మణి మాలికలు/సిరి వడ్డే

వికీసోర్స్ నుండి

సిరి వడ్డే 44, హుల్గాట్ రోడ్‌, కేంబ్రిడ్జ్‌,CBI-8, యునైటెడ్‌ కింగ్డమ్‌, కలం పేరు: సిరి వృత్తి: కేషియర్‌ (మార్కిెటింగ్ గ్రూప్స్‌) మొబైల్‌ నెం: 07466651509 ఈ-మెయిల్‌: vaddesiri@yahoo.com వెబ్‌: sirivadde.wix.com/sirimallelu

సిరిమల్లెలు... 1.

 నిలువెల్లా గాయాలే చేసినా
మది వేణువుకి ఎందుకో నీ తలపుల గేయాలే

2.

తలపుల వనాలను పెంచినది నేను
తుంటరి భ్రమరమల్లె వెంటబడేది నీవు

3.

మది సాగరంలో ముత్యపుసౌధాలు
నీ నవ్వులతో కట్టినవే

4.

రంగుల కలలై వెలిసిపోతున్నాయి
మది కాన్వాసుపై ముద్రించుకున్న నీ జ్ఞాపకాల చిత్రాలు

5.

మనోనోక్షేత్రం సుసంపన్నమే ఎపుడూ
నీఊసుల చిగురులను తొడుగుతూ

మణి మాలికలు జ సిరి వడ్డే

131 132

6.

చిగురిస్తున్నాయి శిశిరాలు కుసుమించే ఆశలతో శరత్‌ చంద్రికలై

7.

మౌనభావాలు మధురమే మనోసాగరతీరాన్ని ఆనందపు అలలుగా తాకుతుంటే

8.

 సిగ్గుల ముసురులేవో కమ్ముకుంటున్నాయి
నీ చూపుల చినుకులు చిటికెలతో సవ్వడి చేస్తుంటే

9.

నా మనసులో వెన్నెల కురుస్తోంది
నీ నవ్వులను దోసిలి పడుతుంటే

10.

అడుగులన్నీ అనాధలై మిగిలి పోయాయి
నీతో సప్తపది భాగ్యానికి నోచుకోలేక

11.

గెలుచుకున్నా నీ మదిలో స్థానాన్ని
కోల్పోయానని గుర్తించనేలేదు నా హృదయాన్ని

12.

సిగ్గుల మరుమల్లెలేవో సైగలు నేర్చుకుంటున్నాయి
అల్లరితుమ్మెదవై నువ్వు చెక్కిలి మీటుతుంటే

13.

మనోవనమంతా విస్తరించిన వలపు కొమ్మలే
తీపిరాగాల కోయిలమ్మవై నువ్వు వాలాలని

14.

ఉప్పొంగే ఆశల కెరటాలెన్నో
మనోసంద్రమంతా ఉప్పెనలై ఉరకలువేస్తూ

15.

గుండెల్లో నీఊహల గాజుదీపం పగిలిపోయింది
జ్ఞాపకాల శకలాలను మాత్రమే మిగిల్చి

మణి మాలికలు జ సిరి వడ్డే 16.

 మది పసిమువ్వై నర్తిస్తోంది
నీ గారాల నయగారాలకు

17.

మనోవనమంతా విరబూసిన పున్నాగలే
నీజ్ఞాపకాల పరిమళాలను వెదజల్లుతూ

18.

మదిసౌధంలో నీజ్ఞాపకాల ముత్యాలెన్నో
ఆశల సరాలుగా అల్లుకుంటూ

19.

కన్నీటి నావనై సాగిపోతున్నా
నీ జ్ఞాపకాల అలలపై

20.

నీ జ్ఞాపకాల గమకాలెన్నో
నా గుండె వేగంతో పోటీగా తాళం వేస్తూ

21.

నిశిరాతిరి వడిలో కునుకుతీస్తూనే ఉన్నా
నీ ఊసులెంతగా చిచ్చు పెడుతూన్నా

22.

వసంతఋతువులో తరువులా
ప్రేమ చిగురులు తొడుగుతోంది మనోవనమంతా

23.

నీచెక్కిలిపై చోటిస్తావా ఘడియైునా
కన్నీటి ముత్యాన్నై జారిపోతాను

24.

మరణానికైనా అడ్డుచెప్పను
మరుజన్మలోనైనా మనసిస్తానని నువ్వు మాటిస్తే

25.

స్వప్నమై మిగిలిపోతా
నీ కనుల మాటునే కొలువిస్తానంటే

మణి మాలికలు జ సిరి వడ్డే

133 134

26.

 నీతలపుల వాకిటనే కునుకు తీస్తున్నా
వలపుల తలుపులను తెరుస్తావనే ఆశతో

27.

ఇంత మొండిది ఏమిటో నా మనస్సు
నన్ను కాదాని నీకే వత్తాసు పలుకుతోంది

28.

సిగ్గుల మొగ్గలు విచ్చుకుంటున్నాయి
చెక్కిలిపై నీఅధరపు సంతకాలకు

29.

వలపులరేవులో ఊగిసలాడుతోంది ఊహలనావ
నీ జ్ఞాపకాల అల(ల )జడికి

30.

అరవిరిసిన నీ నవ్వులనే అద్ధుకుంటున్నాను
నా మనోకుసుమంపై , అనురాగపు పుప్పొడిగా

31.

వలపుల ముత్యాలెన్నో జాలువారుతున్నాయి
నీచెక్కి లిని తాకిన తమకంతో

32.

హృదికి సిరిమువ్వల నర్తనాలే
నీ ఊపిరివేణువు పలుకరిస్తుంటే

33.

ఆశల దీపాలనే వెలిగిస్తున్నా
చిరుగాలులకారని జ్ఞాపకాల జ్యోతులుగా

34.

మది కెరటం అలసి పోతోంది
నీఊహల ఘోషలమధ్య ఎగసి పడుతూ

35.

మనస్సు మూగబోతోంది
నీ తలపుల తపోవనంలో తచ్చాడుతుంటే

మణి మాలికలు జ సిరి వడ్డే 36.

రెప్పల మాటునే మేఘాలను నింపుకున్నాను

కన్నుల్ని నీకలల వర్షాలతో నింపుకోవాలని

37.

కనురెప్పలు నిదురను మరచి కాపలాకాస్తున్నాయి కలగా నువ్వు మరలి పోతున్నావనే

38.

మౌనాలేవో పెదవి విప్పుతున్నాయి మాటలు నేర్చిన కూనలమ్మలా

39.

జ్ఞాపకాల బృందావనిలో విహరిస్తున్నా మనోవేణువు ప్రణయరాగమే, ఆలపిస్తుంటే

40.

నా కనుపాపలకు పరిచయిస్తున్నా నీ చిరునవ్వుల వెన్నెలను

41.

నే ఆశల హరివిల్లునే అల్లుకుంటున్నాను చినుకువై నువ్వుfi మదిని తడిపేస్తుంటే

42.

లతలు తెగ వయ్యారాలు పోతున్నాయందుకనో ? కుసుమ కాంతలు తమను హత్తుకున్నాయనేమో !

43.

నీనవ్వుల తివాచీని పరిచావా ? పూలన్నీమూతి ముడిచాయి.!

44.

మదికి తడి తగిలేవరకు తెలియనేలేదు నీజ్ఞాపకాల బిందువులు సింధువులై తాకాయని

45.

నీనవ్వుల కాగడాను వెలిగించాను నిశీధి నీడలను పారద్రోలుదామని</poem>

మణి మాలికలు జ సిరి వడ్డే

135 136

46.

 నీజ్ఞాపకాలకే నేనంటే మక్కువ
నీకంటే ఎక్కువగానే అంటిబెట్టుకున్నాయి

47.

లాకులు తెరిచినా గంగ పొంగదే ?
రైతుల కన్నుల్లో వరదలై పోటెత్తుతూ

48.

అప్పుడప్పు డూ నువ్వు నచ్చవెందుకనో?
ఎప్పుడూ నీపంతాన్నే నెగ్గించుకుంటుంటే..!

49.

దుస్తులే భారమట నవతరానికి
ఆది మానవులే నయమనిపిస్తూ

50.

భూమాతకెంత మురిపెమో
హరితాంకురాలు ...తన గుండెను చీలుస్తున్నా

51.

ఓనమాలను దిద్దడం మొదలెట్టేసాను
నీకు ప్రేమలేఖ వ్రాసేద్దామని

52.

ఎవరు గిచ్చారో? గగనాన్ని ప్రేమగా
గోరుముద్రనే నెలవంకగా... తురుముకుంది సిగపూవుగా!

53.

కంటతడి పెడుతోంది కంటిపాప, నిదురను మరచి
నను వీడిపోతున్న నానీడవైన నిను చూసి

54.

కాలమెంత గడుసరిదో కదా!
మన కోసం తానాగదు, తనతో రమ్మనీ పిలువదు

55.

నే చిరునవ్వుగా మారింది
నీ పెదవులపై కొలువుండాలనే

మణి మాలికలు జ సిరి వడ్డే 56.

 మత్తకోకిలకు మరుపు ఎక్కువైనట్లుంది
మధుమాసానికి ముందే మైమరుస్తోంది

57.

బిడియాన్నే పూర్తిగా వదిలేసింది నామనసు
నువ్వెంతగా గాయపరుస్తున్నా నిన్నేస్మరిస్తూ

58.

ఈ జన్మకెంత ఆత్రమో
మరుజన్మలో నిన్నుఎలా కలవాలనే ఆలోచనలలో మునుగుతూ

59.

నాజాడనే మరిచింది వింతగా
నీ జాడలలోనే గుడ్డిగా నడుస్తున్న నా మనస్సు

60.

హోయలొలుకుతోంది శ్రావణ మేఘం
చినుకుల జూకాలను(లోలకులను)పెట్టుకుని

61.

నీ పరిచయంతోనే తెలిసింది
జ్ఞాపకాలకూ పరిమళం ఉంటుందని

62.

కనుపాపలకు యెంత కలవరమో?
కనుమరుగైపోయే నీరూపాన్ని చూపాలని

63.

వేపపూల వసంతం
నీతలపుల ఉగాదిలో

64.

కంటి ప్రమిదల్లో...ఆశలవత్తులెన్నో
కన్నీటి చమురులతోనే వెలిగిస్తూ

65.

కలువ భామకెంత మురిపెమో
నెలరాజు కురిపించే వెన్నెల చినుకులు తలంబ్రాలై తాకుతుంటే

మణి మాలికలు జ సిరి వడ్డే

137 138

66.

గరికపూలకు పులుముతున్నా
దోసిలిపట్టిన నీ దరహాసపు పరిమళాలను!

67.

నా మౌనానికి బాషను నేర్పెళ్లావు
రోజంతా నీనామమే జపం చేస్తోంది

68.

నా ఆత్మకి ప్రతిరూపం
నీ రూపంలో సంచరిస్తూ

69.

నీమాటలెపుడూ కమ్మని గేయాలే
తీయని గాయాలనే చేస్తూ

70.

రాలిపోయే పూలకెన్ని గాయాలో
కొమ్మను వీడే విషాదంలో

71.

రాధమ్మ మనసెంత గాయపడిందో
కన్నయ్య అందరి (అందని)వాడు అవుతున్నందుకు

72.

ఎన్ని గాయాలను మోసి ఉంటుందో వెన్నెలమ్మ
ప్రతి తారతో సరసాలాడే నెలరేడును తలచి

73.

మారణాయుధమే నేనౌతా
ఆపదే నీకు గాయం చేస్తే

74.

జ్ఞాపకాల శబ్దాలు
అంతరంగంపై శాశ్వత శిల్పాలను చెక్కుతూ

75.

మది జోగుతోంది కలల లోకంలో
నీ మాటల మత్తుగుళికలను మింగి

మణి మాలికలు జ సిరి వడ్డే 76.

ఋతువులు విడ్డూరంగా దారి తప్పాయి
వసంతాలన్నీ నీలోనికి...గ్రీష్మాలు నాలోనికి

77.

స్వచ్ఛతల కొలనులో ఉన్నట్లుంటుంది
మల్లెలాంటి నీనవ్వులు చూస్తుంటే

78.

విసురుతూనే ఉంటాడు వసంతుడు
ప్రతి తరువుపై వలపుశరాలు

79.

భావాలకెన్ని పరిమళాలో
నా తలపుల 'వన'మాలివి నీవైతే

80.

కరుగుతూనే ఉంది కాలం
హృదాయాన్ని శిలగా మిగిల్చి

81.

నీ జ్ఞాపకాలెపుడూ తీయనివే
మదిని చెరగనిగాయాలుగా మారుస్తున్నా

82.

గాలికి ఆరని చిరుదీపాన్నే !
నీ గుండెగుడిలో వెలిగినంతవరకూ

83.

మదిలో తారాదీపాలు...నీ నవ్వులు
హృదికి మలయమారుతాలు ...నీ ఊసులు

84.

సప్తపదులు నీతో వేస్తున్నా
సప్తజన్మలకు వారధిగా నిలిచిపోవాలని

85.

గుప్పెడంత గుండె అలసి సొమ్మసిల్లి పోతోంది
ఉప్పెనంత నీ ప్రేమ ప్రవాహాన్ని దాచుకోలేక

మణి మాలికలు జ సిరి వడ్డే

139 86.

నేనౌనంటే నువ్వు కాదంటావు
అచ్చం నా మాట వినని నా మనసులా

87.

ఎంత నేర్ప రివో
గుండెలోని హాలాహలం చల్లార్చి మాటలతో అమృతాన్నిచిలికించేస్తూ

88.

మనస్సు పరిమళిస్తోంది
వసంతునిలా వలపుల పల్లవులేవో ఆలపిస్తుంటే

89.

నీ నవ్వుల తివాచీ పరిచావా ?
అందరాని పాలపుంత చెంతచేరిందని భ్రమపడ్డా !

90.

తనువుకే కాదు
మనస్సుకు అలుపేనంట...నీ జ్ఞాపకాల భారాన్ని మోసి

91.

అక్షరాలన్నీ మెరిసే తారకలే
నీ పదాలను అల్లుకుంటే

92.

కన్నీటితో తొణికింది మదికొలను
నను విడిచిన మరుక్షణమే

93.

మనసూ మాటలు నేర్చింది
అధరాలపై దరహాసపులేఖలను లిఖిస్తూ

94.

ఆశావిహంగాలు ఎగిరిపోతున్నాయి
నీగుండెగూటిని చేరే దారి తెలియక

95.

గుండె పగిలిన చప్పుడుకేమో
దుఖగీతమాలపిస్తూనే..దొర్లిపోతోంది కాలం

140

మణి మాలికలు జ సిరి వడ్డే బి96.

నిను చేరాలనే తపనతోనే
సెకనుకోసారి లెక్కిస్తున్ననిమిషాలెన్నో

97.

నీ కలల ఆమని
మది అంచులలో వేలాడుతూ ఓ సుందర పూవని

98.

ఎంతాశో నామదికి
నన్ను నేను నీలా ప్రేమించాలని

99.

అంతరంగం విషాద జలసమాధే
ఊహల్లో నువ్వు కనబడకుంటే

100. గాయమై గుండెను కోస్తావెందుకు?
చితిలో కూడ నిను వీడనని బాసలే చేసినా!

101. నిజాలను వెలికి తీస్తూనే ఉన్నా
గత జ్ఞాపకాల తవ్వకాల నుండి

102. హృదయకుసుమం ముడుచుకుంటోంది సిగ్గులమొగ్గై
నీ చిగురుటాకుచూపుల మధ్యచిక్కి

103. స్వర్ణోదయమే కోిటివెన్నెల కాంతులతో
నువ్వు మేల్కొల్పు పాడుతుంటే

104. నీ ప్రేమ హస్తాన్ని చేజారనివ్వకు
పోగొట్టుకున్న నా హృదయం దొరికేవరకు

105. నీ తలపుల అస్త్రాలే
నా ప్రేమాంబులపొది నిండుగా

మణి మాలికలు జ సిరి వడ్డే

141

 >106. లేలేత ఊహలేవో తప్పటడుగులే వేస్తున్నాflయి
గురితప్పని నీ చూపుల శరాలకు

107. జ్ఞాపకాల వంతెనలు నిర్మిస్తున్నా
సుడులుతిరిగే ఊహల సుడిగుండాలపై

108. పూలవాగులా పొంగే నీజ్ఞాపకాలు
మదికోనేటిలో విచ్చుకున్న కన్నెకలువలలా

109. చిలిపి ఊహలకెపుడూ పంతాలే
నీ జ్ఞాపకాలతో పోటీకిదిగుతూ

110. మనోకోయిల మూగబోయింది
వసంతమై నువ్వు వచ్చినా కూయడమేలేదు

111. కరి మబ్బు కన్నీళ్ళలో
ఆనంద భాష్పాలను వేరుచేయడమెలా?

112. మనసును అంతలా గారాం చెయ్యకు
మౌనంగానే మదికి అల్లరిని నేర్పేస్తుంది

113. నిరీక్షణకు ఇంత సంబరం దేనికో
ఎదురుచూపులతోనే నిన్ను ఎదలో నింపేసుకుంటూ

114. విరిజల్లులే!
వసంతం అరనవ్వు నవ్వితే చాలు

115. నా గుండె బరువెక్కింది
చేజారిన పసిజ్ఞాపకాలు తడుముతుంటే

142

మణి మాలికలు జ సిరి వడ్డే