భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/నృకేసరిశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక


ధర్మపురి రామాయణము నరసింహశతకము రచించిన శేషప్ప యను శేషాచలదాసుఁడే యీశతకమును రచించెను. కవి తనకులము నీమూఁడు పొత్తములలోఁగూఁడఁ జెప్పుకోనలేదు. శైలిని బట్టి వందికులమువాఁడని శతకకవిచరిత్రకారులు అనుమానించిరి. కులమున కొకశైలియుండునా? ప్రమాణశూన్యమగు ననుమాన మెపుడును చరిత్రమునకు శరణ్యము కాజాలదు. కవి నివాసము ధర్మపురి. ఇది నిజామురాష్ట్రమునందు ఓరుగల్లునకుఁ బండ్రెండామడల దూరమునున్న సుప్రసిద్ధమగు నృసింహక్షేత్రము. ఇటఁ గలనృసింహస్వామిని గూర్చియే యీకవి నరసింహశతకము, నృకేసరిశతకము రచించెను. చిత్రభారతము, పద్మపురాణము, నవీనవసిష్టరామాయణము లోనగు గ్రంథములలో ధర్మపురి ప్రశంస గలదు. ఆంధ్రులందఱకుఁ దీర్థరాజముగా నున్న నిజామురాష్ట్రములోని క్షేత్రములు పెక్కులు యవన పరిపాలనమునకు లోఁబడినపిదప నితరరాష్ట్రవాసుల కగమ్యము లయ్యెను. క్రమముగ విస్మృతికి వచ్చెను. అట్టివానిలో సుప్రసిద్ధమగు ధర్మపురి క్షేత్రముగూడ నొకటి. ఈ నృకేసరిశతకము వ్రాఁతప్రతియొకటి నిజామురాష్ట్రమునందలి మెదకు మండలములోఁ బరిశోధనము గావించుతఱి జోగి పేటలో లభించెను. పరిశోధకసంఘమువారి కీయవలసిన యీశతకమాతృకను దగ్గరనుంచికొని శుద్ధప్రతి వ్రాసి యెటులేని ముద్రించి వ్యాప్తిలోనికి దేవలయునని సంకల్పించుకొంటిని. ఇంతలో బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారు శతకములు సంపుటములుగా వేయ నెంచి మమ్మాపనిజూడ నియోగించుటచే మాచెంతను అందుబాటులోను గల యముద్రితశతకములతోఁబా టీశతకమును గూడ ముద్రించి ప్రకటింప నవకాశము లభించినది. నిజాంరాష్ట్రశతకకవులజీవితమునం దీశతకకర్తచరిత్రము చేరఁదగియున్నది.

కవి దాదాపు నూఱుసంవత్సరములకు నావలివాఁడు కాఁడని మేము విచారింపఁ దత్రత్యులు చెప్పిరి. ప్రమాణములగు నాధారములు లభింపకున్నను నీ కాలము విశ్వసనీయమే. నృకేసరిశతకము భక్తిరసోద్బోధకమై సులభశైలిలో సరసముగా నున్నది. అందందుఁ గొలఁదిగ వ్యాకరణలోపములు గలవు. శుద్దప్రతి వ్రాయుతఱి కొన్నిచోటులఁ గవిభావానుసారముగా లేఖకులలోపముల సవరించితిమి.

ఇట్లు భాషాసేవకులు

నందిగామశేషాద్రిరమణకవులు
1.6.26శతావధానులు

శ్రీరస్తు

నృకేసరిశతకము

ఉ.

శ్రీకమలాలయారమణ శీఘ్రముగా దయఁజూచి నామనో
వ్యాకులమెల్లఁ దీర్చు మింక వారిజలోచన నమ్మినాఁడ నే
లోకులఁ గొల్వనేర భువిలో నను వంచనజేయఁబోకుమీ
నీకు నమస్కరించెదను నేర్పుగ ధర్మపురీనృకేసరీ.

1


చ.

అమరము పంచకావ్యములనైనఁ బఠింపఁగలేదు లెస్సగా
శ్రమపడి ప్రాసవిశ్రమవిచారము జేయఁగలేదు నే కవి
త్వము గని నిన్ను వేఁడితిని తప్పులొ యొప్పులొ చిత్తగించుమీ
కలమదళాక్షపండితుఁడఁ గాసుర ధర్మపురీనృకేసరీ.

2


చ.

రవికుల రేఁగుకాయలకు రత్నములే వెలబోసినట్లు దు
ష్కవిజనులంత బుద్ధిచెడి కాసులకోసము తుచ్ఛమైనమా
నవులను బ్రస్తుతించుచు ఘనంబుగఁ బద్యము లమ్ముకొండ్రు మా
ధవ నినుఁ గానఁజాలరు ముదంబున ధర్మపురీనృకేసరీ.

3


చ.

పెదవులు దీర్ఘదంష్ట్రలును భీకరమైన విశాలనే

పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/239 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/240 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/241 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/242 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/243 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/244 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/245 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/246 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/247 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/248 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/249 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/250 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/251 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/252 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/253 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/254 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/255 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/256 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/257 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/258 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/259 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/260 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/261 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/262 పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/263