భారత నీతికథలు/కల్మాషపాఁదుడు - బ్రాహ్మణతిరస్కారము

వికీసోర్స్ నుండి

4. కల్మాషపాదుఁడు - బ్రాహ్మణతిరస్కారము.

వసిష్ఠుని యద్భుత ప్రభావమునకుఁ బాండవులు మహాశ్చర్య చేతస్కులైరి. “చిత్రరథా ! నీవు సర్వజ్ఞుండవు. నీ మూలంబున బ్రహ్మతేజోధికుండైన వసిష్ఠుని మహాత్మ్యమును వినఁగలిగి కృతార్థులమైత్రిమి. మిత్రమా ! అమ్మహాత్మున కిల్లాలై ధన్యురాలైన పుణ్యురాలెవ్వరు ? పురాణదంపతులంబోలు నాపుణ్య దంపతులకుఁబుట్టిన పుత్రులెవ్వరు ? వారును దండ్రియంతటి తపస్సంపన్నులు కా గలిగిరా ?” అని వసిష్ఠ కథాశ్రవణ కౌతూహలంబున నర్జునాదు లెన్ని యో ప్రశ్న లడుగుచుండ నాగంధర్వుండు వెండియు వారికిట్లనియె.

జగత్పావన శీలయైన యరుంధతి వసిష్ఠుని భార్య. అమ్మహా సాధ్వియందు వనికి నూర్వురు పుత్రులు జనించిరి.

అయోధ్యా పురాధీశ్వరుండును నిక్ష్వాకుకుల సంభవుండునునగు కల్మాషపాదుఁడను రాజు మృగయావినోదంబున నొక్కనాడు వసిష్ఠాశ్రమ సమీపారణ్య భూముల విహరించుచు గిరిగహనసంచారంబున నెంతయుడస్సి విశ్రమార్థము దదాశ్రమము వంకవచ్చు చుండెను. అప్పుడు వసిష్ఠ పుత్ర శతంబున కగ్రజన్ముండును నధికతపశ్శక్తి యుక్తుండునునగు శక్తియను మహాముని యయ్యరణ్యంబున నింధనార్థంబు పోవుచు మార్గ మధ్యంబున వాని కెదురయ్యెను. రాజుల దర్శించినంతనే మ్రొక్కుటయుఁ బ్రక్క కుఁ దొలంగుటయు మున్నగు భక్తి వినయ సూచకంబులం తనయెడఁ జూపని శక్తింజూచి, రాజాభిమానంబునఁ గల్మాష పాదుఁడు తెరువు దొలంగుమని యీసడించుచుఁ బలికెను. “రాజా! ఎట్టి 'రాజులైనను బ్రాహ్మణోత్తము లేదురగుగు దెంచు సప్పుడు భక్తి యుక్తులై నమస్కరించి ప్రియంబులు వలికి మార్గం బోసంగెదరు. ఇదియే యుత్తమ ధర్మము. దీనిని నీ వేల యెఱుంగకున్నావని" శక్తి బదులు చెప్పిను. అంతఁ గల్మాష పొదుండు వాని పై నాగ్రహించి తన చేతనున్న కశకోలతో సమ్మునీంద్రుని దీవ్రముగా వేసెను. ఇట్లవమాని తుండైన శక్తియు నపొర కోపారుణిత సయనుండై వానిం జుఱచుఱిఁ జూచి, ఓరీ ! రాజాధమా! నీవు రాక్షసాకారంబున నకారణంబ నాకపకారంబు గావించితివి. కావున రాక్షసుండవై మనుష్యమాంసం బాహారంబుగా నుండు” మని శపించెను. అప్పుడు రాజు వానిని వసిష్ఠ తనయునిగా గ్రహించి తన యపరాధంబుసకు వగచుచు ముకళిశహస్తుడై 'మునీంద్రా! నన్ను మన్నించి యీ శాపంబుఁ బాపుకొను సుపాయంబును ప్రసాదింపు” మని ప్రార్థింప సాగెను. అంతలో వసిష్ఠునకు బద్ధవై రుండై న విశ్వామిత్రుఁ డచ్చటికి వచ్చి వారలు తన్నెఱుంగకుండ నంతర్హితుడయి యుcడి, కింకరుండను నొక్క రక్కసుని రాజు హృదయంబునఁ బ్రవేశింపుమని యాజా పించెను. విశ్వాతు నా దేశంబునను శక్తి శాపంబునను గింకరుఁడు కల్మాషపాదుని యంతరంగంబున నా వేశింపఁగల్లెను. -- ఇట్లురాక్ష సావిష్ణుఁడై రూ రాజు తన రాజ్యంబునకు వచ్చి పూర్వపు మన : ప్రవృత్తి లేశంబును లేక స్పూర దృష్టులు క్రూర స్వభావమును వహించి రాజ్య కార్యముల యందు మతి లేకుండ సంచరింపసాగాను, దానికడ రోగనాడొక బ్రాంహణుండద్కిక క్షుద్బాదకు గురై వచ్చి, సమాంసం బైన భోజనం బెట్టింపుమని యుడుగ గల్మాష పాదుండట్లే యని పలికి యం : పురంబునకు బోయి యాసంగతి మఱచి పోయెను. నా యర్థ రాత్రంబున స్ఫురణకు వచ్చి సంత నే యతను తనవల వానిం బిలిచి, మాబ్రాహ్మణునకు భోజనము నొసంగుమ?' : నియోగం చెను. కాని బ్రాంహణుం డయకాల భోజన మంగీక రింప లేదు. ఆ సంగతి బానగంబు వాఁ డెఱింప, మనుష్యమాంసం గొనిపోయి పెట్టుమని కల్మాషపాదు డనెను.వాడును వద్యస్థానంబునకుంజని నరనూంసమును గొని బ్రాహ్మణునకు వడ్డించినంత నే యతఁడ య్యది దివ్యదృష్టిని గ్రహించి, యాగ్రహించి, "ఓరి రాజధమా ! అభోజ్యంబయిన మానవ మాంగమును బెట్టిననీవు మనుష్యా దుండవుకమ్ము.” అని శపించెను. కల్శాష పాదుండును మానుష భావంబు విడిచి రాక్షసుడయ్యె..

ఇట్లు రాక్షసుండైన తక్షణంబున నే యతఁడతి త్వరిత గతిని శక్తి యొద్దకువచ్చి “నీ కారణంబున నాకి శాపద్యా పారంబు సంభవించెను. కావున దీని ఫలంబు మున్ముందు నీవే యనుభవింపు” మని పలుకుచు వానిం జంపివేసెను. ఆ కృత్య మునకు విశ్వామిత్రుండెంతయు సంతసించి, యారాక్షసునకు బోధించి వసిష్ఠవుత్రుల నందఱంగూడ వానిచేఁ జంపించెను. ఇట్లొక్కమారుగ రాక్షసనిహతులైన కుమారకులంజూచి, పరమయోగ ధరుండయ్యుఁ బాపము వసిష్ఠుఁడు శతపుత్ర శోక దందహ్యమాన మానసుండయ్యెను. క్రమక్రమముగ నతఁడు దుఃఖాతిశయంబున వివశాత్ముండై యాత్మహత్య మహాపాపంబని తలంపనేరక, యావిషాదంబున దావానల మధ్యంబునఁ జొచ్చెను. కాని యాతఁడు చొచ్చినంతనే యమ్మహావలంబు వానికి శీతంబై వాని కెట్టి యపాయంబును గావింపదయ్యె.

అంత వసిష్ఠుండు కంఠ దేశంబున రాయిగట్టుకొని సముద్ర మధ్యమున నుఱికెను. తోడనే సముద్రస్వామి తన యుత్తుంగ తరంగహస్తంబుల నాతనింబట్టియెత్తి యతిభద్రంబుగఁ దీరంబునంజేర్చె. సుతశతవర్జితంబైన యాశ్రమంబికఁ జూడనొల్లనని వసిష్ఠుండింటికిఁ బోనొల్లక యచ్చటనుండి మేరుపర్వతంబునకుఁ బోయి యత్యున్నతంబైన తచ్చిఖరంబెక్కి యందుండి తటాలున నేలకుదుమికెను. అత్యధిక తపస్సంపన్నుడైన యమ్మహాత్ముని దేహబంధము లేశమైన గాయమువడదయ్యె. పీమ్మట నతడతి భయంకరముగఁ బ్రవహించుచుండిన యొక మహానదిం బ్రవేశించెను. అయ్యది శతవిధంబులఁ బరిద్రుతయై వసిష్ఠునకు స్థల మొసంగుటచే దానికి శతద్రునామము వచ్చినది. ________________

కల్మాషపాదుఁడు - బ్రాహ్మణ తిరస్కారము. " ఇట్లు శరీర పరిత్యాగంబున కెన్ని విధంబుల బ్రయత్నిం చిననుగడ కప్రాప్తమరణుండై వసిష్ఠుండు విసిగి మగణవ్యవసా యంబువిడిచి యాశ్రమంబునకు వచ్చుచు నొకచోశ క్తి భార్య యగు నదృశ్యంతినిఁ జూచెను. తోడ నే గర్భవతియగు తన గోడలి యుదగం:ునుండి షడంగాలంకృతంబై న వేదనాద మతి మనోహరముగ రానికి వినవచ్చెను.. ఆధ్వని శక్తిగఁ ఠధ్వనిగా నూహించుటచే వేద వేదాంగముల ధరించిన హేతుడామె పుణ్యాదరమున నున్నవాఁడని సంతసించి, మనుమని ముఖము చూచి నేను గృలాగ్గుడని య్యెదనని యతఁడు నిశ్చయి 7 చు కొనెను. నాటినుండియు వసిష్ఠుఁడు మరణ ప.గుత్నమును సంపూర్ణముగా విడిచి " ** *శ్రమంబునఁగోడలిని గోపాముచుండ నొకనాడాక స్మికముగ రాక్షసుడైన కలాష పొధుండచ్చటికి వచ్చెను. వాని భయంక రాకృతిం జూచి యదృశ్యంతి వెఱచి గడగడ వడకు చుండ, వసిష్ఠుఁ డామెకు ధైర్యము చెప్పి, మంత్రపూతంబులైన కమండి." దళంబుల నారక్కసుని పైఁ జిలికె. తోడ సేవాఁడు శాపవిముక్తుండే రక్క. సురూపు విడిచి నిజరూపంబును దాల్చి యత్తపోధను నకుఁ బాదాక్రాంతు డయ్యెడు. అప్పుడు వసిషుండు వాని కిట్లు సీతి నుపదేశించెను.

చ. గుణముల నొప్పి బ్రాహణులకుం గడుభ క్తుడనై సమ స్తధా రుణిఁ బ్రజఁ బ్రోచుచున్ విగతరోషుఁడ వై సుఖముండుమింక బ్రా హణులక పబ్లి సేయక శమంబును జేకొను మింద్రుడైన బ్రా హణులక నజ్ఞ సేసి చువమానముబొందుఁ బ్రతాపహీనుఁడై