భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/స్నేహ వాక్యం
ప్రొఫెసర్ టి.జ్యోతిరాణి, M.A.,Ph.D.. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
స్నేహ వాక్యం
అసమ సంబంధాలు పునాదిగాగల రాజకీయార్థిక నిర్మాణాలను ప్రగతి శీలంగా మలచుకొనానికి, ప్రజాస్వామికం చేసుకొనానికి తలఎత్తిన ఉద్యమా లైనా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పరాయిపాలన నుండి దేశాన్ని విముక్తం చేసుకొనటానికి నిర్మించబడ్డ స్వాతంత్య్రోద్యమాలేనా అవి ఉనికిలోకి వచ్చి ఆశించిన లక్ష్యాలను సాధించటానికి ఆకాశంలో సగం అయిన స్త్రీల పరోక్ష, ప్రత్యక్ష భాగస్వామ్యం అనివార్యం. కానీ పితృస్వామిక భావజాలం స్త్రీని ఒక స్వతంత్ర వ్యక్తిగా చూడానికి నిరాకరిస్తుంది. స్త్రీపురుషుల మధ్య అధీనత్వ- ఆధిపత్య సంబంధాలు పునాదిగా నిర్మించబడిన పితృస్వామిక కుటుంబంలో ఇంటికే పరిమితం చేయబడిన స్త్రీ ఇంటిని నిర్వహించానికి తన జీవితకాలమంతా నిర్విరామంగా, నిరంతరాయంగా శ్రమ చేస్తున్నప్పటికీ ఆ పనికి విలువ లేదు , గుర్తింపురాదు. అదే విధగా భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్రీల చురుకైన భాగస్వామ్యం, క్రీయాశీలక పాత్ర గుర్తింపుకు రాకుండ, అదాశ్యంగా మిగిలిపోయే ప్రమాదా వున్నది. ఇటువంటిస్థితి ముస్లిం స్రీల విషయంలో మరింత తీవ్రమయ్యే అవకాశ మున్నది. స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం స్త్రీలు చురుకైన భాగస్వామ్యం వహించారన్నది ఒక చారిత్రక వాస్తవం. ఈ సత్యాన్నివెలికి తీయానికి జెండర్ చైతన్య స్పృహ, చిత్తశుద్ధి, నిబద్ధతలతో కూడిన కృషి, విభిన్నపధతులద్వారా స్త్రీల భాగావామ్యానికి సంబంధించిన సమాచారసేకరణ అవసరమవుతాయి. ఈ విధమైన కృషి శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన భారత శ్వాఆతంత్య్రోద్యమం- ముస్లిం మహిళలు పుస్తకంలో వ్యక్తమవుతుంది.
స్వాతంత్య్రోద్యమాన్నీ జనబాహుళ్య ఉద్యమంగా (Mass Movement) బలో పేతం చేసే క్రమంలో గాంధీజీ పిలుపు మేరకే స్త్రీల భాగస్వామ్యం చోటు చేసు కున్నదనే భావన తప్పని ఈ పుస్తకంలో పొందుపరచబడిన 61 మంది ముస్లిం స్రీల పాత్రలను పరిశీలించినట్లయితే బోధపడుతుంది. 1857 నుండి 1947 వరకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చేవరకు నిర్మించబడిన వివిధ ఉద్యామాలలో, ఆ తరువాత సాగిన ప్రజా ఉద్యమాలలో కూడ ముస్లిం మహిళలు గుణాత్మకంగా విలక్ష ణమైన పాత్ర నిర్వహించారన్న వాస్తవం తెలుస్తుంది. స్వతంత్రభారత నిర్మాణంలో వారి స్థానం స్పష్టమవుతుంది. స్రీలుగా పితృ స్వామిక సమాజంలో,ముస్లింలుగా భారతదేశంలో పరాయీకరణకు గురవుతున్న వర్తమాన సందర్భంలో ఈ పుస్తకం ఆహ్వానించతగింది.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో అధికంగా పాల్గొనటం గమనించవచ్చు. ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం లో పాల్గొన్న ముస్లిం స్త్రీలలో బేగం హజరత్ మహల్ మినహాయించి పోరుబాటన నడిచిన మిగిలిన వారందరూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. దాదాపు నూటయాభై సంవత్సరాల క్రితమే పరాయిపాలనను వ్యతిరేకించి, తిరగబడి, ఉరిశిక్షలకు కూడ ఏమాత్రం భయపడకుండ ఎదురు నిలిచిన వీరవనితలు వీరు.
స్వాతంత్య్ర సాధనకు రూపుదిద్దుకున్న విభిన్న పోరాట మార్గాలు- అహింసా యుత మార్గం కావచ్చు, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వామపక్ష మార్గం కావచ్చు గెరిల్ల యుధమే మార్గం కావచ్చు- అన్ని పోరాట మార్గాలలో ముస్లింస్రీల భాగస్వామ్యం ఉండటం గమనించవలసిన విషయఒ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించి సహాయనిరాకరణ, విదేశీవస్తు బహిష్కరణ, క్విట్ఇండియా మొదలైన అన్నిపోరాట రూపాలలో ముస్లిం స్త్రీల చురుకైన భాగస్వామ్యం కనిపిస్తుంది.ఈ ముస్లిం స్త్రీలు సంపన్న కుటుంబాల నుండి సాధారణ కుటుంబాల వరకు చెందినవారు. దక్షిణాఫ్రికాలో సంపదను, వ్యాపారాలను త్యజించి భారత దేశానికి వచ్చి పాల్గొన్న కుటుంబాలు కొన్నికాగా స్వదేశంలోనే ఆస్తులను, పదవులను, ఉద్యోగాలను, వ్యాపారాలను వదలుకొని జాతీయోద్యామంలో పాల్గొన్న కుటుంబాలు మరికొన్ని ఇటువంటి నేపథ్యం గల కుటుంబాలకు చెందిన ముస్లిం మహిళలు చాలావరకు ఉన్నత విద్యను అభ్యసించినవారే. బాల్యం నుండే బ్రిీటిష్ పాలననువ్యతిరేకించినవారే.
మునీరా మజ్రుల్ హఖ్, అమీనాతయ్యబ్జీ, మజీదా హసీనా బేగం మొదలైనవారు జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములు. కాగా రజియాఖాతూన్ మొదలైనవారు పరోక్షంగా ఉద్యమానికి తోడ్పడ్డారు. వాస్తవానికి ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం అని ఖచ్చితంగా విభజించటం కష్టం. సమావేశాలు నిర్వహించడం, ప్రసంగించటం, పికిటింగులు జరపటం, ఊరేగింపులో పాల్గొనటం, పోలీసు లాఠీ దెబ్బలను తినటం, జెలుకెళ్ళటం, శిక్షననుభవించటం ఉద్యమానికి ఎంత ముఖ్యమో నిధులను సమీకరించటం, ఉద్యామకారులు జైలుకెళ్ళినప్పుడు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనటం, నేటికి మద్దతు నివ్వటం, ఉద్యమకారులకు ఆశ్రయ మివ్వటం,ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి పత్రికలు నడపటం, రచనలు చేయటం, తమ ఇంటిని పురుషులు ఉద్యమంలో నిమగ్నమైనప్పుడు కుటుంబ బాధ్యతలు సంపూర్ణంగా స్వీకరించటం, పోలీసుల దాష్టికాన్ని భరించటం, ఎంతకషనష్టాలకైనా సంసిద్ధులు కావటం మొదలైనవన్ని ఉద్యమం నిలదొక్కు కొనటానికి, లక్ష్యాలను సాధించానికి అంతే ముఖ్యం. కాబట్టి సమగ్ర దృష్టితో, సునిశితంగా పరిశీలించినట్లయితే ఉద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం అనే విభజన కృత్రిమమైనదే. చాలా సందర్భాలలో ఉద్యమకారుల కుటుంబాలకు చెందిన మహిళల భాగస్వామ్యం ప్రారంభంలో మరోకరూపంలో ఉన్నట్లు కనిపించినా, భర్త జైలుకెళ్ళినప్పుడు, భర్త చేపట్టిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో స్త్రీలు పోరాటంలో ముందుండటం గమనించదగింది.
అక్బరీ బేగం, అమినా తయ్యాబ్జీ, షంషున్నిసా అన్సారీ, సుఫయాసోం, అంజాదీ బేగం మొదలైనవారు ఉద్యమ నాయకత్వస్థానంలో వుండి ఉద్యమాన్నిసమర్దవంతంగా నిర్వహించారు. కాగా కార్యకర్తలుగా కూడ ముస్లిం స్రీలు పోరాటాలలో ముందుండి లాఠీ దెబ్బలు తిని, అరెస్టయి, జైలుశిక్షలను అనుభవించినారు. స్త్రీలను సమీకరించడంలో కీలక పాత్రను పోషించారు. బ్రిీటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి 'హజరా ఆపా' భారత దేశ ప్రతినిధిగా హజరయ్యారు. అక్బరీ బేగం, మహాబూబ్ ఫాతిమా, అంజాది బేగం, సుగరా ఖాతూన్, సాదాత్ బానో కిచ్లూ తదితరులు ఉత్తేజపూరిత ప్రసంగాలతో ప్రజలను ఉద్యమోన్ముఖులను చేయటంలో కృతకృత్యులయ్యారు. కాగా ఉమర్ బీబీ, ఆమనా ఖురేషి మొదలైనవారు కార్యకర్తలుగా విదేశీ వస్త్ర దాహనంలో ముందుండి తమ వస్తువులను దాహనం చేయటంతో ఉద్యమాన్నిప్రారంభించారు. అన్ని పోరాట రూపాలలో కూడ ముస్లిం స్త్రీలు ముందుండి లాఠీ దెబ్బలను తిని, అరెస్టయి, జైలు శిక్షలను అనుభవించారు.
భర్త అరెస్టయినప్పుడు బ్రిీటిష్ వ్యతిరేకతను ప్రచారం చేసే 'జమిందార్' పత్రిక ప్రచురణ బాధ్యతను బేగం జాఫర్ అలీఖాన్, అదేవిధంగా 'ఉర్దూ-ఏ మౌల్లా' ప్రచురణను బేగం నిశాతున్నీసా చేపట్టగా బేగం ఖుర్షీద్ ఖాజా 'జామియా మిలియా ఇస్లామీయ' విద్యా కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ 'హింద్' అను ఉర్దూ మాసపత్రికకు సంపాదాకురాలిగా విధులను నిర్వర్తించారు. బీబీ అమతుస్సలాం 'హిందాూస్థాన్' అనే ఉర్దూ పత్రికను నిర్వహించారు. మరికొందరు తమ రచనలతో ఉద్యమానికి స్పూర్తినిచ్చారు. హాజౌరా ఆపా అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు కూడ.స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ లింగవివక్షత వైపు దృష్టి సారించి, స్రీలను చెతన్యవంతులను చేయడానికి స్త్రీ విద్య సాధనమని గుర్తించి ఆ దిశగా ప్రయత్నించిన స్రీలూ కనిపిస్తారు . సంప్రదాయ మూఢచారాలకు, పర్దా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమూ కనిపిస్తుది.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ముస్లిం మహిళలందరూ హిందూ- ముస్లిం ఐక్యత కోసం కృషి చేసినవారే. ఉద్యమం చివరిదశలో బ్రిటిష్‌వారి కుతంత్రాల ఫలితంగా పరిస్థితులు దేశవిభజనకు దారి తీయగా దానిని వ్యతిరేకించారు ఈ ముస్లిం మహిళలు. అదేవిధగా నైజాం ప్రాంతం భారతదశంలో విలీనం కావాలని ఆందోళన చేసినవారిలో ముస్లిం మహిళలు ఉన్నారు. భారతదేశ విభజన వల్ల ఆస్తులు పాకిస్తాన్ భూభాగంలో ఉండిపోయినా, భారతదేశంలోనే వుండి కటిక పేదారికాన్ని అనుభవించిన ఉద్యమకారిణులూ కనిపిస్తారు. జాతీయోద్యమంలో పాల్గొన్న ఈ ముస్లిం మహిళలు 'భారతదేశం తమ మాతృభూమి' అన్నభావనతోనే ఎంత త్యాగానికైనా సిద్ధపడటం వీరి జీవితాలను గురించిన అధ్యాయనం వెల్లడిచేస్తుంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కావటమే కాకుండ, బ్రిటిషర్ల తొత్తులైన జమీందారులకు వ్యతిరేకంగానూ, స్వాతంత్య్ర సిద్ధించాక ప్రజా ఉద్యమాలలో,తెలంగాణా రైతాంగపోరాటంలోనూ పాల్గొన్నముస్లిం మహిళలు కూడ ఉన్నారు. గాంధేయమార్గాన్ని అనుసరిస్తూ సమాజ సేవకు అంకితం కావటం పట్ల కృతజ్ఞతతో స్వతంత్ర భారత ప్రభుత్వం ఫాతిమా ఇస్మాయీల్, కుల్సుం సయానీలకు 'పద్మశ్రీ' బిరుదునిచ్చి సత్కరించింది. వీరిలో కుల్సుం సయానీ 1957లో యూనిస్‌కో సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 1958లో ప్రభుత్వ స్త్రీ విద్యకోసం నియమించిన 'నేషనల్ కమీషన్ ఆన్ విమన్స్ ఎడ్యుకేషన్' అనే కమిటీలో ఈమె సబ్యురాలు. మహాత్మాగాంధీ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పటానికి 11 దేశాలు పర్యటించింది. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్యస్నేహం కోసం కృషి చేసింది. విద్యకోసం ప్రత్యేకించి స్త్రీవిద్య కోసం అవిశ్రాంతంగా ఆమె చేసిన కృషికి 'నెహ్రు˙ లిటరసీ అవార్డు' లభించింది. ఫాతిమా ఇస్మాయిల్ దళితుల అభ్యున్నతి కోసం చేసిన కృషికి గుర్తింపుగా 'దళిత మిత్ర' అవార్డు పొందింది. హాజౌరా ఆపా కార్మిక కర్షక సంక్షేమానికి చేసిన కృషికి లెనిన్ శతజయంతి ఉత్సవాలలో 'సుప్రీం సోవియ్ జూబ్లీ అవార్డు'తో గౌరవించబడింది. ఫాతిమా యఫ్ ఈయ్యాబ్ అలీ కూడ గాంధేయ మార్గంలో నడుస్తూ స్వాతంత్య్రానంతర భారతదశంలో గుజరాత్‌లోని 'పడలా' గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దింది. అందుకు భారతప్రభుత్వం విశిష్ట మహిళగా ఆమెను గుర్తించింది. స్వతంత్య్ర భారత దేశంలో రాజకీయ రంగ ప్రవశం చేసి అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా బాధ్యాతలను నిర్వహించిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాసుమా బేగం రాష్ట్రంలో మంత్రి పదవిని చేపట్టి దేశంలో మంత్రి పదవి చేపట్టిన తొలి ముస్లిం మహిళగా ఖ్యాతి గడించారు. సఫియా అబ్దుల్ వాజిద్, బేగం అక్బర్ జహాన్ బేగం, అనీస్ బేగం కిద్వాయ్ లాింటి వారు పార్లమెంటు సబ్యులయ్యారు.బేగం షరీఫా హమీద్ అలీ ఐక్యరాజ్యసమితి మహిళా విభాగానికి భారతదశ ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ విధంగా ఉద్యామబాటన నడిచిన ఈ స్త్రీల జీవితాలను అధ్యయనం చేసనప్పుడు వాళ్ళు ఎటువంటివిలువల కోసం పాటుపడ్డారో అవి ఎంత ఉన్నతమైన, ఉదాత్తమైన మానవీయ విలువలో అర్దమవుతుంది. ఎటువంటి కష్టానికీ తలవంచక పోవటం, ధైర్యంగా నిలబడడం, దుర్బర దారిద్య్రాన్నిఅనుభవించటానికైనా సిద్ధపడడం,తాము చెప్పేదే ఆచరించటం, అరెస్టు కాకపోవటాన్ని నామోషీగా భావించటం,బ్రిీటిష్ ప్రబుత్వానికి విన్నవించుకోవటాన్ని చిన్నతనంగా పరిగణంచటం, క్షమాబిక్షను కోరటానికి బదులు ప్రాణాలు అర్పించడానికి సంసిద్దులు కావడం, తమ ప్రాణాలు 'జాతి సొత్తులు' అని ప్రకంచడం మొదలైనవన్నీ వాళ్ళ ఆత్మాభిమానానికి, త్యాగనిరతికి అద్దా పడతాయి. వస్తు వినిమయ విష సంస్కృతిలో పడికొట్టుకుపోతున్న ప్రస్తుత యువత తప్పనిసరిగా చదవవలసిన పుస్తకమిది. ఈ పుస్తకం ఇటు స్త్రీల చరిత్రనూ, అటు ముస్లింల చరిత్రనూ సుసంపన్నం చేస్తుంది. జాతీయోద్యమంలో పాల్గొన్నముస్లిం మహిళల భారతీయతను స్పష్ట చేస్తుంది. హిందూ ముస్లింలు ఐక్యతతో స్వతంత్య్ర భారతదశాన్ని సాధించుకున్నారన్న విషయంవెల్లడి చేస్తుంది. గ్లోబలైజేషన్ సంస్కతిలో, స్వార్థపూరిత సామాజిక వాతావరణంలో పతన మవుతున్నమానవీయ విలువల మధ్య బ్రతుకుతున్న ప్రస్తుత యువత ఈ పుస్తకం ద్వారా ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే ఎటువింటి త్యాగాలతో ప్రస్తుత సమాజాంన్నినిర్మించుకున్నామో వారికి అర్దమవుతుంది. గతాన్ని తెలుసుకొని ఆ పునాదాుల మీదాుగా లౌకిక, ప్రజాస్వామిక,మానవీయ విలువలతో కూడిన ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకొనానికి కావలసిన ప్రాతిపదిక ఈ పుస్తకంలో ఉన్నది.
విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్రంలో ప్ర త్యేకించి చరిత్రకు సంబంధించిన పరిశోధన అధ్యయనాలకు సయ్యద్ నశీర్ అహ్మద్ వ్రాసిన ఈపుస్తకం ఒక నమూనాను అందిస్తుందని నిస్సందేహంగా చెప్ప వచ్చు. పరిశోధకు లకిది స్పూర్తినిస్తుంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ముస్లింమహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటం సుళువైన విషయం కాదు. నిరంతర అంవేషణ, నిజాయితితో కూడిన అవిశ్రాంత కృషి, పట్టుదల అవసరమవుతాయి. అధ్యయనం పట్ల ఆసక్తి, సీరియస్‌నెస్ వున్న రచయిత నశీర్ అహమ్మద్ ఎన్నో గ్రంథాలయాలు తిరిగి, ఎమన్నో సంస్థలను, వ్యక్తులను కలసి వివిధ భాషల్లో వున్న ఆధారాలను సేకరించటం వల్లే ఈ పుస్తకరచన సాధ్యమైందని భావించవచ్చు. వ్యక్తుల జీవిత చరిత్రలకు ఫొటోలు కూడ జతపర్చినప్పుడు అధ్యయనం చేసేవారు ఆత్మీయ భావనకు లోనవుతారు.ఇందుకోసం మహిళల ఫోటోలను సేకరించడానికి రచయిత చేసిన శ్రమ అభిలషణయం.
సామాజిక స్పహతో తపనతో ఎంతో శ్రమించి, ఎన్నో ఆధారాలను అధ్య యనం చేసి, అదృశ్యంగా ఉన్న ముస్లిం మహిళలు, ముస్లిం యోధులు స్వాతంత్య్ర పోరాటంలో నిర్వహించిన పాత్రను తన పలు గ్రంథాలద్వారా, అసంఖ్యాకమైన తన వ్యాసాల ద్వారా వెలుగులోకి తీసుకరావటంలో రచయిత అనిర్వచనీయమైన కృషి వ్యక్తం అవుతుంది. భారతదేశ చరిత్రలో ముస్లింల భాగస్వామ్యం దిశగా శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ నిరంతరం సాగిసున్న కృషి ఆహ్వానించదగింది మాత్రమే కాదు అభినందించదగింది. ఈ పుసకానికి 'స్నేహ వాక్యం' వ్రాసే అవకాశం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.