భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/సయ్యద్ కనీజ్ బేగం
అద్భుత కార్యాచరణతో అందర్ని ఆకట్టుకున్న మహిళానేత
సయ్యద్ కనీజ్ బేగం
(1890-1955)
జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళలు సత్యాగ్రహోద్యమమైనా, సాయుధ పోరాటమైనా ఏమాత్రం నుకాడలేదు. బ్రిటిష్ వ్యతిరేకపోరాటంలో మహిళలు తమప్రత్యేక ప్రతిభా సామర్థ్యాలను చూపారు. ఈ మేరకు అద్బుత ప్రసం గాలతో ప్రజలనుఆకట్టు కోవటమేకాకుండ, తన కార్యాచరణతో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడిన మహిళా ప్రముఖు లలో శ్రీమతి సయ్యద్ కనీజ్ బేగం ఒకరు.
1890లో బీహార్ రాష్ట్రంలో సయ్యద్ కనీజ్ బేగం జన్మించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ముబారక్ హుస్సేన్ మనుమరాలు. బీహార్ రాష్ట్రకాంగ్రెస్ నేత సయ్యద్ సలావుద్దీన్ కనిష్ట సోదరి. చిన్న వయస్సులోనే ఉర్దూ, అరబ్బీ ,పర్షియన్ భాషలలో ఆమె మంచి తర్పీదు పొందారు.సోదరుడు సయ్యద్ సలావుద్దీన్‌సహచర్యం వలన ప్రముఖ జాతీయోద్యమ నేతలు మౌలానా అబుల్ కలాం ఆజాద్,మహాత్మాగాంధీ, మౌలానా ముహమ్మద్ అలీ, మౌలానా షాకత్ అలీల ఆలోచనలతో ఆకర్షితులయ్యారు. ఆ ప్రభావంతో భారత జాతీయ కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వంస్వీకరించి బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల దిశగా ముందుకు సాగారు.
155 స్వదేశీ ఉద్యమంలో, మద్యపాన నిషేధం కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం వహించారు. ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించారు.బ్రిటిష్ పాలకుల దుశ్చర్యలను విమర్శిస్తూ ఆమె చేసిన ప్రసంగాలు యువతీ-యువకులను ఉత్తేజపర్చాయి. గృహిణుల కోసం ఆమెచేసిన ప్రత్యేక ప్రసంగాలు కుటుంబ స్త్రీలను ఎంతగానో ఆకట్టుకుని ఖిలాఫత్ పోరాటంలో పాల్గొంటున్న తమ బిడ్డలను, భర్తలను,తోబుట్టువులను చూసి గర్వపడటమే కాకుండ, స్వయంగా మహిళలను కార్యోన్ముఖులను చేయ గలిగాయి.
ఆమె తన ఉత్తేజిత ప్రసంగాలతో సరిపెట్టుకోకుండ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొన్నారు. ఆశయాలను ఆచరణలో చూపి ఎందరికో మార్గదర్శకులయ్యారు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన పలు పోరాటాల నిర్వహణలో సమర్ధత చూపారు. ఈ మేరకు లక్ష్యసాధన పట్ల దృఢదీక్షతో పనిచేస్తూ బీహార్‌లోని జాతీయో ద్యమకారులలోఅగ్రస్థానంలో నిలచి ప్రముఖ మహిళా నాయకురాలిగా పేర్గాంచారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భర్త రియాసత్ హుస్సేన్‌తో కలసి జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహిసున్న సమయంలో ఆయన 1931లో ఆకస్మికంగా మరణించారు. ఆ దుస్సంఘటన ఆమెను మానసి కంగా చాలా దెబ్బతీసింది. ఆ స్థితి నుండి ఆమె మళ్ళీ కోలుకోలేదు.
ఆ తరువాత ప్రాపంచిక విషయాల మీద పూర్తిగా ఆసక్తి కోల్పోయిన ఆ ఉద్యమకారిణి క్రమంగా రాజకీయా లకు దూరమయ్యారు. ఆ విధంగా ప్రాపంచిక విషయాలకు దూరమైన శ్రీమతి సయ్యద్ కనీజ్ బేగం 1955లో చివరిశ్వాస విడిచేవరకు నియమనిష్టలతో ధార్మిక జీవితం గడిపారు.
నా భర్త కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడినట్టే,మృత్యువుతో కూడ పోరాడి విజయం సాధించగలరు. ఒకవేళ మృత్యువుదే పైచేయి అయినట్టయితే, గౌరవప్రదమైన జీవితం సాగించే ఉద్యమకారునికి లభించే మరణం,పదికాలాల పాటు నికృష్టంగా గడిపే భయంకర బానిస జీవితం కంటే ఎంతో ఉన్నతమైంది.
- బేగం ముహమ్మద్ ఆలం. 156