భరతమాత స్తుతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఈ భారతమాత స్తుతిని తెలుగు కవి శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు రచించిన అంటరానివారు ఎవరు? అనే కావ్యం నుండి గ్రహించ బడినది

  సీ !!         భూరి సస్య ఫల సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌ 
                        భాగ్య భాగ్యోపేత భరత మాత !
             భారతాది సుగుణ సంభరిత పాలిత నిత్య 
                        ఫలిత పుణ్య వ్రాత భారతమాత !
              హతపాతక వ్రాత నుతలోక సంఘాత 
                       బహు విధాఖ్యాత మా భారత మాత !
              పూర్వ సంచిత భాగ్య భోగ్య సంధాత దు 
                        ర్భర దుఃఖ నాశ శ్రీ భారత మాత !
  
  తే !గీ !       మహిత విష్ణు పదీ పూత భారత మాత 
            వర మహా వీర మాత మా భారతమాత 
            భవ్య రత్న ప్రసూతి మా భారత మాత 
             మాతలకు మాత భారత మాత దలతు !!