భలే తాత మన బాపూజీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దొంగ రాముడు (1955) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన పాట.


భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ - చిన్నీ పిలక బాపూజీ


కుల మత బేధం వలదన్నాడు - కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు - మనలో జీవం పోసాడు || భలే తాత ||


నడుం బిగించి లేచాడు - అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ - దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం - మనకు లభించెను స్వరాజ్యం || భలే తాత ||


సత్యాహింసలే శాంతి మార్గమని - జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు - మహాత్ముడై ఇల వెలిశాడు || భలే తాత ||