మీఁగడతరకలు/రాజు—కాఁపువాఁడు
రాజు - కాఁపువాఁడు
ఒక్కనాఁ డొక భూవరుఁ డుదయ వేళ
హయము పై నెక్కి స్వారీకి బయలువెడలె;
కోట దాఁటి యతం డట్లు కొలఁదిదూర
మేగుసరి కొకకాఁపువాఁ డెదురుపడియె.
ఏమిచిత్రమొ కాని- యానృపునిహయము
కాఁపువానిని దవ్వునఁ గాంచినంత
బెదరి యట్టిట్టు గంతులువేసి తుదకు
నేలమీఁదికి భూవరుఁ గూలద్రోసె.
క్రిందఁ బడినను గాయంబు నొందకుండ
తోడనే లేచి యొడ లెల్లఁ దుడిచికొనుచు
హయముపై నెక్కి క్రమ్మర రయము మీఱ
కోటలోనికిఁ జనె ఱేఁడు కోప మడర.
| చని జటిలున నంత నామనుజవిభుఁడు | |
| "ఉదయమున లేచి యెవ్వరివదనములను | |
| ఇంక నీతనివదనంబు నెవ్వ రైన | |
| తనకు నెటులైన మరణంబు తప్ప దనుచు | |
"ప్రొద్దుననె లేచి నాపాడుమొగము మీరు
పావనం బగు తావకవదన మేను
నొక్కసారిగా నిరువుర మొకరి నొకరు
కాంచితిమి గాదె యెవ్వరిఁ గాంచగుండ.
సాదువదనంబు గాంచి భూనాధ ! మీరు
పుడమిపై నశ్వముననుండి పడితి రంతె;
కాని దేవరవదనంబు గాంచి నేను
మరణశిక్షకుఁ బాల్పడి మడియనుంటి.
కాన నెవ్వరివదనంబు హానికరమొ
అరసి లెస్సఁగ దేవర యానతిండు"
అనుడు, సిగ్గున మాఱు మాటాడలేక
వెంటనే కాఁపువానిని విడిచె ఱేఁడు