భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/అస్గరీ బేగం
తిరుగుబాటుయోధుల క్షేమం కోరుతూ అగ్నికి ఆహుతైన
అస్గరీ బేగం
(1811 - 1857)
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మాతృభూమి పట్ల తెగని బంధాన్ని పెంచుకున్న ప్రతి ఒక్కరూ అపూర్వమైన త్యాగాలతో చిరస్మరణీయులయ్యారు. అటువంటి త్యాగదనులలో తిరుగుబాటు యోధుల క్షేమం కోరుకుంటూ తనను తాను బలి చేసుకున్న త్యాగశీలి శ్రీమతి అస్గరీ బేగం.
1811 జులై 5న ఉతర పదశ్ రాష్ట్రం ముజఫరపూర్ జిల్లాలో అస్గరీ బేగం జన్మించారు. ఆమె కుటుంబం ప్రథమ స్వాతంత్య్రసంగ్రామయోధుల కుటుంబం. 1857నాటి పోరాటంలో పాల్గొన్నఖ్వాజీ అబ్దుల్ రహిమాన్ ఆమె కుమారుడు.అబ్దుల్ రహిమాన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఆ తిరుగుబాటులో ఆమె కూడ పరోక్షంగా పాల్గొన్నారు. ఆ సంగ్రామంలో పాల్గొన్నప్రతి ఒక్కరూ తన బిడ్డలేనని భావించిన ఆమె తిరుగుబాటు వీరులకు ఆశ్రయం కల్పించటం, ఆహార పానీయాలు అందించటంలో సహాయపడ్డారు.
ఈ విషయం తెలిసిన ఆంగ్లేయ సైనికాధికారులు ఆమెను బంధించారు. ఆమె మీద రాజద్రోహం ముద్రవేశారు. ప్రథమస్వాతంత్య్రసంగ్రామ యోధుల రహస్యాలు చెప్పమని ఆమెను వేదించారు. అధికారులతో సహకరించకుంటే సజీవదహనం చేస్తామని బెదిరించారు. ఆ బెదిరింపులు ఏవీ కూడ ఆమె పట్టుదలను సడలించలేకపోయాయి. చివరకు భయంకర చిత్రహంసల పాల్జేసినా ఆమె లొంగలేదు , పెదవి విప్పలేదు . అందుకు ఆగ్రహంచిన అధికారులు ఆమెను సజీవదహనం చేయించారు. ఆంగ్లేయ సైనికాధికారుల హింసాత్మక చేష్టలను భరించిన అస్గరీ బేగం మాతృభూమి సేవలో చిరునవ్వుతో బలయ్యారు.
(Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi,1993, Page.116 and Who is who Indian Martyrs, Dr. PN Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 118)
66