మామవమృడజాయే మాయే
స్వరూపం
రాగం: వసంత. చతురశ్ర త్రిపుట తాళం.
ప: మామవ మృడజాయే మాయే మరకత మణివలయే గిరి తనయే||
అ: సోమ కులజ జయచామ మహీపతి కామిత ఫలదాయిని కాత్యాయని ||
చ: నారదాది ముని మానస సదనే తారకాధిపతి సన్నిభ వదనే
చారు రత్న రసనే సురదనే సారస లోచనే సామజ గమనే
సూరి జనావన నిరతే లలితే శారద రాగమ మహితే సుచరితే
భూరి కృపాన్వితే సురగణ వినుతే మారజనక వాసుదేవ సహజాతే ||