భళి వైరాగ్యంబెంతో
స్వరూపం
చక్రవాకం రాగం త్రిపుట తాళం
ప: భళి వైరాగ్యంబెంతో బాగై యున్నది చం
చలమైన నామనసు నిశ్చలమై యున్నది || భళి ||
చ 1: అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ
హరి నామ స్మరణ జిహ్వకు అనువై యున్నది || భళి ||
చ 2: గురుధానమున మనసుకుదురై యున్నది చిత్త
మిరువది యారింటి మీద నిరవై యున్నది || భళి ||
చ 3: పరమ శాంతమెన్నగను బాగై యున్నది మాకు
పరతత్వమందే మా బుద్ధి పట్టియున్నది || భళి ||
చ 4: విరసము పోరులేని విధమై యున్నది మాకు
ప్రకృతి యెడబాసి మోక్షమున కిరవై యున్నది || భళి ||
చ 5: గురి భద్రాద్రీశునందే గురువై యున్నది యిపుడు
అరమరలేక రామదాసుడనదగి యున్నది || భళి ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.