భజరే శ్రీరామం హే

వికీసోర్స్ నుండి


  కేదార రాగం   ఆది తాళం

ప: భజరే శ్రీరామం హే మానస

భజరే రఘు రామం రామం || భజరే ||


చ 1: భజ రఘు రామం భండన భీమం

రజ నిచ రాఘ విరామం రామం || భజరే ||


చ 2: వనరుహ నయనం కనదహిశయనం

మనసిజకోటి సమానం మానం || భజరే ||


చ 3: తారకనామం దశరధరామం

చారు భద్రాద్రీశ చారం ధీరం || భజరే ||


చ 4: సీతారామం చిన్మయధామం

శ్రీ తులసీదళ శ్రీకర ధామం || భజరే ||


చ 5: శ్యామల గాత్రం సత్యచరిత్రం

రామదాస హృద్రాజీవ మిత్రం || భజరే ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.