మమ్మేలు మాతండ్రి
Appearance
రాగం:శివరంజని తాళం:ఖండ మమ్మేలు మాతండ్రి గణనాథా నమ్మితి నినులోన గణనాథా వేదాలు నీ స్తోత్రపాఠాలుగా శాస్త్రాలు నీఇంటి దారులుగా దేవా! పురాణాలు నీకథలుగా కావ్యాలు గానాలు నీకీర్తిగా హేరంబ దేవా! హేమాంచితాంగా! శ్రీరమ్యహాసా! శ్రితపాపనాశా! హే ఏకదంతా! హే వక్రతుండా! హే శూర్పకర్ణా! హే లంబతుండా! వేదాంతవేద్యా! వేషాతిదూరా! హే వికట! హే సౌమ్య! హే వామనా! ఆత్మస్వరూపా! ఆనందగోపా! హే సుముఖ! హే కపిల! హే బాలకా! మాలోని చెడులను మాయింపవా? మాలోని సద్బుద్ధి మొలిపింపవా? మాలోన త్యాగంబు కలిగింపవా? మాలోన నువు వచ్చి కొలువుండవా? మమకారబంధాలు తొలగింపవా ఈ అంధకారమ్ము తప్పింపవా నీ వెలుగు మాలోన గుప్పింపవా శ్రీ సచ్చిదానందమును చూపవా