మొల్ల రామాయణము/యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
Jump to navigation
Jump to search
యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము[మార్చు]
క. కామారివినుతనామా!
సామీరికృత ప్రణామ! సంహృతరక్షో
గ్రామా! వర్షామేఘ
శ్యామా! సంగ్రామభీమ! జానకిరామా! 1