భజరే మానస రామం
స్వరూపం
నవరోజు రాగం త్రిపుట తాళం
ప: భజరే మానస రామం
భజరే మానస రామం
అ.ప: కరధృతశర కోదండం
కరితుండాయుత భుజ దండం || భజరే ||
చ 1: దాశరధీ నరసింహం
దాశరధీ సురసింహం
కౌసల్యా బహు భాగ్యం రామం
మైధిల్యాలోచన యోగ్యం || భజరే ||
చ 2: అవనత జలజభవేంద్రం
అగణిత గుణగణ సాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికర వేషం || భజరే ||
చ 3: శ్యామ సజలధర శ్యామం
సాంబశివానుత నామం
భద్రాద్రిచల నివాసం పరి
పాలిత శ్రీరామదానం || భజరే ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.