Jump to content

మారిషస్‌లో తెలుగు తేజం/చిత్రమాలిక

వికీసోర్స్ నుండి
మారిషస్ ప్రధానమంత్రి శ్రీ అనిరుద్ధ జగన్నాథ్, విద్యామంత్రి శ్రీ ఆర్ముగం పరశురామన్, ఇంధన, జలవనరుల మంత్రి శ్రీ మహేన్ ఉచ్ఛన్నలతో శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీ బుద్ధప్రసాద్.
మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు దంపతులకు గాంధీ ప్రతిమ బహూకరిస్తున్న శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీ బుద్ధప్రసాద్


మారిషస్ ప్రధాని శ్రీ అనిరుద్ధ జగన్నాధ్, మంత్రులు శ్రీ ఆర్ముగం పరశురామన్, శ్రీ ఉచ్చన్నలతో శ్రీ మండలి.
లిరిడూట్ లో శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ మండలి వెంకట కృష్ణారావు, మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య, మలేసియా తెలుగు సంఘ అధ్యక్షుడు శ్రీ పాల్ నాయ్డు, శ్రీ సత్యారావు.


భారత హైకమిషనర్ శ్రీ కె.కె.ఎస్. రాణాకు మెమెంటో బహూకరిస్తున్న శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీ బుద్ధప్రసాద్.
లాలౌరాలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న శ్రీ మండలి వెంకట కృష్ణారావు. చిత్రంలో మారిషస్ ప్రధాని శ్రీ అనిరుద్ధ జగన్నాధ్ కూడ కలరు.


శ్రీ మండలి వెంకట కృష్ణారావుని సన్మానిస్తున్న డా॥ సి. నారాయణరెడ్డి.
దక్షిణాఫ్రికా ప్రతినిధుల వీడ్కోలు విందులో ప్రసంగిస్తున్న శ్రీ మండలి. చిత్రంలో శ్రీమతి జమున, డా. అక్కినేని ప్రభృతులు కలరు.


మహాసభలకు అరుదెంచిన ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్న తెలుగు ఆడపడుచులు
మహాసభల ముఖద్వారం ముందు రంగు రంగుల రంగవల్లిక.


ప్రదర్శనలో ఉంచిన ప్రాచీన తెలుగు గ్రంథాలు
లాలౌరాలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం.


మారిషస్ లో ఒక సుందర ప్రదేశంలో శ్రీ బుద్ధప్రసాద్, శ్రీ ఆచంట వెంకటరత్నం నాయ్డు, శ్రీ. ఎం.వి. కృష్ణారావు, శ్రీమతి శోభారాజ్, డా. నందకుమార్, శ్రీ సి.వి. నరసింహారెడ్డి, శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు, శ్రీ వేణు మాధవ్, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు.
దక్షిణాఫ్రికా సంఘం అధ్యక్షుడు శ్రీ. టి.పి. నాయ్డుకు మెమెంటో బహుకరిస్తున్న శ్రీ మండలి.


తెలుగు మహాసభల ముగింపు సమావేశంలో బహుమతి ప్రదానం చేస్తున్న శ్రీ మండలి వెంకట కృష్ణారావు.
మోకాలో మహాత్మా గాంధీ విగ్రహం చెంత డా. శివరామమూర్తి, డా. నరసింహారెడ్డి, బుద్ధ ప్రసాద్, గోవిందరాజు, రామకృష్ణరావు ప్రభృతులు.


మారిషస్ గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడుతో శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్.
Indians arrive at immigrant steps, Port Louis, Mauritius, 1842.


Places of Origin of Telugu Settlers in Mauritius.

"మారిషస్‌లో తెలుగు తేజం" పుస్తక రచయిత శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ 26-5-56 సంవత్సరంలో కృష్ణాజిల్లాలో జన్మించారు. మాజీమంత్రి, ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సారధి శ్రీ మండలి వెంకట కృష్ణారావు, ప్రభావతీ దేవిగార్ల ప్రథమ పుత్రులు; బి.ఏ. పట్టభద్రులు. సాంఘిక సేవ, సాహితీ పిపాస, సంస్కృతి పట్ల అంతులేని మక్కువ గల శ్రీ బుద్ధ ప్రసాద్ చిన్ననాటి నుంచే రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు. అవనిగడ్డ గాంధీక్షేత్రం, సేవాశ్రమం నిర్వాహకుడుగా, "గాంధీక్షేత్రం" మాస పత్రిక సంపాదకుడిగా గాంధేయ భావ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సుకు నిరంతర కృషి చేస్తున్న వ్యక్తి. 1990 డిశెంబర్ లో మారిషస్ లో జరిగిన తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న శ్రీ బుద్ధ ప్రసాద్ మారిషస్ యాత్రానుభవాలను, తెలుగు వారి జీవన విధానం గురించి తెలుగు భాష పట్ల అక్కడి వారికి ఉన్న అభిమానాన్ని ఈ పుస్తకంలో సరళమైన భాషలో కళ్ళకు కట్టినట్లు వివరించారు.