మీఁగడతరకలు/సూరకవి—బంధువుఁడు
స్వరూపం
సూరకవి - బంధువుఁడు
తన్ను కుక్కలు వెన్నంటి తఱుమ తఱుమ,
సూరకవి యొక్క దినమున పాఱిపోయి
ఎట్టొ తప్పించుకొనివచ్చి తుట్టతుదకు
జొచ్చె నొకయిల్లు నిట్టూర్పు పుచ్చికొనుచు.
వాని నెటు లైన నవమానపఱుప నెంచి
బందుగుఁ డొకండు దొరకెఁ గా సం దటంచు
"బావ ! ఇది యేమి? గాడిదవలెను బెదరి
పరుగువాఱితి " వని వాని పరిహసించె.
శ్వానభయమున పరుగెత్తి వచ్చినాఁడ
శీఘ్రముగ నింక మందలోఁ జేరుకొంటి,
కాన నిప్పుడు ధైర్యంబు కలిగె" నంచు
బదులు పలికెను కవి యంత బందుగునకు,