Jump to content

మీఁగడతరకలు/ఆఁబోతు

వికీసోర్స్ నుండి

ఆఁబోతు


వెల్ల యేనుంగుగున్న నా, విభవ మొప్ప
గోపురంబును బోలిన మూపురంబు
గ లిగి, నగరవీధుల వెంటఁ గదలియాడి,
ఒకరి జోలికిఁ బోవక, ఒకరిచేత
నదలువులను బడక , యథేచ్ఛానురీతి
నిబ్బరంబుగ నఱ్ఱాడి, యుబ్బు మెఱయ
అంగడులను జొచ్చి, పురజను లాదరమున
తనివి తీఱఁగ బెట్టడి ధాన్యములను
నోరినిండఁగ నిరికించి యారగించి,
కూర్మిమై వారు గంగడోల్ గోఁకుచుండ,
మోర సారించి యొయ్యారముగను నిలిచి,
కసుల నరమోడ్చి పరవశంబునను జొక్కి,
సెలవులను మూఁగు నడవియీఁగలు కలంగి
బెదర, నాఁబోతు గుఱకలు వెట్టుచుండె.