మహేంద్రజాలం/మా మాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మా మాట

ఇంతవరకు మేము ప్రచురించిన వివిధ వైవిధ్యము గల గ్రంథములను సమాదరించిన అశేష పాఠక మిత్రులకు మా హృదయ పూర్వక నమస్సుమాంజలులు.

మేము ఇంతకు పూర్వము ప్రచురించిన "ఇంద్రజాల రహస్యాలు " అను గ్రంధమును విశేషంగా ఆదరించిన అఖిలాంధ్ర పాఠక మహాశయుల ప్రోత్సాహమే ఈ గ్రంధ ప్రచురణకు నాంది అయినది.

ఇందులో - వినోదానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చే ఆధునిక ప్రదర్శనలేగాక - మూలికలు, రసాయనాల కలయికచే ఉద్భవించు చిత్ర - విచిత్ర పురాతన పద్ధతులను కూడ చేర్చడము జరిగినది.

ఈ ప్రదర్శనలు చేయు వారు సాంకేతిక ఇబ్బందులను తమ తమ అనుభవముతో గ్రహించి, సందర్భాను సారముగా ఏ ప్రదేశములలో - ఏ సమయములో - ఏ ప్రదర్శన చేయ వచ్చునో నిర్ణయించుకొన గలవారై యుండవలెను.

ఈ గ్రంధ ప్రచురణలో తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించిన వి.జి. చౌదరి (V.G.పబ్లికేషన్స్ అధినేత) గారికి...!

ఈ చిన్న పొత్తమును సర్వ జనాదరణీయముగా మలచిన రచయిత ఉషా పద్మశ్రీ గారికి...! మే మందించు వినోద విజ్ఞాన సాహిత్యానికి తమ వంతు ప్రోత్సాహాన్నిస్తున్న తెలుగు పాఠక మహాశయుల కు - మాకృతజ్ఞతలను తెలియ జేస్తూ - సెలవు తీసికొనె......మీ...............


----ప్రకాశకులు