Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/సాదత్‌ బానో కిచ్లూ

వికీసోర్స్ నుండి

ప్రాణం కంటే ఆత్మగౌరవం ప్రధానమని భావించిన

సాదత్‌ బానో కిచ్లూ

(1893-1970)

మాతృదేశం పట్ల భక్తి భావన గల దేశభక్తులకు అక్షరజ్ఞానం తోడై, ఆ అక్షర యోధులకు దాస్య శృంఖలాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న దృడ సంకల్పంతో పోరుబాటను ఎంచుకున్న ఉద్యామకారులు జీవిత సహచరులైనట్టయితే, అటువిం మహిళలు అద్భుతాలను సృషించగలరు. ఆ మహత్తర అవకాశం దక్కించుకున్న ఉద్యమకారిణి బేగం సాదాత్‌ బానో.

పంజాబు రాష్ట్రం అమృతసర్‌లోని సంపన్న కుటుంబంలో 1893 జనవరి 10న సాదాత్‌ బానో జన్మించారు. ఆమె తండ్రి మియా హఫజుల్లా. ఆమె పుినిల్లు విద్యావికాసాల కేంద్రం. తండ్రి, అన్నయ్య సయీదుల్లా సాహెబ్‌లు ఆమె విద్యాభ్యాసం పట్ల ప్రత్యేక శ్రద్ధా తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె పలు భాషలను నేర్చుకున్నారు. ఆమెకు ఉర్దూ, పర్షియన్‌ భాషలలో మంచి ప్రవేశం లభించింది. మంచి విద్వత్తు లభించిన కారణంగా ఆమె 1910 నుండి కవిత్వం రాయడం ఆరంభించారు. ముసిం మహిళలు చదుా వుకోవటమే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో సాదాత్‌ బానో జాతీయోద్యామ స్పూర్తితో కవితలు రాస్తూ, ప్రముఖ కవుల, పండితుల ప్రశంసలందాుకున్నారు. 167

1914 అక్టోబర్‌ 20న డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూను ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన కూడ స్వాతంత్య్ర సమరయోదులు. విదేశాలలో ఉన్నత చదువులు పూర్తిచేసి ఇండియా వచ్చిన ఆయన బ్రిటిషు వ్యతిరేక పోరాలకు జీవితాన్ని అకితం చేశారు. సాదాత్‌ బానోతో వివాహానంతరం న్యాయవాదిగా రావల్పిండిలో తొలుత ప్రాక్టీస్‌ ప్రారంభించి, తరువాత అమృతసర్‌లో స్థిరపడ్డారు. బానిసత్వం నుండి విముకవుౖ ప్రజలు స్వతంత్ర భారతావనిలో స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ సంతోషంగా గడపాలని కాంకిస్తూ కఠిన కారాగారవాసాన్ని, బ్రిటీష్‌ పోలీసుల క్రూర హింసలను భరించారు.

1919 సంవత్సరాంతంలో ప్రవాసం నుండి బయటకు వచ్చాక డక్టర్‌ సైఫుద్దీన్‌ లక్షలను ఆర్జించి పెడుతున్న న్యాయవాదా వృత్తిని పూర్తిగా మానేసి ఖిలాఫత్‌ ఉద్యామానికి, జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలకు అంకితమయ్యారు. స్వాతంత్య్రోద్యామ చరిత్రలో జలియన్‌వాలా బాగ్‌ హీరోగా ఖ్యాతి గాంచిన ఆయన బ్రిటీష్‌ వలసవాదాుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించటంతో అత్యధిక కాలం జైళ్ళల్లో గడిపారు. జాతీయ ఉద్యామనేతగా పలుమార్లు కారాగారవాస శిక్షకు గురై, తన జీవితంలోని అత్యంత విలువైన 14 సంవత్సరాల కాలాన్ని జైలు గోడల మధ్యాన గడిపిన పోరాట చరిత్ర ఆయనది. (Muslims In India, Volume II, Naresh Kumar Jain, Manohar, New Delhi, 1983, Page. 27.)

బ్రిీషు వ్యతిరేక కార్యకలాపాల కారణంగా సాదత్‌ బానో గృహం మీదా అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. సోదాలు, దాడులు ఆ ఇంటికి మామూలయ్యాయి. పోలీసుల వేధింపుల తాకిడిని తట్టుకుంటూ ఎంతో ధైర్యంగా నిలవటమే కాకుండ, జైళ్ళల్లో గడుపుతున్న భర్తకు ధైర్యం చెబుతూ కుటుంబం గురించి ఏమాత్రం పట్టించు కోకుండ పోరుబాటలో సాగాల్సిందిగా ఆమె ప్రోత్సహించారు. అందుకు తగట్టుగా సైపుద్దీన్‌ కిచ్లూ బ్రిీషు వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా నిలచారు.


మతోన్మాద భావనలకు వ్యతిరేకంగా సాదాత్‌ బానో కిచ్లూ కలం పట్టి పోరాడరు. బయి శత్రువును తరిమి కొట్టాలంటే, హిందూ-ముస్లింల ఐక్యత అత్యవసరమని ఆమె తన కలం దద్వారా, గళం ద్వారా పలుమార్లు ఉదాహరించారు. హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛించారు. ఆ దిశగా నిరంతరం కృషి సాగించారు. ఆ ప్రయత్నాలలో భాగంగా హింద్జూ సోదరుల మత మనోభావాలను గాయపర్చే ఏ పనులు చేయరాదని ముస్లింలకు హితవు పలికారు. ఆ హితవులను తాను ఆచరించి చూపారు. హిందూ 168 సోదరులు గోవును ఆరాధిస్తారు కనుక వారి మనోభావాలను గౌరవించాలన్న ఉదేశ్యంతో ఆమె తన కుటుంబంలో గోమాంసం వంటకాలను పూర్తిగా నిషేధించారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan, Dr. Abida Samiuddin, IOS, New Delhi,1997, Page.162)

ఆమె చక్కని కవయిత్రి, మంచి రచయిత్రి. ఉద్యమకారులను ఉత్తేజపరుస్తూ బ్రిటిషు ప్రభుత్వపు రాక∆స రాజకీయ క్రీడల వెనుకగల కుయుక్తులను ఎండగడ్తూ పలు కవితలు రాశారు. ఈ విషయంలో ఆమె మౌలానా ఆజాద్‌ మార్గంలో పయనించారు. ఉర్దూ, పర్షియన్‌ భాషల మీద మంచి ఆధిపత్యం ఉన్న ఆమె కవితలు మాత్రమేకాదు, నవలలు కూడ రాశారు. ఆమె రాసిన కవితలు దక్కన్‌ రివ్యూ, తెహజీబ్‌-యే-నిసా, ఖాతూన్‌ లాంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. తెహజీబ్‌-యే-నిసా లో ఆమె మహిళల సమస్యల మీదా ప్రగతిశీల పరిష్కారాలతో నవల రాశారు. 1910లో రాసిన ఆ నవల సీరియల్‌గా ప్రచురితమైంది. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద ప్రత్యేక శీర్షికలతో 1910-12 సంవత్సరాలలో అసంఖ్యాకంగా ఆమె ప్రత్యేక ఫీచర్స్‌ రాశారు. ఈ కవితలు, వ్యాసాలు, ఫీచర్స్‌లలో ఆమెలోని దూరదృష్టి, విసృత అధ్యాయనం వెల్లడవుతాయి. సమకాలీన సమాజం, జాతీయ అంతర్జాతీయ ప్రపంచం తీరుతెన్నులను, ఆయా రాజకీయ వ్యవస్థలను అర్థ్ధం చేసుకునేందుకు ఆమె ప్రత్యేకంగా ఆంగ్ల భాషను కూడ నేర్చుకుని ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యాయనం చేశారు.

1910లో తన 18 సంవత్సరాల వయస్సులో ఆమె దేశభక్తి ప్రపూరితమైన కవితలు రాశారు. ఓ కవితలో బానిస బంధానాలలో బందీ అయిన తన దేశం గురించి, స్వేఛ్చను కోల్పొయిన దేశ ప్రజల గురించి ఆవేదాన వ్యక్తంచేశారు. ఆ కవిత ఈ క్రింది విధాంగా సాగింది-

హృదయమా ! నాదుóఖ గాథను ఎవరికి వినిపించేను ? పూదోట నుంచి నా నివాసం పంజరంలోకి మారింది. నా గుండెలపై బాధల కొరడ దెబ్బలు పడుతున్నాయి. గతకాలం నాకు జ్ఞప్తికొస్తూంది. ఆ పూదోటలోని వృక్షాలు, ఆ నా చిన్నిగూడునూ-

పంజరంలోంచి ప్రపంచపు స్వాతంత్య్రాన్ని చూస్తూన్నాను. నా గూడు గుర్తు కొసూంది. బందీనెవున్నాను. అరిచే శకలదు. ఆ గుంపుగా ఎగరడం, ఆ ఆకాశ విహారం, ఆ తోటలో వసంతాలు. ఆ పాటల సవ్వడులూనూ.

నా ఆనందాపు ఆ రోజులు ఇప్పుడెక్కడికి పోయాయి. ప్రభూ! పూదోటలో ఎగిరి 169 వలయాకారంగా తిరగటం. ఉద్యానవనపు శోభను తిలకించటం. కొమ్మల ఆకుల్లో సంతోషంతో కేరింతలు. చల్లని గాలులతోబాటు చప్పట్లు చరచడమూ.

నా ప్రాణాలు వెలిగినా నా గుండె మాడిపోయింది. నా వక్షంలో వేదానా జ్వాల ఆగ్నిని నింపింది. ఈ చిన్న పంజరంలో బందీగా మారాను. నా ఆనాటి గూటి తాలూకు స్వేచ్ఛ ఎక్కడికి పోయింది? ఇష్టం వొచ్చినపుడు రావడమూ. ఇష్టమైనపుడు పోవడమూను.

నా ఈ అసహాయతని ఎవరికి చెప్పేను ? నా రాత నాకు రోజూ కొత్త బాధల్ని తెస్తూంది. దెబ్బతిన్న రెక్కలతో విషాదగానం చేస్తునన్నాను. మంచు వేకువలొచ్చి పూల మోము కడగటం గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెపై దెబ్బపడుతోంది.

ఆనాటి నాగూటి రూపు నా కళ్ళల్లోనే తిరుగుతూంది. సంతోషాన్నీ, హాయినీ ఎక్కడ వెతికేను? జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా హృదయంలో వో భయం కలుగుతోంది. అందమైన ఆ రూపం ఆ చక్కటి ఆకారం. వాటితోనే గదా ఆనాడు వెల్లివిరిసే నా గూటి అందాలు ! నక్షత్రాలతో సంభాషణ అను మరో కవితలో-

ఈ వసంత దృశ్యం ఎంత హాయిగా ఎంత అందంగా వుంది. కాని నా గుండెల్ల్లో దాగిన భావనలు బయటికి రాలేకపోయాయి. నాకు మీతో గాని, మీ ఆకాశంతో గాని ఏ ఆవసరం లేదదు. నా దేశం, నా భారత దేశం గురించే నా చింత ఆంతాను. ఆ రోజు దేవుడు ఏనాటికైనా నా కళ్ళకు చూపిస్తాడా? భారత దేశం ఆనాడు మీలాగే వెలుగులు విరజిమ్ముతుందా ?

సమకాలీనులు ఆశ్చర్యంతో చూస్తారు నా భారతదేశాన్ని-దాని వెలుగులు మురిపిస్తాయి సకల ప్రపంచాన్ని-నా ప్రియమైన దేశంపై బలవుతాను నేను- ప్రభూ ఈ మోడువారిన వనంలో వసంతాన్ని రప్పించు.

అని ప్రభువును వేడుకుంటూ సాదాత్‌ బానో నక్షత్రాలతో సంభాషణ సాగించారు. ఈ విధంగా ఆమె రాసిన ప్రతి కవితలో దేశభక్తి భావనలు వ్యక్తంచేస్తూ స్వేచ్ఛా- స్వాతంత్య్రకాంక్షంలతో, మాతృభూమి ఉజ్వల భవిషత్తును కాంక్షించారు.

1914 ప్రాంతంలో పంజాబు ప్రజలు రౌలత్‌ చట్టం వలన ఇక్కట్లు పడసాగారు. ఎప్పుడు ఎలా అరెస్టులు జరుగుతాయో, ఎప్పుడు ఎవరు అరెస్టవుతారో, ఏ స్వాతంత్య్ర సమరయాధుని ఇంటిమీద పోలీసు మూకలు విరుచుక పడుతాయో, ఎంతి విధ్వసం సృష్టిస్తారో, ఏ వ్యక్తి ప్రాణానికి ఎప్పుడు ప్రమాదం ముంచుకు వస్తుందో, ఏ రాత్రిపూట

170

బ్రిటిషు గూఢచారులు విరుచుకుపడతారో, ఎవరిని ఎక్కడికి తీసకువెళాతారో తెలియని భయానక రోజులవి.

ఆ రోజుల్లో కూడ, మీరు ధైర్యం కోల్పోకండి. వేదనపాలు కావొద్దు- అస్తిత్వపు తోటలోన పూలలా వికసంచండి - ఈ సాదాత్‌ ప్రార్థనను ఎప్పుడూ మరవొద్దు- ఏలాగైనా మీరు స్వపరిపాలనా స్వేచ్ఛను పొందండి, అంటూ ఉద్యామకారులను ప్రోత్సహిస్తూ కవితలు రాశారు.

ఈ విధాంగా కవితలు రాయటం, రచనలు చేయటం మాత్రమే కాకుండ ఆమె మంచి వక్తగా ప్రధానంగా మహిళలను ఉత్తేజపర్చుతూ ప్రసంగాలు కూడ చేశారు. ఆ ప్రసంగాలు మహిళలను బాగా ఉతేజితుల్ని చేశాయి. ఆ ప్రసంగాలలోని బ్రిటిషు వ్యతిరేక భావనలు సహజంగానే ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాయి.1919లో చారిత్రాత్మక జలియన్‌వాలా బాగ్‌ సభలో ఆమెకూడ ప్రసంగం చేయాల్సి ఉంది. ఆమె ఉత్తేజపూరిత ప్రసంగం కూడ తయారు చేసుకున్నారు. ఆ రోజున అమృతసరలో ఉన్న అంవాంఛనీయ వాతావరణం మూలంగా సన్నిహితులు, జాతీయ కాంగ్రెస్‌ నాయకుల వత్తిడి మేరకు జలియన్‌వాలా బాగ్‌ సభాప్రాంగణానికి ఆమె చేరలేకపోయారు.

రౌలత్‌ చటం కిరాతకత్వానికి పంజాబు ప్రజలతోపాటుగా డాక్టర్‌ సైపుద్దీన్‌ కిచ్లూ బలయ్యారు. ఆయనకు సంకళ్ళువేసి అజ్ఞాత స్థానానికి తరలించారు. ఆయన ప్రాణాలకు ముప్పువాటిల్లనుందని ప్రజలలో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత విచారణ 171 జరిపి ఆయనకు శిక్ష విధించారు. ఆ సంకట సమయంలో సాదాత్‌ బానో మ్లాడుతూ నా భర్తకు శిక్ష పడినందాుకు సంతోషంగా ఉంది. ఆందుకు ఆ ప్రభువుకు నా సాష్టాంగ ప్రణామములు. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తా. ఆ కంటక ప్రాయమైన మార్గంలో సాగి నా ప్రాణాలను బలివ్వడానికి కూడ నేను సర్వదా సిద్ధం అని ధైర్యశాలిగా ప్రకటించారు.

పంజాబు అకృత్యాల మీద విచారణ కోసం మహాత్మాగాంధీ పంజాబు వచ్చి సాదాత్‌ బానో కిచ్లూను కలిశారు. ఆ సందర్భంగా ఉద్యామకారుల విడుదల కోరుతూ, గాంధీజీని ఉద్దేశించి ఈ క్రింది కవితను రాసి ఆయన గౌరవార్థం సమర్పించారు.

ప్రతి హృదయంలో నీ నివాసం ఉంది కదా గాంధీ. నీ ప్రశంసలకు ఆలవాలం కదా ప్రతి జిహ్వా గాంధీ! నీ గురించి గౌరవం అను పుష్పాలు ఆన్ని చోట్ల పూశాయి. ఈ పూదోటలో శిశిరం ఏనాటికీ రాబోదు. అమృతసర్‌ వాసులు తీవ్రదుఃఖంలో చిక్కుకున్నారు. వారికి వారి లక్ష్యం తప్పక లభిస్తుంది. యదార్థాన్ని మీరు విడమర్చి చెప్పాలి మరీ. మీ మార్గదర్శ కత్వంలో సూచించాలి ఉపాయాల్ని. జెల్లో పడివున్నవాళ్ళు బంధవిముకులవ్వాలి.

ఈ అరెసుల సందార్బంగా ప్రముఖ జాతీయోద్యామ నాయకులు పండిత జవహర్‌ లాల్‌ నెప్ర˙, సి.ఆర్‌.దాస్‌, స్వామి శ్రద్ధానందా తదితరులు పరామర్శించేందుకు ఆమె ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా, మాతృభూమి దాస్య విముక్తి కోసం సాగుతున్న పోరులో నా భర్త జైలు కెళ్ళటం మాకందరికి గర్వకారణం తప్ప చింతించాల్సినదేమీ లేదాని, ప్రకిటించి ఆ నేతలను ఆశ్చర్యపర్చారు.

బ్రిటిషు పోలీసుల ఎత్తులను ఎదాుర్కొనేందుకు జాతీయోద్యమకారులకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో డక్టర్‌ కిచ్లూ స్వరాజ్య ఆశ్రమం స్థాపించారు. ఆ ఆశ్రమాన్ని 1921లో మహాత్ముడు ప్రారంభోత్సవం చేయగా, అందులో సర్దార్‌ భగత్‌సింగ్‌ లాంటి యోధులు శిక్షణ పొందారు. ఆ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యకులుగా డాక్టర్‌ కిచ్లూ శికణా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రిీష్‌ ప్రభుత్వం అలవాటుగా డాక్టర్‌ కిచ్లూను అరెస్టు చేయగా ఆయన స్థానంలో సాదాత్‌ బానో కిచ్లూ స్వరాజ్య ఆశ్రమ నిర్వహణ బాధ్యాతలను స్వీకరించారు. ప్రభుత్వ గూఢచారుల నిఘా కళ్ళనుండి తప్పించుకుంటూ, ఆటంకాలు అధిగమిస్తూ ఆమె స్వరాజ్య ఆశ్రమం బరువు బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. (Saifuddin Kitchlew - Hero of Jallianwala Bagh, Toufique Kitchlew, NBT, India, 1996, Page. 42) 172 స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆ దంపతు లు ఖద్దరు ధరించటం ప్రారంభించారు. సాదాత్‌ బానో జీవితాంతం ఖద్దరు ధరించటమే కాకుండ, ఆమె బిడ్డలు కూడ ఖద్దరు ధారణకు ఇష్టపడేట్టుగా ఆమె తయారు చేశారు. ఖద్దరు ప్రచారంలో ఆమె క్రియాశీలక పాత్ర వహించారు. 1930 నుండి 1934 వరకు సాగిన శాసనోల్లంఘన ఉద్యమంలో భర్తతోపాటుగా ఆమె ఆన్ని సమావేశాలకు హజరయ్యారు. ముస్లిం సాంప్రదాయాలను గౌరవిస్తూ కూతురు జుబెదాతో కలసి ఆయా కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించారు. (Saifuddin Kitchlew : Page. 139)

భర్తతోపాటుగా జాతీయ-అంతర్జాతీయ వ్యవహారాల పట్ల, రాజకీయ వ్యవస్థలు, రాజకీయ ఆలోచనల పట్ల చక్కని అవగాహనగల సాదాత్‌ బానో ప్రజలకు, ప్రధానంగా యువతకు ఆకర్షణ కేంద్రయ్యారు. ఈ అవకాశాన్ని ఆమె ఉపయాగించుకుని యువతీ, యువకులలో దేశభక్తి భావనలను పెంపొందించేందాుకు కృషి సల్పారు. యువతకు సన్మారం చూపటం మాత్రమే కాకుండ వారిని అవసరాలలో ఆదుకున్నారు. ఆ విధగా యువత అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమెను యువతీ యువకులు ప్రేమతో ఆపాజీ (అక్కయ్య) అని పిలుచుకున్నారు.

జాతీయోద్యమంలో భాగంగా సాగిన మహిళా చైతన్య కార్యక్రమాలలో కూడ ఆమె అపరిమిత ఆసక్తి చూపారు. అఖిల భారత మహిళా సంఘాలలో ఆమె చురుకైన పాత్ర నిర్వహించారు. స్వాతంత్య్రోద్యామ కాలంలో, విభజన తరువాత స్వతంత్ర భారత దేశంలో మహిళల పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఆమె పాటుపడ్డారు.

డకర్‌ కిచ్లూ దంపతులు తొలుత నుండి ముసింలీగ్‌ వేర్పాటు వాదా రాజకీయాలను వ్యతిరేకించారు. హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా కాంక్షించిన ఆ భార్యాభర్తలు లీగ్‌ కార్యకర్తల ఆగ్రహానికి గురైనప్పికీ తమ మార్గం మార్చుకోలేదు. భారత్‌ విభజనను చివరి క్షణం వరకు వ్యతిరేకించారు. అయినా విభజన జరగటంతో, మతోన్మాదానికి జాతీయవాదాం దాసోహం అన్నది అని డాక్టర్‌ కిచ్లూ చేసన విమర్శను ఆమె సమర్థించారు. మాతృదేశం రెండుగా చీలిపోవడన్ని ఆమె సహించలేక పోయారు. ఆ మానసిక పరిస్థితులలో విభజన వలన వచ్చిపడిన ఉపద్రవాన్ని ఆ కుటుంబం చవిచూడల్సివచ్చింది. నిరంతరం దేశ స్వేచ్చ, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ఆ కుటుంబానికి కూడ భయంకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ దంపతుల ఆస్థిపాస్తులన్నీ దుండగులు దోచుకున్నారు. 173 చివరకు కట్టుబట్టలతో ఢిల్లీ వెళ్ళి ముస్లిం శరణార్థ్దుల శిబిరంలో గడపాల్సిన దుస్థితి రావటంతో ఆమె తీవ్రంగా కుంగిపోయారు. ఆత్మీయులు, సన్నిహితులు పాకిస్తాన్‌ వెళ్ళ మని సలహా ఇచ్చినా, ఆ సలహాలను ఖాతరు చేయలేదు. ఆ భయానక వాతావరణంలో కూడ భారత దేశ సరిహద్దులు దాటడనికి ఆమె ఇష్టపడలేదు.

స్వాతంత్య్రం లభించాక డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ ప్రభుత్వంలో ఎటువింటి పదవిని ఆధికారాన్ని ఆశించలేదు. ప్రపంచ శాంతి-,స్వేహాలు కాంకక్షింస్తూ వామపక్ష భావాల వైపు మొగ్గు చూపుతూ ప్రపంచ శాంతి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన మారిన రాజకీయ అభిప్రాయాల మూలంగా ఆ సాదాత్‌ బానో దంపతులు అధికారం వెలగబడు తున్న నేతల అలక్ష్యానికి గురయ్యారు. ప్రముఖులతో స్వేహసంబంధాలున్నా డాక్టర్‌ కిచ్లూ దాంపతులు ఎటువంటి పదవిని గాని, ఎట్టి లబ్దిని కాని ఆశించలేదు. ఆర్థికంగా అవస్థలు పడుతూ చివరకు సన్నిహితులు, తమ మీద ఆధారపడిన ఇతరుల పోషణ కోసం ఉన్న ఆస్తిపాస్తులను అమ్మివేయడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. అనారోగ్యం, పేదారికం వెాండుతున్నా ఆర్థిక సహాయం అర్థించడనికి ఆమె ఇష్టపడలేదు. భర్త డాక్టర్‌ కిచ్లూ అనారోగ్యంతో బాధపడు తుండగా పండిత నెహ్రూ కల్పించుకుని చికిత్స నిమిత్తం ఆయనను బలవంతంగా ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఆక్రమంలో సాదాత్‌ బానో అధికార రాజకీయాలకు దూరమై ప్రజాసంఘాలలో పనిచేయసాగారు.1963 లో డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ మృతి చెందాక ఆమె ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఆ దుస్థితిలో కూడ ఆమె ఎవ్వరి వద్ద చేయి చాచలేదు. ప్రభుత్వాన్ని యాచించలేదు. ప్రభుత్వం కూడ ఆ యోధురాలిని ఆదుకోలేదు. చివరకు కటిక పేదరికంలో మగ్గుతూ, సరైన చికిత్సకు కూడ నోచుకోక, కనీసం మందులు కూడ కరువై అనారోగ్యంతో సమరం సాగిస్తూ శ్రీమతి సాదాత్‌ బానో కిచ్లూ 1970 ఆగస్టు 18న కన్నుమూశారు.

♦♦♦♦

మాతృభూమి,స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు, ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా. అందువలన నా భర్తజీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది జాతిజనులు నిర్ణయించాలి. - బేగం ముహమ్మద్‌ ఆలం

174