మైసూరు పులి టిపూ సుల్తాన్/ప్రచురణకర్త మాట

వికీసోర్స్ నుండి

అబ్బాదుల్లా
డైరెక్టర్‌
తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌
 సందేశభవనం, లక్కడ్‌కోట్‌
ఛత్తాబజార్‌, హైదరాబాద్‌-2

ప్రచురణకర్త మాట

ప్రముఖ రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రాసిన ఈ చిరు పుస్తకం వలన మైసూరు పులి టిపూ సుల్తాన్‌ జీవిత అధ్యయనం సాధ్యపడుతుంది. చక్కని పరిపాలన దక్షతతో, ఆర్థిక, సామాజిక రంగాలలో జాతీయ, అంతర్జాతీయ, రాజకీయాలలో తనదైన ప్రజ్ఞాపాటవం చూపిన టిపూ జీవితం ఈనాటి పాలకులకు ఆదర్శం.
ఈ పుస్తకం తొలుత 2002 మే నెలలో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ద్వారా ప్రచురితమైంది. ఆ సందర్భంగా లభించిన పాఠకాదరణ వలన 2004 మే మాసంలో పునర్ముద్రణ అయ్యింది.
ఈమధ్య తెలుగు జీవిత గాథల్లో గొప్పగా వచ్చిన పుస్తకం అంటూ పండితుల ప్రశంలందుకున్న ఈ పుస్తకానికి మరింతగా లభించిన ఆదరణ మూలంగా మరిన్ని మార్పులు చేర్పులతో, అరుదైన నూతన ఫొటోలు, చిత్రాలతో మూడవసారి ముచ్చటగా ముద్రితమై ప్రస్తుతం విూ ముందుకు వచ్చింది.
మన చరిత్రను మరుస్తున్న నవయువకులు భారత దేశ మహనీయుల జీవితాలను మధురమైన తెలుగు భాషలో అవగాహన చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాం.
  - అబ్బాదుల్లా