Jump to content

మైసూరు పులి టిపూ సుల్తాన్/నా మాట

వికీసోర్స్ నుండి

మైసూర్‌ పులి టిప్పుసుల్తాన్‌

                                                            నా మాట

బ్రిీటిష్‌ వ్యతిరేక పోరాటాలలో ప్రధాన పాత్ర వహించి మైసూరు పులిగాప్రఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌ జీవిత విశేషాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సంకల్పంతో మైసూరు పులి టిపూ సుల్తాన్‌ రాశాను. ఈ సమాచారం గీటురాయి వారపత్రికలో ధారావాహికంగా ప్రచు రితమైంది. ఈ సీరియల్‌ను చదివిన పాఠకులు పలువురు దీనికి పుస్తక రూపం కల్పించమన్నారు. ఆ పాఠకుల కోరిక మేరకు 2002లో మిత్రులు జనాబ్‌ హబీబుర్‌ రహ్మన్‌ (విజయవాడ) సహకారంతో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ పుస్తకంగా వెలువరించింది. ఈ చిన్నపుస్తకాన్ని పెద్ద మనస్సుతో పాఠకులు ఆదారించారు. పత్రికలు చక్కని సమీక్షలతో ప్రజలకు పరిచయం చేశాయి. ఆనాడు తెలుగు జీవిత గాథాల్లో గొప్పగా వచ్చిన పుస్తకం అంటూ పండితుల ప్రశంసలందాుకున్న ఈ పుస్తకానికి పాఠకుల నుండి లభించిన మరింత ఆదరణ మూలంగా 2004 లో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ పునర్ముద్రించింది.ఆ సమయంలో కర్ణాటక ప్రాంతంలో కొన్నిమతోన్మాద స్వార్థపరశక్తులుటిప్పు సుల్తాన్‌ గురించి అపప్రదలను ముమ్మరంగా ప్రచారం చేసు న్నందున, ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నఉద్దేశ్యంతో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ఛైర్మన్‌, హాజీ షేక్‌ పీర్‌ అహమ్మద్‌, ఈ పుస్తకాన్ని కర్ణాటకలోని తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలకు పంపి, మిత్రులద్వారా ఉచితంగా పంపిణీ చేయించారు. మన రాష్రంలో కూడ చాలా వరకు ఉచితంగా పంపిణి జరిగింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఈ పుస్తకాన్ని అందించారు. ఆ తరువాత తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ వారు మైసూరు పులి:టిప్పు సుల్తాన్‌ పుస్తకాన్నిసరికొత్తగా ప్రచురించ సంకల్పించారు. ఆ సంస్థ సంచాలకులు జనాబ్ అబ్బాదుల్లాగారు, అలనాటి పుస్తకాన్నిపూర్తిగా తిరగరాసి నూతన 9 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

సమాచారం, నూతన చిత్రాలు, ఫొటోలు సమకూర్చాలని తిరుగులేని షరతు విధించారు. ఆయన విధించిన షరతులను గౌరవిస్తూ, నా పుస్తకాన్ని చదివిన చరిత్ర ఆధ్యాపకులు, పరిశోధకులు, పాఠకులు సూచించిన ప్రమాణాలను పాిటిసూ ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న పుస్తకాన్ని రూపొందించాను.

ఈ లోగా ఈ పుస్తక రచనలో తోడ్పాటుకోసం స్వయంగా టిపూ సుల్తాన్‌ రాజ్య రాజధాని శ్రీరంగపట్నం మరోమారు వెళ్ళివచ్చాను. శ్రీరంగపట్నంలోని ప్రతి ప్రదశాన్ని మళ్ళీమళ్ళీ సందర్శించాను. ఆయా ప్రాంతాల చిత్రాలను, ఫోటోలను సేకరించుకున్నాను. ఆ ఫోటోలు, చిత్రాలతో సహా సరికొత్త సమాచారం పొందు పర్చుకున్న కారణంగా ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం పూర్తిగా సరికొత్త పుస్తకమయ్యింది.

ఈ కృషిలో నాకు సహకారం అందించిన తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌, హైదారాబాదు సంచాలకులు జనాబ్‌ అబ్బాదుల్లా గారికి, పరిచయ వాక్యం రాసిచ్చిన పుస్తక ప్రచురణలో సహకరించిన మిత్రులు జనాబ్‌ వాహెద్‌ (గీటురాయి) గారికి, పరిచయ వాక్యం రాసిచ్చిన ప్రముఖ రచయిత, కవి శ్రీ యం.డి. సౌజన్య (తెనాలి) గారికి, టిపూ సుల్తాన్‌ కుటుంబం, చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఫోటోలు సేకరించటంలో నాకు ఎంతగానో సహకరించిన పుస్తక ప్రియులు, నా మిత్రులు జనాబ్‌ యస్‌. ఖాన్‌ సాహెబ్‌ (అసిస్టెంటు కమీషనర్‌, కస్టమ్స్‌ అండ్‌ ఎక్సయిజ్‌,బెంగుళూరు) గారికి, నా ప్రతి ప్రయత్నం వెనుక తానుండి సతతం నన్ను ప్రోత్సహిస్తున్ననా జీవిత సహచరిణి శ్రీమతి రమిజా భానుకు, నా ప్రత్యేక ధన్యవాదాలు.

    ఇక ఈ గ్రంథాం గురించి తీర్పు చెప్పాల్సింది పాఠకులే !
                                                  - సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వినుకొండ, మే, 2006. 10 7