ముండకోపనిషత్
శాంతి మంత్రః
[మార్చు]మంత్రము | భావము |
---|---|
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః |
ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో శుభప్రథమగు దానినే దర్శించెదము గాక. మిమ్ములను స్తుతించుచు మా కొసగబడిన ఆయుష్కాలమును పూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదము గాక. సనాచన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము నొనగూర్చు గాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయు గాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించు గాక. మా లోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించు గాక. |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ప్రథమ ముండకము
[మార్చు]ప్రథమ ఖండము
[మార్చు]మంత్రము | భావము |
---|---|
ఓం బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ |
సృష్టికర్త, జగత్ప్రభువగు బ్రహ్మదేవుడు దేవతలందరి కంటెను ముందుగ ఆవిర్భవించాడు. సకల విద్యలకు ఆధారము, ఆశ్రయముయైన బ్రహ్మవిద్యను బ్రహ్మ తన జ్యేష్ఠ కుమారుడగు అథర్వునకు తెలియజేసినాడు. |
అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మా |
ఏ విద్యను బ్రహ్మ దేవుడు అథర్వునకు తెలియజేసెనో అట్టి బ్రహ్మవిద్యను, అథర్వుడు పూర్వము అంగిరునికి తెలిపెను. అంగిరుడు భారద్వాజ గోత్రుడైన సత్యవాహునకు భోధించెను. ఈ పరావిద్యను సత్యవాహుడు అంగిరసునకు భోధించెను. |
శౌనకో హవైమహాశాలేఽ ంగిరసం |
ఉత్తమ గృహస్తుడైన శైనకుడు యుక్తరీతిని అంగిరస మహర్షిని సమీపించి - హేభగవాన్, దేనిని తెలియుటచేత ఈ ప్రపంచ జ్ఞానమంతయు తెలియ బడుతుంది. - అని ప్రశ్నించెను. |
తస్మై సహోవాచ - ద్వేవిద్యే వేదితవ్యే ఇతి హస్మయద్ |
శౌనకునికి అంగిరసుడు జవాబు చెప్పెను - పరావిద్యయని, అపరావిద్యయని తెలిసికొనదగినవి రెండు విద్యలు ఉన్నవని బ్రహ్మవోత్తలు చెప్పెదరు. |
తత్రాపరా, ఋగ్వేదో యజుర్వేదః |
ఈ ఉభయవిద్యలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనెడి నాలుగు వేదములు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషము అనెడి వేదాంగములు అపరావిద్యకు సంబంధించినవి. అక్షరపరబ్రహ్మను అందించు విద్యయే పరావిద్య. |
యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ |
ఏదయితే కనులకు గోచరించనిదై (imperceptible), మనస్సుచే గ్రహించుటకు వీలుకానిదై (ungraspable), పుట్టుకలేనిదై(without any lineage), రంగులేనిదై (attributeless), కన్నులు చెవులు లేనిదై, హస్తపాదములు లేనిదై, నిత్యమై, సర్వరూపధారియై, సర్వవ్యాపియై, సూక్ష్మతరమై, నశించనిదియైన అక్షరరూపమును జగత్తుకు మూలకారణముగ ధీరపురుషులు సర్వత్ర దర్శింతురు. |
యథోర్ణనాభిః సృజతే గృహణతే చ |
సాలెపురుగు ఎలాగున సాలెగూడును తన నుండియే ప్రభవింపజోసి తనలోనే అంతర్లీనం చేసికొనునో, మహీతలము నుండి ఓషధులెలా ఆవిర్భవించునో, మానవుని తల మీద, శరీరము మీద కేశములు ఎలా ఉద్భవించపనో అలాగే అక్షర తత్వము నుండి ఆవిర్భవిస్తుంది. |
తపసా చీయతే బ్రహ్మ తతోఽన్న మభిజాతే |
తపస్సులో యున్న బ్రహ్మము సృజనాత్మక స్పందనతో పెరుగినది. అతని నుండి అన్నం జనించింది. అన్నము నుండి ప్రాణము, మనస్సుట సత్యమైనవి, లోకములు, కర్మలు, కర్మఫలములు కలిగినవి. |
యః సర్వజ్ఞ సర్వవిద్ యస్య జ్ఞానమయం తపః |
సర్వజ్ఞుడు, సర్వవిధుడు, జ్ఞానమే తపముగా గలవాడు అయిన బ్రహ్మ పదార్థము నుండి సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు, నామరూపములు, అన్నము ఉద్భవించినవి. |
ఇతి ప్రథమ ముండకే ప్రథమ ఖంణ్డః |
ఇది ప్రథమ ముండకములో ప్రథమ ఖండము. |
ద్వితీయ ఖండము
[మార్చు]మంత్రము | భావము |
---|---|
తదేతత్ సత్యం మన్త్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం స్తాని త్రేతాయాం బహుధా సన్తతాని |
శృతి మంత్రములలో ఏ కర్మలను ఋషులు దర్శించినారో అవి అన్నియు సత్యమైనవే. త్రేతాయుగములో ఇవి బాగా ఆచరించబడినవి. సత్యప్రియులై నిత్యమూ ఆ కర్మలను మీరూ ఆచరించండి. లోకములో పుణ్య ఫలములకు ఇదియే మార్గము. |
యదా లేలాయతే హ్యర్చిః సమిద్దే హవ్యవాహనే |
హోమాగ్ని చక్కగా మండుతూ, జ్వాలలు కదులుతూ ఉన్నపుడు అగ్నికి రెండు భాగాలమధ్య ఆహుతులు సమర్పించబడవలెను. |
యస్యాగ్నిహోత్ర మదర్శ మపౌర్ణమాస |
మానవుడాచరించు అగ్నిహోత్ర హోమము అమావాస్య నాడు ఆచరించ వలసిన కర్మ నాచరించకపోయినా, చాతుర్మాస్య వ్రతము నాచరించకపోయినా, నూర్పిడి సమయంలో అనుసరించ దగిన కర్మలు ఆచరించకపోయినా, అతిథులు పాల్గొనకపోయినా, వైశ్వదేవ ఆహుతులు లోపించినా, శాస్త్రవిరుద్ధముగా విధినిర్వహణ జరిగినా ఆ యజ్ఞము యజ్ఞకర్త యొక్క ఏడు లోకాలను ధ్వంసం చేస్తుంది. |
కాలీ కరాలీ చ మనోజవా చ |
కాలీ, కరాలీ, మనోజవా, సులోహితా, సుధూమ్రవర్ణా, స్పులింగినీ, విశ్వరుచీదేవీ అనునవి కదులుతున్న అగ్ని యొక్క ఏడు నాలుకలు. |
ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు |
దేదీప్యమానములగు ఈ జ్వాలలో ఎవడు యథాకాలములో ఆహుతు లంద జేయునో, అతనిని ఆ ఆహుతులు సూర్యకిరణాలై దేవతలకు ప్రభువైన ఇంద్రుడు నివసించు స్థలమునకు తీసుకొని పోతాయి. |
ఏహ్యేహీతి తమాహుతయః సువర్చసః |
మెరియుచున్న ఆహుతులు ప్రియ వచనములు పలుకుతూ, అర్చించుచూ, - మా పుణ్యఫల విశేషముచే లభించిన పవిత్ర బ్రహ్మలోకము ఇదే - అని తెలుపుచు - రండి రండి - అని ఆహ్వానించుచు యజమానిని సుర్యకిరణాల ద్వారా తాసుకొనిపోతాయి. |
ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా |
అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివే. |
అవిద్యాయా మంతరే వర్తమానాః |
అజ్ఞానములో చరిస్తూ, తామే ధీరపురుషులని, ప్రజ్ఞావంతులని ఆత్మస్తుతి ఒనర్చుకొను మందమతులు శోకగ్రస్తులై, అంధునిచే నడిపించబడు అంధునివలె దిక్కుతోచక పరిభ్రమిస్తుంటారు. |
అవిద్యాయాం బహుధా వర్తమానా |
అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు పిల్లలవలె భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రందికి జారుదురు. |
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం |
కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు. |
తపః శ్రద్దే యే హ్యుపవనం త్యరణ్యే |
శాంతమనస్కులు, విద్వాంసులు, భిక్షాటన జీవనముతో అరరణ్యములో తపస్సు శ్రద్ధలతో జీవితమును సాగించు బుధజనులు, శుద్ధిపడిన వారై, సూర్య మార్గము ద్వారా అమృతము, అవ్యయమునైన పురుషుడు ఉండు స్థానమునకు చేరుతారు. |
పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో |
కర్మల ద్వారా లభించే లోకాలను పరీక్షించిన పిదప నిత్యమైనది కర్మలద్వారా పొందబడేదికాదు అని గ్రహించి ముముక్షువు కర్మల పట్ల నైరాశ్యమును పొందాలి. పరతత్వమును గ్రహించుటకు సమిధలను చేతపట్టుకొని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువును సమీపించవలెను. |
తస్మై స విద్యా నుపసన్నాయ సమ్యక్ |
ఇంద్రియ నిగ్రహము కలిగి, ఉపశమించిన మనస్సు కలిగి, శాస్త్రోక్త రీతిని ఆచార్యుని సమీపించిన శిష్యునికి, బ్రహ్మవిదుడైన గురువు సత్యస్వరూపము, అక్షర విద్యయూనైన బ్రహ్మజ్ఞానమును భోధించవలెను. |
ఇతి ప్రథమ ముండకే ద్వితీయ ఖంణ్డః |
ఇది ప్రథమ ముండకములో ద్వితీయ ఖండము. |
ద్వితీయ ముండకము
[మార్చు]ప్రథమ ఖండము
[మార్చు]మంత్రము | భావము |
---|---|
తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్ |
ఓ సౌమ్యుడా, ఇదియే సత్యము, జ్వలించు అగ్నినుండి అలాంటివేయగు నిప్పురవ్వలు ఎలా జనిస్తాయో, అలాగే అక్షర బ్రహ్మమునుండి నానావిధములైన జీవులు ఉద్భవిస్తాయి. మరల అందులోనే లయించి పోతాయి. |
దివ్యో హ్యమూర్తః పురుషః |
స్వప్రకాశము, నిరాకారము, అజము, విశుద్ధము, సర్వవ్యాపకము అగు పురుషుడు వెలుపల, లోపల ఉన్నవాడై, మనోప్రాణములు లేనివాడై, అక్షర స్వరూపమునకు అతీతముగా ఉన్నాడు. |
ఏతస్మా జ్ఞాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ |
దానినుండి ప్రాణము, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, సకలాధారమైన భూమి అన్నీ పుడతాయి. |
అగ్నిర్మూర్దా చక్షుషీ చంద్రసూర్యౌ |
దానికి దేవలోకమే శిరస్సు, సూర్యచంద్రులే నేత్రములు, దిక్కులే చెవులు, వేదములే తెరిచియున్న నోళ్ళు, గాలియే ప్రాణము, విశ్వమే హృదయము. దాని పాదముల నుండియే భూమి ఉద్భవించినది. ఇదియే సర్వభూతాంతరాత్మ. |
తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః |
దానినుండి సూర్యుడే సమిధగాగల మొదటి అగ్నియైన దేవలోకము, చంద్రుని నుండి వర్షమేఘములు, మేఘముల వర్షము వలన భూమిపైన ఓషధులు, వాని నుండి పురుషుడు, ఆ పురుషుడు స్త్రీయందు రేతఃపాతం చేస్తాడు. ఈ విధముగా దాని నుండి ఎన్నో జీవులు ఉద్భవిస్తాయి. |
తస్మాదృచః సామ యజూంషి దీక్షా |
దానినుండి వేద ఋక్కలూ, సామగానాలు, యజ్ఞవిధులు, వ్రతదీక్షలు, క్రతువులు, కర్మలు, యజ్ఞదక్షిణలు, యజ్ఞసమయమూ, యజమాని, సూర్యచంద్రులు, పునీతం చేయు లోకాలు జనించాయి. |
తస్మాచ్చ దేవా బహుధా సంప్రసూతాః |
దానినుండి వివిధ దేవతలు, సాధ్యులు, మానవులు, పశువులు, పక్షులు, ప్రాణా పాన వాయువులు, వరి - యవ ధాన్యములు, తపస్సు, శ్రద్ధ, సత్యము, బ్రహ్మచర్యము, విధులు అన్నీ జనించాయి. |
సప్తప్రాణాః ప్రభవన్తి తస్మాత్ |
దానినుండి సప్త ప్రాణములు, సప్తజ్వాలలు, సప్తసమిధలు, సప్తాహుతులు, హృదయగుహలో ఉంటూ ప్రాణశక్తులు సంచరించు ఏడుఏడు లోకములు అన్నీ జనించినవి. |
అతః సముద్రా గిరయశ్చ సర్వేఽ |
అన్ని సముద్రాలు, పర్వతాలు కూడా దాని నుండే ఆవిర్భవించాయి. అన్ని నదులు దానినుండే ప్రవహిస్తాయి. పంచభూతముల చేత ఆవరింపబడినది సూక్ష్మశరీరము కాగా, ఏ ఓషధుల రసాదుల చేత పంచభూతములు పోషించబడుచున్నవో ఆ ఓషధులు కూడా దానినుండే సంభవించినవి. |
పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం |
కర్మ, తపస్సు, ఈ విశ్వము అంతయూ పురుషడే. ఇది అంతయు పరమము, అమృతమునైన బ్రహ్మమే. ఓ సౌమ్యుడా, అది హృదయగుహలో నిండి యున్నదని ఎవడు తెలిసికొనునో వాడు అజ్ఞాన గ్రంథిని ఛేదించును. |
ఇతి ద్వితీయ ముణ్డకే ప్రథమ ఖణ్డః |
ఇది ద్వితీయ ముండకములో ప్రథమ ఖండము. |
ద్వితీయ ఖండము
[మార్చు]మంత్రము | భావము |
---|---|
ఆవిః సన్నిహితం గుహాచరం నామ |
ప్రకాశవంతమైనది, అతి చేరువలో ఉన్నది, హృదయ గుహలో చరించునది అయిన బ్రహ్మము సకలమునకు ఆధారమై యున్నది. కదిలేవీ, శ్వాసించేవీ, రెప్పలార్పేవీ - సమస్త ప్రపంచము బ్రహ్మములోనే ప్రతిష్ఠితమై ఉన్నవి. స్థూల సూక్ష్మములు తానైనదీ, ఆరాధ్యమైనది, సర్వోత్కృష్ణమైనది, విజ్ఞానమునకు కూడా అతీతమైన బ్రహ్మమును తెలుసుకో. |
యదర్చిమత్ యదణుభ్యోఽణుచ |
ప్రకాశవంతము, అణువు కంటెను సూక్ష్మము ఐన అక్షర పరబ్రహ్మతత్వము సకల లోకములకు, ఆ లోకవాసులకును నిలయము. అదియే ప్రాణము. వాక్కు, మనస్సు, సత్యము, అమరత్వమును, తెలియదగినది అదియే. ఓ సౌమ్యుడా, తెలుసుకో. |
ధనుర్గృహీ త్వౌపనిషదం మహాస్త్రం |
ఓ సౌమ్యుడా, ఉపనిషత్తులు అందించు మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకొని, నిత్యోపాసనచే పదునెక్కిన బాణమును సంధించు. అక్షర పరబ్రహ్మమే లక్ష్య స్థానము అని తెలుసుకో. |
ప్రణవోధనుః శరోహ్యత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే |
ఓంకారమే ధనుస్సు. ఆత్మయే బాణము. బ్రహ్మమే లక్ష్స్థానము. ఏమరుపాటు లేని చిత్తముతో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. శరము లక్ష్యాన్ని ఛేదించి ఆ స్వరూపముతో ఏకమగునట్లు బ్రహ్మతో ఐక్యమైపోవాలి. |
యస్మిన్ ద్యౌఃపృథివీ చాంతరిక్షమోతం |
భూమ్యాకాశములు, వాటి మధ్యనున్న అంతరిక్షము, మనస్సు, పంచప్రాణాలు దేనియందు అల్లుకొని ఉన్నవో అదియే ఆత్మ అని తెలుసుకో. అన్యమైన వ్యర్థప్రసంగాలు వదిలిపెట్టు. అమృతత్వమునకు అదియే వారధి. |
అరా ఇవ రథనాభౌ సంహతా యత్రనాఢ్యః |
రథచక్రము లోని ఆకులు అన్నియు ఇరుసును చేరియున్నట్లు, ఎక్కడయితే నాడులన్నియు కలసిపోతావో, ఆ హృదయములో ఆత్మ అనేక విధములై చరిస్తూ ఉంటుంది. ఆత్మనే - ఓం - కారముగా ధ్యానించండి. అంధకారమును అధిగమించి ఆవలిగట్టు చేరుట లో మీకు శుభములు కలుగు గాక. |
యః సర్వజ్ఞ సర్వవిద్యస్యైష మహిమా భువి |
బ్రహ్మము సర్వజ్ఞుడు, సర్వవిదుడు. ఈ జగత్తులో గోచరించున దంతయు అతని వైభవమే. ప్రాణ శరీరాలకు నాయకుడై, మనోవస్త్రమును ధరించి, హృదయాకాశము లోని తేజోవంతమైన బ్రహ్మపురిలో అతడు స్థిరమై ఉన్నాడు. హృదయములో ప్రతిష్ఠితమై శరీరమంతటా నివసించును. బ్రహ్మముయొక్క పరిపూర్ణ జ్ఞానమును పొంది ధీర పురుషులు ఆనంద స్వరూపుమైన అమృతత్వమును దర్శించెదరు. |
బిద్యతే హృదయ గ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః |
హెచ్చుతగ్గులను వీక్షించగానే అజ్ఞానపు ముడి వీడిపోతుంది, అన్ని సందేహాలు కరగిపోతాయి, కర్మలన్నీ నశించి పోతాయి. |
హిరణ్మయే పరేకోశే విరజం బ్రహ్మ నిష్కలం |
నిర్మలమైనది, నిష్కల్మషమైనది, పరిశుద్ధమైనది, జ్యోతులకు జ్యోతియైనది యగు బ్రహ్మము నిగూఢమైన హిరణ్మయకోశములో ఉన్నట్లు ఆత్మవిదులు తెలిసికొనిరి. |
న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం |
అక్కడ సూర్యుడు ప్రకాశింపడు, చంద్ర తారకలు వెలుగు నీయవు. మెరుపులు కూడా కాంతినొందవు. ఇక అగ్ని మాట చెప్పనేల. అతని ప్రకాశము ననుసరించే సర్వము ప్రకాశించును. ఈ యావత్ప్రపంచము అతని వెలుగు చేతనే వెలుగు చున్నది. |
బ్రహ్మవేద మమృతం పురస్తాద్ బ్రహ్మ |
ఇదంతయు అమృతమయమైన బ్రహ్మమే. ముందు, వెనుక, ఈప్రక్కనూ, క్రిందా పైననూ సర్వత్రా బ్రహ్మమే వ్యాపించి యన్నది. ఈ సకల జగత్తు యథార్థానికి సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మమే అయి ఉన్నది. |
ఇతి ద్వితీయ ముణ్డకే ద్వితీయ ఖణ్డః |
ఇది ద్వితీయ ముండకములోని ద్వితీయ ఖండము. |
తృతీయ ముండకము
[మార్చు]ప్రథమ ఖండము
[మార్చు]మంత్రము | భావము |
---|---|
ద్వా సుపర్ణా సయుజా సఖాయా |
స్నేఙితులై, సదా కలిసి యుండే రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నవి. వాటిలో ఒకటి చెట్టు పండ్లను ఆసక్తిగా తింటుండగా, మరియొకటి ఏమీ తినక వీక్షించుచున్నది. |
సమానే వృక్షే పురుషో నిమగ్నోఽ |
ఒకే వృక్షము నాశ్రయించి యున్న రెండు పక్షులలో ఒకటైన జీవాత్మ అజ్ఞానంలో, భ్రాంతిలో మునిగి తన అశక్తతకు శోకించుచున్నది. పూజార్హమును, ప్రభువును అగు మరొక దానిని, అనగా పరమాత్మను, దాని వైభవమును చూడగానే దాని దుఃఖమంతా చెదిరిపోవుతున్నది. |
యదాపశ్యః పశ్యతే రుక్మవర్ణం |
స్వప్రకాశమై, బ్రహ్మయోనియై, విశ్వకర్తయై, విశ్వభర్తయైన పరమాత్మను సాక్షాత్కరించుకొనిన ప్రజ్ఞావంతుడు పాపపుణ్యముల నధిగమించి, నిర్మలము, సర్వోత్తమమునైన సమస్థితిని అందుకొనును. |
ప్రాణోహ్యేష యః సర్వభూతై ర్విభాతి |
ప్రాణులకు ప్రాణమై, సర్వజీవులలో ప్రకాశించుచున్న బ్రహ్మమును తెలుసుకొనినవాడు, వ్యర్థప్రసంగములు చేయక నిజమైన విద్వాంసుడు అవుతాడు. అతడు ఆత్మయందే క్రీడిస్తూ, రమిస్తూ, పుణ్యకర్మల నాచరిస్తూ బ్రహ్మ విదులలో అగ్రస్థానం వహిస్తాడు. |
సత్యేన లభ్య స్తపసా హ్యేష ఆత్మ |
సత్యము, తపస్సు, సమ్యక్ జ్ఞానము మరియు బ్రహ్మచర్యముల నిత్య సాధనల చేత ఆత్మ లభ్యపడును గాన, వాటిని చక్కగా అలవరచుకొనుము. దోషములు అంతరించగానే జ్యోతిర్మయము, పరిశుద్ధము నైన ఆత్మను సన్యాసులు దేహములోనే దర్శింతురు. |
సత్యమేవ జయతే నానృతం |
సత్యమే జయిస్తుంది. అసత్యము కాదు. సత్యము చేతనే దేవయానము ఏర్పడియున్నది. ఆప్తకాములైన ఋషులు ఈ మార్గము ద్వారానే సత్యనిలయమైన పరంధామము చేరుతారు. |
బృహచ్చ తత్ దివ్య మచింత్య రూపం |
పెద్దది, దివ్యమైనది, చింతించుటకు వీలుకానిది, సూక్ష్మాతి సూక్ష్మమునునై బ్రహ్మము ప్రకాశిస్తుంది. దూరాతి దూరమునై ఉన్నది. ఇది ఇక్కడే ఈ శరీరములోనే ఉన్న హృదయగుహలోనే ఉన్న దానిని ఋషులు సాక్షాత్కరించుకొందురు. |
న చక్షుషా గృహ్యతే నాపివాచా |
ఆత్మను కన్నులు చూడలేవు. మాటలు వర్ణించలేవు, ఇతరములైన ఇంద్రియములు గ్రహించలేవు. కర్మలు, తపస్సు దానిని వ్యక్తపరచలేవు. అవగాహన శుద్ధిపడి, ప్రశాంతత నొందినపుడు, ధ్యానస్థితిలో ముముక్షువు అద్వయమైన ఆత్మను దర్శించుతాడు. |
ఏషోఽణు రాత్మా చేతసా వేదితవ్యో |
ఐదు విధములుగ ప్రాణము వ్యాపించి యున్న ఈ దేహములోనే బుద్ధిప్రకాశం ద్వారా ఆత్మను తెలుసుకోవాలి. మానవుని బుద్ధి ఇంద్రియములతో అల్లుకుపోయి ఉన్నది. బుద్ధి నిర్మలము కాగానే ఆత్మ అందు ప్రకాశిస్తుంది. |
యం యం లోకం మనసా సంవిభాతి |
విశుద్ధ బుద్ధి కలవాడు ఏయే వస్తువులను వాంఛిమచినా, ఆయా వస్తువులను, లోకములను అతడు పొందుతాడు. కనక శ్రీమంతుడు కాగోరువాడు బ్రహ్మజ్ఞానిని ఆరాధించాలి. |
ఇతి తృతీయ ముంణ్డకే ప్రథమ ఖణ్డః |
ఇది తృతీయ ముండకములోని ప్రథమ ఖండము. |
ద్వితీయ ఖండము
[మార్చు]మంత్రము | భావము |
---|---|
స వేదై తత్ పరమం బ్రహ్మధామ |
దివ్యమై ప్రకాశించునది, సమస్త విశ్వమునకు ఆధారమైనది యగు పరబ్రహ్మమును ఆత్మజ్ఞాని తెలుసుకొనును. కోరికలు లేనివారై అట్టి ఆత్మజ్ఞానిని ఆశ్రయించువారు పునర్జన్మను అధిగమిస్తారు. |
కామాన్ యః కామయతే మన్యమానః |
విషయాలను సదా స్మరించుకొంటూ వాటి కొరకు అర్రులుచాచువారు తమ వాంఛలు తీరడానికి అక్కడక్కడ జన్మిస్తుంటారు. ఐతే ఆత్మానుభూతి పొందినవానికి సర్వ కోరికలు తీరనివి కాగా, ఈ జన్మయందే అన్ని కోరికలు నశించును. |
నాయ మాత్మ ప్రవచనేన లభ్యో |
ప్వచనముచేత గాని, గొప్పగా శాస్త్రాధ్యయనము చేయుట చేత గాని, మేధస్సు చేత గాని ఆత్మ పొందబడదు. ఎవరైతే హృత్పూర్వకముగా పొందుటకు ప్రయత్నించునో అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును చెలియజేస్తుంది. |
నాయమాత్మా బలహీనేన లభ్యో |
బలహీనులకు, అవిధేయులకు, తగని తపస్సులు చేయు వారికి ఆత్మ లభించదు. దృఢాభిప్రాయులై ఉచిత రీతిన ప్రయత్నంచే వారి ఆత్మ బ్రహ్మైక్యము పొందును. |
సంప్రా ప్యైన మృషయో జ్ఞానతృప్తాః |
ఆత్మలాభము పొందిన ఋషులు జ్ఞానముతో తృప్తి చెందిరి. కోరికలు తీరిన వారైరి. సంగరహితులై ప్రశాంత చిత్తులైరి. సర్వగతమైన ఆత్మను సాక్షాత్కరించుకొని, యుక్తాత్ములైన ఆ ఋషులు అన్నింటిలో ప్రవేశింతురు. |
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః |
సన్యాస యోగము చేత పరిశుద్ధమైన అతఃకరణ గలవారగు పవిత్రాత్మలు ఉపనిషత్తులయందు తెలుపబడిన జ్ఞానమును క్షుణ్ణముగా తెలుసుకొను చున్నారు. వారందరును జన్మాంతమందు బ్రహ్మలోక ప్రాప్తిని పొంది విముక్తు లగుచున్నారు. |
గతాః కలాః పంచదశ ప్రతిష్ఠా |
వారి పదిహేను అంశాలు వాటి కారణాలలో చేరిపోతాయి. ఇంద్రియాలు వాటి అధిదేవతలలో కలిసిపోతాయి. వారి కర్మలు, వ్యక్తిత్వము పరమ మైన అక్షరతత్వంలో లీనమవుతాయి. |
యథా నద్యః స్యందమానాః సముద్రేఽస్తం |
ప్రవహించు నదులు నామరూపాలు వదిలి ఎలా సాగరములో ఐక్యమగునో అలాగుననే ఆత్మజ్ఞాని నామరూపాలనుండి విడిపడి సర్వోత్కృష్టము, ప్రకాశవంతము నైన పరబ్రహ్మలో లీనమగును. |
స యో హవైతత్ పరమం బ్రహ్మవేద |
బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే కాగలడు. బ్రహ్మవిదుడు కాని వాడు అతని వంశములో జన్మిచడు. హృదయ గ్రంథులు వీడిపోగా శోకమునకు, పాపమునకు దూరుడై అతడు అమరుడౌతాడు. |
తదేత దృచాభ్యుక్తం - |
ఇదియే వేదముచేత ప్రవచించబడినది. సక్రమ కర్మాచరణగల వారికి, వేద పారంగతులకు, బ్రహ్మనిష్టగల వారికిట ఏకర్షి అగ్నిహోమ మాచరించువారికి, శాస్త్రోక్తరీతిని శిరోవ్రతాన్ని అనుసరించువారికి మాత్రమే ఈ బ్రహ్మవిద్య నుపదేశించాలి. |
తదేతత్ సత్య మృషి రంగిరాః పరోవాచ నై తదచీర్ణ వ్రతోఽధీతే |
ఇదియే సత్యము. ఈసత్యమును ప్రాచీన కాలములో అంగిరస మహర్షి తన శిష్యులకు తెలియజేసెను. ఏ వ్రతమును ఆచరించనివాడు దీనిని అధ్యయనము చేయరాదు. పరమ ఋషులారా మీకు నమస్కృతులు. మహా ఋషులారా మీకు నమస్సులు. |
ఇతి తృతీయ ముణ్డకే ద్వితీయ ఖణ్డః |
ఇది తృతీయ ముండకములో ద్వితీయ ఖండము. |
ఇతి ముణ్డకోపనిషద్ సమాప్తాః |
ముండకోపనిషత్తు సమాప్తము. |
జై గురుదేవ్
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు