకుఁ గెంపుల బవి రెలును బచ్చకడియము ల్పద్ద్మరాగములు - గ్రుచ్చిన మొలనూళ్లు గోమేధికముల యందియల్ మొదలైన హార భూషిణము - లందంబుగా ( జేర్ప నపుడు కన్య కలు, శారదపూర్ణిమాచం ద్రుని:ళలొ - చారు వసంతవాసనపుష్పలతలొ ? సానదీఱినమంచి జాతిరత్నములొ ? - శ్రీనిండఁబట్టినార్చినకుందనంపఁ 2210 గమ్లలో ? కఱిఁబులుగడిగిన ముత్తి - యద్దులో నెఱతావి నలరుగంధంపుఁ ᎽᏐ గొమ్లలో ? యనఁ బెండ్లికూతు లొప్పారి - రమ్లక్క యని సతు లక్క జంబంద 74 శ్రీ రం గ నా థ రా మా య ణ ము ద్విపద వారిలో సీత లావణ్యవిఖ్యాత - సారగుణ వ్రాత జగదేక మాత యాదిమలక్ష్మీదా నైపుఁ గాన - నా దేవి చెలువ మింతంతని తెలిసి భూషింపశక్యమే ? భూషణంబులకు - భూషణంబై యొప్పె భూదేవికరణి ; మెఱసి రత్నాకర మేఖల యగుచు . మఱిగంధవతి వసుమతియుఁ దానగుచు, ఆంత వసిష్టసంయమిలగ్నసమయ - మంతయు జనకున కరసి యేతెంచి దశరథుతో సమస్తము దెల్ప నతఁడు - కుశికపుత్రవసిష్టగురులతోఁ గడలి యమరేంద్రవిభవుడై యర్ఘ యానములఁ . గొమరొప్ప గైసేసి కొడుకులునడువ శృంగారములు సేసి చెలుపలునడువ - సంగడిఁ గొలిచి రాజన్యులు నడువఁ 2220, గ్రంతలుగొన పుణ్యకాంతలు నడువ - నంతంతఁ బొగడుచు నర్థులు నడువఁ గైసేసి హయమత్తగజములు నడువ - గైసేసి మంత్రివర్గంబు తో నడువ వేదనాదములతో విప్రులు నడువ - మోదంబుతో మునిముఖ్యులు నడువ నడచి యజ్జనకుని నగరొప్పఁజొచ్చి - పుడమితేఁ డప్పడు పుత్తులు దాను వనజలోచనలు నివాళు లొసంగ - జనకుఁ డెదుర్కొని సంభ్రమంబెనఁగ —: శీ సీతా రావు కల్యాణము, :— È السا ఖచితోరునవరత్న కల్యాణ వేది - నుచిత పీఠంబున సున్నచోప్రీతి దనపురోహితునితో దడయక జనకుఁ - డనలుఁ బ్రతిష్టించి హైమవేదిక వేదోక్తగతిహోమవిధు లాచరించి - యాదేవకన్యకి లననొప్ప తనదు కన్యకామణుల నగణ్యలావణ్య - మా న్యల నలువుర మైత్రిరావించి జనకుండు మధుపర్క సమయంబుఁ దీర్చి . తనకూర్త్మిపుత్రి సౌదామినీగాత్రి 2230, గామినీజనమణిఁ గమలాక్షి సీత ( - గోమలి దెరమఱుంగుగ వేడ్క నిలిపి రామూ భిరాముఁ డా రామచంద్రునకుఁ గామిత సిద్ధి సంకల్పపూర్వముగ “శ్రీరామ ! నాపత్రి సీత సద్ధర్త - చారిణిఁ గొను మగ్నిసాక్షిగా" ననుచు దారవోసెను దేవతాపుష్పవృష్టి - ధారతో దివ్యవాద్యధ్వనుల్ మీఱఁ బ్రమదంబుతోడ దీపాలపళ్లెములు - సమదయానలు మహాసం భ్రమంబునను దలఁబ్రాలు బంగరుతబుకుల నునిచి - కెలఁకుల రమణులు కెరి లుచుఁ బట్ట గుడముతో జిల్క ఱఁ గూర్చి యిద్దఱకు - వడి శిరస్సుల మీఁద వలనొప్ప నుంచి ; రంతట సుముహూర్త మని తెరదీయఁ - గాంత నెమ్లోము మన్లను గొని యలరె ! రామునిక నుఁగవ రాకాసుధాంశు . గోమున నలరెడుకుముదంబు లనఁగ భామచూపులు నిల్చెఁ బతిపాదయుగళిఁ - దామరపై తేటితండంబపోలె, 2240, నింతిలావణ్యాబ్ది కెదురెక్కుమీన - సంతానమై రామచంద్రు చూ పడరె; వరు దేహకాంతి పవాహమధ్యమున - దరుణిచూపులు పదదళములై గాలె. ارسيا دسط9 3- الكبـده కావ్యము బా ల కా ం డ ము 75 సతిచూపుఁ బతిచూపు సరసతఁజూప - రతిరూప రతిమనోరమణుని రూపు నెలమి నొండొరులు మే నెఱుఁగరాకుండఁ - గశలంట దాఁకినగతిఁ గొంతసేపు వెల సె నంతట రఘువీరకుంజరుఁడు - చెలికేలుఁగెందమి చెలువునఁ బట్టి యొండొరు ల్పులకించి యొక్క-పీఠమున - నుండి హోమము సేయుచుండిరి ప్రీతి ε: ఉరువయోధన్య నాయూర్తిళా కన్య - గరము సంప్రీతి లక్ష్మణకుమారునకు వలనొప్ప నాకుశధ్వజకూఁతులందు - నలినాయతాక్షి మాండవి భరతునకు నత్రిజబింబాస్య యగు శ్రుతకీర్తి శత్రుఘ్నునకు నిచ్చె జనకుండు ప్రీతి l నిగమో_క్టవిధినిఁబాణి గహణములు - తగిలి కావించి రాదశరథాత్త్వజులు : 2250 తలద్రాలు వోసి రందు లాజహోమ . మలదీర్చి కాంచిరి ముసలదీవనలు దివినుండి ఘోషించె దేవదుందుభులు - భువినిండ వర్షించె బుష్పవర్షములు : అప్ప డానందించి రఖిలదేవతలు - నప్ప డానందించి రఖిలసనునులు s పాడిరి గంధర్వపతు లుత్సహించి - యాడిరి సంప్రీతి నమరకన్యకలు ; అపుడు వసిష్టుఁ డా యవనీశసుతుల - నుపమింప వైవాహికో క్తమైనట్టి హోమాంతమున వారి యుచితకృత్యములు - నేమంబుతో నగ్ని నెఱిఁ బ్రదక్షిణము. సేయించి సప్తర్షి సేవ లొనర్చి . యాయతంబుగ దీక్ష నలరుచు నుడు కూర్చుండి రందఱు కుదురు గానందు ; - నేర్చుచు పూనులు నెసఁగు భూసురులు 1 సరగున నందఱు సంతోషమె సఁగ - పరఁగదీవనలిచ్చి పరమపావనుల శుభలక్షణంబుగా సుందరీజనుల . విభవసమృద్ధిగా విలసిల్లి నప్ప 2260) డాయతంబుగ దీక్ష నలరి మోదమునఁ - జేయించి మఱునాఁడు చెలఁగి సదస్సు గావించి సంతోషకలితులై యపుడు - దీవించి రందఱు దివ్యచిత్తముల( ; దెఱఁగొప్పఁగాఁ బెండ్లిదినములు ನಲ್ಲ - నెఱయ నిత్తైఱఁగున నిండియుండుటయు. అన్ని శోభనములు నన్ని తేజముల - కన్నులపండువుగాఁ జూచి ప్రీతిఁ దరణివంశాధీశు దశ రధాధీశు - శరధిసన్నిభశీలు జనక భూపాలు వెఱవొప్పదీవించి, سين كثة వా రనుప - నరి గెఁ గౌశికుఁడు హిమాచలంబునకు ? నప్పడు మిథిలేశుఁ డానందకేళి - నుప్పొంగి నిజవిభవోన్నతి మెఱసి ధరణీశులకుఁ జాలఁ దద్దాజయుగము - వరభూషణంబులు వస్త్రంబు లొ సఁగఁ దమ దేశములకును దగఁ జనిరంతఁ ; - గ్రమమున నర్ధార్థిగణముల కెల్ల నపరిమిత ద్రవ్య మట యిచ్చి పనిచి.నృపయు గ్ల మొప్పెను నెనరొప్పఁగాను : 2270 గర మొప్ప బుద్ధులు గఱపి కూ (తులకు - వరరత్నభూషణావళులు విచిత్ర చిత్రాంబరములు దాసీజనంబులును - నేత్రోత్సవంబుగా నెమ్మితో నొ సఁగి కరిరథహయభటగణభూషణాదు - లరణంబుగాఁ దన యల్లండ్ర కిచ్చి, యావసిష్టాదిసంయములకు దశర - ధావనీశునకు ననర్హ మాణిక్య 了6 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద భూషణంబు లొసంగి పూజించి వినము - భాషణంబుల యుక్త పద్ధతి ననుపఁ గొడుకులఁ గోడండ్ర గొమరొప్పఁ గొనుచుఁ - గడకతో దశరథ పతి గదలి యడరి యయోధ్యకు నరుగుచోఁ ద్రోవ - వడిబేర్చి ప్రతికూల వాయువు ల్వీ చెఁ : దడయక దుర్నిమిత్తము లనేకములు - పొడచూప నప్పడు యాపతి కలఁగి, “యేలొకో మునినాథ ! యిబ్బంగిఁగడఁగి - పోలనిశకునము ల్పొడచూపఁదొడఁగె ?" ననవుడు దశరథు ననుకంపఁ జూచి - యని యొ వసిష్టసంయమి నిశ్చయించి 2280 “యుర్వీశ ! ముందఱనొకమహాభయము - పర్వి యాలోననే పాయు నోడకుము" అనుచుండ వాయువు లందంద విసరెఁ - గనుకను పెంధూళిగప్పెఁ గప్పటయుఁ, గరులు జోదులుఁ దురంగములు రాహుతులు - విరథులై రథులు నివ్వెఱపాటు వడిరి సేనలు నలైస ల్చీకాకువడియె 1 - భానుమండలమునఁ బ్రిభమా సె ; నంత, నిరువదియొక్కమా తేచి రాజులను - దరమిడిచంపిన ధన్యవిక్రముఁడు క్రమినజడలలో గాఁపున్నగంగ - చెప్తునా నుదుటను జెమ టుబ్బు మండ ఘోరమై మండెడుకుత్తుకవిషము - గ్రూకదైత్యులమీఁదఁ గోపించి యు మిసి పరమేశ్వరుఁడుదనఫాలనేత్ర మునఁ - బెరి (గి మండుచునున్న పెనుమంటఁ బుచ్చి తన రెండుకన్నులఁ దగఁ బంచి పెట్టు - కొనివచ్చుపగిది గన్లోనల గెంపె సఁగఁ దెగి లోనమండెడు తీవ్రకోపాగ్ని - యెగసి మైసుడిగొన్న యెఱమంటలనఁగ, 2290 వెలసి కెంజాయల వెదజల్లజడలు - బలిసి జూటంబున భాసిల్లుచుండఁ దమకించి భుజలక్ష్మి తాఁ బట్టియాడు - విమలనాళము తోడి విరిచమి యనఁగఁ బరశువు మూఁపున భరియించివచ్చు పరశురామునిఁ జూచి భయమున నలఁగి రయమున దశరథరాజుసన్లునులు to భయ నివారణమంత్ర పరతంత్రు లగుచు —: పరశురాముడు శ్రీరాము నెదుర్కొని భంగపడుట :ననఘులై యెదురుగా నర్ఘ్యపాద్యములు . గొనిపోవ వానిఁ గైకొనక రౌద్రమున దశరథభూపాలు దర్పించి చూచి - దశరథరాము ముందఱ వచ్చి నిలిచె ; నిలిచిన భార్గవు నిజమూర్తిఁ జూచి - తల యూచీ మెచ్చి సద్భక్తితో మ్రొక్కి, చక్క-ఁ గట్టెదుర హస్తములొప్ప మొగిచి - యొక్కింత భయమున నున్న వీక్షించి 4నీవెంత మైక్కిన నిన్నుమన్నించి - పోవ నా తోఁ బోరు భూపాల" యనుఁడు, “భూసురోత్తమ ! కశ్యపుఁడు మొదలయిన.భూసురో త్తములకు భువి నెల్ల నిచ్చి2300 యతిజితేంద్రి యవృ_త్తి నడవులనుండ - నతులత పోరాశి వగుటను జేసి, యొనర నీకెఱఁగుట యుచితంబు గాన - మునినాథ ! యే నీకు ప్రెక్కి-తిఁగాన, వెఱచి మ్రొక్కుట గాదు వెరవరి నన్ను - నుఱకఁ బోనాడుట యుచితమే నీకు ?” ననవుడు దాషసుం డని నన్నుఁబలికి - తనిలో సహస్రబాహార్డును దొట్టి కొవ్యము బా ల కా ం డ ము 77 యిరువదియొక్కమా తేచిరాజులను - తరమిడి చంపితి ధరణిపై ಜಿಲ್ಲಿ నెఱిఁ దిలోదకములు నెత్తుట నొసఁగి - తెఱఁగొప్ప మీపితృదేవతలెల్ల భూపాలశవములఁ బొంబొంద దివికి . సోపానములు చేసి సౌరిదియై చనిరి : అట్టిభార్గవురాము ననఘ ! నన్నెఱుఁగ - కిట్టేల రాముఁడై యిలఁ బుట్టితీపు 2 రాజన్నఁ బొరిఁగొందు రామనాములను - రాజుల సైఁతునే రణభూమి నేను ? రాజకులుండవొ రాముని నిన్ను - నాజి మన్నింతునే ? యదియునుగాక 2310) రాజ ని మీతండ్రి రణమునఁ ద్రుంప - నాజికి వచ్చిన నాకును నో ప్రీలమఱుంగునఁ జెలువొప్ప నున్న - కాలవశంబునఁ గాచితి నతనిఁ దాన గర్వాంధుఁడై తద్దయు నిపుడు - మానక యున్నాఁడు మఱి యుబ్బి యిచట, మఱుఁగుజొచ్చిన నైన మననీ య' ననుచు - వెఱవక పల్కి-న వెఱపుతో నపుడు, అనవుడు దశరథుఁ డతిభీతుఁ డగుచు - వినయోక్తి భార్గవు వీక్షించి పలికె. నీవు బ్రాహ్మణుఁడవు నీకు రోషంబు - గావింప నేటికి ? ఘనముగా నాదు తనయులు బాలురు తగదు కోపంబు - వినుత శాస్త్ర పురాణవిఖ్యాతిఁ గనుట, నెఱుఁగనే ? భార్గవ : యెఱుఁగవే నీవు - ఎఱుఁగనిమర్తంబు లెం దైనఁ గలవె ?" నీతోడఁ బోరాడ నిన్నెదిరింప - నాతతంబుగ నుండు నటభవుం డైన, నోపునే ? భార్గవ 1 యొరు లెదిరింపఁ - బాపవే యీతతిఁ బరమపావనుఁడ 1 2320 దేవేంద్రుఁ డైన నీ తీవ్ర ప్రతిజ్ఞ - భావించి యుడుపంగ భవ్యుండు గాఁడు ; మన్నించి రక్షీంచి మమ్లు నందఱను - జెన్నుగాఁ జను" మని శిరసును వంచి మన్నింపు మని వేఁడి మఱియు మ్రొక్కి-నను-గన్నులఁ గోపంబు గడునొప్పియుండె: నని తన్నుఁ గొనియాడ నతనివాక్యములు - విని యాచరింపక విపులరోషమునఁ గనలుచు నత్యంత కఠినుఁడైయపుడు - దమియింతు నని మదిఁ దల (చి యిట్లనియె 聽" “కర మొప్ప విలువిద్యఁ గడిమిమై నేను - హరునితోఁ దొల్లి యభ్యాసంబు సేయ నాఁడు కుమారుండు నాతోడఁ దొడరి - పో(డిమి చెడి యోడి పోయినఁ జూచి, నా పెంపు మెచ్చిన నాగకంకణుని - చాపంబు విఱిచిన సై (తునే ? మఱియు, " అనిన నారఘురాముఁ డారాముఁ జూచి - యనియె నిశ్చల వృత్తి నతిసమదమున నేను వినోదమై నెక్కిడితివియఁ - గా నది విఱిగెను గాక దానట్ల 2330) నాతెగ కేల పినాకివి ల్నిలుచు ? - నాతత భుజసత్త్వ మట్టిదె నాకు ! నెస(గ యుద్ధములందు నివ్వొకుకులులు - పసుల బ్రాహ్మణులఁ జంపఁ డలంప రెందు, 3) వెన్ని పలికిన నీకవిచెల్లె ; నీవుద్రాప్తణుఁడవు నినుఁ జంపనొల్ల ; నిదె నాదుకంధర మిడె నీదుపరశు - వదరక యుచితకృత్యము సేయు మింక ;" ననవుడు రఘురాము నలుక దీపింపఁ - గనుఁగొని పలికె భార్గవరాముఁ డడరి. “భావింప నాకు నీ పలుకులఁజూడ - నీవు క్షత్రియుఁడవు నేను బ్రాహ్మణుఁడ S. *78 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద నను గర్వమున్నది యటు చూడవలదు - వినుత విక్రమశ_క్తి వేడిఁ జూపెదను ; వఱలు నజ్జనక భూవరునింట నీవు - విఱిచిన వి నీవిల్లను దొల్లి యర్తిలి నిండార నమరులు విశ్వ - కర్తచే నొక్కటఁ గావించి రెలమిఁ

బురములు నిర్జింపఁ బోయెడునాఁడు - హరునకుఁ దగ నిచ్చి రందులో నొకటి 2340 నావింటఁ ద్రిపురంబు లణ (చి రుద్రుండు - దా వీరగర్వముద్రారతుఁ డగుచు :నసహాయమున నేను నసురత్రయంబు - వసుధపై ఁ గూల్చి తెవ్వరు నాకు నీడు " .నని పల్క"చక్రి బుద్ధాకృతిఁబూని . తు నిమించెఁ గాక రుద్ధునికి శక్యం బె" యని యాడకాడకు నమరులు మునులు - సనకాదిహరిపార్శ్వచరులును విలువ విని రుద్ర గణములు వినుపింప శివుఁడు - విని రోషమునఁ బోర విష్ణుని విలువ సురగరుడోరగవరు లెల్లఁ గూడి - సరసిజాసనుఁ జేరఁ జని విచారించి హరిహరసుత్త్వంబు లరయుద మనుచు - ముర వైరి కపుడుకార్డుకరాజ మిచ్చి యిరువుర కెంతయు నెఱుక సేయుటయు - హరియు రుద్ధుఁడు బోరి రరుదుగా నపుడు నారాయణుని తీవ్రనారాచ ఘోర . ధారచే శివునికోదండంబు సగము విఱిగి పేటెత్తిన వీక్షించి రప్పడు - హరిశ_క్తి ఘన మని యమరు లందఱును 2350 ఇరువుర మాన్పిరా యీశుఁ డవ్వేశ Ει సురలచిత్తస్టితిఁ జూచి యావిల్ల రయమున నా దేవరాతునకిచ్చె - జయధన్యుఁ డాతండు జనకున కిచ్చె వనజలోచను (డును వలనొప్ప నిచ్చెఁ - దన చేతిచాప మత్తఱి రుచికునకు .జమదగ్ని కిచ్చె నిశ్చలమతి నతఁడు - జమదగ్ని నా కిచ్చె సదయుఁడై దీని

బెనఁకువ నది తొల్లి పేటె_త్తియుంటఁ - గని నీవు విఱచితి గాక ! భూనాథ 1 ఆవింటితోడి దె నరయ నాచేతి - యీవిల్లా నిదెచూడు మినవంశ తిలక ! నెలకొని యీవిల్లు నీవెక్కుపెట్టి - తలకొని బాణసంధానంబు సేసి కడిమిచూపక నిన్నుఁ గదలనీ" ననినఁ - దడయక రోషించి దశరథాత్త్వజుఁడు కన్నుల ఘనవహ్ని కణములు దొరుఁగ-ద న్నెఱుంగని జామదగ్నితో ဒါ့ခ်န္ရ္ဟ. "నిరుపమనిజశ_క్తి నీకుఁగల్గుటయు - దరమిడి రాజులఁ దరిమి చంపుటయు 2360 నెఱుఁగుదు నన్ను నీ వితరునిమాడ్కి - వెఱవకఁబలి కెదు బీరంబు మెఱసి సీవెఱుంగవు నాదు నిజబాహుబలము - నీవెంత వాఁడవు ? నీచాప మెంత ? తె"మ్లని విలుఁదీసి తెగువ మోపెట్టి is క్రస్తఱ నత్యుగ్రకాండంబు దొడిగి “నీకాళ్ల దెగవేసి నీగర్వముడిపి - నీకోప మడఁచెద నేఁ"డన్నఁదలఁకి యురుసత్వగర్వంబు నుబ్బును దూలి - పరశురాముఁడు రాముఁ బ్రార్థించి పలికె. “నేను గశ్యపునకు నిల నిచ్చినాఁడఁ - గాన రాత్రులు నిల్వగా నేర దిచట : ననుదినంబును మహేంద్రాచలంబునకు - జనవలె నటుచేసి చరణము ల్వలయు నాకాళ్ళ నేయక నాపాలిపుణ్య - లోకమార్గంబు లా లోకింప నేయు కావ్యము చా ల కా O డ ము 79 నన్నురక్షింపుము నరనాథచంద్ర ! - మన్నింపవే రామ ! మనుజ లోకేశ " యనవుడు రఘురాముఁ డా జామదగ్ని - ఘనపుణ్యలోకమార్గము నేసె నంత : 2870 జడురీతినిలుచున్న జమదగ్నిరాముఁ - గడునుగ్రుఁడైయున్న కాకత్ స్థరాముఁ జూచుచునుండిరి సురసిద్ధసాధ్య - బేచరు లద్భుత క్రీడలఁ దగిలి వలనొప్పఁగాఁ బుష్పవర్షము ల్లరి సె - నలినగర్బాదులు నానందమంది పొగడిరి రామునిఁ ; బొందుగా సురలు - మిగులు తేజంబున మిన్ను ననుండి : యంత భార్గవరాముఁ డారాముఁ జూచి - యంతరంగంబున నతని భావించి “యనఘ ! నీ సత్త్వ మే నాత్తులోఁ జూచి - నిను వివేకించితి నీవు విష్ణుఁడవు : కాకుత్స్థయటుగాన గదనంబునందు . నీకు నోడుట నాకు నింత గాదెందు ; నాబలంబును నీవె ; నాయాత్త నీవె ; . నాబంధువులు నీవె ; నారామచంద్ర ! నామాట లన్నియు నాత్త నుంపకయ . రామ ! రక్షింపవే రఘుకులాధీశ " యనుచుఁ బ్రస్తుతిసేసి యానందమంది.మనమున రఘురామమహిమ లెన్నుచును 2980 వరుస శ్రీరాముని వలగొని భక్తి . గరములు ముకుళించి కరము సంప్రీతి వినయవిధేయుడై విభు నటుచూచి - మనమునఁ గృపవుట్ట మఱి యిట్టులనియె. “సెలవిమ్లు రాఘవ శ్రీజానకీశ - సెలవిమ్లు పోయెద సెలవిమ్లు నాకు నాతప్పలెన్నక నన్నుమన్నించి - యీతఱి రక్షించి యింపుగా (బనుపు మనసునేకముచేసి మదివెల్లఁగనుచుఁ - గనుమూసినినుఁగూర్చి కదలకతపము లొనరంగఁజేసిన నొయ్యనమునులు - మనముల నానందమగ్నులైయుందు" రనుచుఁ బ్రిస్తుతిఁజేసి యభిసుతుల్చేసి - యనుపమ ఫ్రీతితో నప్పడే కదలి నిరుపమతరశ_క్తి నీశక్తి" యనుచు . నరి గెరాముఁడు మహేంద్రాచలంబునకుఁ బరశురామునివిల్లు ప్రార్ధింపనొసగె - వరుణుచేతికి రఘువర్యుఁడా క్షణ మె యప్పడు వాయువు లనుకూలగతుల - నొప్పె నుత్సాహంబు లొదవె సేనలకు. 2390 నరు దరు దని సుర లభినుతిసేయ - వరజయశ్రీగూడి వచ్చి రాఘవుఁడు తనతండ్రిదశరథధరణిపాలనకు so ననఘవసిష్టున కతిభక్తి మ్రొక్కె మ్రొక్కి-న దీవించి మొగిఁగౌఁగిలించి - యక్కున నందను నౌదలఁ జేర్చి పరమ సమదమునఁ బార్ధివేశ్వరుఁడు - "సరసోక్తి నేఁ బునర్జాతుండనైతిఁ గొము రొప్ప నీవంటి కొడుకును గనుట - నమరేంద్రుఁ బోలితి నవనిలో నిపుడు పరమపావనుఁడైన పరశురాముడు - పరమేశుపగిదిని దిరఁగ నిచ్చటికి వచ్చుట నేఁ గాంచి వడలెల్లవడఁక - యిచ్చలో భయమంది యిఁక నేది క్రోవ ?" యనుచు భయంబున నాతనితోడ - మనవిగాఁ జెప్పిన మఱి వినకున్నఁ బరవశత్వం బొంది పలుకనేరకయ - పరమమైత్రికి నేను బాల్పడియుంటి :

నతని గెల్చుటయె నా కాశ్చర్యమయ్యె - నతులిత వైభవం బందితి నేను 2400 బాసెను భయ మెల్లఁ బ్రౌఢి నీచేత - వాసికెక్కితి నిల వైభవం బబ్బె"

ననుచు రామునిఁ జాల నభినుతిచేసి - మునివసిష్టాదుల ముదమునఁ గూడి పరమసమ్మదమున బలములుఁదాను - నరిగె నయోధ్యకు నవనివల్లభుఁడు.

-: దశరథుడు పుత్రులం దోడ్కొని అయోధ్య కేగుట :- పుణ్యచిహ్నములతోఁ బుణ్యులతోడ - బుణ్యమంగళతూర్యములు మ్రోయనరిగి తానును గొడుకులు దశరథాధీశుఁ - డానందమున నయో ధ్యాప్చరిఁ జొచ్చి రాజితాలంకారరమణఁజేపట్టు - రాజమార్గంబున రారా జముఖులు సఖులు (దారును గేళిసౌధంబు లెక్కి - సుఖతరాకృతుల రాసుతులఁ గన్లోనుచు సేసలుచల్ల నాశీర్వాద మెల్ల - భూసురు లొసఁగ విస్ఫురణఁ బెు పెసగ నగణితశృంగార ခြိုး యొప్పదనరు - నగరుఁ బ్రవేశించె నరనాథుఁ డంతc గౌసల్యకేకయ పాలపుత్రి 囑 యాసుమిత్రాదేవి యూది గా ( గలుగు 2410, నంతఃపురాంగన లందఱునప్ప - డెంతయు (బ్రీతితో నెదురుగా వచ్చి జేరివారలమీఁద సేసలు చల్లి - నీరాజనుబులు నెఱి నిచ్చి రంతఁ గొడుకులందఱు ప్రెక్క-( గోడండ్రుప్రె క్క- i గడుప్రీతి దీవించి కౌగిట జేర్చి సీతాదికాంతల చెలువంపుబుద్ధి 瞿 చాతురి కన్నుల చల్లగా ఁ జూచి తనరారుచుండిరి దశరథుం డపుడు - తనయులు నలుగు య తను భజియింప నాల్గుచేతులనొప్ప నలినా కుఁడనఁగ - నాల్గుకొమ్లలుగల నా కేభ మనఁగ సకలజనానందచతురుఁడై రాజ్య - మకలంకం క్షకు 3 యేలుచుండి యోుకనాఁడు దశరథుం డుచిత మెలటింగి - ప్రకటితశుభిరతు భరతు నీక్షించి “ఘనుఁడు మీమామ కేకయరాజు దోడు - కొనిపోదు నిన్నని కోరియున్నాడు గాన శత్రుఘ్నుతో గదలి మీమామ - తో నేగి యతని సంతోషంబు నెఱపు 2420, తాతకు నవ్వకుఁ దగ మేనమామ - కాతతభక్తితో ననిశంబు మ్రొక్కు సురలకా ( దలఁచి భూసురులకు వత్స ; - పుమ ప్రియంబునఁ బరిచర్య సేయు వారలచేత నవారణస్యంద - నారోహణములు శస్త్రాప్రవిద్యలును నెఱి వేదశాస్త్రము ల్నీతిశాస్త్రములు - నురుకళావిద్యలు నొగి నభ్యసింపు మేకక్షణంబును నెడపక నియతిఁ - జేకొని నీమేలు చెప్పి పుత్తెమ్లు." అనవుడుఁ దల్లల కవ నిపాలునకు - వినతుడై రఘురామవిభునకు ప్రెక్కితాను శత్రుఘ్నుండుఁ దన మేనమామ - తో న యిమ్లుల భరతుఁడు పుణ్యరతుఁడు రాజగృహంబున రమణీయమైన - రాజధానికి నేగి రఘుకుమారకులు తాతకుఁ దమరాకఁ దగ నెఱిఁగింపఁ . ప్రీతిమైఁ బుచ్చ నా పృథ్వీవరుండు పట్టణంబునఁ దీరువడతోరణములు - గట్టించి బహుపతాకలు కల్వడములు 2480 కావ్యము బా ల కా ం డ ము 81 కలయంగ నెత్తించి గంధోదకములు . పౌలుపొందఁ జల్లించి పుష్పధూమములు కరమొప్ప రాజమార్గమున వాసింపఁ - దిరిచారకుల ఁ బంచి బలయుతులగుచు వనితలు నిజమంత్రివర్గంబు తోడ - జనుదేర నెంతయు సంభ్రమం బెసఁగ వరుస నానాగీత వాద్యనృత్యములు - పరమశుభాచార భంగులనడువఁ ప్రీతినెదుర్కొని ప్రియ మొప్ప వంది - సూతమాగధజన స్తుత లోలిఁ జెలఁగ మనుమలఁ దోడ్కొని మహిమతో వచ్చె - బనిగొన్నభ_క్తితో భరతుండు నంతఁ దమతాత మొదలుగాఁ దగిన పెద్దలకుఁ - గ్రమము దప్పక నమస్కారము ల్పేసి పొలుపొంద వారిచేఁ బూజితుం డగుచుఁ - దళుకొత్త వేడుక దాతతో ననియె “నార్యక ! నాకు విద్యాభ్యాసమింకఁ - గార్య మాచార్యులై ఘనులైనవారి కప్పగింపుఁడు నన్ను" ననిన నారాజు - చెప్పిన వారిచే శిక్షితుండగుచు 2440 నమరవిద్యాభ్యాస మంతయుఁ జేసి - విమలై కమతి నొక విప్రునిచేతఁ “దమతండ్రియగుచున్న దశరథేశునకు - సముచితస్థితి మేము సకలవిద్యలును జెలువంబుగా నభ్యసించితి మింక - దలఁపుపటైడు మూకు c దముఁజూడవలయు” నని చెప్ప మన నయోధ్యాపురంబునకుఁ . జనుదెంచి యతఁడు నాజననాయకునకు రాజపత్నులకు నారామలక్ష్మణుల - కోజ నెంతయుఁ జెప్పె నుల్లంబులలర నంత శ్రీరాముండు యావరాజ్యమున - నెంతయుఁ జతురుఁడై యెల్లవారలకు బ్రాకటంబుగ నొండు బాధలేకుండ - నేక ప్రబుద్ధిగా నిటc దండ్రిగొలిచి ధారుణీ ప్రజలకు దయయొప్పఁ జేసి - వీరు వారన కతివిశ్రుతకీర్తి సమచిత్తుడై ధర్మచరితంబుఁ బూని - యమరేంద్రవిభపుఁడై యారామవిభుఁడు సీతయుఁ దానును జెలువొప్పఁగూడి - సూతనరతిసుఖార్జోరాశిఁదేలి 2450 చంద్రశాలలఁ గేళిసౌధవీథికలఁ - జంద్రకాంతాతివిశాల వేదికల గాజుటోవరుల బంగరుపడకిండ్ల - జాజిపూఁబాన్పులఁ జంపక క్రమక నారికేళరసాల నారంగరంగ - నారామములఁ గృతకా ద్రి సానువుల గొలఁకులఁ గెలఁకులఁ గుంజపుంజములఁ - జలు వచప్పరముల సైకతస్థలులఁ జా మరీ మెలఁగుచు సకల భోగములు - నాతతసౌఖ్యంబు లందుచునుండే. అని యాం ధభాష భాషాధీశవిభుఁడు - వినుతవాక్యొగము విమలమూనసుఁడు పాలితాచార డపార ధీశరధి - భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు దమతండ్రివిట్టలధరణీశుపేరఁ - గమనీయగుణదైర్యకనకాద్రి పేర నలఘు నిశ్చలదయాయతబుద్ధి పేర . . . లలిత నిర్మలగుణాలంకారు పేర నాచంద్రతారార్క- మై యొప్పమిగిలి - భూచక్రమున నతిపూజ్యమై యొప్ప 2460 నసమానలలిత శబ్దార్థసంగతుల - రసికమైచెలువొందు రామాయణంబు పరఁగనలంకార భావనల్నిండఁ - గరమర్ధినీబాలకాండంబుఁ జెప్పె 6 82 శ్రీ ర 0 గ నా థ రా మా య ణ ము ద్విపద నారూఢినార్ణేయమై యాదికావ్య - మై రసికానందమై యల్లనాఁడు నివ్వసుమతినొప్ప నీపుణ్యచరిత - మెవ్వరుచదివిన నెవ్వరు వినిన సామాదిబహువేదచయధామరామ - నామచింతామణి నవ్యభోగములు పరహితాచారముల్ ప్రభువిచారములు to- పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు - ధరైకనిష్టలు దానాభిరతులు مسطا నాయురారోగ్యంబు లైశ్వర్యములును - బాయనిశుభములు పాపక్షయములు వరపుత్రలబ్దియు వైరినాశనము - సరినొప్ప ధనధాన్యచయ సమృద్దియును నేవిఘ్నములు లేక యిండ్లలోనధిక o లావణ్యవతులై న లలనల పొందు 24.70, కొడుకులతో నెపుఁ గూడియుండుటయు . నెడగా (గ నాపద లెల్లఁబాయుటయు సముదంబున బద్ధుజనుల గూడుటయు . నిమ్లులఁ గామ్యంబు లెడపకుండుటయు సతతంబు దేవతాసంతర్పణంబు மும் పితృగణతృ_ప్తియుఁ బెంపారుచుండు వ్రాసినవారికి వరశుభోన్నతులు - వాసవభోగాదివాసులఁ జేయు నెందాఁక కులగిరు లెందాఁక జలధి - యెందాఁక రవిచంద్రు లెందాఁక దిశలు ఎందాఁక వేదంబు లెందాఁక ధరణి - యెందాఁక భువనంబు లేప్పదీపించు నందాఁక యీకథ యక్షతానంద - సందోహదోహళాచారమై పరఁగు, "బాల కాండము సవూ ప్తము,