మామవతు శ్రీసరస్వతీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: హిందోళ. ఆది తాళం.

ప: మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని||

అ: కోమలకర సరోజ ధృత వీణా సీమాతీత వర వాగ్భూషణ ||

చ: రాజాధిరాజ పూజిత చరణా! రాజీవనయనా! రమణీయ వదనా!
                        (మధ్యమకాలం)
సుజన మనోరథ పూరణ చతురా! నిజగళ షోభిత మణిమయ హారా!
అజ భవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేదసారా ||