Jump to content

భారత మాతకు జేజేలు

వికీసోర్స్ నుండి

బడి పంతులు (1972) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన పాట.


పల్లవి : భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికీ జేజేలు

చరణం 1 : త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి

చరణం 3 : సహజీవనము సమభావనము
సమతావాదము వేదముగ
ప్రజాక్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి