భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం నిశాతున్నీసా బేగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బ్రిటిష్‌ దాష్టికాలకు భయపడని ధీశాలి

బేగం నిశాతున్నీసా బేగం

(1884-1937)

భారత స్వాతంత్య్రోద్యమంలో భర్త రాజకీయాభిప్రాయాలను గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో ఉద్యమ దిశగా సాగిన భార్యలు కొందారైతే, స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉండి ఉద్యమంలో స్వేచ్ఛగా పాల్గొంటూ, భర్తను కూడ తన నిర్దుష్ట,నిక్కచ్చి అభిప్రాయాలతో ఉద్యమ దిశగా ప్రోత్సహించినవారు కొందరు న్నారు. అటువంటిఅరుదైన ధీరవనితలలో బేగం నిశాతున్నీసా అగ్రగణ్యులు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మోహాన్‌ జిల్లాకు చెందిన అవధ్‌లో నిశాతున్నీసా బేగం 1884లో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సయ్యద్‌ శబీబ్‌ హసన్‌ మోహానీ రాయచూర్‌లో హెకోర్టు న్యాయవాది. చిన్నతనంలో బేగం నిశాతున్నీసా ధార్మిక విద్యతోపాటుగా అరబ్బీ, ఉర్దూ, పర్షియన్‌ భాషలను అభ్యసించారు. ఆ ప్రాంతంలో విద్యావకాశాలు లేని బడుగువర్గాల ఆడపిల్లలకు చదవటం, రాయటం నేర్పటం ప్రారంభించి చిన్న వయస్సులోనే ఆమె తనలోని సేవాభావాన్ని వెల్లడి చేశారు. ఈ మేరకు ఆమె మోహాన్‌ (Mohan) జిల్లా చెందిన ఉన్నవ్ గ్రామంలోని బాలికలలో విద్యాభ్యాసం పట్ల ఆసక్తిని కలిగించారు.

జాతీయోద్యమంలో చిచ్చరపడుగుగా ఖ్యాతిగాంచిన మౌలానా హసరత్‌ మోహానిని


111 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆమె 1901లో వివాహం చేసుకున్నారు. మౌలానా పూర్తి పేరు ఫజలుల్‌ హాసన్‌ హసరత్‌ మోహాని. వివాహానంతరం భర్తతోపాటుగా అలీఘర్‌ చేరుకున్న బేగం నిశాతున్నీసా చిన్నతనంలోనే ప్రదర్శించిన స్నేవాభావాలకు, స్వేచ్ఛా, స్వతంత్ర భావాలు గల హసరత్‌ మోహాని తోడ్పాటు లభించింది. మంచి చదువరి అయినటువంటి ఆమెకు పండితుడు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాభిలాషి అయినటువంటి భర్త లభించటంతో ఆమె అధ్య యనం మరింత చురుకుగా సాగింది.

వివాహం తరువాత అలీఘర్‌లో విద్యాభ్యాసం చేస్తున్న మౌలానా మోహాని 1903లో ఉరూ-ఏ-మøల్లా (Urdu-e-Mualla) అను ఉర్దూ పత్రికను ప్రారంభించారు. మౌలానా మెహాని, బేగం నిశాతున్నీసా 1904లో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుండి ఆ దంపతులిరువురు జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలన్నిటిలో పాల్గొనసాగారు. 1907లో సూరత్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అతివాదులు- మితవాదులుగా చీలిపోగా అతివాదుల నేత బాలగంగాధర తిలక్‌ వెంట మౌలానా నడిచారు.ఆ తరుణంలో బేగం నిశాతున్నీసా భర్త అభిప్రాయాలను సమర్థించటమే కాకుండ ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతివాద రాజకీయాలను ప్రోత్సహించారు.

1908లో ఉర్దూ-ఏ-మౌల్లా బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించిన ఓ వ్యాసం పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం ఇండియన్‌ డిఫెన్స్‌ రూల్స్‌ క్రింద నౌలానాను 1908 న్‌ 22న అరెస్టు చేసింది. మౌలానా అరెస్టు కావటం అది మొదటిసారి. ఆ సమయంలో ఆమె తొలి సంతానం ఏడాది వయస్కురాలైన పసికందు నైమా బేగం (Naima Begum) తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఆ

 కుటుంబంలో అరెస్టులు, జైళ్ళ అనుభవం లేదు. అయినా గ్రామీణ ప్రాంతం నుండి

వచ్చిన బేగం నిశాతున్నీసా భర్త అరెస్టు పట్ల ఏమాత్రం భయపడకుండ ఉద్యామకారిణిగా అత్యంత ధైర్యాన్నిప్రదర్శించారు.

ప్రభుత్వం, పోలీసుల చర్యలకు తాను భయపడకుండటం అటుంచి భర్తకు ఎంతో ధైర్యం చెప్పారు. మౌలానా మోహానిని అరెస్టు చేసిన మరుసటి రోజున ఓ లేఖ రాసి దానిని పోలీసు అధికారి ద్వారా ఆయనకు పంపారు. ఆ లేఖలో మీ మీద విరుచుక పడిన ప్రమాదాన్నిఎదుర్కోండి. నా గురించి ఆలోచించ వద్ధు. మీ నుండి

112 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


ఎటువంటి బలహీనత ప్రదర్శితం కారాదు. జాగ్రత్త సుమా! అని హెచ్చరించారు. ఈ లేఖను చూసి మౌలానా ఆశ్చర్యపోయారు.

మౌలానా పక్షాన వాదించేందుకు ఆ సమయంలో న్యాయవాదులు ముందుకు రాలేదు. అలీఘర్‌ కళాశాల కార్యదర్శి నవాబు వకారుల్‌ ముల్క్‌ (Nawab Wiqar-ulMulk) లాంటి ప్రముఖులు మౌలానాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు. (Hasrath Mohani, Muzaffar Hanafi, Trd. by Khadija Azeem, NBT, India, 1989, Page. 29) ఆ విపత్కర పరిస్థితులలో అధైర్యపడకుండ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నంత కాలం ఆయా కార్యక్రమాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు.1908 ఆగస్టు 4న కోర్టు తీర్పు చెబుతూ మౌలానాకు రెండేళ్ళ జైలు, ఐదు వందల రూపాయల జరిమానా విధించింది. ఆ తీర్పు ఆమెను ఏమాత్రం కదిలించలేకపోయింది. దయనీయంగా ఉన్న కుటుంబం ఆర్థిక పరిస్థితుల కారణంగా జరిమానా కట్టలేదు. ఆ కారణంగా అత్యంత విలువైన పుస్తకాలు గల మౌలానా స్వంత గ్రంథాలయాన్ని కేవలం 60 రూపాయలకు పోలీసులు వేలం వేశారు. ఈ సందర్భంగా పోలీసులు నానా హంగామా సృష్టించారు. ఆ దుష్టచర్యలకు బేగం నిశాతున్నీసా కించిత్తు కూడ చలించలేదు.

చివరకు 1909 జూన్‌లో మలానా విడుదాలయ్యారు. జైలు నుండి విడుదల కాగానే మళ్ళీ ఆయన తన బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించారు. ఆయనకు నచ్చచెప్పి ప్రభుత్వవ్యతిరేక కార్యకలాపాల నుండి విరమింపచేయాల్సిందిగా బంధువులు, సన్నిహితులు ఆమెకు సలహాలనిచ్చారు. ఆ సలహాలు ఆమెకు రుచించలేదు. ఆపులు, సన్నిహిత బంధువులు దూరమయ్యే పరిస్థితులు వచ్చినా ధార్మిక,ఆర్థిక, రాజకీయ నిబద్ధ్దత నుండి ఏమాత్రం దారి మళ్ళేది లేదని బేగం నిశాతున్నీసా స్పష్టంచేశారు.

మౌలానా ఉర్దూ-ఏ-మౌల్లా ను పునరుద్దరించారు. ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్నిప్రచురిస్తున్నందున ఉర్దూ-ఏ-మøల్లా ముద్రణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ అవాంతరాన్ని అధిగమించేందుకు మౌలానా దంపతులు తమ చిన్నఅద్దె గృహంలో ఉర్దూ ప్రెస్‌ ఏర్పాటు చేసుకున్నారు.ఈ ప్రెస్‌లో బేగం నిశాతున్నీసా అహర్నిశలు పనిచేస్తూ, అన్నిబాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఉర్దూ-ఏ -మౌల్లా పత్రిక నిరాటంకంగా బయటకు రావటంలో ఆమె అన్ని విధాల మౌలానాకు తోడ్పటునిచ్చారు. బ్రిటిషు ప్రబుత్వచర్య లకు వ్యతిరేకంగా జాతీయ భావాలతో ప్రజలను

113 సయ్యద్ద్‌ నశీర్‌ అహమ్మద్‌

చైతన్యవంతుల్ని చేయాలన్న లక్ష్యంతో ఆరంభించిన ఉర్దూ-ఏ-మౌల్లా ను మరింత అర్థ్దవంతంగా రూపొందిచడంలో సంకల్పబద్ధాులైన నిశాతున్నీసా బేగం బృహత్తర పాత్ర నిర్వహించారు.

మౌలానా దంపతుల ప్రభుత్వ వ్యతిరేక చర్యల పట్ల కినుక వహించిన అలీఘర్‌ ప్రముఖులు ఉరూ-ఏ-మøల్లా పత్రికను ఎవ్వరూ కొనవద్దని, ఆ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించవద్దని ప్రత్యేకంగా హుకుం జారీచేశారు. ఆ కారణంగా మౌలానా దంపతులు ఆర్థికంగా పలు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ సమయంలో వారిల్లు, ఉర్దూ ప్రెస్‌, ఆ దంపతుల ఆత్మగౌరవం, మౌలానా ఇంటి పరిస్థితులుమౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ మాటల్లో ఇలా ఉన్నాయి:

' When Hasarath was released from captivity he had nothing in the world that could provide him any financial help. There is an old dilapidated house that was taken on rent for about two rupees a month, and had a very small room and varandah in the inner part, and almost as much accommodation in the other portion. In the inner portion, lives that fervent freedom fighter, ascetic, with his wife who personifies resolve and determination; and in the outer portion you find a hand operated, small wooden press and a few stones (plates), Often enough he had even calligraphed the copy of Urdu-e-Moalla himself, had himself consolidated it on the stone plates, even operated the press himself to print the journal. This is about all that Urdu-e-Moalla’s owner can boast of as his belongings. Neither has he any other source of income, nor does his self-respect allow him to take obligation from any one else! ‘ (Hasrath Mohani, Muzaffar Hanafi, Trans. by Khadija Azeem, NBT, India, 1989, Page. 29)


అటువంటి దుర్భర పరిస్థితులలో కూడ భర్తకు ధైర్యం చెబుతూ, కుటుంబ బరువు బాధ్యాతలను స్వయంగా భరిస్తూ బేగం నిశాతున్నీసా మౌలానా మోహానిని ప్రోత్సహించారు.బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్షరాగ్నులు కురిపిస్తున్న ఉర్దూ-ఏ-మøల్లా మీద పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఈసారి పత్రికను పూర్తిగా తుదముట్టించాలని అనుకున్నారు. 1913 మే 13న ఉర్దూ-ఏ-మౌల్లా పత్రిక నుండి మూడు వేల రూపాయలను డిపాజిట్టు చేయాల్సిందిగా ప్రెస్‌ యాక్ట్‌ క్రింద డిమాండ్‌ చేశారు. ఆ మొత్తం కట్టనందున ఉర్దూ ప్రెస్‌ను ప్రభుత్వం జప్తు చేసింది. ఆ చర్యతో మౌలానా దంపతులు ప్రాణపదంగా చూసుకుంటున్న ఉర్దూ-ఏ-మౌల్లా మూతపడింది. అంతర్జాతీయ పరిణామాల మూలంగా బ్రిటిషు ప్రభుత్వవ్యతిరేకుల మీద

114 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

పోలీసులు దృష్టిషిసారించారు. జాతీయోద్యమ నేతల మీద ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మౌలానాను గృహనిర్భంధంలోకి తీసుకుని, ఆయన కదలికల మీద ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను ఖాతరు చేయనందున 1916 ఏప్రిల్‌ 13న మౌలానాను ప్రభుత్వం మరోసారి నిర్భంధంలోకి తీసుకుంది. ఆంక్షతో కూడిన స్వేచ్ఛను ప్రభుత్వం ప్రసాదిస్తాననగా అందుకు మౌలానా వ్యతిరేకించారు. మౌలానా హసరత్‌ తీసుకున్న ఆ నిర్ణయం పట్ల మౌలానా ఆజాద్‌, అలీ సోదరులు ఆందోళన వ్యక్తంచేయగా బేగం నిశాతున్నీసా మాత్రం ఎటువంటి జంకు లేకుండా భర్త నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆంక్షలతో కూడిన స్వేచ్ఛ కంటే జైలు జీవితం ఎంతో మేలు అని ప్రకటించారు.

( She declared that arrest was better than detention and that her husband had done well by rejecting the conditions proposed by the British Empire's toadies - Hasrath Mohani, Page.46-47)


పల్లెటూరు నుండి విచ్చేసిన పడతిలో ఇంత ధైర్యం, సాహసం, హేతుబద్ద ఆలోచనల వ్యక్తీకరణలను గమనించిన ప్రముఖ నాయకులు అమితాశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసాలో దాగిఉన్న శక్తియుక్తులన్నీ బహిర్గత మయ్యాయి. మౌలానా విడుదల కోసం అధికారులతో పోరాడుతూ, న్యాయ వాదులను కలసి ఒకవైపు న తీవ్రంగా కృషిచేస్తూ మరోవెపు న మౌలానా పక్షాన ప్రజలకు, పత్రికలకు సమాచారం అందిస్తూ ప్ర ముఖ జాతీయోద్యమ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, అభిప్రాయాలను పంచుకుంటూ, జాతీయోద్యమ కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

మౌలానాను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఒక్కచోట ఉంచకుండా రహాస్యంగా పలుచోట్లకు మార్చుతున్నప్పటికి ఎంతో చాకచక్యంతో ఆ విషయాలను తెలుసుకుంటూ భర్త పరిస్థితిని, ఆయన అభిప్రాయాలను ప్రజలకు, జాతీయోద్యమ నేతలకు తెలుపుతూ మౌలానాకు ప్రజలకు ఆమె సంధానకర్తలా వ్యవహరించారు. ఆ సమయంలో కూడ మౌలానా పక్షాన వాదించేందుకు న్యాయవాదులు ముందుకు రాలేదు . ఆ సంక్లిష్ట పరిస్థితులను కూడ తట్టుకుంటూ భర్త పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు.

మøలానా జైలులో ఉన్నప్పుడు ఆయన సంకల్పబలాన్ని, ప్రభుత్వానికి తలవంచని

115 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

దృఢదీక్షను తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద వ్యాఖ్యానిస్తూ పలువురు ప్రముఖులకు ఆమె ఉత్తరాలు రాశారు. 1916 ఏప్రిల్‌ 11న మౌలానా అబ్దుల్‌ బారికి లేఖ రాస్తూ, మౌలానాకు భగవంతుడు మరింత సంకల్పబలం ఇవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఒక వేళ జైలు శిక్ష పడినా ధైర్యంగా ఉండాలి...నేను కూడ జైలుశిక్షకు గాని ఉరిశిక్షకు గాని బలవ్వడానికి సిద్ధ్దంగా ఉండాలి, అని ప్రకటించారు. మౌలానా మోహాని లలిత్‌పూరు జైలులో ఉండగా, ఆయనకు 1916 ఏప్రిల్‌ 28న రాసిన లేఖలో ఎవడైతే జులుం చేస్తాడో వాడు కత్తికి బలవుతాడు. మనం జులుం చేయం. మన మీద జులుం సాగుతున్నందుకు సంతోషిద్దాం అని ఆమె రాశారు.

మౌలానా మోహాని నిర్బంధంలో ఉండగా ఆమె చూపిన చొరవ, కార్యదక్షత, సమయస్పూర్తి, దేశభక్తిని కొనియాడుతూ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌,మౌలానా అబ్దుల్‌ బారి ఫిరంగి మహాల్‌, మౌలానా ష్ధకత్‌ అలీ, మౌలానా ముహమ్మద్‌ అలీ, ఆబాది బానో బేగం తదితర ప్రముఖులు ఆమెకు లేఖలు రాయగా మహాత్మా గాంధీ ఆమె ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ తన పత్రికలలో ప్రత్యేక కధానాలు ప్రచురించారు.

జాతీయ స్థాయిలో బేగం నిశాతున్నీసాకు లభించిన గుర్తింపు గౌరవం ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం భయంకర దుర్బర పరిస్థితు లను ఎదుర్కోవాల్సివచ్చింది. ఆనారోగ్యం, పోలీసుల వేధింపులు, పేదరికం ఆ కుటుంబాన్నిపట్టి పీడించసాగాయి. ఆ సమయంలో ఆమె ఇంట దొంగతనం కూడ జరిగింది. ఆ దొంగతనంతో ఆ కుటుంబం ఆర్థికంగా మరింత కునారిల్లిపోయింది. కుటుంబం ఎంతి ఆర్థిక అవసరాలతో అల్లాడుతున్నా ఆమె మాత్రం ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలుగనివ్వలేదు.

ఆ కుటుంబం పరిస్థితు లు తెలుసుకున్న మౌలానా సన్నిహిత మిత్రులు, హిందూస్థాన్‌ పత్రిక సంపాదకులు, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు పండిత కిషన్‌ ప్రసాద్‌ కౌల్‌ 1916 -17లో అలీఘర్‌ వచ్చారు. ఆ సమయంలో మౌలానా ఇంటి పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన ఆమెకు ఆర్థిక సహకారం అందించదలిచారు. ఈ విషయాన్ని సంశయిస్తూ ఆమెవద్ద ప్రస్తావించారు. ప్రజల నుండి చందా వసూలు చేసి ఆమెకు పంపగలనన్నారు. ఆ మాట విన్నంతనే మేము ఎలా ఉన్నామో అలాగే ఉండడానికి సంతోషిస్తున్నాం...మా బరువును ఇతరుల మీద వేయటం సరికాదు. మా విషయం గురించి ఆలోచించ వద్ధు.. మౌలానా ప్రచురించిన సాహిత్యం చాలా పడిఉంది. మీకు వీలైనట్టయితే ఆ గ్రంథాలను

116 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


విక్రయించి సహకరించండి. ప్రజల నుండి చందాల వసూలు మాత్రం వద్దుదాు అని ఆమె సున్నితంగా పండిత్‌ కౌల్‌ అభ్యర్థనను నిరాకరించారు.

ఈ విధంగా ఆత్మాభిమానానికి ఏమాత్రం విఘాతం కలుగనివ్వకుండా కష్టనష్టాలను చిరునవ్వుతో స్వాగతిస్తూ ముందుకు సాగే ఉత్తమగుణసంపదతో బేగం నిశాతున్నీసా ఆచరణాత్మక ఉద్యమకారిణిగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. ప్రజలలో గౌరవాభిమానాలను సంతరించుకున్న ఆమె ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుల సరసన నిలిచారు. ఆనాడు సరోజిని నాయుడు, అనిబీస్వ్ంట్, ఆబాది బానో బేగం తదితరులు గల భారతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధిమండలిలో స్థానం పొందారు.

ప్రముఖ మహిళల ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె 1917లో మాంటేగ్ ను కలిశారు. ఆ సందర్భంగా బ్రిటిషు ఉన్నతాధికారి సమక్షంలో ఆమె చూపిన తెగువ ఆమెలోని పోరాటయోధాురాలిని మరోమారు బహిర్గతం చేసింది. విచారణ లేకుండ పోలీసుల నిర్భంధంలో మగ్గుతున్న, ఆంక్షల వలయంలో చిక్కుకుని బాధలు పడుతున్న ఉద్యమకారుల పక్షాన భారతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధిమండలి సభ్యురాలిగాఆమె మాట్లాడారు. ఐర్లండులోని విప్లవకారులను విడుదల చేస్తున్న మీరు నిర్బంధంలో ఉన్న భారతీయ యోధులకు ఎందుకు స్వేచ్ఛనివ్వరని బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యదర్శి మాంటేగ్ ను ప్రశ్నిస్తూ జాతీయోద్యమకారుల విడులను డిమాండ్‌ చేసిన తీరు ఆమెలోని నిర్భీతికి నిదర్శనంగా నిలచింది.

1918 మేలో హసరత్‌ మోహాని జైలు నుండి విడుదలయ్యారు. గృహనిర్భంధ ఉతర్వులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.ఆ ఆంక్షలను ఆయన నిరాకరిస్తూ వాివాటిని ఉల్లంఫిుంచారు. ఆ కారణంగా మీర్‌, మోహాన్‌ తదితర ప్రాంతాలలో ఆంక్షలతో కూడిన నిర్భంధాన్నిమౌలానా చవిచూడల్సి వచ్చింది. ఈ విషయమై నిశాతున్నీసా బేగం భర్త పక్షాన న్యాయపోరాటం సాగించారు. ఆ పోరాటం ఫలితంగా చివరకు డిసెంబరు మాసంలో మౌలానాకు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. ప్రబుత్వం విధించిన ఆంక్షలు తొలగగానే నిశాతున్నీసాతో కలసి మౌలానా ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుగ్గా భాగస్వాములయ్యారు.

1920 డిసెంబరులో ఆరంభమైన సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు.

117 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటిషు ప్రభుత్వాన్ని మన దేశం నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. సfiస్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల మీద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమానిflన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యామానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు మౌలానా దంపతులు భారత దేశంలో ముందుగా స్వదేశీ బట్టల వ్యాపారం ఆరంభించిన వారయ్యారు. స్వదేశీని విస్త్రుతంగా ప్రచారం చేసేందుకు నిశాతున్నీసా పలు సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలలో ప్రసంగిస్తూ మహిళలను ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ ఉద్యమంలో ఆమె నిర్వహించిన బృహత్తర పాత్రను కొనియాడుతూ 1920 మే 19నాి యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ ప్రత్యే క శీర్షిక కూడ నిర్వహించారు.

1920లో మౌలానా హసరత్‌ మోహాని తమ నివాసాన్ని అలీఘర్‌ నుండి కాన్పూరుకు మార్చి అక్కడ ఖిలాఫత్‌ సfiస్వదేశీ స్టోర్స్‌ లిమిటెడ్‌ ను ప్రారంభించారు. ఈ వ్యాపార నిరfiర్వహణలో నిశాతున్నీసా బేగం భర్తకు చేయూతనిచ్చారు. ఆరంభంలో ఈ వ్యాపారం బాగున్నా ఆ తరువాత మౌలానా అరెస్టులు, ప్రభుత్వం ఒత్తిడి, పోలీసుల అరాచకం వలన వ్యాపారం నష్టదాయకంగా పరిణమించింది. ఆ కారణంగా ఆర్థికంగా మౌలానా ఇక్కట్లు పడాల్సివచ్చింది.

ఆర్థికంగా అవస్థల పాలవుతున్నా నిశాతున్నీసా దంపతులు రైలులో మూడవ తరగతి బోగీలలోని అసౌకర్యాలను భరిస్తూ సుదీర్గ… ప్రయాణం చేసి 1921 నాటి అహమ్మదాబాద్‌ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చారు. అహమ్మదాబాద్‌లో ఆబాది బానో బేగం నేతృ త్వంలో అఖిల భారత మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కస్తూరిబా గాంధీ, సరళా దేవిలతోపాటుగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిశాతున్నీసా మాట్లాడుతూ స్త్రీ విద్య పట్ల అత్యధిక శ్రద్ధ చూపాలన్నారు. మహిళలో చైతన్యం రావాలంటే ముందుగా చదువు చాలా అవసరమని భావించారు. స్వగ్రామంలో ఆడపిల్లలకు అక్షరజ్ఞానం అందించడానికి చిన్నతనంలోనే ప్రయత్నించిన నిశాతున్నీసా ఈసారి అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ వేదిక మీద నుండి ఆ అంశాన్ని ప్రకటించారు.

1921లో అహమ్మదాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఆ

118 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

సమావేశంలో మౌలానా మోహాని సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ చారిత్రాత్మక ప్రతిపాదాన చేశారు. ఆ ప్రతిపాదనను బేగం నిశాతున్నీసా బలపర్చారు. గాంధీజీ వ్యతిరేకత వలన ఆనాడు ఆ ప్రతిపాదన తీర్మానం కాలేకపోయింది. ఆ సంఘటన నేపధ్యంలో 1922లో గయాలో జరిగిన మరొక సమావేశంలో ఆనాట్‌ఇఅంశాన్ని పురస్క రించుకుని మహాత్మాగాంధీ వైఖరిని నిశితంగా విమర్శిస్తూ ఆమె అద్భత ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం సభికులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆ సమయంలో జైలులో ఉన్న మహాత్ముడు కూడ ఆమె అభిభాషణ వివరాలను తెలుసుకుని నిశాతున్నీసా నిబద్ధతను అభినందించారు.

ఈ సందర్భంగా సంపూర్ణ స్వరాజ్యం కాంక్షిస్తూ మౌలానా మోహాని చేసిన పలు ప్రసంగాల పట్ల ఆగ్రహంచిన ప్రబుత్వం 1922 ఏప్రిల్‌ 14న ఆయనను అరెస్టు చేసింది. బేగం నిశాతున్నీసా మళ్ళీ న్యాయపోరాటం ఆరంభించారు. మౌలానా కుటుంబం అలీఘ ర్‌ నుండి కాన్పూరుకు తరలి వెళ్ళినందున ఈ సారి ఆమె పోరు కాన్పూరు నుండి సాగింది. చివరకు మౌలానాకు కోర్టు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు జాతీయోద్యమకారునిగామౌలానా మోహాని అత్యధిక సమయం జైళ్ళలో గడపాల్సి రావటంతో నిశాతున్నీసా ఆర్థికంగా పలు కడగండ్లను ఎదుర్కొంటూ కూడ జాతీయ కాంగ్రెస్‌ నుండి ప్రజల నుండి వచ్చిన ఆర్థికసహాయాన్ని తిరస్కరించారు. ఈ విధంగా అన్ని కష్టనష్టాలను సహిస్తూ పోరుబాటన సాగిన నిశాతున్నీసా ఉద్యమకారుల కుటుంబాల కు ఆదర్శంగా నిలిచారు.

అహమ్మదాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలనంతరం 1924 డిసెంబరు 29న మౌలానా హసరత్‌ మోహాని భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. భర్తను రాజకీయ సహచరునిగా భావించిన బేగం నిశాతున్నీసా ఆయన అభిప్రాయాలను సమర్ధించారు. ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటూ, సంపూర్ణ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం కాంక్షించే ఆ దంపతులు తమ లక్ష్యం దిశగా ముందుకు సాగుతూ, భారత కార్మికోద్యమ నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహించారు.

చివరివరకు అటు ప్రజలతో మమేకమై జాతీయోద్యమంలో, ఇటు కార్మికులతో ఏకమై కార్మికోద్యమంలో ఆమె చురుకన పాత్రను కొనసాగించారు. 1925లో కాన్పూరులో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల సందర్బంగా జరిగిన కార్మికుల భారీ ప్రదర్శ నకు ఆమె నాయకత్వం వహించారు. ఆ తరు వాత క్రమక్రమంగా నిశాతున్నీసా బేగం క్రియాశీలక

119 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రాజకీయాలకు దూరమయ్యారు.

ఈ మేరకు జీవితం చరమ దశ వరకు ఏదో ఒక మార్గాన బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో ఆమె చూపిన తెగువ, ధైర్యసాహసాలను స్వయంగా గమనించిన మౌలానా ముహమ్మద్‌ అలీ ఆమె వ్యక్తిత్వంలోని ఔన్యత్యం మౌలానా మోహాని కంటే గొప్పదని కీర్తిస్తూ , ‘ his stature remain secondary to that of the fragile lady who was endowed with a heart larger than his...the woman, who had during his absence, inspired the Muslims with such daring and fortitude that even he could not have done had he not been behind the bars’. (Hasrath Mohani, Page.72) అని అనాflరు. ఆమెలోని ఉత్తమ గుణసంపదను మననం చేసుకుంటూ ఆనాటి ముస్లిం మహిళలలో మాత్రమే కాకుండ సమకాలీన పురుషులలో కూడ అంత స్థాయి కన్పించదని,మౌలానా హసరత్‌ మోహాని స్వయంగా నిశాతున్నీసా బేగం గురించిన రాసిన ఆర్టికల్‌లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

‘ Her selflessness, modesty, sense of dignity and honour, benevolence, perception and sagacity, courage and truthfulness, her determination and daring, generosity and sincerity, the depth of her faith and the purity of devotion, her high sensibility and politeness and fortitude, and, above all her devotion to the Prophet and her faith placed Begum Mohani much above not just Muslim women but also above most men of time. ‘ (Hasrath Mohani, Page.72).

బేగం నిశాతున్నీసా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా భర్తతోపాటుగా పలు ప్రాంతాలను చుట్టివచ్చారు. ఆ పర్యటనలలోని విశేషాలను, తన అనుభవాలను రాజకీయాభిప్రాయాలను అక్షరబధం చేస్తూ Safar Nama-e-Hijaz, Safar Nama-e-Iraq అను గ్రంథాలను రాసి ప్రచురించారు.

ఈ విధంగా ప్రత్యక్షంగా తన విలక్షణమైన వ్యవహారసరళితో, పరోక్షంగా తన భర్త అభిప్రాయాలను ప్రభావితం చేస్తూ, అటు భారత స్వాతంత్య్ర సంగ్రామంలో, ఇటు భారత కార్మికోద్యమ చరిత్రలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, కార్యదక్షత, సమయస్పూర్తి ప్రదర్శించిన ఉద్యామకారిణిగా తనదైన ముద్రను సుస్థిరం చేసుకున్న బేగం నిశాతున్నీసా 1937 ఏప్రిల్‌ 18న కాన్పూర్‌లో కన్నుమూశారు.

120