మారుతే నమోస్తుతే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప : మారతే నమోస్తుతే మహామతే మారుతే నమోస్తుతే ||మా ||

చ : 1. శ్రీ రఘూత్తమ పాదచింత నాప హత భేద పూరితాంతర ప్రమోద భూషిత ధీతవేద ||మా ||

2. బుడ్డిబలాది దాన పోషితాఖిల ధీన సిద్ధయోగీశ ప్రదాన శ్రీహరే మంజులగాన ||మా ||

3. భద్రగిరి రామపాద భక్తి జనిత వినోద భద్రదాయక ప్రసీద పాహిమాం మంజులనాద ||మా ||