మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం

వికీసోర్స్ నుండి

వారం: శుక్రవారం

పల్లవి:
మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం మంత్ర స్వరూపం భజ దత్తం 
మంత్రార్ణరూపం మంత్రార్థ గోపం మంత్ర ప్రదీపం భజ దత్తం

చరణం:
ద్రాంబీజవాసం దారిద్ర నాశం దయా నివేశం భజ దత్తం 
షడక్షరేశం సంపత్ప్రకాశం యోగోపదేశం భజ దత్తం

అష్టార్ణ వేద్యం భవరోగ వైద్యం ఆనందహృద్యం భజ దత్తం 
ద్వాదశ వర్ణం ఆనంద పూర్ణం యోగోత్తీర్ణం భజ దత్తం

షోడశ బీజం గురురాజ రాజం కైవల్యభాజం భజ దత్తం
దత్తాత్రేయం కృష్ణం హరిం తం ఉన్మత్త రూపం భజ దత్తం

ఆనందదాయకం మునిబాల రూపం పిశాచ వేషం భజ దత్తం 
విశుద్ధ జ్ఞాన సాగరమీశం సచ్చిదానందం భజ దత్తం