Jump to content

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

వికీసోర్స్ నుండి

చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)

రచన: తోలేటి

గానం: ఘంటసాల

సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం


ఓమ్

ఓమ్ నమః శివాయా...

నవనీత హృదయా.

తమః ప్రకాశా..

తరుణేందు భూషా.

నమో శంకరా! దేవదేవా..


మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా

మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా


భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ|

పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ|

మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా


మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త|

మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో|

నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ|

వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల|

మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా


ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువొ రుద్రయ్య |ఏక చిత్తమున|

ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రవయ్య |ప్రాతకముగ|

దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా |దీటుగ నమ్మితి|

వేట చూపుమా రుద్రయ్యా, వేట చూపుమా రుద్రయ్యా |వేట చూపుమా|