మధురము శివ మంత్రం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిత్రం: కాళహస్తి మహాత్మ్యం (1954)

రచన: తోలేటి వెంకట రెడ్డి

సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం

గానం: ఘంటసాల


మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా! | మధురము |

ఇహపర సాధనమే.. ఏ... ఏ.

ఇహపర సాధనమే (4)

నరులకు సురుచిర తారకమే | ఇహపర |

ఆగమ సంచారా (2)

నా స్వాగతమిదె గొనుమా | ఆగమ |

భావజ సంహారా...(3)

నా నన్ను కావగ రావయ్యా | భావజ |

పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ.. (2)

మున్నీటను ముంచెదవో.. | పాలను |

భారము నీదయ్యా (2)

పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..

జయహే సర్వేశా! (2)

సతి శాంభవి ప్రాణేశా!..ఆ.. |జయహే!|

కారుణ్య గుణసాగరా!..(2)

శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా! |కారుణ్య గుణసాగరా!

మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!

ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే