భారత నీతికథలు/శిశుపాలుఁడు - దైవదూషణము

వికీసోర్స్ నుండి

17. శిశుపాలుఁడు - దైవదూషణము.


జరాసంధవధ జగద్విదితంబగునట్లు వాని కళేబరం బును భీమసేనుఁడు నగరద్వారతోరణ సమీపంబున పై చెను. ఆ భయంకర కృత్యమును జూచి పట్టణవాసు లెల్లగు భయాతిశయంబునఁ బ్రాణాపాయమును శంకించిరి. కరుగాసమేతుఁడైన గరుడధ్వజుఁడు మాగధుల కెల్ల నభయ మిచ్చి బియందున్న రాజలోకంబు నెల్ల విడిచి పెట్టెను, మో కి తులైన శత్రియులెల్లరు ననంత రత్న పుంజములను గాను కex గా సమర్పించుకొనిరి. జరాసంధుని కుమారుడైన సహ దేవు నోదార్చి వాసు దేవుఁడు వానికిఁ దండ్రి సింహాసనము నొసంగెను.

లోకైక వీరుండైన మాగధుఁడు పృహోదరునిచేఁ జంపఁబడుట వినినంత నే యుధిష్ఠిరుఁడు మహానంద భరితుఁడై రాజసూయంబింక నిర్విఘ్నముగఁ గొనసాగునని ధైర్యము వహించెను. వాని యజ్ఞానుసారముగ భీముఁడు తూర్పు "దేశమునకును నగ్గుముడు త్తర దేశమునకును నకులుఁడు పశ్చిమ దేశంబునకును సహ దేవుఁడు దక్షిణ దేశమునకును దిగ్విజయార్ధము మరల బయలు దేతిరి. పాండు రాజకుమారుఁ డైన ధరరాజు రాజసూయయాగము గావించుంగావున జరాసార్వ భౌమునకుఁ గప్పములు చెల్లింప వలయునని భీమాసున నకుల సహదేవులు తాము పోయిన దేశముల ________________

కుజుడు - దైవదూషణను, యందలి రాజులను శాసించిరి. సయముచేఁ గొందఱు, భయముచేఁ గొందఱును, బోరాడి యోడిపోయి కొందఱును, మొత్తము పై రాజు లెల్లకును బాండుకుమారులకు వశులై యపరిమితము లైన ధనకనక వస్తు వాహనాదులను యుధిష్ఠిరు నకు సమర్పించుకొనిరి. ధర్మరాజు రాజసూయ యాగమును బ్రారంభించెను, పురోహితుఁ డై న చౌమ్యుఁడు కావలసిన యజ్ఞోపకరణ ద్రవ్యము లన్నియు సమకూర్చెను • దిగ్విజయమున ధర రాజు నడు సామంత రాజు లైన మహా రాజులందు నా యాగమున రాహ్వానింపఁబడి వచ్చిరి. వచ్చిన రాజుల కెల్లఁ దగిన నివేశము లొసుగఁబడినవి. దుర్యోధనుఁడు కర్ణునితోడను సూర్వురు తములతోడను వచ్చెను. మఱియు విరాట ద్రుపద శిశుపాల వృష్టి భోజూంధక రాజులును, అంగ మగ కళింగ కాశీర కాంభోజాది రాజులును వచ్చిరి. అట్లు వచ్చిన సకల రాజులోక ములో మనకుఁ బ్రస్తుతము శిశుపాలుఁడు ముఖ్యుఁడు. శిశుపాలుఁడు చేది రాజ్యముసకు రాజు. తండ్రి దమ ఘోషుఁడు. తల్లి సాత్వతి. ఆ దంపతులకు వీడు చతుర్భుజ లలాట నేత్రములతోఁ బుట్టి, పుట్టినంత నే గార్దభస్వరంబుతో నేడువ నారంభించెను. ఆ యేడుపు చూచి తల్లిదండ్రులు భయవి స్తయాధీన మనస్కులగుచుండ నొక్క యశరీరి యైన భూతము వారి కిట్లనియె. “ఈ బాలు 'నెవ్వరెత్తికొనినచో వీని రెండు చేతులు లలాట నేత్రమును మాయమగునో ________________

భారత నీతికథలు - రెండవ భాగము. నాని చేత నితఁడు చంపఁబడును. ఇతరులచేఁ జంపఁబడఁడు." ఇట్లుపలికిన యశరీర వాణిని విని వారమితాశ్చర్యము నొంది, యా బాలునిఁ జూడవచ్చిన వారికెల్ల ఏని 'నెత్తుకొనుట 'కందిచ్చుచుండిరి. అతి వికృత స్వరూపుఁ డైన యా బౌలని, మేనత్తయైన సాత్వతినిఁ జూచుటకుఁ గృష్ణుఁ డొకనాఁడు వచ్చెను. వచ్చినంతనే వాసు దేవునిఁ బ్రియసత్కారంబులఁ బూజించి సాత్వతి తనకుమారుని దాని కందెచ్చెను. అతం డక్కుమారుని నెత్తుకొనినంత నే చూచువారి కెల్ల నక్కజముగ వాని మిక్కిలి చేతులును, మిక్కిలి కన్నులును దటాలున 'మాయమైనవి. దానింజూచి సాత్వతి యద్బుతచిత్తయై యశ కరివచనం బప్పుడు తలంచి తన పుత్రునకు నారాయణుని వలన మరణంబగుట యెఱిఁగి " ముకుందా ! వీడు దుష్టుండై నీ కనిష్టుండై యెంతటి యవినయము గావించినను, గరుణించి నూ జపరాధముల వజకు క్షమింపవలయు”నని ప్రార్థించెను. జగద్విభుండైన జనార్దనుండు మేనత్తను మన్నించి యామె కావరంబు నొసంగెను. ఇది శిశుపాలుని బాల్యవృత్తాంతము. పెద్దవాఁడై న తరువాత నతఁడు జరాసంధాదులకుఁ 'బాణమిత్రుడై కృష్ణుని శతకోటిలో వర్తించు చుండెను. వివిధ దేశా గతులైన రాజపుతు లెల్లరు నాడు ధర రాజు రాజసూయ వైభవమును జూచి మిక్కిలి సంతసించి, సకల క్షత్రియ వీరులచే నలంకరింపఁ బడిన నిండు సభలో సర్వసమతుం ________________

శుపాలుడు - దైవదూషణను, మల దును జగన్మాన్యుండును నగు నొక్క మహా పురుషునిఁ 'బెద్దగాఁ జేసి యర్ఘ్యం బొసంగి గౌరవింపుమని భీషుఁడు ధర్మజునకు, జెప్పెను. యుధిష్ఠిరుం డందుకు సమతించి, “మహాత్మా ! ఈ 'రాజలోకములో నట్టి మహాపురుషుఁ "డెవ్వరో నిర్ణయించిన యెడల వానికర్ష్యం బొసంగెద " నని యడి గేను. "పుండరీకాక్షుండైన కృష్ణుండుదక్క నిందర్యంబుగొనుట కర్ష లిం కెవ్వరు గలరు. కావునఁ బురుషోత్తముం డైన నారాయణుని గౌరవింపు" మని భీషుఁడు నియోగింపఁ దద్వచనంబున ధర్మనందనుఁడు సహదేవుఁడు దెచ్చిన యర్యం బర్హణీయుండయిన వాసు దేవు నకు శాస్త్రప దిష్ట విధానంబున నిచ్చిన, దానింజూచి సహింపనోపక శిశుపాలుం డుపాలంభ నపరుండై యధోక్షజు నా క్షేపించుచు ధర్మరాజున కిట్లనియె. “యుధిష్ఠి రా ! అవనీనాధు లనేకులుండ, వశిష్టా చార్యులును బూజ్యులునగు ఊహణులు పలువురుండ, గాం గేయు నవినీతి విని కష్టచరితుండైన కృష్ణునిఁ బూజించి నీయవి వేకంబు వెల్లడించుకొంటివి. నీవుధ రపరుండవనియుఁ బూజ్యుండవనియు నీసుగుణంబులు వినివచ్చిన మా రాజలోక మును నీవిట్లు పరిభవింపవచ్చునా! ఈదాశార్షఁడు పూజారు డగునా! ఈకృష్ణుండు మీకంతయిష్టుండేని వలసినంత ధనం బొసం గెదగుగాక. మావంటి మహా రాజులును గృపద్రోణా దులవంటి యాచార్యులును గల యీనిండు సభలో పొనిం ________________

భారత కథలు - రెండవ భాగము. బూజుంపవచ్చునా?" అని యింక నే మేమో నోటికివచ్చిన మెల్లఁ బ్రెలుచుసభనుండి తొలంగి పోయెను. పోనీతోడ సేవాని మిత్రులైన మణికొందఱు రాజులును వెడలిపోయిరి. వారెల్లరు రణ సన్నాహమొనర్చినయెడల యజ్ఞమునకు భంగము వాటి ల్లునని భయపడి, ఛగరాజు శిశుపాలుని సమీపించి మంచి మాటలతో వానిని శాంతిపరచుటకుఁ బ్రయత్నింపసాగెను. ఎంద తెన్ని విధములఁ చెప్పిన 'జఁడు తన మౌర్యమును మానలేదు. మానక కృష్ణున కెదురై కయ్యమునకుఁ గాలు చువ్వసాగెను. అప్పుడు చక్రధరుండు సకలరాజు చక్రము విన గంభీర స్వరమున నిట్లుపలి కె. “ప్రాగ్యోతిషంబునంగల భగదత్తుపై దండెతి పోయినప్పుడీ శిశుపాలుఁ డన్యాయముగఁ బ్రజల బాధించి ద్వార నగరమును గాల్చెను. మా భోజవంశపు రాజులు భార్యలతోఁ గూడ రైవతకాద్రిని వినోదించుచుండ వారి నకారణంబు వధించెను. వసు దేవుఁడు చేయదలంచిన యజ్ఞము విఘము నొందునట్లు వాని హయమును నపహరించెను. మఱియు వీఁడు వాగ్విషయంబు లైన యపకారంబు లనేక ములు నాకొనర్చె. తొల్లిమాయత్త సాత్వతి నన్నుం ఆర్డిం చుటం జేసి, యిద్దురాతుండు చేసిన యపరాధశతంబు సహిం చితిని. ఇప్పుడు మీరందఱు నేఱుంగ నన్న కారణంబు దూషించి, నాకత్యంత శత్రుండయ్యె.” ఇట్లు పలుకుచు నారాయణుండు రాజచక్రంబెల్ల భయ మొందునట్లు చక్రంబును - - a ________________

(8) ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము. బును బ్రయోగించి శిశుపాలుని మస్తకంబును దటాలున ఖండించెను. కం. భూరిగుణోన్నతు లనఁదగు హరికి ధీరులకు ధరణివల్లభులకు ఈ క్పారుష్యము చను నే మహా దారుణమది విషముకంటె దహనముకంటెన్.

18. ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము.


ఖాండవ దహన కాలమున నగునుఁడు మయునకుఁ గావించిన మహోపళారమును దలంచి, మయుఁడు రాజు సూయ సందర్భమున నత్యద్భుత మగునొకసభగావించి పాండ పులకి చ్చెను. ఆ విచిత్ర సభావై భవంబును జూచివచ్చిన రాజు లెల్లకు మితిమీరిన యాశ్చర్యమును జూచుటయం దింకను ద: విఁ - దక, దుర్యోధనుఁడు శకు నీతోఁ గొన్ని దిసములం దే యండి పోయెను. ఒకనాడు దాని యపూర్వరమణీయతకు విస్మితుండై యా యూప్రదేశములం గ్రుమగుచు, వివృతంబైన ద్వారమును సంవృతంబుగాఁ దలంచి చొరనొల్లక, సంవృత ద్వారమును వివృతంబని చొరంబోయి, కవాటఘటిత లలాటుండగుచుండెను. మఱియు విమలమణిష్ఠలంబు జలా శయంబనుకొని పరిధానంబుగఁ దోచికొని, నిజమైన జలాశయంబును స్థలముగాఁ దలంచి, కట్టిన పుట్టము తడియం