మా కొద్దీ తెల్లదొరతనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


గరిమెళ్ళ సత్యనారాయణ (1893-1952) జాతీయ స్వాతంత్ర్య గేయకవి.


మా కొద్దీ తెల్లదొరతనము |దేవ|

మా | ప్రాణాలపై పొంచి మానాలు హరియించె ||మాకొద్దీ||


పన్నెండు దేశాలు పండుచున్నగాని

పట్టెడన్నము లోపమండి | ఉప్పు ముట్టుకుంటె దోషమండి |

నోట | మట్టి కొట్టి పోతాడండి

అయ్యో | కుక్కలతో పోరాడి కూడు తింటామండి ||మాకొద్దీ||


చూడి యావుల కడుపు వేడివేడి మాంసం-వాడికి బహు ఇష్టమంట|

మాదు| పాడి పశువుల కోస్తాడంట, మా| మతము

పాడుచేస్తాడంట

మా| చూడియావుల మంద సురిగి ఇంటికిరాదు. ||మాకొద్దీ||


Public domain
భారత దేశపు చట్టాల ప్రకారం ఈ బొమ్మ/కృతి కాపీహక్కుల చట్టం అన్వయించకపోవటం లేక కాలదోషం పట్టడం వలన సార్వజనికమైంది. భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం అన్ని ఛాయాచిత్రాలు లేక సంస్థ కృతులు ప్రచురించిన 60 సంవత్సరాల తరువాత (అంటే, 01-01-1959 కంటే ముందువి) సార్వజనికమౌతాయి. రచనల కాపీ హక్కులు రచయితకున్నట్లయితే రచయిత మరణించిన 60 సంవత్సరాల తరువాత సార్వజనీకమౌతాయి.
Flag of India.svg