మానసమా నీవు మరువకుమీ పెన్ని
Appearance
మోహన రాగం త్రిపుట తాళం
ప: మానసమా నీవు మరువకుమీ పెన్ని
ధానము రామ మంత్రాను సంధానము || మానసమా ||
చ 1: సారంపు గురుభక్తి మీరకుమీ సం
సార ఘోరాటవిలో దూరకుమీ దరి
జేరని కోర్కెల కోరకుమీ అయి
దారింటి వెనువెంట బారకుమీ భ్రష్ట || మానసమా ||
చ 2: పరదైవములకు మ్రొక్కకుమీ స్త్రీలోల
సరసిజ ముఖులకు దక్కకుమీ ఘోర
నరక దుఃఖములెల్ల బాయు సుమీ దా
శరధీ కదామృత సారములో రుచి || మానసమా ||
చ 3: చిద్రూపము వెలుగొందుసుమీ అజ
చుద్రాదులకెల్ల విందుసుమీ దా
రిద్ర్య వ్యాధికి మందు సుమీ శ్రీ
భద్రాచల రామదాస పోషక భక్తి || మానసమా ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.