భజరే మానస శ్రీరఘువీరం

వికీసోర్స్ నుండి


రాగం: ఆభేరి - ఆది తాళం

పల్లవి:
భజరే మానస శ్రీరఘువీరం
భుక్తిముక్తిప్రదం వాసుదేవం హరిం॥

అనుపల్లవి:
వృజిన విదూరం విశ్వాధారం
సుజన మందారం సుందరాకారం॥

చరణము:
రావణమథనం రక్షితభువనం
రవిశశినయనం రవిజారి మర్దనం
రవిజాది వానర పరివృతం నరవరం
రత్నహార పరిశోభిత కంధరం
(మధ్యమకాలం)
రవిశశి కుజబుధ గురుశుక్ర శనైశ్చర రాహుకేతునేతారం
రాజకుమారం రామం పవనజాప్తమవనిజామనోహరం॥