భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు/పరిచయ వాక్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పరకాల పట్టాభిరామారావు, స్వాతంత్ర సమరయోధులు, విశాలాంధ్రా దినపత్రిక విశ్రాంత సంపాదకులు విజయవాడ, ఫోన్‌:0866-2474635


పరిచయ వాక్యం

పరకాల పరిచయ వాక్యం

'భారత సాfiతంత్య్రోద్యమం: ముస్లింలు' గ్రంథాన్ని శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వ్రాయకపోతే భారత స్వాతంత్య్రోద్యామంలో ముస్లింలు నిర్వహించిన వీరోచిత పాత్ర,కొత్తతరం వారికే కాదు, పాత తరం వారిలో చాలా మందికి కూడ తెలియకుండ పోతుందనే చెప్పుకోవాలి. ఈ గ్రంధంలో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రను విహంగ దృష్టితో వీక్షిస్తూ, అందులోని ప్రధాన ఘట్టాలలో ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల పాత్రను సోదాహరణంగా రచయిత తెలియజేశారు.

1765 ప్రాంతంలో బ్రిీటిష్‌ పాలకుల మీద తొలి తిరుగుబాటు జెండాను ఎగురవేసిన ముస్లిం ఫకీరులు- హిందూ సన్యాసుల సాయుధ పోరాటంతో ప్రారంభించి,వలసపాలకుల జోహుకుందారులుగా వ్యవహరిస్తున్న జమీందారులను, మహజనులు అనబడు వడ్డీ వ్యాపారులను ఎదాుర్కొన్న ఫరాజీ యోధుల తిరుగుబాట్లను, వహాబీ వీరుల పోరాటాలను, మలబారు మోప్లాలు సాగించిన అత్మార్పణల విశిష్ట ఉద్యమాలకు సంబంధించిన చాలా అరుదైన సమాచారాన్ని ఈ గ్రంధం అందిస్తుంది. ఆ పోరాటాల అపూర్వ చరిత్రను రచయిత ఉత్తేజపూర్వకంగా వివరించారు. ఆనాటినుండి పరాయి పాలకుల మీద యుధ్జం ప్రకటిచిన యోధుల చరిత్ర క్రమంలో టిపూసుల్తాన్‌ పాత్రను ప్రవేశపెడుతూ, విదేశీ శత్రువుతో పోరాడుతూ రణభూమిలో వీరమరణం పొందిన స్వదేశీ రాజులలో ఆయన ప్రధముడని రచయిత తెలిపారు. 7 1857 నాటి చారిత్రక పోరాటంలో అద్వితీయ పాత్ర పోషించిన ముస్లింల సాహసాలను, ఆ దశలో అరివీర భయంకరంగా పోరాడిన పలువురు యోధుల గురించే కాకుండ యోధరాండ్ర గురించి అమూల్య సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. ఆనాటి పోరాట యోధుల వీరోచిత గాధలు హృదయాలను కదల్చివేస్తాయి. చరిత్ర పుటలలో మరుగునపడన ఈ ఘట్టాలు రచయిత ఎంతో శ్రమించి అంవేషిస్తేగాని లభించే అవకాశం లేదు. ఈ పోరాటంలో భాగం పంచుకున్న పాత్రికేయుల ఘన చరిత్రను కూడ స్వయంగా జర్నలిస్టు అయిన నశీర్‌ వదిలి పెట్టలేదు . కంపెనీ పాలకుల దుశ్చర్యలను దుయ్యబడుతూ, తిరుగుబాటును ప్రోత్సహిస్తూ కలంతో రణం చేసి, జనరల్‌ హడ్సన్‌ తుపాకి గుండ్లకు బలైన 'ఢిల్లీ అక్బార్‌' సంపాదకుడు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ గురించి సరికొత్త సమాచారాన్ని అందించారు. ఆయన బాటలో నడిచిన నిజాం రజాకారుల కరకు కత్తులకు బలైన, తెలుగు బిడ్డడు షోయాబుల్లా ఖాన్‌ను మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తారు. ప్రధమ స్వాతంత్య్ర సమరంలో బ్రిీటిష్‌ పాలకుల రికార్డులను బట్టే 27 వేల మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారన్న సమాచారం చదువుతుంటే కళ్ళనీళ్ళు తిరగకమానవు. ఈ పోరాటంలో వ్యక్తమైన హిందూ-ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు వలసపాలకులు ప్రజలను మత ప్రాతిపదికన విభజించి, చరిత్రను వక్రీకరించి రాసి, మత మనోభావాలను రంగం మీదకు తెచ్చి, విభజనకు బీజాలు నాటారని రచయిత వివరిస్తారు.

1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ అవిర్భావం నుండి స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు ఈ గడ్డ బిడ్డలైన ముస్లిం జనసముదాయాల భాగస్వామ్యాన్నిఅందులో విశిష్ట భూమిక నిర్వహించిన త్యాగదనుల విశేషాలను పాఠకులకు పరిచయ ం చేసూందీ గ్రంథం.సామాన్య పాఠ్య గ్రంథాలు గాని, అందుబాటులో ఉన్న చరిత్ర గ్రంథాలలో గాని మనకు లభ్యంగాని అరుదైన సాహస ఘట్టాలను మన ముందు దృశ్శీకరించి పాఠకుడ్నితన వెంట తిప్పుకుంటూ, అలనాటి స్వాతంత్య్ర సమరయాధులందర్నిపరిచయం చేయటంలో రచయిత విజయం సాధించారు.

జాతీయ కాంగ్రెస్‌ స్థాపనలో, విస్తరణలో సహకరించిన బధ్రుద్దీన్‌ తయ్యాబ్జీ, రహిమతుల్లా సయాని నుంచి, '... నమాజ్‌ నాకు ఎంతటి విధి అయిందో, నా దేశ 8 స్వాతంత్ర్యం కోసంపోరాడటం అంతే తప్పనిసరి విధి...' అంటూ పోరుబాటన నడిచిన ఉలేమాల ప్రతినిధి మౌలానా అహమ్మద్‌, అగ్నియుగంగా ఖ్యాతిగాంచిన విప్లవోద్యమంలో పాల్గొని దాశాబ్దాల తరబడి ప్రవాస జీవితాలను గడపటమే కాకుండ ప్రప్రథామ ప్రవాస భారత ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్‌ బర్కతుల్లా భోపాలి,యుగాంతర్‌ గ్రూపుకు చెందిన విపవకారుడు ఖుదీరాంకు ఆశ్రయం కల్పించి 'ఖుదీరాంకి దీది'గా ఖ్యాతిగాంచిన అజ్ఞాన యువతి, ఉరి కొయ్యలకు వెరవని అసమాన ధర్య వంతులు రసూలుల్లా ఖాన్‌, ఇంతియాజ్‌, భగత్‌ సింగ్ ఆదర్శప్రాయుడు, హిందు-ముస్లింల ఐక్యతా చిహ్నం అష్పాఖుల్లా ఖాన్‌ లాింటి అరుదైన విప్లవ వీర కిశోరాలు ఈ గ్రంధంలో పాఠకుడికి తారసపడతారు.

జాతీయోద్యామంలో భాగంగా సాగిన ఖిలాఫత్‌ పోరాటంలో ముందుకు నడిచిన అలీ సోదారులు, స్వాతంత్య్రం కంటే హిందూ-ముస్లింల ఐక్యత ప్రధానమన్నమౌలానా అబుల్‌ కలాం అజాద్‌, బ్రిీటిష్‌ పోలీసుల క్రౌర్యాన్ని పళ్ళబిగువున భరించి తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్‌ చేసిన కమ్యూనిస్టు యోధుడు మౌలానా హస్రత్‌ మోహాని, జలియన్‌వాలాబాగ్ వీరుడిగా ఖ్యాతిగాంచిన డాక్టర్‌ సైపుద్దీన్‌ కిచ్లూ విముక్తి పోరాటంలో విలాసాలకు తావు ఉండరాదాంటూ సర్వస్వం ఉద్యమాలకు సమర్పించటమే కాకుండ గాంధీజీ దేశ పర్యటనకు నిధులు అందజేసిన వృద్ధ మాత 'బీబి అమ్మ'గా చిరస్మరణీయురాలైన అబాది బానో బేగం, నిషాతున్నీసా బేగం లాింటి పలు మహిళా రత్నాలు,క్విట్ ఇండియా' నినాదం సృష్టించిన యూసుఫ్‌ మోహరాలి, వందలాది విముక్తి పోరాట యోధులు తమ తమ విశిష్టమైన భూమికలతో దార్శనమిస్తారు. స్వరాజ్య సాధన మాత్రమే కాకుండ కార్మిక- కర్షక సంకే∆మం కోరుకుంటూ ఆ దిశగా కూడ సాగి పలు కుట్ర కేసులను ఎదుర్కొన్న షౌకత్‌ ఉస్మాని, ముజఫర్‌ అహమ్మద్‌, కవులు ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం, సజ్జాద్‌ జహీర్‌, హజరా బేగం లాిం కమ్యూనిస్టు ఉద్యామకారుల సమాచారం ఉంది. నేతాజీ నాయకత్వంలో ప్రాణాలు తృణప్రాయంగా భావించి ఆజాద్‌ హింద్‌ ఫ్ధజ్‌లో ప్రముఖ పాత్ర వహించి, ' జైహింద్‌ ',నేతాజీ అను ప్రఖ్యాత పదాలను కాయిన్‌ చేసిన మన రాష్ట్రానికి చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని, పౌజ్ సేనాని జనరల్‌ 9 షానవాజ్‌ ఖాన్‌, నేతాజీ వెంట మృత్యువునుస్వీకరించిన హబీబుర్‌ రెహమాన్‌ లాింటి వీరపుత్రుల అరుదైన విశేషాలు ఈ గ్రంథంలో లభ్యమవుతాయి. నిరాయుధులుగా బ్రిీటిష్‌ పోలీసు బలగాలకు ఎదురు నిలచి అహింసా మార్గంలో ఆత్మార్పణలతో వాయవ్య సరిహద్దు రాష్ట్రాన్ని ఎరుపెక్కించి, ప్రపంచ అహింసోద్యమాల చరిత్రలో అగ్రస్థానం పొందిన ఖాన్‌ అబ్దుల్‌ గపార్‌ ఖాన్‌ 'ఖుదా-యే-ఖిద్మత్‌గార్‌' పరాన్‌ బిడ్డలు కనపడతారు.

బ్రిీటిషర్ల బానిసత్వం నుండి విముక్తి కోసం సుదీర్గ కాలంపాటు సాగిన స్వాతంత్య్ర సమరంలోని ప్రతి ఘట్టంలో తమ భాగస్వామ్యాన్ని అందించిన ముస్లిం యోధుల పాత్రను సంగ్రహంగా అందించిన, ఈ గ్రంథాన్ని రచయిత క్రింది వాక్యాలతో ముగించటం సమంజసంగా ఉంది. దేశ విభజన సమయంలో '.. ముస్లిం సంపన్న.వర్గాలలో అత్యధికులు భారత్‌ వదిలి వెళ్ళి పోయారు. కాని లౌకిక భారతంపై పరిపూర్ణ విస్వాసంతో కోట్లాది ముస్లింలు యిక్కడే ఉండిపోయారు. మాతృదేశం అభివృద్ధి, రక్షణకు సంబంధించిన పలు రంగాలతోపాటు దేశ ప్రతిష్టను యినుమడింపజేసే అనేక జీవన రంగాలలో విశేషమైన కృషి సల్పుతూ భారతీయ సమాజంలో అవిభాజ్యమై పోయారు. మౌలానాఅబుల్‌ కలాం ఆజాద్‌ మాటల్లో చెప్పాలంటే, ముస్లింలు లేని భారత చరిత్ర, సంసృతి,నాగరికత అసంపూర్ణం, అపరిపూర్ణం...'.

ఈ మాటలను అక్షరాల రుజుచేసేవిధంగా రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఎంతో శ్రమకోర్చి, అపూర్వ పరిశోధన జరిపి, ఈ గ్రంథాన్ని ఒక అమూల్యమెన కానుకగా తెలుగువారికి అందాచేశారు. భారత స్వాతంత్య్ర సమరం చరిత్రకు సమగ్ర రూపం కల్పించడనికి ఇంకా ఎంత కృషి జరగాల్సి ఉందో ఈ పుస్తకం గుర్తు చేస్తుంది.స్వాతంత్య్రోద్యమ ఉజ్వల చరిత్రలో ముస్లింల పాత్ర గురించి గతంలోను, వరమానంలోను,భవిష్యత్తులోను పరిశోధన జరిపిన, జరుపుతున్న వారందరికీ ఈ గ్రంధం అమూల్యమైన ఆధారం కాగలదు. అంతటి మంచి పరిశోధానాత్మక పుస్తకాన్ని అంద చేసినందుకు స్వాతంత్య్ర సమరయోధుల అందరి పక్షాన, పరిశోథకుల తరఫున రచయిత శ్రీ నశీర్‌ ఆహమ్మద్‌ను అభినందిస్తున్నాను.


10